slack
-
పని చేసేవారు కొందరైతే.. హడావుడి చేసేవారు మరికొందరు!
కంచర్ల యాదగిరిరెడ్డి: ప్రతి ఆఫీసులో రెండు రకాల ఉద్యోగులు ఉంటారు.. పనిలో ఆనందం పొందాలనుకునే వారు కొందరైతే.. పనిచేస్తున్నట్టుగా హడావుడి (షో) చేసేవాళ్లు ఇంకొందరు. ఎవరు ఏమిటన్నది తెలుసుకోవడం కొంచెం కష్టమైన పనే.. కానీ ఐటీ కంపెనీల్లో ఇలాంటి వారిని గుర్తించేందుకు ఈ–కమ్యూనికేషన్ టెక్ కంపెనీ ‘స్లాక్’ ఒక అధ్యయనం చేసింది. ఆశ్చర్యకరమైన ఫలితాలను ప్రకటించింది.మన దేశంలో ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో షో చేసేవాళ్లు 43 శాతందాకా ఉన్నారని వెల్లడైనట్టు తేల్చి చెప్పింది. అంటే ప్రతి వంద మందిలో 57 మంది చక్కగా పనిచేసుకుంటూంటే.. మిగతా వారు చేసేపనికన్నా ఎక్కువగా ‘షో’ చేస్తున్నారని అభిప్రాయపడింది. ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లోని కంపెనీల్లో ఇలాంటి ఉద్యోగులు గణనీయంగానే ఉన్నారని పేర్కొంది. 18వేల మందిని ప్రశ్నించి.. ఆఫీసుల్లో సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు వినియోగించే అప్లికేషన్ ‘స్లాక్’. వాట్సాప్, మెసెంజర్, సిగ్నల్ మాదిరిగానే ఉంటుంది. కానీ ఇది ఆఫీసు బృందాలకు మాత్రమే పరిమితం. అయితే ఉద్యోగుల్లో పనిచేసేవాళ్లు, చేస్తున్నట్టు నటించే/హడావుడి చేసేవారిని గుర్తించేందుకు స్లాక్ సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఒక అధ్యయనం చేపట్టింది. వివిధ దేశాల్లోని ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న 18వేల మందిని రకరకాల ప్రశ్నలు వేసి.. వారు ఏ రకానికి చెందినవారో తెలుసుకునే ప్రయత్నం చేసింది. తాజాగా ఆ అధ్యయనం నివేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలతో పోలిస్తే ఇండియా, జపాన్, సింగపూర్ వంటి ఆసియా దేశాల్లో పనిచేస్తున్న వారిలో ‘షో’ చేసేవారే ఎక్కువని పేర్కొంది.ఇండియాలో 43 శాతం, జపాన్‌లో 37 శాతం, సింగపూర్‌లో 36 శాతం ఇలాంటి ఉద్యోగులు ఉన్నారని తెలిపింది. కానీ ఆసియాలో భాగమే అయినా దక్షిణ కొరియాలో మాత్రం దాదాపు 72 శాతం మంది ఒళ్లు వంచి బుద్ధిగా పనిచేస్తున్నారని పేర్కొంది. యూరప్, అమెరికాలలో హడావుడి చేసే ఉద్యోగులు కొంత తక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. ఉద్యోగులు ఏమంటున్నారు? స్లాక్ సర్వే ప్రకారం.. పలువురు ఐటీ ఉద్యోగులు తమ పనితీరును లెక్కగట్టే విధానంలో మార్పులు రావాలని కోరుకుంటున్నారు. కేవలం ఆన్లైన్ స్టేటస్, ఈ–మెయిళ్లకు ఇచ్చిన సమాదానాలు వంటివాటిపై మాత్రమే కాకుండా.. పనికి సంబంధించి మేనేజర్లతో మాట్లాడిన సందర్భాలు, ఏదైనా పని పూర్తి చేసేందుకు పట్టిన గంటలు వంటివాటి ఆధారంగా పనితీరును మదింపు చేయాలని అంటున్నారు. కోవిడ్ సమయంలో మాదిరిగా రిమోట్ వర్కింగ్ లాంటి పద్ధతులే మేలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది పనివేళలు ఫ్లెక్సిబుల్‌గా ఉండాలని కోరుకుంటే.. ఇష్టమైన చోట పనిచేసే అవకాశం ఉండాలని 36శాతం మంది అభిప్రాయపడ్డారు. ఆఫీసుల్లో ప్రోత్సాహకాలు భిన్నంగా ఉండాలని, కార్యాలయాల్లో వసతులు పెరగాలని 32శాతం మంది భావిస్తే.. వర్క్ ఫ్రం హోమ్ కాకుండా మళ్లీ ఆఫీసులకు వచ్చి పనిచేయడంపై నిర్ణయం తీసుకోవాలని మరికొందరు ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ఆఫీసులలో ఒకరిద్దరు కాకుండా బృందాలుగా పనిచేయాలని, బృందంగా మేధోమథనం చేయడం ద్వారా ఉత్పాదకత పెరుగుతుందని పలువురు ఉద్యోగులు పేర్కొన్నారు. సహోద్యోగులతో కలివిడిగా ఉండవచ్చునని, నాలుగు మాటలు మాట్లాడుకోవచ్చని తెలిస్తేనే మళ్లీ ఆఫీసులకు వెళతామని మైక్రోసాఫ్ట్ నిర్వహించిన ఒక అధ్యయనంలో 84శాతం మంది ఉద్యోగులు చెప్పడం గమనార్హం. పని చేయకున్నా ‘ఆన్లైన్’ కొందరు ఉద్యోగులు తాము పెద్దగా పనేమీ చేయకపోయినా యాక్టివ్‌గా ఉన్నామని చూపుకొనేందుకు ప్రయత్నిస్తుంటారని స్లాక్ అధ్యయనం వెల్లడించింది. ఇలాంటి 63 శాతం మంది ఉద్యోగులు యాప్స్‌లో తమ స్టేటస్ ‘ఆన్లైన్’ అని ఉండేలా చూసుకునేందుకు ప్రయత్నిస్తారని పేర్కొంది. మీటింగ్‌లతోనే సరి! తమకు మీటింగ్‌లలో, ఈ–మెయిళ్లకు సమాధానాలు ఇవ్వడంతోనే రోజంతా గడచిపోతోందని.. దీనివల్ల తాము ఉత్పాదకత ఎక్కువగా ఉండే పనులు చేయలేకపోతున్నామని సింగపూర్ ఉద్యోగుల్లో 44 శాతం మంది పేర్కొన్నట్టు స్లాక్ అధ్యయనం వెల్లడించింది. స్లాక్ ఏమంటోంది? ఒక ఐటీ కంపెనీ ఉద్యోగి పనితీరును, ఉత్పాదకతను అంచనా వేసేందుకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ప్రమాణాలు విజిబిలిటీ, యాక్టివిటీ అని రెండు రకాలు. ఉద్యోగి ఆన్లైన్లో ఎన్ని గంటలు ఉన్నాడు? ఎన్ని ఈ–మెయిళ్లు పంపాడు? వంటి వివరాల ఆధారంగా 27శాతం మేనేజర్లు ఉత్పాదకతను నిర్ణయిస్తుంటారని స్లాక్ సర్వే చెప్తోంది. ఉద్యోగులు అసలు పనిలో ఉత్పాదకత ఎంత పెంచారనేది మేనేజర్ల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని స్లాక్ టెక్నాలజీ ఎవాంజలిస్ట్ డెరెన్ లానే పేర్కొన్నారు. ఫలితాలను బట్టి కాకుండా, కంటికి కనిపించే అంశాల ఆధారంగా ఉత్పాదకతను నిర్ణయిస్తే.. ఆ కంపెనీ ఉద్యోగులు పనిచేస్తున్నట్టు నటించేందుకే ఇష్టపడతారని చెప్పారు. ఈ తీరువల్ల ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతుందని.. పనితో సంబంధం లేకుండా ఆఫీసుల్లో ఎక్కువ సమయం గడపడం, వచ్చిన ఈ–మెయిళ్లకు వెంటనే సమాధానాలు చెప్పడంలో బిజీగా మారిపోతున్నారని, లేదంటే అవసరమున్నా లేకపోయినా అన్ని మీటింగ్‌లకూ హాజరవుతున్నారని స్లాక్ అధ్యయనంలో తేలిందని వివరించారు. -
రిమోట్ వర్కింగ్ బిజినెస్‌లో అతిపెద్ద డీల్
న్యూయార్క్: వర్క్‌ప్లేస్ మెసేజింగ్ యాప్ స్లాక్ టెక్నాలజీస్ ఇంక్‌ను కొనుగోలు చేసేందుకు సేల్స్‌ఫోర్స్.కామ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. డీల్ విలువ 27.7 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 2.05 లక్షల కోట్లు). క్లౌడ్ కంప్యూటింగ్ సేవల దిగ్గజం సేల్స్‌ఫోర్స్ కుదుర్చుకున్న అతిపెద్ద డీల్ ఇది. తద్వారా రిమోట్ వర్కింగ్ సేవలకు మరింత బూస్ట్నివ్వనుంది. అంతేకాకుండా క్లౌడ్ కంప్యూటింగ్‌లో ప్రత్యర్ధి సంస్థ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు పోటీనివ్వనున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ డీల్ ద్వారా సేల్స్‌ఫోర్స్.. ఉద్యోగులు, కస్టమర్లు, భాగస్వాములతో బిజినెస్‌ల కనెక్టివిటీకి యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు కానున్నట్లు విశ్లేషకులు వివరించారు. యాప్‌ల వినియోగం ద్వారా రెండువైపులా కనెక్టివిటీకి వీలు కలగనున్నట్లు తెలియజేశారు. టీమ్స్ జూమ్ కోవిడ్-19 కారణంగా తలెత్తిన రిమోట్ వర్కింగ్ పరిస్థితులను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోవడంతో పోటీలో స్లాక్ టెక్నాలజీస్ వెనుకబడినట్లు ఈ సందర్భంగా విశ్లేషకులు తెలియజేశారు. రియల్ టైమ్ మెసేజింగ్ ద్వారా గ్రూప్‌ల మధ్య సంభాషణలకు వీలు కల్పిస్తూ స్లాక్ సర్వీసులను అందిస్తోంది. మరోపక్క మైక్రోసాఫ్ట్ టీమ్స్ ప్రొడక్ట్‌లో భాగంగా వీడియో, వాయిస్ కాలింగ్‌కు వీలు కల్పిస్తూ బిజినెస్‌ను భారీగా పెంచుకున్నట్లు పేర్కొన్నారు. ఆఫీస్ ప్యాకేజీలతోపాటు.. టీమ్స్‌ను అందించడం ద్వారా మైక్రోసాఫ్ట్ లబ్ది పొందినట్లు తెలియజేశారు. కాగా.. సేల్స్‌ఫోర్స్‌తో డీల్ కుదుర్చుకోవడం ద్వారా టెక్నాలజీయేతర కంపెనీలకూ స్లాక్ సర్వీసులు విస్తరించే వీలున్నట్లు వివరించారు. డీల్ తీరిలా స్లాక్‌తో సేల్స్‌ఫోర్స్ కుదుర్చుకున్న ఒప్పందం ఎలాగంటే.. యూఎస్ స్టాక్ ఎక్స్ఛేంజీలో మంగళవారం సేల్స్‌ఫోర్స్ షేరు 45.5 డాలర్ల వద్ద ముగిసింది. దీని ఆధారంగా స్లాక్ వాటాదారులకు తమ వద్దగల ప్రతీ షేరుకి 26.79 డాలర్ల నగదు లభించనుంది. అంతేకాకుండా 0.0776 సేల్స్‌ఫోర్స్ షేర్లు సొంతంకానున్నాయి. గత వారం డీల్‌పై చర్చలు బయటపడ్డాక అంచనా వేసిన విలువతో పోలిస్తే ఈ ఆఫర్‌ను 54 శాతం ప్రీమియంగా నిపుణులు పేర్కొంటున్నారు. మార్కెట్ ముగిశాక డీల్ వివరాలు వెల్లడికావడంతో ఫ్యూచర్స్‌లో సేల్స్‌ఫోర్స్ షేరు 4 శాతం పతనంకాగా.. స్లాక్ షేరు నామమాత్ర నష్టంతో 43.73 డాలర్లకు చేరింది. కాగా.. ఈ ఏడాది మూడో క్వార్టర్లో సేల్స్‌ఫోర్స్ ఆదాయం అంచనాలను మించుతూ 5.42 బిలియన్ డాలర్లకు చేరింది. సీఎఫ్‌వో మార్క్ హాకిన్స్ జనవరిలో పదవీ విరమణ చేయనున్నట్లు సేల్స్‌ఫోర్స్ తాజాగా పేర్కొంది. సీఎఫ్‌వో బాధ్యతలను ప్రస్తుత చీఫ్ లీగల్ ఆఫీసర్‌ను అమీ వీవర్ చేపట్టనున్నట్లు తెలియజేసింది. -
కూలేదాక చూస్తూ ఉంటారా ?
* శిథిలావస్థకు చేరిన విద్యుత్ కేంద్ర భవనం * లక్షల విలువ చేసే సామగ్రికి భద్రత గాలికి * వర్షం వస్తే ప్లాస్టిక్ పట్టాలే గతి * భయంతో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తాడేపల్లి (తాడేపల్లి రూరల్): గుంటూరు జిల్లాకు రైల్వేకు తలమానికమైన తాడేపల్లి పట్టణ పరిధిలోని సిమెంటు ఫ్యాక్టరీ ఏరియాలో ఉన్న 132/133 కేవీ విద్యుత్ ఉపకేంద్రం శిథిలావస్థకు చేరింది. ఎప్పుడో ప్రకాశం బ్యారేజీ నిర్మాణం జరిగినప్పుడు సిమెంటు ఫ్యాక్టరీకి విద్యుత్ సరఫరాకుగాను ఈ ఉపకేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గతంలో ఇక్కడ నుంచి హైదరాబాద్ ఎర్రగడ్డకు, కడప, శ్రీశైలం, నాగార్జున సాగర్లకు విద్యుత్‌ను సరఫరా చేసేవారు. ఇంతటి ఘనచరిత్ర ఉన్న ఈ విద్యుత్ ఉప కేంద్రంలో విద్యుత్ శాఖలో ఉన్నత పదవులను అలంకరించిన వారెందరో ఇక్కడ పనిచేసిన వారే. ఇంతటి చరిత్ర కలిగిన ఈ ఉపకేంద్రం విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరింది. ఏ క్షణాన ఈ భవనం కుప్పకూలిపోతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సిబ్బంది ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. లక్షల విలువ చేసే సామగ్రికి భద్రత ఏదీ ? సిమెంటు ఫ్యాక్టరీ విద్యుత్ ఉపకేంద్రంలో 132 కేవీ ఫీడర్లు ఆరు, 33 కేవీ ఫీడర్లు ఏడు, పవర్ ట్రాన్స్ఫార్మర్లు 3 ఉన్నాయి. విజయవాడ గుణదల దగ్గర నుంచి ఇక్కడకు వచ్చే విద్యుత్‌ను స్టెప్ డౌన్ చేసి, కంట్రోల్ ప్యానల్స్ ద్వారా గుంటూరు–1, గుంటూరు–2, తాడికొండ, మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల, కొల్లిపర, తుళ్లూరు, అమరావతిలో సగ భాగం, తెనాలి తదితర ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ ఉప కేంద్రాలకు సరఫరా చేస్తారు. కృష్ణాకెనాల్ రైల్వే జంక్షన్‌కు ఇక్కడి నుంచే పవర్ అందుతుంది. ఏలూరు, చినఅవుట్‌పల్లి దగ్గర నుంచి తెనాలి, గుంటూరు వరకు రైల్వే లైనుకు విద్యుత్‌ను సరఫరా చేస్తారు. అయితే శిథిలావస్థకు చేరిన ఈ విద్యుత్ ఉపకేంద్రంలో విధులు నిర్వర్తించాలంటే సిబ్బంది భయపడుతున్నారు. వర్షాలు కురిసినప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. లక్షలాది రూపాయల విలువ చేసే కంట్రోల్ ప్యానల్స్ ఎక్కడ తడిచి పాడై పోతాయేమోనని సిబ్బంది పట్టాలు, పరదాలు కప్పి ఉంచుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఏఈ మాత్రమే ప్రభుత్వ ఉద్యోగి కాగా, మిగిలిన 14 మంది కాంట్రాక్టు సిబ్బంది కావడం గమనార్హం.