Sociologist
-
Pranav Shukla: పండుటాకులే పిల్లలుగా...
దైనందిన జీవితంలో ఎన్నో సందర్భాలు ఎదురవుతుంటాయి. వాటిలో కొన్ని మనల్ని కదిలించి ఆలోచింపచేస్తాయి. మరికొన్ని సందర్భాలు భవిష్యత్‌నే మార్చేస్తాయి. అలాంటి ఓ సంఘటన ప్రణవ్ శుక్లా జీవితాన్ని మార్చేసి సామాజికవేత్తగా తీర్చిదిద్దింది. వందలమంది వృద్ధులను చేరదీసి వారి ఆలన పాలన చూసుకుంటూ ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నాడు ప్రణవ్. హరియాణలోని ఫరిదాబాద్‌కు చెందిన వ్యక్తి ప్రణవ్ నారాయణ్ శుక్లా. ప్రణవ్ శుక్లా ప్రొఫెసర్ కొడుకు కావడంతో ఇంటర్మీడియట్ తరువాత మెడిసిన్ చదవాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే మెడిసిన్‌లో చేరాడు. కానీ ఫ్యాషన్ డిజైనింగ్‌పై మక్కువ ఏర్పడడంతో నెలరోజుల తరువాత మెడిసిన్ మానేసాడు. ఇది కుటుంబ సభ్యులకు నచ్చకపోవడంతో ఎటువంటి ఆర్థిక సాయం చేయలేదు. అయినా తనకిష్టమైన ఫ్యాషన్ డిజైనింగ్‌ను కష్టపడి చదివి ఓ బహుళజాతి సంస్థలో ఉద్యోగం సంపాదించాడు. కాలేజీ రోజుల్లో... ప్రణవ్ శుక్లా ఫ్యాషన్ డిజైనింగ్ చదివేటప్పుడు రోజూ కాలేజీకి ట్రైన్లో వెళ్తుండేవాడు. ఒకసారి ట్రైన్ ఎక్కేందుకు ఓక్లా స్టేషన్‌కు చేరుకున్నాడు. అది చలికాలం కావడంతో ప్లాట్‌ఫాం మీద మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో ప్లాట్‌ఫాం పైన ఒక మూలన ఒక వృద్ధుడు చలికి వణికిపోతూ అల్లాడిపోతున్నాడు. అదిచూసి చలించిపోయిన ప్రణవ్ తను ఎంతో ఇష్టంతో కొనుక్కున్న జాకెట్‌ను ఆ వృద్ధుడికి ఇచ్చాడు. అప్పుడు అతడి కళ్లలో చూసిన ఆనందం ప్రణవ్‌కు చాలా సంతృప్తినిచ్చింది. తను జీవితంలో ఆర్థికంగా నిలదొక్కుకున్న తరువాత వృద్ధుల బాగోగులను చూసుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు. ఆనందాల, ఆత్మీయతల ఆశ్రమం.. ప్రణవ్ ఉద్యోగంలో చేరాక కొంతమొత్తాన్ని దాచుకుని వృద్ధులకు ఖర్చుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. çకొంతమొత్తం జమయ్యాక.. నిరాశ్రయులైన వృద్ధులకు బియ్యం, పప్పులు, దుస్తులు వంటి నిత్యావసరాలు సమకూర్చేవాడు. అయితే వారి అవసరాలు తీర్చడానికి మరిన్ని సదుపాయాలు అవసరం అని భావించి... 1996లో ‘అనడి సేవా ప్రకల్ప్’ పేరిట ఓల్డేజ్ హోమ్‌ను ఏర్పాటు చేశాడు. అప్పుడు ప్రణవ్‌కు పంతొమ్మిదేళ్లు. వసతి సదుపాయాలు లేక అనాథలుగా మారిన ఒంటరి వృద్ధులను చేరదీసి వసతి, కడుపునిండా ఆహారం పెట్టడం, అవసరమైన ఆరోగ్య అవసరాలు తీర్చుతూ వృద్ధుల జీవననాణ్యతను మెరుగుపరిచాడు. ఒకపక్క ప్రణవ్ ఉద్యోగం చేస్తూనే అనడిని చూసుకునేవాడు. కొన్నాళ్ల తరువాత పూర్తి సమయాన్ని ఆశ్రమానికి కేటాయించడం కోసం 2017లో ఉద్యోగం వదిలేశాడు. అప్పటినుంచి మరింత సమయాన్ని కేటాయించి ఆశ్రమంలోని వారిని సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకోవడం మొదలు పెట్టాడు. వారికి అవసరమైన వైద్యసదుపాయాలు సకాలంలో అందిస్తూ వారిని ఆనందంగా ఉంచేందుకు తనవంతు కృషి చేస్తున్నాడు. ఆవులు పెంచుతూ... ఆశ్రమాన్ని నడిపేందుకు.. అవసరమైన ఖర్చుల కోసం అనడి ఫారమ్స్ అండ్ గోదామ్ పేరిట ఆవుల పెంపకాన్ని ప్రారంభించాడు. రెండువందల ఆవులను పెంచుతూ.. వాటి ద్వారా వచ్చే పాలు, పెరుగు, నెయ్యిని విక్రయిస్తూ వచ్చిన ఆదాయాన్ని అనడి ఆశ్రమ వృద్ధుల కోసం ఖర్చు చే స్తున్నాడు. గత ఇరవై ఆరేళ్లుగా అనడీలో ఎంతోమంది వృద్ధులు ఆశ్రయం పొందారు. మలివయస్కుల జీవితాల్లో వెలుగులు నింపుతోన్న నలభై ఆరేళ్ల ప్రణవ్ సేవకు గుర్తింపుగా అనేక అవార్డులు, గౌరవ సత్కారాలు దక్కడంలో ఆశ్చర్యం లేదు. అందుకే పిల్లలు వద్దనుకున్నాం కాలేజ్ డేస్‌లో తీసుకున్న నిర్ణయం ఈరోజు ఇంతమందికి ఆశ్రయం కల్పిస్తోంది. పెద్దవారికి సాయం చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఆశ్రమంలో నలభైæరెండు మంది వృద్ధులు ఉన్నారు. వారిని కన్నబిడ్డల్లా చూసుకుంటున్నాము. అందుకే నేను, నా భార్య పిల్లలు వద్దు అనుకున్నాము. -
Arti Singh Tanwar: పోలీస్ వీడియో పాఠాలు
మోసం, లైంగిక దోపిడి నుంచి అమ్మాయిలను రక్షించే లేడీ సబ్ ఇన్స్పెక్టర్గా ఆర్తిసింగ్ తన్వర్కి మంచి పేరుంది. దీంతోపాటు సైబర్ నేరగాళ్ల నుంచి ఎంత అలెర్ట్‌గా ఉండాలో సోషల్ మీడియా ద్వారా అవగాహన కలిగిస్తుంటుంది. చట్టం గురించి వీడియో పాఠాలు చెబుతుంటుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు, మోటివేషనల్ స్పీచ్‌లు ఇస్తుంటుంది. ఆమె గైడ్లైన్స్కి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. రాజస్థాన్ పోలీస్ అకాడమీలో విధులు నిర్వర్తిస్తున్న ఆర్తిసింగ్ తన అభిరుచితో బాధ్యత గల సామాజికవేత్తగానూ ప్రశంసలు అందుకుంటోంది. ఈ లేడీ సబ్ ఇన్స్పెక్టర్ తన విధుల ద్వారానే కాదు రోజూ ఇచ్చే స్ఫూర్తిమంతమైన స్పీచ్‌లు, ఎలాంటి మోసం జరగకుండా ఇచ్చే సైబర్ గైడెన్స్‌తో ప్రతిరోజూ చర్చలో ఉంటుంది. ‘నా అభిరుచిని వృత్తితో జోడీ కట్టించాను. ఫలితం ఎంతోమందికి చేరువయ్యాను’ అంటారు ఈ లేడీ పోలీస్. ► వృత్తి... ప్రవృత్తితో కలిసి.. ఆర్తిసింగ్ కుటుంబ సభ్యులు, బంధువుల్లో చాలామంది పోలీసులుగా ఉన్నారు. వారిలాగే ఆర్తి కూడా పోలీస్ వృత్తినే ఎంచుకుంది. 2012లో రాజస్థాన్ పోలీస్ అకాడమీలో చేరి 2014లో సబ్ ఇన్ స్పెక్టర్‌గా విధులను చేపట్టింది. ‘నేను సోషల్ మీడియా ఫ్రెండ్లీగా ఉంటాను. చేస్తున్న పనుల ద్వారానే నలుగురిలో అవగాహన కలిగిస్తే చాలనుకున్నాను. మహిళల గళం వినిపించాల్సిన చోటు, సైబర్ అవగాహన, సందేశాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. నా ఫాలోవర్స్ ఎప్పుడు ఇంతగా పెరిగిపోయారో తెలియనే లేదు’ అనేస్తారు ఆమె నవ్వుతూ. ► సోషల్ మీడియా సెల్... పోలీస్ అకాడమీలో శిక్షణ ఇవ్వడంతోపాటు సోషల్ మీడియా సెల్ కూడా నిర్వహిస్తోంది ఈ సబ్ ఇన్స్పెక్టర్. ‘ఇటీవల మా సిబ్బందికి పోలీస్ అకాడమీ డైరెక్టర్ ఫొటోతో ఓ మెసేజ్ వచ్చింది. గిఫ్ట్ కార్డుల సాకుతో ఎవరో నకిలీ నంబర్ తో డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. వెంటనే అందరినీ అప్రమత్తం చేశాను. ఇలాగే.. షాపింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్, మెసేజ్‌లలో వచ్చే షార్ట్ లింక్స్... వంటి ఆన్లైన్ మోసాలు ప్రతిరోజూ నమోదవుతున్నాయి. ఈ మోసాలకు అడ్డుకట్ట వేయాలంటే ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో అవగాహన తప్పనిసరి అనుకున్నాను. లైవ్ ఇంటరాక్షన్ ద్వారా మోసాన్ని నివారించడానికి సూచనలు ఇస్తుంటాను. బాధితులు తమ అనుభవాలను కామెంట్స్‌లో లేదా డైరెక్ట్ మెసేజ్ ద్వారా తెలియజేస్తారు. దీంతో వారికి తక్షణ సహాయం అందివ్వడానికి ప్రయత్నిస్తుంటాం. మోసం, లైంగిక దోపిడీని ఎలా నివారించాలో సూచించే వీడియోలను అప్లోడ్ చేస్తుంటాను’ అని వివరిస్తారు ఆమె. ► యువతకు వీడియో పాఠాలు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు, టైమ్ టేబుల్ తయారు చేసుకోవడం, రోజువారీ సిలబస్‌ను ఎలా సిద్ధం చేసుకోవాలి, ఏ సబ్జెక్టులను ఎప్పుడు, ఎలా చదవాలి, కంటెంట్ సులభంగా ఎలా గుర్తుంచుకోవచ్చు... ఇలాంటి వీడియోల కోసం యువత ఎదురు చూస్తుంటుంది. ► కొత్త టెక్నాలజీ పరిచయం సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వీడియోల ద్వారా షేర్ చేస్తుంటుంది ఆర్తి. మొబైల్ హ్యాక్ అయితే ఏం చేయాలి? ఇంట్లోని స్మార్ట్ టీవీ హ్యాక్ అయితే సమస్యను ఎలా పరిష్కరించాలి? సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ కొత్త ఫీచర్లు ఏమిటి?.. వీటికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటుంది ఆర్తి. ► ఖాకీ యూనిఫాంలో.. ‘నా వీడియోలలో చాలా వరకు నేను ఖాకీ యూనిఫాంలోనే కనిపిస్తాను. ఆఫీసులో పని చేస్తున్నప్పుడు చట్టపరమైన సమాచారాన్ని చిన్న చిన్న వీడియోలు చేసి పోస్ట్ చేస్తాను. కొన్నిసార్లు ఇంటి నుంచి ఆఫీసుకు లేదా ఆఫీసుకు నుంచి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు కారులో వీడియోలు షూట్ చేసి అప్లోడ్ చేస్తుంటాను. పోస్ట్ చేసిన గంటల్లోనే వేలల్లో వ్యూస్ వస్తాయి. దీనిని బట్టి ప్రజల్లో చట్టం, న్యాయం, మోసాలకు సంబంధించిన అవగాహన ఎంత అవసరం ఉందో గ్రహించవచ్చు’ అని చెప్పే ఆర్తిసింగ్ను ‘మా మంచి పోలీస్’ అంటూ ప్రశంసిస్తున్నారు ఆమె ఫాలోవర్స్. ప్రతిరోజూ అవగాహన రీల్ ప్రతిరోజూ లక్షలాది మంది ఫాలోవర్లు ఆర్తి గైడెన్స్ రీల్స్ కోసం ఎదురు చూస్తుంటారు. వాటిలో చట్టం, న్యాయానికి సంబంధించి అవగాహన కంటెంట్‌కే ప్రాధాన్యమిస్తుంటుంది. ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్‌ల ద్వారా నాలుగు లక్షల మందికి పైగా ప్రజలు ఆర్తి సూచనలను ఫాలో అవుతున్నారు. -
Priyaswara Bharti: ప్రేరణనిచ్చే ప్రియస్వరం
పట్టుమని పదేళ్లు కూడా నిండకముందే తండ్రి మరణం, దీనికితోడు ఆర్థిక పరిస్థితులు దిగజారి భవిష్యత్ శూన్యంగా కనిపించింది. విధి వంచించిందని సర్దిచెప్పుకుని ముందుకు సాగుతోన్న తరుణంలో ఎంతో ఇష్టమైన చెల్లి, తల్లి అకాల మరణాలు అమాంతం పాతాళంలోకి లాగినట్టు అనిపించాయి. అయినా ఏమాత్రం భయపడకుండా ఎదురవుతోన్న ఆటుపోట్లను బలంగా మార్చుకుని సామాజిక వేత్తగా, డైరెక్టర్‌గా రాణిస్తోంది ప్రియస్వర భారతి. 21 ఏళ్లకే జీవితానికి సరిపడినన్ని కష్టాలను అనుభవించిన ప్రియస్వర నేడు అవార్డు విన్నింగ్ డాక్యుమెంటరీలు తీస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో చిన్న గ్రామానికి చెందిన ప్రియ స్వరభారతి. నలుగురు సంతానంలో ఒకరు. తల్లిదండ్రులు ఇద్దరూ ప్రైవేటు స్కూలు టీచర్స్. భారతికి తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు అనుకోకుండా తండ్రికి యాక్సిడెంట్ అయ్యింది. మెరుగైన చికిత్సనందించేందుకు పాట్నాకు తీసుకెళ్లారు. ప్రారంభంలో ఆరునెలలు అనుకున్న చికిత్స మూడేళ్లపాటు కొనసాగింది. దీంతో కుటుంబం మొత్తం అక్కడే ఉండాల్సి వచ్చింది. ఉన్నదంతా ఖర్చుపెట్టి చికిత్స చేయించినప్పటికీ ఫలితం దక్కకపోగా, తండ్రిని కోల్పోయారు. మరోపక్క ఆర్థిక ఆధారం లేక నలుగురూ మూడేళ్లు స్కూలుకు వెళ్లలేదు. ట్యూషన్లు చెబుతూ... తండ్రి చనిపోయాక భారతి తల్లి ఉద్యోగం చేసినప్పటికీ కుటుంబ పోషణకు సరిపోయేది కాదు. దీంతో తల్లికి సాయపడేందుకు హోమ్ ట్యూషన్స్ చెప్పేది భారతి. ఇదే సమయంలో స్కూలుకు వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో ఎక్స్ట్రాకరిక్యులర్ యాక్టివిటీస్‌ను నేర్పించే కిల్కారి సంస్థలో చేరింది. అక్కడ సైన్స్ ప్రాజెక్టుపై మక్కువ ఏర్పడడంతో ఎంతో ఆసక్తిగా నేర్చుకునేది. దీంతో 2013లో కిల్కారి నుంచి యూనిసెఫ్‌కు ఎంపికైన 20 మందిలో భారతి ఒకరు. కిల్కారి, యూనిసెఫ్ ద్వారా పిల్లల హక్కుల గురించి వివరంగా తెలుసుకుని తన తోటి వలంటీర్లతో కలిసి ‘బీహార్ యూత్ ఫర్ చైల్డ్ రైట్స్’ పేరుతో సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ద్వారా పిల్లలకు విద్య, బాలల హక్కులపై అవగాహన కల్పించడం, బాల్యవివాహాలు, మహిళలు, ప్రత్యుత్పత్తి అవయవాల ఆరోగ్యంపై అవగాహన కల్పించేది. ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ వివిధ వర్క్‌షాపులు, వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. చెల్లితో కలిసి డైరెక్టర్‌గా... ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ అసోసియేషన్, కిల్కారి సంస్థలు రెండు కలిసి పదిరోజుల పాటు డైరెక్షన్ లో ఉచితంగా వర్క్‌షాపు నిర్వహించాయి. అప్పుడు యూనిసెఫ్ అడ్వైజరీ బోర్డు యువ యంగ్ పీపుల్ యాక్షన్ టీమ్‌లో సభ్యురాలిగా కొనసాగుతోన్న భారతి సినిమాటోగ్రఫీపై ఆసక్తితో పదిరోజులపాటు వర్క్‌షాపుకు హాజరైంది. తరువాత తన చెల్లి ప్రియాంతరాతో కలిసి ‘గెలటాలజీ’ డాక్యుమెంటరీ తీసింది. తొమ్మిదో జాతీయ సైన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ డాక్యుమెంటరీకి స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. తరువాత 2019లో పట్నాను ముంచెత్తిన వరద బీభత్సాన్ని కళ్లకు కట్టేలా ‘ద అన్నోన్ సిటీ, మై ఓన్ సిటీ ఫ్లడెడ్’ పేరుతో మరో డాక్యుమెంటరీ రూపొందించింది. ఈ డాక్యుమెంటరీకి కూడా ఆర్ట్స్ అండ్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో స్పెషల్ జ్యూరీ అవార్డు వరించింది. 2018 నుంచి డాక్యుమెంటరీలు తీస్తూ జాతీయ, అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు పంపిస్తూ అనేక అవార్డులను అందుకుంది. ప్రస్తుతం పట్నా యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ చదువుతున్న భారతి కొన్ని పెద్ద ప్రాజెక్టులకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తోంది. అవకాశాలు సృష్టించుకోవాలి అవకాశాలు వాటంతట అవే మన దగ్గరికి రావు. మనమే సొంతంగా సృష్టించుకుని ముందుకు సాగాలి. అప్పుడే జీవితంలో ఎదగగలుగుతాము. అదే నా విజయ రహస్యం. – ప్రియస్వర భారతి -
భార్యను ఎలా కొట్టాలంటే..!
దోహా : నేటికి కూడా స్త్రీని ఓ అంగడి సరుకుగా భావించే సమాజం ఇది. దేశాలు, ప్రాంతాలు మారినప్పటికి ఈ భావజాలం మాత్రం మారదు. అందులోనూ జీవితాంతం తనకు తోడుగా ఉండటానికి వచ్చిన స్త్రీ పట్ల మరింత చులకన భావం కనిపిస్తుంటుంది చాలా మంది మగాళ్లలో. బయట చాలా విషయాల్లో కనీసం నోరేత్తని ఆజానుబాహులు కూడా భార్యల దగ్గరకు వచ్చే సరికి ప్రతి చిన్న విషయానికి కూడా చేయ్యెత్తడానికి రెడీగా ఉంటారు. ఈ ఆధునిక కాలంలో కూడా భార్యంటే కుక్కిన పేనులా పడుంటుందనే ధైర్యంతో పురుషులు రెచ్చిపోతుంటే.. భర్త వదిలేస్తే తన జీవితమే నాశనమవుతుందనే భయంతో మహిళలు బతుకీడుస్తున్న సంఘటనలు కోకొల్లలు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరలవుతోన్న ఓ వీడియో చూస్తే మళ్లీ ఓ వందేళ్లు వెనక్కి ప్రయాణించాం అనిపించకమానదు. ఇప్పటికి కొన్ని ముస్లిం దేశాల్లో మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో.. నేటికీ మహిళకు వారిచ్చే విలువ ఏంటో ఈ వీడియో చూస్తే పూర్తిగా అర్థమవుతుంది. ఖతర్‌కు చెందిన సోషియాలజిస్ట్ ఒకరు భార్యను ఎలా కొట్టాలో వివరిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. దారుణం ఏంటంటే భార్యను కొట్టడమే తప్పంటే.. దానికి మతం కూడా అనుమతించిందంటూ కొన్ని తలకు మాసిన నియమాలు చెప్పుకొచ్చాడీ సోషియాలజిస్ట్. వివరాలు.. ‘పెళ్లైన మగవారు ఈ వీడియోను తప్పక చూడాలి. భార్యను కొట్టడం తప్పనిసరి.. కానీ ప్రతిరోజు కాదు. ఈ కొట్టడం కూడా ఎలా ఉండాలంటే భార్యకు తాను ఆడదాన్ని అని.. భర్త మగవాడు, బలవంతుడు అనే విషయాన్ని గుర్తుకు తెచ్చేలా కొట్టాలి. భార్యకు తన భర్త శక్తిసామర్థ్యాలు తెలిసేలా దండించాలి. ముందు మీరొక విషయం అర్థం చేసుకోవాలి. కుటుంబాన్ని ఓ కంపెనీగా భావిస్తే.. భర్త దాని యజమాని. భార్య అందులో వర్కర్. వర్కర్ బుద్ధిగా మసులు కోవడం కోసం యజమాని వారిని దండించాలి. అలా అయితేనే వారి జీవితం సాఫీగా సాగుతుంది. ప్రేమగా ఉండటం వల్ల క్రమశిక్షణ అలవడద’ని సదరు సోషియాలజిస్టు ఈ వీడియోలో పేర్కొన్నాడు. అంతేకాక ‘భార్య పద్దతిగా నడుచుకోవాలంటే భర్త తన ప్రేమను పక్కకు పెట్టి భార్యను కొట్టాలి. భార్య క్రమశిక్షణతో మసలకపోతే.. ముందు హెచ్చరించాలి.. తరువాత సలహా ఇవ్వాలి.. అప్పటికి దారికి రాకపోతే పడక గదికి దూరంగా ఉంచాలి. ఆఖరి ప్రయత్నంగా మాత్రమే ఆమెను దండించాలి. అయితే ఆమెను లాగిపెట్టి ముఖం మీద కొట్టడం, ముక్కు మీద గుద్దడం.. తల మీద బాదడం లాంటివి చేయకూడదు. రక్తం వచ్చేలా కూడా కొట్టకూడదు’ అని చెప్పడమే కాక ఎలా కొట్టాలో ఓ డెమో కూడా చేసి చూపించాడు సదరు సోషియాలజిస్ట్. ఇక్కడ ఇంకో దరిద్రం ఏంటంటే.. పదేళ్ల పిల్లాడి మీద ఈ డెమో చేసి చూపించడం. అంటే ఇప్పటి నుంచే ఆ చిన్న బుర్రలోకి మహిళ అంటేనే ఓ సరుకు అని.. దాని మీద మగవాడికి పూర్తి హక్కు ఉందనే పాఠాన్ని బలంగా ఎక్కిచ్చేస్తున్నాడీ ప్రబుద్ధుడు. -
యువత ఆన్లైన్ ప్రపంచంలోకి....
పుస్తక పరిచయం పుస్తకాన్ని రాసే క్రమంలో రిపోర్టర్, సామాజికవేత్త, సాంకేతిక నిపుణురాలు, మానసిక విశ్లేషకురాలు... ఇలా రకరకాల అవతారాలు ఎత్తారు రచయిత్రి. ‘‘వీళ్లను ఒక పట్టాన అర్థం చేసుకోలేం’’ అని అప్పుడప్పుడూ అంటుంటారు పెద్దలు యువత ధోరణులను పరిశీలిస్తూ. సోషల్ మీడియా ప్రాబల్యం పెరిగిన తరువాత ఈ అర్థం చేసుకోవడమనే వ్యవహారం మరింత క్లిష్టంగా మారింది. సోషల్ మీడియా వల్ల యువతకు మంచి జరగుతుందా? చెడు జరుగుతుందా? అనే చర్చ తీవ్రమైంది. అయితే ఈ చర్చలో ఏకపక్ష వాదనలే ఎక్కువగా వినిపించేవి. సాధికారికమైన సమాచారం ఆధారంగా చేసే వాదన తక్కువగా ఉండేది. ఈ నేపథ్యంలో డోన బోయ్ రాసిన ‘ఇట్స్ కాంప్లికేటెడ్...ది సోషల్ లివ్స్ ఆఫ్ నెట్ వర్క్డ్ టీన్స్’ పుస్తకం యువత ఆన్లైన్ మనస్తత్వాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ఉపయోపడుతుంది. న్యూయార్క్ యూనివర్శిటీ... డిపార్ట్మెంట్ ఆఫ్ మీడియా, కల్చర్ అండ్ కమ్యూనికేషన్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు డోన. మైక్రోసాఫ్ట్‌లో ప్రిన్సిపల్ రిసెర్చర్‌గా కూడా ఆమెకు అనుభవం ఉంది. ఏడు సంవత్సరాల పాటు ఎన్నో కోణాలలో అధ్యయనం చేసి డోన రాసిన పుస్తకం ఇది. దీనికోసం వందలాది మంది టీనేజర్లను ఇంటర్వ్యూ చేశారు. దినచర్య మొదలు మనస్తత్వ పరిశీలన వరకు యువతకు సంబంధించిన రకరకాల ధోరణులను లోతుగా అధ్యయనం చేశారు. టెక్ట్స్ మెసేజ్‌లు, యూ ట్యూబ్ సినిమాలు, ట్విట్టర్, ఫేస్బుక్ అప్డేట్లు, సెల్ఫీలు...ఇలా యువత ఆన్లైన్ జీవితాన్ని లోతుగా విశ్లేషించారు. ‘‘సోషల్ మీడియా వల్ల యువత నష్టపోతుందనే ప్రచారం... అవసరానికి మించి ఎక్కువగా జరుగుతోంది. సోషల్ మీడియా వల్ల లాభమే తప్ప నష్టమేది లేదు’’ అంటున్నాడు డోన ఇంటర్వ్యూ చేసిన స్టాన్ అనే విద్యార్థి. ఒకే కోణంలో కాకుండా సోషల్ మీడియా వల్ల యువతకు జరుగుతున్న నష్టాలతో పాటు ప్రయోజనాలను కూడా డోన చెప్పారు. పుస్తకాన్ని రాసే క్రమంలో రిపోర్టర్, సామాజికవేత్త, సాంకేతికనిపుణురాలు, మానసిక విశ్లేషకురాలు...ఇలా రకరకాల అవతారాలు ఎత్తారు రచయిత్రి. అందుకే పుస్తకానికి నిండుదనం వచ్చింది. ‘ఇట్స్ కాంప్లికేటెడ్...’ పుస్తకానికి విమర్శకుల నుంచి ‘కనువిప్పు కలిగించే పుస్తకం’ (ఐ-ఓపెనింగ్ బుక్), ‘తల్లిదండ్రులు, యువత మాత్రమే కాదు, అన్ని వర్గాల వారు చదవాల్సిన పుస్తకం’ అనే ప్రశంసలు లభించాయి. -
నిర్లక్ష్యం నీడన పిళ్లై సమాధి
అన్నానగర్: మయూరం వేదనాయగంపిళ్లై తమిళ సాహిత్య తొలి నవలా రచయిత. తన రచనల ద్వారా స్త్రీ విద్య, స్త్రీల స్వేచ్ఛకు ఎంతో కృషి చేశారు. కరువు సంభవించిన సమయంలో సొంత డబ్బుతో పేద వారికి ఇతోధికంగా సాయం అందించిన దయూగుణ శీలి. సామాజిక వేత్త. అలాంటి వ్యక్తి సమాధిని ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వదిలివేయడంపై రచయితలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైలాడుదురై సమీపంలోని మయూరం ప్రాంతానికి మునసబుగా పనిచేసిన వేదనాయగంపిళ్లై కొలత్తూరులో 1826 అక్టోబరు 11న జన్మించారు. ఆయన రచయితగా పేరు తెచ్చుకున్నారు. తన రచనల ద్వారా స్త్రీల స్వేచ్ఛను, స్త్రీలకు విద్యను అందించాలని పేర్కొన్నారు. ఆయన రచనల్లో నేతినూళ్, తిరువాళుర్మాలై, తిరువాళుర్ అంతాడి, దేవమాత, పెరియనాయగి, అమ్మన్పధిగం, తమిళ భాషలో తొలి నవలగా చెప్పబడుతున్న ప్రతాపమందలియారుచరితం, సుగుణంబాల్ చరిత్ర, పెన్మణం, పెణ్కల్వి, పెణ్మదిమాలై, సంగీత పర గ్రంథాలైన దేవ స్త్రోత్ర కీర్తనగళ్ తదితరాలు ఉన్నారు. వేదనాయగంపిళ్లై క్రిస్టియన్ వనితను వివాహం చేసుకోవడంతో వారి వంశస్తులు ఆయనను కులం నుంచి వెలివేశారు. దీంతో ఆయన మైలాడుదురై వచ్చి అక్కడే స్థిరపడ్డారు. తమిళ సాహిత్యానికి ఎంతో సేవ చేశారు. పేదలకు తనకు చేతనైనంత మేరకు సహాయం అందించారు. మయూరం ప్రాంతానికి మునసబుగా పనిచేశారు. ఆ సమయంలో కరువు సంభవించడంతో తన సొంత డబ్బుతో పేదలకు సాయం అందించారు. ఆయన 1889 జూలై 21న తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయూన్ని మైలాడుదురై మెయిన్ రోడ్డు నుంచి మాయవరానికి వెళ్లే దారిలోని ఆర్సీ శ్మశాన వాటికలో సమాధి చేశారు. ఆయన సమాధికి ఆనుకునే ఆయన తల్లి మరియమ్మాళ్, భార్య లాజర్ అమ్మాళ్ (వీరిద్దరూ బ్రిటీష్ వనితలు)ల సమాధులు కూడా ఉన్నాయి. పసుపు రంగు సున్నపురాయితో మరియమ్మాళ్ సమాధిని, లాజర్ సమాధిని నిర్మించారు. ఈ రెంటికి ఎదురుగా దీర్ఘ చతురస్రాకారంలో పిళ్లై సమాధి ఉంది. 1983 వరకూ ధర్మపురం మఠం వారు ఈ సమాధులను పరిరక్షించారు. అనంతరం ఎవ్వరూ వీటిని పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో అవి శిథిలావస్థకు చేరుకున్నారు. సమాధిపైన కలుపు మొక్కలు పెరిగిపోరుు అధ్వానంగా దర్శనమిస్తోంది.