sobharani
-
బయట కాపుకాసి.. కాళ్లు, చేతులు కట్టేసి..
సంచలనం సృష్టించిన పిల్లల విక్రయం కేసు వెనుక ముగ్గురు ధీర వనితల పోరాటం దాగి ఉంది. అక్షర జ్యోతి ఫౌండేషన్‌ను నిర్వహించే అక్కాచెల్లెళ్లు ధైర్య సాహసాలతో ఈ మానవ అక్రమ రవాణా బాగోతాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. పీర్జాదిగూడలో ఆర్ఎంపీ శోభారాణితో పాటు స్వప్న, షేక్ సలీంలను పట్టుకున్నారు. ఈ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన తీరును అక్కాచెల్లెళ్లు అనూష, శ్రీవైష్ణవి, ప్రత్యూషలు ‘సాక్షి’తో పంచుకున్నారు. మహిళ ఇచ్చిన సమాచారంతో.. అక్షర జ్యోతి ఫౌండేషన్ తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో ఓ మహిళ అనూషను సంప్రదించింది. తనకు పిల్లల్లేరని, శోభారాణి పిల్లలను విక్రయిస్తున్నట్టుగా తెలిసిందని, ఈ విషయంలో తనకు సహాయం చేయాలంటూ శోభారాణి ఫోన్ నంబర్ ఇచ్చింది. షాక్‌కు గురైన అక్కాచెల్లెళ్లు శోభారాణి కార్యకలాపాలపై స్టింగ్ ఆపరేషన్ చేయాలని నిర్ణయించుకున్నారు. వీరికి యూట్యూబ్ చానల్ విలేకరి సాయికుమార్ సహకరించారు. సీక్రెట్ కెమెరాలతో క్లినిక్‌లోకి..: ఈనెల 21న శ్రీవైష్ణవి పిల్లల్లేని తల్లిగా నటిస్తూ తనకో బిడ్డ కావాలని శోభారాణిని కలిసింది. దీంతో ఆమె వాట్సాప్‌లో అబ్బాయి, అమ్మాయి ఫొటోలను పంపించింది. బాబును కొనేందుకంటూ రూ.4.50 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. అడ్వాన్స్‌గా కొంత మొత్తాన్ని చెల్లించారు. ఆ మరుసటి రోజు ఉదయమే పీర్జాదిగూడలోని క్లినిక్‌కు వచ్చి బాబును తీసుకెళ్లాలని శోభ సూచించింది.దీంతో ముగ్గురు అక్కాచెల్లెళ్లు, సాయికుమార్‌తో శివ, శ్రీనివాస్ అనేవారు బృందంగా ఏర్పడి, సీక్రెట్ కెమెరాలను ధరించి క్లినిక్ లోపలికి వెళ్లారు. ఒకవేళ నిందితులు అనుమానంతో తమపై దాడి చేసినా, పారిపోయేందుకు ప్రయత్నించినా పట్టుకునేందుకు వీలుగా క్లినిక్‌కు వెళ్లే రెండు మార్గాలలో మరో 10 మందిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. క్లినిక్ లోపల నిందితులు శోభారాణి, స్వప్నలతో జరిగే సంభాషణలు, వారి కదలికలను ఎప్పటికప్పుడు బయట ఉన్న బృందానికి వాట్సాప్ మెసేజ్‌లలో చేరవేస్తూ ఏమాత్రం తేడా వచి్చనా వారు సహాయపడేలా రంగం సిద్ధం చేసుకున్నారు. ఆల్టో కారులో బాబును తెచ్చి.. వారు క్లినిక్‌లోకి వెళ్లిన అరగంటలో మరో నిందితుడు షేక్ సలీం తెలుపు రంగు ఆల్టో కారులో బాబును తీసుకొచ్చాడు. క్లినిక్ ఫస్ట్ ఫ్లోర్లో ఉండే భవనం యజమాని ఇంట్లోకి వెళ్లాడు. కాసేపటి తర్వాత శోభరాణి వెళ్లి బాబును తీసుకుని క్లినిక్ లోపలికి వచ్చింది. రెండు నకిలీ ఆధార్ కార్డులను ఇస్తూ వీళ్లే బాబు తల్లిదండ్రులు అని చెప్పింది. ఇంకో రూ.20 వేలు అదనంగా ఇస్తే బాబు బర్త్ సరి్టఫికెట్ కూడా ఇస్తానని, దీంతో మీరే సొంత తల్లి అయిపోతారని శ్రీవైష్ణవికి శోభ సూచించింది. ఒప్పందం మేరకు మిగతా డబ్బును అందించాలని కోరింది. దీంతో బయటికెళ్లి తీసుకొస్తానని శ్రీవైష్ణవి తలుపులు తెరవడంతో అప్పటికే బయట ఉన్న వారిని చూసిన శోభ, ఇతర నిందితులు ఇదంతా ట్రాప్ అని గ్రహించారు. చున్నీతో కాళ్లు, చేతులు కట్టేసి.. శోభారాణి, స్వప్న, సలీంలు క్లినిక్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ బయట ఉన్న బృందం కాపు కాస్తుండటంతో వారికి చాన్స్ లేకుండా పోయింది. సలీం గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించగా.. ప్రత్యూష బలంగా అతన్ని పట్టుకొని, చున్నీతో అతని కాళ్లు, చేతులు కట్టేసింది. అతన్ని పక్కన ఉన్న పిల్లర్‌కు కట్టిపడేసింది. ఇదంతా స్టింగ్ ఆపరేషన్ తెలిసిపోవడంతో శోభారాణి ఏడుపు మొదలుపెట్టింది.పోలీసులకు ఫోన్ చేయవద్దని సెటిల్మెంట్ చేసుకుందామంటూ ఆఫర్ ఇచ్చింది. ఈలోగా డయల్ 100కు ఫోన్ చేయడంతో మేడిపల్లి పోలీసులు వచ్చారు. నిందితులను ఠాణాకు తరలించి, బాబును చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులకు అప్పగించారు. నిందితులను పోలీసులు విచారించగా.. ఢిల్లీకి చెందిన కిరణ్, ప్రీతి, పుణేకు చెందిన కన్నయ్యల నుంచి పసికందులను కొనుగోలు చేసి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విక్రయిస్తున్న అంశం వెలుగులోకి వచ్చింది. లింగ నిర్ధారణ, గర్భస్రావాలు కూడా.. శోభారాణి 20 ఏళ్లుగా పీర్జాదిగూడలో ఫస్ట్ ఎయిర్ సెంటర్ పేరుతో క్లినిక్‌ను నిర్వహిస్తోంది. ఇందులో ముందు గదిలో క్లినిక్ ఉండగా.. వెనుక గది అంతా చీకటిగా ఉంది. ఇందులో శస్త్ర చికిత్సల కత్తెర్లు, క్లాంప్స్, బోన్ కట్టర్స్, సూదులు వంటి సర్జికల్ పరికరాలున్నాయి. డస్ట్ బిన్లో కనిపించకుండా దాచిపెట్టారు. శోభారాణి అక్రమంగా గర్భస్రావాలు, లింగ నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్లు అక్షర ఫౌండేషన్ విచారణలో తేలింది. (ఆడెపు శ్రీనాథ్) -
టీడీపీకి రాజీనామా యోచనలో శోభారాణి
సాక్షి, హైదరాబాద్ : ఏపీలో తెలుగు తమ్ముళ్లు షాక్ ఇస్తుంటే... తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మరో ఝలక్ తగలనుంది. తెలంగాణ తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు బండ్రు శోభారాణి సైకిల్ దిగి కారెక్కే యోచనలో ఉన్నారు. ఆమె త్వరలో టీడీపీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమె టీఆర్ఎస్ అధిష్టానం పెద్దలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణకు చెందిన పలువురు కీలక టీడీపీ నేతలు టీఆర్ఎస్లో చేరగా, మరికొంతమంది బీజేపీలో చేరుతున్నారు. కాగా తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాలను టీడీపీకి కేటాయించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబును శోభారాణితో పాటు పార్టీ నేతలు విజ్ఞప్తి చేసినా, సరైన స్పందన లేకపోవడంతో ...టీడీపీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధం అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను రంగంలోకి దించితే కచ్చితంగా గెలిపించుకుంటామని... ఈ రెండు లోక్‌సభ స్థానాల్లో టీడీపీకి బలమైన కేడర్ ఉందని చంద్రబాబుకు చెప్పినా పరిగణనలోకి తీసుకోకపోవడంతో పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్న తెలంగాణ తమ్ముళ్లు...ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారు. -
హీరోయిన్లు తెలుగు మాట్లాడకపోతే వాకౌట్ చేస్తా!
‘‘తెలుగు ఇండస్ట్రీ రాను రాను ఇంగ్లీష్ ఇండస్ట్రీ అయిపోయింది. ఆర్టిస్టులందరూ ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతున్నారు. టైటిళ్లు కూడా ఇంగ్లీష్‌లోనే పెడుతున్నారు. శోభారాణికి సినిమాలంటే ప్యాషన్. తమిళ చిత్రాలు డబ్బింగ్ చేసి ఎంత డబ్బు పోగొట్టుకుందో నాకు తెలుసు. ‘ఎందుకమ్మా అంత డబ్బు పెట్టి డబ్బింగ్ సినిమాలు కొనడం, సొంతంగా ఓ చిత్రం నిర్మించు’ అన్నా. ఇప్పుడు తను ఓ మంచి కథతో సినిమా నిర్మిస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. మిత్రన్ ఆర్.జవహర్ దర్శకత్వంలో తెలుగు, తమిళంలో సీఎల్ఎన్ మీడియాపై శోభారాణి నిర్మిస్తున్న ‘100 డిగ్రీ సెల్సియస్’ చిత్రం హైదరాబాద్‌లో ఆరంభమైంది. హీరోయిన్లు రాయ్‌లక్ష్మీ, నికిషా పటేల్, అరుంధతి నాయర్లపై దాసరి క్లాప్ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- ‘‘ఇండియాలోని అన్ని భాషల హీరోయిన్స్‌ను తెలుగు ఇండస్ట్రీ గౌరవిస్తుంది. సో, హీరోయిన్స్ ఫస్ట్ తెలుగు నేర్చుకొని ఇండస్ట్రీకి రావాలి. ఇది నా సిన్సియర్ అండ్ సీరియస్ సలహా. ఈ హీరోయిన్స్ నెక్ట్స్ నేనున్న స్టేజ్‌పైకి వచ్చినప్పుడు తెలుగులో మాట్లాడకపోతే వాకౌట్ చేస్తా’’ అన్నారు. ఇదే వేదికపై ‘కోటికొక్కడు’ చిత్రం ఆడియో వేడుక జరిగింది. సుదీప్, నిత్యామీనన్ జంటగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో కన్నడ, తమిళంలో తెరకెక్కిన చిత్రాన్నే ‘కోటికొక్కడు’ పేరుతో సిఎల్ఎన్ మీడియా, లగడపాటి శ్రీనివాస్, గూడూరి గోపాల్‌శెట్టి తెలుగులో విడుదల చేస్తున్నారు. డి.ఇమ్మాన్ స్వరపరచిన ఈ చిత్రం ఆడియో సీడీలను దాసరి, సముద్ర విడుదల చేశారు. ఈ వేడుకల్లో నిర్మాతలు శోభారాణి, ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, డీఎస్ రావు, ప్రతాని రామకృష్ణగౌడ్, హీరోలు భరత్, మనోజ్ నందమ్ పాల్గొన్నారు. -
12 తులాల బంగారం చోరీ
గజ్వేల్ పట్టణంలోని బంగారు నగల తయారీ వ్యాపారి ఇంట్లో 12తులాల బంగారం ఆదివారం చోరీకి గురైంది. ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని వాసవినగర్‌లో నివాసముంటున్న అనంతోజు ఆంజనేయచారి బంగారు ఆభరణాల తయారు చేస్తు జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం వారి ఇంటికి గుర్తు తెలియని మహిళ వచ్చి మీ ఇంట్లో గదులు కిరాయికి ఉన్నాయా అంటూ అడగగా ఆంజనేయచారి భార్య శోభారాణి లేవని చెప్పడంతో సదరు మహిళ అక్కడి నుంచి వెళ్తూ ఇంట్లో గోడకు వేసి ఉన్న ఓ బ్యాగును తీసుకెళ్లిపోయింది. ఈ విషయాన్ని కొద్దిసేపటి తర్వాత శోభారాణి గుర్తించి భర్తకు తెలపగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ బ్యాగులో 12 తులాల బంగారం ఉన్నట్టు ఆయన పేర్కొన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. -
'నల్గొండను కరువు జిల్లాగా ప్రకటించాలి'
నల్గాడ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నేతలు కార్యకర్తలు గురువారం మధ్యాహ్నం రాజపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాజుపేట తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, శోభారాణి తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. -
ఎంపీ‘ఢీ’వో
కుర్చీకోసం ఇద్దరు ఎంపీడీవోల కుమ్ములాట కుర్చీ నాదంటే..నాదేనని వాదులాట సరూర్‌నగర్ మండలంలో విచిత్ర పరిస్థితి సరూర్‌నగర్,న్యూస్‌లైన్: సాధారణంగా మండల అభివృద్ధి ఎవరి పరిధిలో ఉంటుందని అడిగితే టక్కున ఎంపీడీవో అని చెబుతాం. ఎక్కడైనా ఎంపీడీవో మండలానికి ఒక్కరే ఉంటారు. కానీ రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లో మాత్రం ఇద్దరు ఉన్నారు. వినడానికి విచిత్రంగానే ఉన్నా ఇది నిజం. అయితే ఒకరు అధికారులు బదిలీ చేశారని చెబుతుంటే.. మరొకరు కోర్టు ఉత్తర్వులు తనకే వచ్చాయని వాదులాడుకుంటున్నారు. వివరాలిలా ఉన్నాయి.. ప్రస్తుత సరూర్‌నగర్ ఎంపీడీవో సబిత మూడునెలల క్రితం కల్వకుర్తి నుంచి బదిలీపై వచ్చారు. సబిత కంటే ముందు విధులు నిర్వర్తించిన శోభారాణి ఎన్నికల బదిలీల్లో భాగంగా మెదక్ జిల్లా వర్గల్ మండలానికి వెళ్లారు. ఇంతవరకు బానే ఉన్నా...ట్విస్ట్ అంతా ఇక్కడే ఉంది. శోభారాణిని సరూర్‌నగర్ మండలానికి బదిలీ చేస్తూ జడ్పీ సీఈవో ఉత్తర్వులు ఇవ్వడంతో శుక్రవారం ఆమె ఆర్డర్ కాపీతో వచ్చి ఎంపీడీవో సీట్లో కూర్చున్నారు. అయితే శోభారాణి కంటే ముందే సబిత అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో ధర్మాసనం ప్రస్తుతం ఏ మండలంలో కొనసాగుతున్నారో అదే మండలంలో విధులు నిర్వర్తించుకోవచ్చని తీర్పునిచ్చింది. అధికారుల నుంచి ఆర్డర్ కాపీ ఆర్డర్ కాపీ తెచ్చుకున్న శోభారాణి, కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్న సబిత ఇరువురూ ఎంపీడీవో కుర్చీ తనదంటే ..తనదని వాదులాడుకున్నారు. తనకు రిలీవింగ్ ఆర్డర్ రాలేదని, ఉదయం నుంచి డ్యూటీలో ఉన్నానని.. పనినిమిత్తం బయటకెళ్లగానే శోభారాణి తన కుర్చీలో కూర్చోవటం దౌర్జన్యమని సబిత ఆరోపించారు. శోభారాణి వచ్చీరాగానే.. సబిత పేరున వున్న నేమ్‌ప్లేట్‌ను తీసేసి, తన నేమ్‌ప్లేట్‌ను గోడకు అమర్చారు. ఈ వివాదం కార్యాలయంలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకూ ఎంపీడీవో ఎవరో అర్థంగాక కిందిస్థాయి అధికారులు, సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. అధికారుల నుంచి ఆర ్డర్ కాపీ తెచ్చుకున్న శోభారాణి ఎంపీడీవోగా కొనసాగుతారా..? కోర్టు ఉత్తర్వులతో సబిత విధులు నిర్వర్తిస్తారా..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.