ఫేస్ బుక్ అనేది టైంపాస్ చేయడానికి కాదు..
ముంబై: 'ఫేస్ బుక్' అనేది టైంపాస్ చేయడానికి కాదని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ స్పష్టం చేశాడు. ఏదో కాలక్షేపానికి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లను ఉపయోగించడం ఎంతమాత్రం సరైన నిర్ణయం కాదని ఆయన అభిప్రాయపడ్డాడు.ఈ రోజు ఉపాధి కల్పన వెబ్ సైట్ ను ఆరంభించిన అనంతరం సల్మాన్ ట్విట్టర్ లో పలు విషయాలను ట్వీట్ చేశాడు. నిరుద్యోగ యువతకు తగిన సహకారం అందించాలని ఆలోచనతో ఈ వెబ్ సైట్ ఆరంభించినట్లు తెలిపాడు. యువత ఎవరికి వారే తమ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి యత్నించాలన్నాడు.
ప్రస్తుతం తాను ప్రారంభించిన ఈ వెబ్ సైట్ లో అర్హత ఆధారంగా ఉద్యోగం ఎంపిక చేసుకునే ఆస్కారం ఉంటుందన్నాడు. ఈ వెబ్ సైట్ సామాజిక సంక్షేమ సంస్థ సమన్వయంతో పనిచేస్తుందన్నాడు. ఉద్యోగ అన్వేషణలో ఉన్న వారికోసం ఒక వైబ్ సైట్ ను పెట్టే తన ఆలోచనను స్నేహితులకు తెలియజేశానని.. అందుకు వారు సానుకూలంగా స్పందించడంతోనే ఈ వెబ్ సైట్ ను ఆరంభిచినట్లు సల్మాన్ పేర్కొన్నాడు.