Slaughter of cattle
-
మనుషులను చంపడం కంటే నేరం!
సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గో సంరక్షణ (ప్రివెన్షన్ ఆఫ్ స్లాటర్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ క్యాటిల్) బిల్లును ఆ రాష్ట్ర అసెంబ్లీ డిసెంబర్ 9న ఆమోదించింది. అలాంటి చట్టాలు కలిగిన ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటక రాష్ట్రం తీసుకొచ్చిన బిల్లు మరీ కఠినంగా ఉంది. ఆవులే కాకుండా ఎద్దులు, లేగ దూడలను చంపడం నేరం. 13 ఏళ్ల లోపు బర్రెలను చంపడం కూడా నేరం. వాటిని స్మగ్లింగ్ చేయడం, ఓ చోటు నుంచి మరో చోటుకు తరలించడం కూడా నేరం. ఈ నేరాలకు పాల్పడిన వారికి మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. అంటే, నిర్లక్ష్యం వల్ల తోటి మానవుడి మరణానికి కారణమైతే విధించే శిక్షకన్నా ఇది పెద్ద శిక్ష. ఉద్దేశ పూర్వకంగా కాకుండా కేవలం నిర్లక్ష్యం వల్ల తోటి మానవుడి మరణానికి బాధ్యుడైన వ్యక్తికి రెండేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ఒక్కోసారి జరిమానాతో కూడిన జైలు శిక్ష కూడా విధిస్తారు. ముస్లింలు, ఎస్సీ, ఎస్టీలు పౌష్టికాహారం కోసం చౌకగా దొరికే ఆవు, ఎద్దు, బర్రె మాంసాలపైనే ఆధారపడతారు. ఇలాంటి చట్టాల వల్ల వారి నోట్లో మట్టిపడుతుంది. ప్రభుత్వమే వారి పౌష్టికాహారం బాధ్యత తీసుకుందనుకుంటే తోళ్ల పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింటుంది. ఆ రంగంలో ఎక్కువగా పనిచేస్తున్న ముస్లింలు, ఎస్సీ, ఎస్టీలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారు. వారందరికి ప్రభుత్వమే ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పిస్తుందనుకుంటే భారత్‌లో పాడి పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింటుంది. దేశంలో పాడి పరిశ్రమ టర్నోవర్ 6.5 లక్షల కోట్ల రూపాయలు. దేశంలోని రైతులకు గోధుమలు, వరి కలిపి అమ్మితే వచ్చే లాభం కన్నా పాడి పరిశ్రమ వల్ల ఎక్కువ లాభం వస్తోంది. (చదవండి: రణరంగమైన విధాన పరిషత్) డెయిరీలకు పాలను సరఫరా చేసేది ఎక్కువగా పశు పోషకులు, రైతులే. పాలివ్వడం మానేసిన ఆవులను, బర్రెలను, వ్యవసాయానికి పనికి రాని ఎద్దులను కబేలాలకు విక్రయించడం ద్వారా వచ్చే డబ్బే యాదవులు, రైతుల పాడి పరిశ్రమకు ప్రధాన పెట్టుబడి. అందుబాటులో ఉన్న 2014 సంవత్సరం లెక్కల ప్రకారం మహారాష్ట్రలో పశువులను కబేలాలకు తరలించడం ద్వారా ఏటా వచ్చిన సొమ్ము అక్షరాల 1,180 కోట్ల రూపాయలు. దేశవ్యాప్తంగా పశు వధ నిషేధం వల్ల రైతులు సరాసరి సగటున నెలవారి ఆదాయం 6,427 రూపాయలను కోల్పోయారని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. 1970లో దేశంలో క్షీర విప్లవాన్ని తీసుకొచ్చిన ‘అముల్’ వ్యవస్థాపకులు వర్గీస్ కురియన్ కూడా మొదటి నుంచి పశు వధ నిషేధ చట్టాలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ‘పశు సంపదను, పాడి పరిశ్రమను పరిరక్షించుకోవాలంటే అనారోగ్య, నిరుపయోగ పశువులను కబేలాలకు తరలించడమే ఉత్తమమైన మార్గం’ అని కురియన్, ‘ఐ టూ హ్యాడ్ ఏ డ్రీమ్’ పేరిట రాసుకున్న తన జీవిత చరిత్రలో పేర్కొన్నారు. దేశంలో పనికిరాని పశువుల బాధ్యతలను స్వీకరించి అవి చనిపోయే వరకు మీరుగానీ, మరెవరైనగానీ స్వీకరిస్తారా? అంటూ పూరి శంకరాచార్యను కురియన్ ప్రశ్నించగా, ఆయన తన వద్ద సమాధానం లేదని చెప్పారు. (చదవండి: కర్ణాటక పశు సంరక్షణ) నిషేధం ఉన్న చోట తగ్గుతున్న పశువుల సంఖ్య ‘2019–లైవ్‌స్టాక్ సెన్సెక్స్’ ప్రకారం పశు వధ నిషేధం ఉన్న రాష్ట్రాల్లోనే పశువుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. 2012 నుంచి 2019 మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో పశువుల సంఖ్య వరుసగా 10.07, 4.42 శాతం, 3.93 శాతం తగ్గుతూ వచ్చింది. ఎలాంటి నిషేధం లేని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇదే కాలానికి పశువుల సంఖ్య 15.18 శాతం పెరిగింది. ఇదే కాలానికి ఎవరూ పోషించక పోవడంతో రోడ్డున పడ్డ ఊర పశువుల సంఖ్య ఉత్తర ప్రదేశ్‌లో 17.34 శాతం, మధ్యప్రదేశ్‌లో 95 శాతం, గుజరాత్లో 17.59 శాతం పెరగ్గా, అదే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పశువుల సంఖ్య 73.59 శాతం తగ్గింది. పంటల నష్టం...ప్రాణ నష్టం రోడ్డున పడ్డ పశువుల వల్ల రైతులకు ఓ పక్క పంటల నష్టం వాటిల్లుతుండగా, మరోపక్క పశువుల కారణంగా రోడ్డు ప్రమాదాలు పెరిగి ప్రాణ నష్టం కూడా ఎక్కువగానే జరగుతోంది. హర్యానాలో గత రెండేళ్లలో అనాథ పశువులు అడ్డంగా రావడంతో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 241 మంది మరణించారు. -
నిందితులను సన్మానించిన కేంద్ర మంత్రి..!
సాక్షి, న్యూఢిల్లీ: గోవు మాంసం విక్రయిస్తున్నాడనే అనుమానంతో గతేడాది జూన్‌లో అలీముద్దీన్ అన్సారీ అనే వ్యక్తిని ఉరి వేసి చంపారు. రామ్‌ఘర్‌లోలో జరిగిన ఈ ఘటనలో 11 మందిని ముద్దాయిలుగా పేర్కొంటూ జార్ఖండ్‌లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఆ తీర్పుకు హైకోర్టులో బ్రేకులు పడ్డాయి. విచారణ చేపట్టిన జార్ఖండ్ హైకోర్టు నిందితులందరికీ బెయిలు మంజూరు చేసింది. అయితే కోర్టు నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి జయంత్ సిన్హా హత్య కేసులోని 8 మంది నిందితులకు శుక్రవారం హజారీబాగ్‌లోని తన ఇంటిలో పూల మాలలు వేసి సన్మానం చేశారు. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో సిన్హాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నత విద్యనభ్యసించిన జయంత్ తీరు మరీ అధ్వానంగా ఉందనీ జార్ఖండ్ ప్రతిపక్ష నేత హేమంత్ సోరెన్, కాంగ్రెస్ నాయకుడు అజోయ్ కుమార్‌లు మండిపడ్డారు. మత విద్వేశాల్ని రెచ్చగొట్టే హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కేంద్ర మంత్రి మద్దతుగా నిలవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. కాగా, ఈ విమర్శలపై జయంత్ సిన్హా శనివారం స్పందించారు. రాజకీయ పరిపక్వత లేనివారు తనను విమర్శిస్తున్నారని అన్నారు. భారతీయ న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకముందనీ, హైకోర్టు తీర్పుపై ఆనందం వ్యక్తం చేయడం నేరం కాదని స్పష్టం చేశారు. సిన్హా హర్వార్డ్ బిజినెస్ స్కూల్లో పట్టభద్రులు కావడం గమనార్హం. -
ఆంక్షలతో ఎవరికి నష్టం? ఎవరికి కష్టం?!
దేశవ్యాప్తంగా పశువులను వధించడం కోసం విక్రయించడాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించడం ఆర్థికంగా, సామాజికంగా ప్రతికూల ప్రభావాలు చూపనుంది. ప్రపంచంలో పశుమాంస ఎగుమతి దేశాల్లో మొదటి స్థానంలో ఉన్న భారత దేశంలో ఈ రంగం మీద ఆధారపడి ఉన్న 4 కోట్ల మంది తాజా ఆంక్షలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పశు మాంసం రంగానికి సంబంధించిన ముఖ్యాంశాలివీ... వధ నిషేధం వీటిపైన: ఎద్దులు, దున్నపోతులు, ఆవులు, గేదెలు, ఒంటెలు, కోడెలు, దూడలు తదితర పశువులు వేటినీ మాంసం కోసం వధించడానికి లేదా మతావసరాల కోసం వధించడానికి విక్రయించడాన్ని కేంద్రం తాజాగా నిషేధించింది. 4 కోట్ల మందికి ఉపాధి: పశు మాంసం రంగంలో దేశంలో నాలుగు కోట్ల మంది ఉపాధి పొందుతున్నారని అంచనా. వీరిలో 90 శాతం మంది వరకూ అసంఘటిత రంగంలోనే ఉన్నారు. పశువుల వ్యాపారం, క్రయవిక్రయాలు, మాంసం దుకాణాలు, చర్మం శుద్ధి, ఎముకలు తదితరాల శుద్ధి వంటి రంగాల్లోని వారి ఉపాధిపై.. వధించడం కోసం పశువుల విక్రయంపై తాజా ఆంక్షలు గొడ్డలి పెట్టు అవుతాయని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అలాగే.. పశుపోషణ వృత్తిగా సాగించే వారికి, రైతులకు కూడా కష్టాలు పెరుగుతాయని.. పాల కోసమో, మాంసం కోసమో కాకుండా పశువులను పోషించడం వారికి పెను భారంగా మారుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యవసాయ అవసరాల కోసం జరిపే క్రయవిక్రయాలకు కూడా అనేక రుజువులు చూపాల్సి రావడం, పత్రాలను తయారు చేసుకోవడం వంటివి నిరక్షరాస్యులైన అత్యధిక రైతాంగాన్ని ఇక్కట్ల పాలు చేస్తుందని విమర్శిస్తున్నారు. ఎగుమతుల్లో నంబర్ 1: ప్రపంచంలో అతి పెద్ద పశు మాంసం ఎగుమతి దేశం భారతదేశమే. 2013లో బ్రెజిల్పెద్ద ఎగుమతిదారుగా ఉండగా.. దానిని భారత్అధిగమించింది. ఆవు మాంసం కన్నా గేదె మాంసం చౌక కాబట్టి దేశం నుంచి ఎగుమతి చేసే పశుమాంసంలో గేదె/దున్న మాంసానిదే సింహభాగం. బాస్మతి బియ్యం ఎగుమతుల కన్నా బీఫ్/బఫెలో ఎగుమతుల ద్వారానే దేశానికి ఎక్కువ విదేశీ మారకద్రవ్యం లభిస్తోంది. 201516 ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగం లెక్కల ప్రకారం దేశం నుంచి ఎగుమతయ్యే వ్యవసాయ, అనుబంధ ఉత్పత్తుల్లో బఫెలో మాంసం ఎగుమతి 23 శాతంగా ఉంటే.. ఆ తర్వాతి స్థానాల్లో బాస్మతి బియ్యం (21.86 శాతం), బాస్మతేతర బియ్యం (17.25 శాతం) ఉన్నాయి. భారత్‌నుంచి పశు మాంసాన్ని అధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో వియత్నాం, మలేసియా, సౌదీ అరేబియా, ఈజిప్టు దేశాలు కొన్ని. ఉత్పత్తిలో నంబర్ 4: ప్రపంచంలో బీఫ్/బఫెలో మాంస పరిశ్రమలో అగ్రస్థానం అమెరికాదే. ప్రపంచ బీఫ్ ఉత్పత్తిలోనూ, వినియోగంలోనూ 20 శాతం అగ్రరాజ్యానిదే. బీఫ్/బఫెలో మాంస ఉత్పత్తిలో ప్రపంచంలో నాలుగో పెద్ద దేశం భారత్. మొదటి స్థానంలో బ్రెజిల్, రెండో స్థానంలో యూరోపియన్యూనియన్, మూడో స్థానంలో చైనా ఉన్నాయి. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే బీఫ్/బఫెలో మాంసంలో భారతదేశం వాటా 7 శాతం. దేశంలో ఉత్పత్తి అయ్యే మాంసంలో బీఫ్/బఫెలో మాంసానిది రెండో స్థానం. అందులో అత్యధిక వాటా బఫెలో మాంసానిదే. వినియోగంలో నంబర్ 5: ప్రపంచంలో బీఫ్/బఫెలో అధికంగా తినే దేశాల్లో భారత్ ఐదో స్థానంలో ఉంది. మొత్తం ప్రపంచ వినియోగంలో 4 శాతం మాత్రమే భారత్‌లో ఉంది. అయితే.. ఇతర దేశాల్లో బీఫ్ వినియోగం అధికంగా ఉంటే.. భారత్‌లో బఫెలో మాంసం వినియోగం అధికం. ఈ మాంస వినియోగం గత కొన్నేళ్లుగా పెరుగుతోంది కూడా. ప్రతి 13 మంది భారతీయుల్లో ఒకరు బీఫ్లేదా గేదె మాంసం తింటున్నారని జాతీయ నమూనా సర్వే కార్యాలయం (ఎన్ఎస్ఎస్ఓ) చెప్తోంది. జనాభాలో ఎక్కువగా బీఫ్/బఫెలో మాంసం తినేది ముస్లిం మతస్తులు. దాదాపు 40 శాతం మంది భారతీయ ముస్లింలు బీఫ్తింటారు. క్రైస్తవుల్లో 26 శాతం మందికి పైగా, హిందువుల్లో రెండు శాతం కన్నా కొంచెం తక్కువ మంది బీఫ్తినేవారు ఉన్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే మేఘాలయ, కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌లలో బీఫ్వినియోగం అత్యధికం. . మతాల వారీగా బీఫ్/బఫెలో మాంస వినియోగం ఇలా... మతం జనాభా హిందువులు 12.56 కోట్లు ముస్లింలు 6.349 కోట్లు క్రైస్తవులు 65.4 లక్షలు ఇతరులు 8.9 లక్షలు దేశపు పశు మాంసం ఎగుమతులు ఇలా... 201617 (ఏప్రిల్ – జనవరి) రూ. 22,074 కోట్లు 201516 రూ. 27,610 కోట్లు 201415 రూ. 30,201 కోట్లు 201314 రూ. 27,720 కోట్లు మాంసం ఎగుమతి కంపెనీలు: 81 దేశంలో ఉత్తత్తి అయ్యే మాంసంలో ఏ పశువులది ఎంత శాతం? పౌల్ట్రీ (కోళ్లు తదితర పక్షలు): 45% బఫెలో: 19% మేకలు: 16% పందులు: 8% గొర్రెలు: 7% ఆవులు/ఎడ్లు: 5% – సాక్షి నాలెడ్జ్సెంటర్