social networking website
-
చేపకు చక్రాల కుర్చీ...
చేపకు చక్రాల కుర్చీ: పుట్టుకలోని లోపం వల్ల గానీ, ప్రమాదవశాత్తు గానీ మన ఇంట్లో వాళ్లెవరికైనా కాళ్లు దెబ్బతింటే ఊరికే వదిలేస్తామా? ఆస్పత్రుల చుట్టూ తిరిగి, ఆపరేషన్లు చేయిస్తాం. అవకాశం ఉంటే, కృత్రిమ అవయవాలను ఏర్పాటు చేయిస్తాం. తిరిగి నడవగలిగే పరిస్థితి వచ్చేంత వరకు వీల్‌చైర్‌ను ఏర్పాటు చేస్తాం. మనుషుల విషయంలో ఇదంతా మామూలు ప్రక్రియే. సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ ‘రెడిట్’ యూజర్ ఒకరు మాత్రం తన ఇంట్లో పెంచుకుంటున్న చేపకు వీల్‌చైర్ ఏర్పాటు చేశాడు. ఇతగాడు ఏ దేశానికి చెందినవాడో తెలియదు గానీ, ఇతడి యూజర్ నేమ్ ‘లీబిలిటీ’. నీటితొట్టెలో మిగిలిన చేపలతో పాటే పెంచుకుంటున్న గోల్డెన్ ఫిష్ ఈదడానికి ఇబ్బందులు పడుతుండటాన్ని గమనించి, ఈ వీల్‌చైర్‌ను రూపొందించి, అమర్చానని, ఇప్పుడిది ఈజీగా ఈదులాడుతోందంటూ వీడియో, ఫొటోలతో పోస్ట్ పెట్టాడు. దీనికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఐరన్ లంగ్ః62 పుట్టుకతో ఆరోగ్యవంతమైన ఊపిరితిత్తులు ఉన్నా, నిండు నూరేళ్లూ ఊపిరి నిలిచి ఉంటుందనే గ్యారంటీ ఏమీ లేదు. టెక్సాస్‌కు చెందిన అలెగ్జాండర్ అనే ఈ ఆసామి వయసు ఇప్పుడు 68 ఏళ్లు. ఆరేళ్ల వయసులో పక్షవాతం సోకి, ఊపిరితిత్తులు రెండూ దెబ్బతిన్నాయి. అప్పుడు వైద్యులు అతడికి ఐరన్ లంగ్ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి... అంటే, గత 62 ఏళ్లుగా ఐరన్లంగ్తో ఊపిరి నిలుపుకుంటూ వస్తున్నాడు. ఈ ఐరన్ లంగ్‌లో మనిషి పూర్తిగా పడుకుంటేనే శ్వాస ఆడుతుంది. అలెగ్జాండర్ ఘనత ఇదొక్కటే కాదు. ఈ ఐరన్లంగ్తో ఊపిరి తీసుకుంటూనే మూడు డిగ్రీలు పూర్తి చేశాడు. లా కోర్సు కూడా పూర్తిచేసి, లాయర్‌గా ప్రాక్టీసూ ప్రారంభించాడు. ఐరన్లంగ్లో ఉంటూనే, వాలంటరీ బ్రీతింగ్‌ను సాధన చేశాడు. ఇప్పుడు ఐరన్‌లంగ్ నుంచి కొన్ని గంటల సేపు బయట ఉండగలుగుతున్నాడు. వాలంటరీ బ్రీతింగ్‌ను విజయవంతంగా సాధించడం వల్లే రోజూ కొన్ని గంటల సేపు లాయర్‌గా కోర్టుకు హాజరు కాగలుగుతున్నాడు. అక్కడ దొరికే వజ్రాలు మీవే... ఔను! అక్కడ దొరికే వజ్రాలు అచ్చంగా మీవే. అయితే, ఆ గనిలో వాటిని మీరే ఏరుకోవాలి. ఇంతకీ ఈ వజ్రాల గని ఎక్కడ ఉందనుకుంటున్నారా? ఇది అమెరికాలోని అర్కాన్సాస్ రాష్ట్రంలో ఉంది. అక్కడ మర్ఫ్రీబరోలో ఎనభై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్క్ వజ్రాల గనికి ఎవరైనా వెళ్లవచ్చు. ఓపిక ఉన్నంత సేపు వజ్రాల వేట సాగించవచ్చు. ఒకటో రెండో... ఎన్నో కొన్ని వజ్రాలు దొరికితే మీ పంట పండినట్లే! వాటిని ఎవరికీ ఇవ్వక్కర్లేదు. వాటిపై ఎలాంటి పన్నులూ కట్టక్కర్లేదు. ఇక్కడ వజ్రాల నిక్షేపాలు ఉన్నట్లు మొట్టమొదటి సారిగా 1906లో కనుగొన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గనిలో 75 వేలకు పైగా వజ్రాలు దొరికాయి. దీనిని 1972లో స్టేట్ పార్క్‌గా మార్చి, ప్రజలందరికీ ప్రవేశం కల్పించారు. అప్పటి నుంచి ఈ పార్కును సందర్శించిన వారిలో కొందరు అదృష్టవంతులు దాదాపు 19 వేలకు పైగా వజ్రాలను చేజిక్కించుకున్నారు. మీకూ ఈ వజ్రాలు కావాలా? అయితే, చలో అర్కాన్సాస్! గులాబీ యాపిల్... యాపిల్ అంటే ఎర్రగా నిగనిగలాడే పండు రూపమే మనకు గుర్తుకొస్తుంది. మార్కెట్లో ఎక్కువగా కనిపించేవి కూడా ఎర్రని యాపిల్సే. ఎర్ర ఎర్రని యాపిల్‌ను కోసి చూస్తే తెల్లగా కనిపిస్తుంది. ఎర్రని యాపిల్సే కాదు, ఆకుపచ్చని యాపిల్స్, పసుపుపచ్చని యాపిల్స్... ఇలాంటి ఎన్ని రకాల యాపిల్స్‌ను కోసి చూసినా, లోపలంతా తెల్లగానే ఉంటుంది. బ్రిటన్‌లో పండే ఈ విచిత్రమైన యాపిల్స్ మాత్రం చూడటానికి లేత కాషాయ ఛాయ కలగలసిన పసుపు రంగులో కనిపిస్తాయి. వీటిని కోసి చూస్తే మాత్రం, లోపల గుజ్జంతా గులాబీ రంగులో కనిపిస్తుంది. రుచిలో ఈ గులాబీ యాపిల్స్ కూడా మామూలు యాపిల్స్ మాదిరిగానే ఉంటాయి. -
ఫేస్ బుక్ అనేది టైంపాస్ చేయడానికి కాదు..
ముంబై: 'ఫేస్ బుక్' అనేది టైంపాస్ చేయడానికి కాదని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ స్పష్టం చేశాడు. ఏదో కాలక్షేపానికి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లను ఉపయోగించడం ఎంతమాత్రం సరైన నిర్ణయం కాదని ఆయన అభిప్రాయపడ్డాడు.ఈ రోజు ఉపాధి కల్పన వెబ్ సైట్ ను ఆరంభించిన అనంతరం సల్మాన్ ట్విట్టర్ లో పలు విషయాలను ట్వీట్ చేశాడు. నిరుద్యోగ యువతకు తగిన సహకారం అందించాలని ఆలోచనతో ఈ వెబ్ సైట్ ఆరంభించినట్లు తెలిపాడు. యువత ఎవరికి వారే తమ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి యత్నించాలన్నాడు. ప్రస్తుతం తాను ప్రారంభించిన ఈ వెబ్ సైట్ లో అర్హత ఆధారంగా ఉద్యోగం ఎంపిక చేసుకునే ఆస్కారం ఉంటుందన్నాడు. ఈ వెబ్ సైట్ సామాజిక సంక్షేమ సంస్థ సమన్వయంతో పనిచేస్తుందన్నాడు. ఉద్యోగ అన్వేషణలో ఉన్న వారికోసం ఒక వైబ్ సైట్ ను పెట్టే తన ఆలోచనను స్నేహితులకు తెలియజేశానని.. అందుకు వారు సానుకూలంగా స్పందించడంతోనే ఈ వెబ్ సైట్ ను ఆరంభిచినట్లు సల్మాన్ పేర్కొన్నాడు. -
28 రాష్ట్రాలు, 28 వారాలు, 28 ఉద్యోగాలు
భువనేశ్వర్: జీతాల్లో పెరుగుదల కోసం కంపెనీలు మారడం, జీవితంలో తొందరగా పెకైదగడానికి కూడా ఆ పని చేయడం నేటి యువతరం నైజం. అయితే ఒడిశాకు చెందిన 29 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ జుబనశ్వ మిశ్రా కాస్త డిఫరెంట్‌గా ఆలోచించాడు. 28 వారాల్లో 28 ఉద్యోగాలు మారి దేశం, ఆ మాటకొస్తే సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ ద్వారా ప్రపంచం దృష్టినాకర్షించాడు. ఓస్ అదెంత అనుకుంటున్నారా.. అయితే అతని మరో ప్రత్యేకత గురించి తెలుసుకోవాల్సిందే. టీచర్, ఫొటోగ్రాఫర్, సినిమా ఎగ్జిక్యూటివ్, రివర్ రాఫ్టింగ్ గైడ్, కాటికాపరి ఇలా చేసిన ఉద్యోగం చేయకుండా, మన దేశంలోని 28 రాష్ట్రాల్లో పనిచేశాడు. ఇప్పుడు అర్థమైఉంటుంది అతనెందుకంత పాపులర్ అయ్యాడో. ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే హైదరాబాద్‌లో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడుగా పనిచేశాడు. 20 మంది 2 ఏళ్ల పిల్లలు ఒక చిన్న గదిలో మన చుట్టూ కూర్చుని ఏడుస్తుంటే ఎలా ఉంటుందో హైదరాబాద్‌లో అనుభవమైందని, అదే తనకు కష్టమైన ఉద్యోగమని కూడా చెప్పాడు. బ్రిటన్ పత్రిక డైలీ మెయిల్‌కు మిశ్రా ఇంటర్య్వూ ఇస్తూ.. ‘‘తల్లిదండ్రులు ఒత్తిడి వల్ల పిల్లలు మెడిసిన్కో, ఇంజనీరింగ్కో పరిమితమవుతూ వాళ్లు కలల్ని చిదిమేసుకుంటున్నారు. ఆ ట్రెండ్‌ను బ్రేక్ చేయడానికి, విద్యార్థుల కలల్ని నిజం చేసుకునే ప్రయత్నం చేయాలనే నేనీ పనిచేశాను’’ అని చెప్పాడు.తొలుత చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టిన మిశ్రా.. ప్రస్తుతం స్వరాష్ట్రంలో రచయితగా, ఎమోషనల్ స్పీకర్‌గా పనిచేస్తున్నాడు. -
స్పాట్లైట్ : నచ్చని ఫాలోవర్లను ఇక బ్లాక్ చేయొచ్చు!
సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ట్విటర్ తన ఖాతాదారులకు ‘బ్లాక్’ సేవను పునరుద్ధరించింది. దీంతో మీ అకౌంట్‌ను మీకు నచ్చనివారు ఎవరైనా ఫాలో అవుతుంటే వారిని తొలగించి, బ్లాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఈ సదుపాయం ఉండేది. అయితే ట్విటర్ యాజమాన్యం ఎందుకో ఈ బ్లాక్ చేసే పద్ధతిని తొలగించింది. యూజర్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను గమనించి ఈ సేవను తిరిగి అందిస్తున్నట్టు ట్విటర్ పేర్కొంది. సెలబ్రిటీల హడావుడి ఎక్కువగా ఉన్న ట్విటర్లో ‘రీట్వీట్’ల విషయంలో కొంత ఇబ్బంది ఉంది. సెలబ్రిటీల ఫాలోవర్లుగా ఉంటూనే కొంతమంది అసభ్యపూరితమైన రీట్వీట్లు ఇస్తుండటాన్ని గమనించవచ్చు. ఈ నేపథ్యంలో... తిరిగి ‘బ్లాక్’ చేసే సదుపాయం మొదలవుతుండటం విశేషం. తెలుగును సపోర్ట్ చేసే సామ్సంగ్ స్మార్ట్‌ఫోన్! కొరియన్ హ్యాండ్సెట్ మేకర్ ‘సామ్సంగ్’ భారతీయులను ఇప్పుడు ప్రాంతీయ భాషల్లో పలకరిస్తోంది. తాజాగా ఆ సంస్థ మధ్య స్థాయి గెలాక్సీ ఫోన్ ఎస్ డుయోస్-2 ను విడుదల చేసింది. ఇది పది ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేస్తుండటం విశేషం. ఈ ఫోన్ మెనూ తెలుగు, కన్నడ, తమిళంతో మొత్తం పది ప్రాంతీయ భాషల్లో డిస్ప్లే అవుతుంది. ఫేస్బుక్, గూగుల్, జీమెయిల్ తదితరాలను తెలుగు డిస్ప్లేతో సర్ఫ్ చేయొచ్చు! 4 అంగుళాల స్క్రీన్, 5 మెగా పిక్సెల్ కెమెరా, 1.2 జీహెచ్‌జెడ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌తో ఉండే ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. -
‘లైక్’ కొట్టడమూ భావప్రకటనా స్వేచ్ఛే
రిచ్మండ్ (వర్జీనియా): సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ ‘ఫేస్బుక్’లో ‘లైక్’ను క్లిక్ చేయడం కూడా భావ ప్రకటనా స్వేచ్ఛ కిందకే వస్తుందని, దానికీ రాజ్యాంగ రక్షణ వర్తిస్తుందని అమెరికాలోని ఒక కోర్టు రూలింగ్ ఇచ్చింది. ‘ఫేస్బుక్’లో కేవలం ‘లైక్’ కొట్టినంత మాత్రాన అది రాజ్యాంగ రక్షణ పరిధిలోకి వచ్చే ‘భావప్రకటనా స్వేచ్ఛ’ కింద పరిగణించలేమంటూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును రిచ్మండ్లోని అప్పీళ్ల కోర్టు తోసిపుచ్చింది.