smartsiti
-
కాలుష్యాన్ని తరిమితేనే.. స్మార్ట్
ట్రాఫిక్ నియంత్రణ మెరుగుపడాలి పారిశుధ్యం అధ్వానం స్మార్ట్ సర్వేలో నెటిజన్ల వాణి విశాఖపట్నం సిటీ: జీవీఎంసీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్‌సిటీ సర్వేలో ‘కాలుష్యాన్ని తరిమికొట్టండి మహాప్రభో’ అంటూ ఎక్కువమంది నెటిజనులు సూచించారు. విశాఖ నగరంలో ఏమేం సదుపాయాలు కావాలో వివరించాలని మైగావ్.ఇన్ వెబ్సైట్లో జీవీఎంసీ కోరడంతో 2023మంది తమ ప్రాధాన్యాలను తెలిపారు. 25 శాతంమంది కాలుష్యం నుంచి విశాఖను రక్షించాలని ప్రాధేయపడ్డారంటే నగర ప్రజలు ఈ సమస్యతో ఎంతగా సతమతమవుతున్నారో అర్థమవుతోంది. స్మార్ట్సిటీపై సెప్టెంబర్ 15వ తేదీ నుంచి నవంబర్ 1వ తేదీ వరకు వివిధ రూపాల్లో ప్రజల అభిప్రాయాలను జీవీఎంసీ సేకరించింది. గరిష్టంగా 5 లక్షలమంది నుంచి అభిప్రాయాలు తీసుకోవాలన్నది లక్ష్యం కాగా దాదాపు 3 లక్షలమంది సర్వే పత్రాల ద్వారా, 2,023మంది వెబ్సైట్ ద్వారా సర్వేలో పాల్గొన్నారు. ముందుగా నెటిజన్ల అభిప్రాయాలను క్రోడీకరించి కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తున్నారు. ఆన్ లైన్ డేటా మేరకు ఎవరెవరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం. కాలుష్యం మహా నగరంలో కాలుష్యం విపరీతంగా ఉందని 25 శాతం మంది అభిప్రాయపడ్డారు. గాలి, నీరు, శబ్ద కాలుష్యాలు తట్టుకోలేని విధంగా ఉన్నాయన్నారు. స్మార్ట్ సిటీలో మొదటి ప్రాధాన్యతగా కాలుష్యాన్ని తుదముట్టించాలని వారు సూచించారు. పరిశుభ్రత దారుణం నగరంలో పారిశుధ్య నిర్వహణ ఏ మాత్రం బాగులేదని 14 శాతం అభిప్రాయపడ్డారు. డ్రైనేజీ వ్యవస్థ, పారిశుధ్య పనులను మెరుగుపరచాలని కోరారు. ట్రాఫిక్/పార్కింగ్ అస్తవ్యస్తం మహా నగరంగా అభివృద్ధి చెందిన తర్వాత ట్రాఫిక్ నిర్వహణ అసలేం బాగోలేదని 13 శాతం మంది అభిప్రాయపడ్డారు. సిగ్నల్ పడినా అధిగమించి వెళ్లే బైక్‌లే అధికంగా ఉంటున్నా పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్నారని ఆరోపించారు. రద్దీని క్రమబద్ధీకరించేందుకు రూట్ మార్చడం వంటి చర్యలు తీసుకోవడంలేదన్నారు. ప్రజా భద్రత/రక్షణ ఏదీ నగరంలో ప్రజలకు భద్రత, రక్షణ లేదని 9 శాతంమంది అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా మహిళలపై దాడులు జరుగుతున్నాయని పే ర్కొన్నారు. ఒంటరిగా వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్‌స్నాచింగ్‌లకు పూనుకుంటున్నారని, ఇలాంటి వారిని అరికట్టేందుకు రక్షణ బృందాల అవసరం వుం దని అభిప్రాయపడ్డారు. వైఫై/ఇంటర్నెట్ నగరం నలుమూలలా ఇంటర్నె ట్, వైఫై కావాలని 6 శాతం మం ది ప్రజలు అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నట్టు ఈ సూచనను బట్టి తెలుస్తోంది. విద్య విద్యాలయాల్లో సదుపాయాలు కల్పించాలని 5 శాతం మంది కోరారు. నగరంలోని దాదాపు అన్ని విద్యాలయాల్లోనూ ఒకే రీతిన సమస్యలున్నాయని ఏకరువు పెట్టారు. ఆరోగ్యం వదిలేశారు 20 లక్షల మంది జనాభా ఉన్న నగరంలో ఆరోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేశారని 4 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. వ్యాధుల బారిన పడ్డ వారికి ప్రాథమిక చికిత్స అందించే సాయం కూడా జీవీఎంసీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా రవాణా మెరుగుపడాలి ప్రజా రవాణా తగినంతగా లేదని 4 శాతంమంది అభిప్రాయపడ్డా రు. రక్షిత మంచినీరు కరువైందని 4 శాతం మంది పేర్కొన్నారు. విద్యుత్/పార్కులు/ఇ గవర్నెన్స్: 24/7 విద్యుత్‌ను 3 శాతంమంది కావాలన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్, పార్కుల నిర్వహణ అ ధ్వానంగా ఉందని 3 శాతం మం ది అభిప్రాయపడ్డారు. ఇ-గవర్నె న్స్ అమలు చేయాలని 2 శాతం మంది కోరుకున్నారు. సంప్రదాయేతర ఇంధన వనరులు కావాలని 1 శాతంమంది కోరారు. -
‘స్మార్ట్’ బడ్జెట్
నిధుల సేకరణకు అధికారుల వ్యూహం రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేక పద్దులు ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ నివేదిక సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ సర్కారు కలల ప్రాజెక్టులైన వరల్డ్ క్లాస్ సిటీ, స్లమ్ ఫ్రీ సిటీ, స్మార్ట్‌సిటీల దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చాలంటే భారీ స్థాయిలో నిధులు అవసరం. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో వీటికి ప్రత్యేక హెడ్స్ (పద్దులు) ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టుల్లో వివిధ ప్రభుత్వ శాఖలు భాగస్వాములు కానున్నాయి. ఆ శాఖలకు కేటాయించే నిధులు వాటి అవసరాలకే పరిమితమవుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టులకు అవసరమైన నిధులకు ప్రత్యేక పద్దులుంటే మంచిదనే తలంపులో అధికారులు ఉన్నారు. వీటిని సత్వరం పూర్తి చేసేందుకు బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయించాలని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రికలైన ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు ఐదు నుంచి పదేళ్ల వరకు పట్టనుంది. దశల వారీగా పనులు పూర్తి చేయాలన్నా రూ.వందల కోట్లు అవసరం. దీంతో ప్రత్యేక పద్దుల కింద నిధులు మంజూరు చేయాల్సిన అవసరముందని అధికారులు భావిస్తున్నారు. ఆమేరకు ప్రభుత్వానికి నివేదించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ చెప్పారు. తద్వారా ఏటా నిధులు మంజూరయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. చార్మినార్ పాదచారుల పథకానికి అవసరమైన దాదాపు రూ.500 కోట్లకు బడ్జెట్లో ప్రత్యేక పద్దు ఉన్న సంగతి తెలిసిందే. దానికంటే భారీ వ్యయంతో కూడుకున్నందున ఈ ప్రాజెక్టులకుప్రత్యేక పద్దుల అవసరాన్ని వివరిస్తూ అధికారులు ప్రభుత్వానికి నివేదించనున్నారు. వేలాది కోట్లు కావాలి.. స్లమ్‌ఫ్రీ సిటీలో భాగంగాతొలిదశలో నియోజకవర్గానికో స్లమ్‌ను ఎంపిక చేసినా దాదాపు రూ. 650 కోట్లు ఖర్చు కానుందని అంచనా. ఈ లెక్కన గ్రేటర్‌లోని 1476 మురికివాడలను అభివృద్ధిపరచి స్లమ్ ప్రీ సిటీగా మార్చాలంటే రూ.వేల కోట్లు అవసరం. ఈ తరహాలోనే వరల్డ్ క్లాస్ సిటీగా తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రహదారులు.. భూగర్భ డక్టింగ్లు, ఫుట్‌ఫాత్‌లు, సైక్లింగ్ మార్గాలు, ఎల్ఈడీ లైట్లు కావాల్సి ఉంటుంది. వీటిని అందుబాటులోకి తేవాలంటే రూ. వేలాది కోట్లు అవసరం. స్మార్ట్సిటీకీ అంతే స్థాయిలో నిధులు కావాల్సి ఉంటుంది. ప్రత్యేక పద్దులతో ఈ నిధులు మంజూరుకు అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. రహదారులకు రూ.10 వేల కోట్లు నగరాన్ని ‘గ్లోబల్’గా తీర్చిదిద్దాలంటే తొలుత రహదారులను అభివృద్ధి చేయాల్సి ఉంది. లండన్, న్యూయార్క్ వంటి అంతర్జాతీయ నగరాలకు తీసిపోనివిధంగా రహదారుల నిర్మించాలి. కేబుల్ వైర్లు భూగర్భంలో వేసేందుకు డక్టింగ్ ఏర్పాటు,్ల రహదారులకు ఇరువైపులా పచ్చదనం పెంపొందించడం, వరదనీటి కాలువలు, విద్యుత్ దీపాలు తదితర సదుపాయాలతో పాటు పారిశుద్ధ్య నిర్వహణ, సామూహిక మరుగుదొడ్లు, బస్షెల్టర్లు అవసరం. దీనికోసం అంతర్జాతీయ కన్సల్టెంట్ల సేవలు వినియోగించుకునేందుకు సర్కారు సిద్ధమైంది. ఈ తరహారహదారులకు రూ.10వేల కోట్లు అవసరమని ప్రాథమిక అంచనా. కాలువలకూ అధిక మొత్తం కావాల్సిందే నగరాన్ని వరల్డ్ క్లాస్ సిటీగా మార్చాలంటే తొలుత వరదనీరు సాఫీగా పోయేలా పనులు చేపట్టాలి. అందుకు దాదాపు రూ.16 వేల కోట్లు అవసరమని గతంలో అం చనా వేశారు. ఇది ఇంకా పెరిగి ఉంటుందని భావిస్తున్నారు. రాబడిపై జీహెచ్ఎంసీ దృష్టి ఇప్పటి వరకు రూ.5కే భోజనం.. బస్తీలకు శుద్ధజలం వంటి పథకాలపై శ్రద్ధ చూపిస్తున్న జీహెచ్ఎంసీ... ఆదాయ మార్గాలపైనా ప్రత్యేక దృష్టి సారిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను వసూళ్లపై దృష్టి సారించడంతో రూ.వెయ్యి కోట్లకు పైగా వసూలైంది. అదే తరహాలో వివిధ మార్గాల ద్వారా రావాల్సిన ఆదాయంపైనా దృష్టి పెడుతున్నట్టుసోమేశ్ కుమార్ తెలిపారు. జీహెచ్ఎంసీకి వృత్తిపన్ను దాదాపు రూ. 300 కోట్లు రావాల్సి ఉండగా, రూ.100 కోట్లు కూడా రావడం లేదు. మోటారు వాహనాల పన్నుల వాటా, వినోదపు పన్ను, ఇతరత్రా మార్గాల్లో రావాల్సిన వందల కోట్ల నిధులు జీహెచ్ఎంసీ ఖజానాకు చేరడం లేదు. వీటన్నింటిపై శ్రద్ధ వహించడం ద్వారా ఎవరిపై ఎలాంటి భారమూ మోపకుండానే జీహెచ్ఎంసీ ఆదాయం కనీసం 30 శాతం పెరగగలదని అంచనా. ఆ దిశగా అవసరమైన కసరత్తు ప్రారంభించారు. వరల్డ్ క్లాస్ సిటీ కి కావాల్సినవి... చక్కని రహదారులు, ఫుట్‌పాత్‌లు పార్కింగ్ ప్రదేశాలు వీధి దీపాలు 24 గంటలపాటు నీటి సరఫరా నిరంతరం విద్యుత్ సరఫరా భూగర్భడ్రైనేజీ చెరువుల పరిరక్షణ శుద్ధమైన తాగునీరు మెరుగైన ప్రజారవాణా భూగర్భకేబుళ్లు స్మార్ట్‌సిటీకి... వైఫై సేవలు ఆధునిక సాంకేతిక వనరులు ఇంట్లో కూర్చునే నెట్వర్క్తోవివిధ పనులు చేసుకోగలగడం ఫోన్ మెసేజ్‌తో సమస్యల పరిష్కారం -
మూడొంతులుమురికిలోనే..
3.39 లక్షల మంది మురికివాడల్లో నివాసం పమాదభరితంగా 31 వాడలు దుర్భరంగా మారిన నగర జీవనం ఆదుకోని ప్రభుత్వ పథకాలు ఊరిస్తున్న రాజీవ్ ఆవాస్‌యోజన సాక్షి, హన్మకొండ: తెలంగాణ రాష్ట్రంలో రెండో పెద్ద నగరంగా పేరొందిన వరంగల్‌లో అభివృద్ధి ఛాయలు కనిపించడం లేదు. గ్రేటర్ వరంగల్‌గా మార్పుకు సుముఖత.. కేంద్ర ప్రభుత్వ నిధులతో త్వరలో స్మార్ట్‌సిటీ పథకం అమలు.. అంటూ పాలకులు ప్రజలను మభ్య పెట్టడం తప్పితే నగర సమగ్రాభివృద్ధికి ఇన్నేళ్లుగా తీసుకుంటున్న చర్యలు శూన్యం. నగర జనాభాలో మూడొంతుల మంది ఇప్పటికీ మురికివాడల్లో అరకొర సౌకర్యాల నడుమ దుర్భర జీవనం సాగిస్తున్నారు. వీరికి పక్కా ఇళ్లు, మౌలిక సదుపాయాలను కల్పించడంలో బల్దియా అధికారుల తీవ్ర నిర్లక్ష్యం చేశారు. దానితో మురికికూపాల్లో నివసిస్తున్న జనాభా మూడు లక్షలు దాటింది. వరంగల్ నగర జనాభా ప్రస్తుతం 8,19,249 ఉంది. ఈ జనాభాలో 3.39 లక్షల మంది మురికివాడల్లో జీవిస్తున్నారు. విలీన గ్రామాలను మినహాయిస్తే నగరంలో 84 మురికివాడలు ఉన్నట్లుగా అధికారికంగా గుర్తించగా.. ఇక్కడ 1,58,334 మంది ప్రజలు నివసిస్తున్నారు. అధికారిక గుర్తింపుకు నోచుకోకపోయినప్పటికీ మురికివాడలుగా పేరొందినవి మరో 62 వీధులు ఉన్నాయి. ఇక్కడ 85,769 మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. విలీన గ్రామాలు కాకుండా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చూస్తేనే 6,20,000 జనాభా ఉండగా.. ఇందులో 2,44,113 మంది మురికివాడల్లో ఉండటం గమనార్హం. ఆదుకోని ఆవాస్‌యోజన.. విలీనగ్రామాలను మినహాయిస్తే 146 మురికివాడలు నగరంలో ఉండగా ఇక్కడ 4,166 కుటుంబాలకు నివసించేందుకు కనీసం సరైన ఇళ్లు లేవు. వీరంతా కార్పొరేషన్ పరిధిలో పూరిగుడిసెలు, డేరాలు వంటి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకుని నివసిస్తున్నారు. వీరితో పాటు పక్కా ఇళ్లు లేకుండా నివసిస్తున్న కుటుంబాల సంఖ్య 18,616గా ఉంది. అరుతే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న రాాజీవ్ ఆవాస్ యోజన పథకం ద్వారా లబ్ధి పొందేందుకు కార్పొరేషన్ పరిధిలో ఎదురుచూస్తున్న కుటుంబాల సంఖ్య ఇరవై వేలకు పైమాటగానే ఉంది. కానీ, ఇప్పటి వరకు కార్పొరేషన్ పరిధిలో ఆర్వైఏ పథకం అమలుకు నోచుకోలేదు. అత్యవసరంగా పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాల్సిన కుటుంబాల సంఖ్య 4,166గా ఉండగా.. ఇందులో ఆరోవంతు కంటే తక్కువ మందికి మొదటిదశ కింద రూ.31.58 కోట్లతో 576 పక్కా గృహాలు మంజూరయ్యాయి. వీటిని జితేందర్‌నగర్, అంబేద్కర్నగర్లలో నివసిస్తున్న పేదలకు నిర్మించి ఇస్తామని చెప్పినా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ఇవి పూర్తరుున తర్వాత మలిదశ కింద గాంధీనగర్, మీరాసాహెబ్కుంటలో ఈ పథకాన్ని అమలు చే స్తామని అధికారులు పేర్కొంటున్నారు. ప్రమాదభరింగా 31 కాలనీలు.. నగరంలో 146 మురికివాడలు ఉండగా వీటిలో 31 వాడలు చెరువు, వరదముంపులో, కొండచరియలు విరిగిపడే ప్రమాదభరిత ప్రాంతాల్లో ఉన్నాయి. వాస్తవానికి వీరిని ఈ ప్రాంతాల నుంచి తరలించి సురక్షిత ప్రాంతంలో ఆవాసం కల్పించాల్సి ఉంది. కానీ ఈ దిశగా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా మురికివాడల్లో నివసిస్తున్న జనాభాలో దళితులు, మైనార్టీల జనాభానే ఎక్కువగా ఉంది. అధికారికంగా గుర్తించినవి 84 మురికివాడలు ఉండగా వీటిలో 17 పూర్తిగా హరిజన వాడలు కావడం గమనార్హం. అంతేకాదు.. మైనార్టీలు అధికంగా ఉండే ఉర్సు, కరీమాబాద్ ప్రాంతాలు సైతం మురికివాడల జాబితాలోనే ఉన్నాయి.