నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లువ రుసగా అయిదవ రోజు కూడా నష్టాల్లోనే ముగిశాయి. ఆరంభంలో లాభాలనార్జించినప్పటికీ మిడ్‌సెషన్ లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ప్రధానంగా బ్యాంకింగ్ సెక్టార్ అమ్మకాలతో మరింత నీరసించాయి. చివరికి సెన్సెక్స్ 67 పాయింట్ల నష్టంతో 26,308 వద్ద నిఫ్టీ 22 పాయింట్లు క్షీణించి 8,082 వద్ద ముగిశాయి. పీఎస్‌యూ బ్యాంక్ సూచీ 2.5 శాతం పతనంకాగా, బ్యాంక్ నిఫ్టీ 1 శాతం నష్టపోయింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు, ఫార్మా, ఆటో రంగాలు నష్టాల్లో ఐటీ, మీడియా, ఎఫ్ఎంసీజీ లాభాల్లో ముగిశాయి. ఐడియా, అరబిందో, బాష్, యస్‌బ్యాంక్, స్టేట్‌బ్యాంక్, బీవోబీ, ఐసీఐసీఐ, ఐషర్, లుపిన్, టాటా స్టీల్ నష్టపోగా, టీసీఎస్, అంబుజా, అల్ట్రాటెక్, ఏసీసీ, జీ, ఎన్టీపీసీ, ఐటీసీ, కోల్ ఇండియా, విప్రో, ఇన్ఫోసిస్ పుంజుకున్నాయి.
అటు డాలర్ మారకపు విలువలో రూపాయి 16 పైసలు నష్టపోయి రూ.68.3 స్థాయికి పడిపోయింది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి పది గ్రా. రూ.125 క్షీణించి రూ.27,135 వద్ద ఉంది.