Social Sciences
-
సోషల్ సెన్సైస్ కోర్సులు
వివిధ స్పెషలైజేషన్లలో సోషల్ సెన్సైస్ కోర్సులను అందించడంలో దేశంలోనే అగ్రశ్రేణి విద్యా సంస్థ.. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ (టిస్). దీనికి ముంబై ప్రధాన కేంద్రంగా హైదరాబాద్, తుల్జాపూర్, గువహటి, చెన్నైల్లో క్యాంపస్‌లున్నాయి.2017 విద్యా సంవత్సరానికి టిస్ వివిధ కోర్సుల్లో ప్రవేశాలకుప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో టిస్ పీజీ కోర్సులు.. అర్హతలు.. ఎంపిక ప్రక్రియతదితర వివరాలపై ప్రత్యేక కథనం.. పీజీ కోర్సులు .. క్యాంపస్‌లు ముంబై క్యాంపస్: ఎంఏ ఇన్.. ఎడ్యుకేషన్ (ఎలిమెంటరీ); డెవలప్మెంట్ స్టడీస్; ఉమెన్స్ స్టడీస్; అప్లైడ్ సైకాలజీ విత్ స్పెషలైజేషన్ ఇన్ క్లినికల్ సైకాలజీ; అప్లైడ్ సైకాలజీ విత్ స్పెషలైజేషన్ ఇన్ కౌన్సెలింగ్ సైకాలజీ; గ్లోబలైజేషన్ అండ్ లేబర్; హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ లేబర్ రిలేషన్స్; సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్; సోషల్ వర్క్ ఇన్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అండ్ డెవలప్మెంట్ ప్రాక్టీస్ తదితర. ఎంఏ/ఎంఎస్సీ.. క్లైమేట్ ఛేంజ్ అండ్ సస్టైయినబిలిటీ స్టడీస్; రెగ్యులేటరీ గవర్నెన్స్; అర్బన్ పాలసీ అండ్ గవర్నెన్స్; వాటర్ పాలసీ అండ్ గవర్నెన్స్; డిజాస్టర్ మేనేజ్మెంట్. మాస్టర్ ఆఫ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ (ఎంహెచ్ఏ) గువహటి క్యాంపస్: ఎంఏ ఇన్.. ఎకాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ సస్టెయినబుల్ డెవలప్మెంట్; లేబర్ స్టడీస్ అండ్ సోషల్ ప్రొటెక్షన్; పీస్ అండ్ కన్ఫ్లిక్ట్ స్టడీస్; సోషియాలజీ అండ్ సోషల్ ఆంత్రోపాలజీ; సోషల్ వర్క్ ఇన్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అండ్ డెవలప్మెంట్ ప్రాక్టీసెస్; సోషల్ వర్క్ ఇన్ కౌన్సెలింగ్; సోషల్ వర్క్ ఇన్ లైవ్లీహుడ్స్ అండ్ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్; సోషల్ వర్క్ ఇన్ పబ్లిక్ హెల్త్. చెన్నై క్యాంపస్: ఎంఏ ఇన్.. సోషల్ వర్క్ ఇన్ మెంటల్ హెల్త్; సోషల్ వర్క్ ఇన్ హెల్త్, మేనేజ్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్; అప్లైడ్ సైకాలజీ విత్ స్పెషలైజేషన్ ఇన్ క్లినికల్ సైకాలజీ; అప్లైడ్ సైకాలజీ విత్ స్పెషలైజేషన్ ఇన్ కౌన్సెలింగ్ సైకాలజీ. తుల్జాపూర్ క్యాంపస్: ఎంఏ ఇన్.. సోషల్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్; సోషల్ వర్క్ ఇన్ రూరల్ డెవలప్మెంట్. ఎంఏ/ఎంఎస్సీ.. ఇన్ డెవలప్మెంట్ పాలసీ, ప్లానింగ్ అండ్ ప్రాక్టీస్; సస్టైయినబుల్ లైవ్లీహుడ్స్ అండ్ నేచురల్ రిసోర్సెస్ గవర్నెన్స్. హైదరాబాద్ క్యాంపస్: ఎంఏ ఇన్.. ఎడ్యుకేషన్; పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్; డెవలప్మెంట్ స్టడీస్; నేచురల్ రిసోర్సెస్ అండ్ గవర్నెన్స్; రూరల్ డెవలప్మెంట్ అండ్ గవర్నెన్స్; ఉమెన్స్ స్టడీస్; హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. అర్హత: 10+2+3 లేదా 10+2+4 విధానంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. కొన్ని కోర్సులకు బ్యాచిలర్ డిగ్రీలో నిర్దేశిత సబ్జెక్టులు అభ్యసించినవారు మాత్రమే అర్హులు. ఎంపిక: జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్ష.. టిస్‌నెట్ (100 మార్కులు), ప్రీ ఇంటర్వ్యూ టెస్ట్/గ్రూప్ డిస్కషన్ (50 మార్కులు), పర్సనల్ ఇంటర్వ్యూ (75 మార్కుల) ద్వారా ఎంపిక ఉంటుంది. ప్రవేశ పరీక్ష: ఆబ్జెక్టివ్ విధానంలో గంటా నలభై నిమిషాల వ్యవధిలో నిర్వహించే పరీక్షలో జనరల్ నాలెడ్జ్, ఎనలిటికల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీలపై ప్రశ్నలు ఉంటాయి. తప్పుగా గుర్తించిన సమాధానాలకు నెగెటివ్ మార్కులు ఉండవు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుం: క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/డెబిట్ కార్డ్ ద్వారా రూ.1030 చెల్లించాలి. ఏడాదికి రూ.2.5 లక్షలలోపు ఆదాయమున్న ఎస్సీ/ఎస్టీలు, రూ.లక్షలోపు ఆదాయమున్న ఓబీసీ ఎన్సీఎల్లు రూ.260 పే చేయాలి. ముఖ్య తేదీలు: ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 30, 2016 పోస్ట్ ద్వారా దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ: డిసెంబర్ 1, 2016 నేషనల్ ఎంట్రెన్స్ టెస్ట్ (కంప్యూటర్ బేస్డ్): జనవరి 7, 2017 వెబ్సైట్: http://admissions.tiss.edu/ -
డిగ్రీ సిలబస్‌లో సమూల మార్పులు
చర్యలు చేపట్టిన తెలంగాణ ఉన్నత విద్యా మండలి సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కోర్సుల్లో సమూల మార్పులు తెచ్చేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. రాష్ట్ర పరిస్థితులు, వాణిజ్య అవసరాలకు అనుగుణంగా బీఏ, బీకాం తదితర కోర్సుల్లో సిలబస్‌ను మార్పు చేయాలని నిర్ణయించింది. సోషల్ సెన్సైస్, భాషా పరమైన సబ్జెక్టుల్లోనూ మార్పులు చేయనుంది. ఇందులో భాగంగా శనివారం బీకాం కామర్స్ సిలబస్‌లో తీసుకురావాల్సిన మార్పులపై ఉన్నత స్థాయి కమిటీతోపాటు సూపర్వైజరీ, వర్కింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది. మరో పది రోజుల్లో సోషల్ సెన్సైస్, భాషా సబ్జెక్టుల్లో సిలబస్ మార్పు కోసం కమిటీలను ఏర్పాటు చేయనుంది. కామర్స్ సిలబస్‌లో మార్పులపై చర్చించేందుకు తెలంగాణలోని విశ్వవిద్యాలయాల డీన్స్, విభాగాధిపతులు, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్లతో శనివారం హైదరాబాద్‌లో ఉన్నత విద్యా మండలి వైస్ఛైర్మన్లు మల్లేశ్, వెంకటాచలం భేటీ అయ్యారు. ఫిబ్రవరి నాటికి అన్ని సబ్జెక్టుల్లో మార్పులను పూర్తి చేసి, వచ్చేవిద్యా సంవత్సరం నుంచే అమల్లోకి తేవాలని నిర్ణయించారు. కామర్స్‌లో మార్పులపై సంబంధిత సబ్జెక్టు డీన్స్‌తో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీతోపాటు అన్ని విశ్వ విద్యాలయాల బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్లు, విభాగాధిపతులతో కూడిన సూపర్వైజరీ కమిటీ, డిగ్రీ కాలేజీ అధ్యాపకులతో కూడిన వర్కింగ్ కమిటీలు సిలబస్‌లో మార్పులను ఖరారు చేస్తాయి. ముఖ్యంగా రాష్ట్ర వాణిజ్య, పారిశ్రామిక అవసరాలను గుర్తించి, వాటికి అనుగుణంగా కామర్స్ సిలబస్‌లో మార్పులు తీసుకువస్తారు. పారిశ్రామికరంగంలో పరిస్థితులు, భవిష్యత్తులో అవసరాలపైనా పాఠ్యాంశాలు ఉంటాయి. వివిధ రంగాల వారీ స్థితిగతులపై విద్యార్థుల్లో పూర్తిస్థాయి అవగాహన కలిగేలా ఈ మార్పులు తెస్తారు. దేశ వాణిజ్య విధానంతోపాటు విదేశీ వాణిజ్య విధానాలపైనా పాఠ్యాంశాలు ఉంటాయి. మూడేళ్ల కోర్సులో 16 సబ్జెక్టుల్లో సిలబస్‌ను మార్పు చేయనున్నారు. స్వల్పకాలిక కోర్సులకు హాజరు తప్పనిసరి డిగ్రీ పూర్తి కాగానే విద్యార్థులకు ఉపాధి లభించేలా బీకాం చదువుతున్నపుడే సర్టిఫికెట్ కోర్సులను, స్వల్పకాలిక కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. వీటితోపాటు విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు నైపుణ్యాల అభివృద్ధిపై స్వల్పకాలిక కోర్సు ఉంటుంది. వీటికి ఇంటర్నల్‌గా మార్కులు ఉంటాయి. అయితే వాటిని విద్యార్థి డిగ్రీ సర్టిఫికెట్లో పొందుపరచరు. అయితే ఈ కోర్సులో కనీస హాజరు శాతం తప్పనిసరి నిబంధనను విధిస్తారు. తద్వారా కచ్చితంగా ఆ తరగతులకు హాజరయ్యేలా చేస్తారు. తెలంగాణ యాస, భాషలకు స్థానం.. భాషా సబ్జెక్టులైన ఇంగ్లిషు, తెలుగు సబ్జెక్టుల్లోనూ సిలబస్ మార్చనున్నారు. వాటితోపాటు సోషల్ సెన్సైస్‌లో హిస్టరీ, కల్చర్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్టుల సిలబస్‌లో మార్పులు తెస్తారు. భాష, సంస్కృతి సబ్జెక్టుల్లో ప్రొఫెసర్ జయశంకర్, కొమురం భీం వంటి వారి చరిత్ర, తెలంగాణ ఉద్యమ ప్రస్థానం, కళాకారుల పాత్ర, బతుకమ్మ, కోలాటం, దసరా తదితర పండుగలకు చోటు కల్పిస్తారు. తెలంగాణ యాస-భాష, సాహిత్యం, సంస్కృతి, మహానుభావుల పద్య, గద్య రచనలు, కవిత్వాలపైనా పాఠ్యాంశాలు ఉంటాయి. వీటిల్లో మార్పులపై పది రోజుల్లో కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.