Socks
-
వందేళ్ల క్రితం ఎవరెస్ట్‌పై గల్లంతు
లండన్: ప్రపంచంలోనే అతి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే క్రమంలో జాడ తెలియకుండా పోయిన బ్రిటిష్ పర్వతారోహకుడి ఆనవాళ్లు తాజాగా వందేళ్లకు బయటపడ్డాయి. నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీ బృందంలోని పర్వతారోహకులకు 1924లో కనిపించకుండా పోయిన ఇద్దరిలో ఎ.సి.ఇర్విన్(22) పాదం, బూటు, ఆయన పేరున్న ఎంబ్రాయిడరీ సాక్స్ దొరికాయి. ఇది తెలిసి ఇర్విన్ సోదరుని కుమార్తె ఆనందం వ్యక్తం చేశారు. దీంతోపాటు, ఎడ్మండ్ హిల్లరీ, టెన్జింగ్ నార్గే కంటే 29 ఏళ్ల ముందే ఎవరెస్ట్ అధిరోహించేందుకు వెళ్లిన ఈ ఇద్దరూ తమ ప్రయత్నంలో విజయం సాధించారా లేదా అన్న అనుమానాలకు తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీ బృందం ఈ ఏడాది సెప్టెంబర్‌లో చైనా ఆదీనంలోని ఎవరెస్ట్ ఉత్తర ప్రాంతంలో రొంగ్బుక్ గ్లేసియర్ వద్ద చిత్రీకరణ చేపట్టింది. ఈ బృందానికి ఆస్కార్ విజేత కూడా ప్రముఖ జిమ్మీ చిన్ నాయకత్వం వహిస్తున్నారు. అక్కడ వారికి 1933 నాటి ఆక్సిజన్ సిలిండర్ ఒకటి లభ్యమైంది. ఇర్విన్‌కు సంబంధించిన వస్తువు కూడా ఒకటి దొరికింది. దీంతో, చాలా రోజులు అక్కడే అన్వేషణ జరిపారు. ఫలితంగా వారికి ఓ కాలున్న బూట్ దొరికింది. అందులోని సాక్ ఎంబ్రాయిడరీపై ‘ఎ.సి.ఇర్విన్’అనే పేరుంది. ఈ బూటును 1924 జూన్‌లో జార్జి మల్లోరీతో కలిసి ఎవరెస్ట్ అధిరోహించేందుకు వచ్చి అదృశ్యమైన బ్రిటిష్ దేశస్తుడు ఏసీ శాండీ ఇర్విన్దేనని తేల్చారు. 1999లో మల్లోరీ మృతదేహం పర్వతారోహకుల కంటబడగా, ఇర్విన్ ఆనవాళ్లు ఇప్పటికీ దొరకలేదు. అయితే, ఈయన వెంట తెచ్చుకున్న కెమెరా కోసం పలువురు గతంలో తీవ్రంగా గాలించారు. అందులోని ఫొటోల ఆధారంగా ఈ ఇద్దరు సాహసికుల ప్రయత్నం ఏమేరకు ఫలించిందన్న ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని వారి ఆశ. తాజాగా దొరికిన ఆధారంతో ఇర్విన్ మృతదేహం వంటి ఆనవాళ్లు అదే ప్రాంతంలో దొరకవచ్చన్న అంచనాలు పెరిగిపోయాయి. -
ఈ సాక్సులు వేసుకుంటే సినిమా మిస్ అవ్వరు.. ఎలా అంటే?
కంప్యూటర్ యుగంలో పెరుగుతున్న టెక్నాలజీని వినియోగదారులకు అనుకూలంగా తయారు చేయడానికి కొన్ని కంపెనీలు కంకణం కట్టుకున్నాయి. ఇందులో భాగంగానే 'నెట్‌ఫ్లిక్స్ సాక్స్' పేరుతో అందుబాటులో ఉండే సాక్స్ సినిమాలు చూసేటప్పుడు చాలా ఉపయోగకరంగా ఉండేలా తయారు చేశారు. ఈ అద్భుతమైన సాక్స్ గురించి మరిన్ని వివరాలను ఇక్కడ చూసేద్దాం. నిజానికి నెట్‌ఫ్లిక్స్ ద్వారా సినిమాలు.. లేదా ఇతర ప్రోగ్రామ్స్ చూసే సమయంలో నిద్ర వస్తే.. ఆ ప్రోగ్రామ్ లేదా సినిమా మిస్ అయిపోతామేమో అని చాలామంది కంగారు పడొచ్చు. కానీ ఇప్పుడు ఎలాంటి టెన్షన్ లేకుండా సినిమా చూసేటప్పుడు నిద్ర వస్తే నిద్రపోవచ్చు. మీరు ఏ మాత్రం చూస్తున్న ప్రోగ్రామ్ మిస్ అయ్యే అవకాశం లేదు. నెట్‌ఫ్లిక్స్ సాక్స్ పేరుతో మార్కెట్లో లభించే సాక్సులు సెన్సార్లను కలిగి ఉంటాయి, కాబట్టి టీవీ చూసే సమయంలో వాటిని కాళ్ళకు వేసుకోవాలి. సాక్సులు వేసుకుని టీవీ చూసే సమయంలో నిద్ర వస్తే.. సాక్సులోని సెన్సార్లు ఆ విషయాన్ని గుర్తించి.. మీరు చూస్తున్న సినిమాను అక్కడితో ఆపేస్తాయి. మీరు నిద్ర మేల్కొన్న తరువాత ప్రోగ్రామ్ మళ్ళీ అక్కడ నుంచే కంటిన్యూ అవుతుంది. ఇదీ చదవండి: ఇషా అంబానీ రైట్ హ్యాండ్ ఇతడే.. జీతం లక్షల్లో కాదు కోట్లల్లోనే.. ఈ సాక్సులు మీ కదలికలను దృష్టిలో ఉంచుకుని పనిచేస్తాయి. కొన్ని సందర్భాల్లో మీరు కదలకుండా అలాగే కూర్చుంటే సాక్సులోని సెన్సార్ టీవీని ఆపేయవచ్చు, కాబట్టి సాక్సు వేసుకుని టీవీ చూసేటప్పుడు కదలిక అవసరం. కదలకుండా కూర్చోవడం లేదా నిద్రపోవడం మధ్య వ్యత్యాసం ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఈ సాక్సులు సమస్యగా మారే అవకాశం ఉంటుంది. -
సాక్స్ అలా ఉంటే చాలా ప్రమాదకరం.. ఏం జరుగుతుందో తెలుసా..?
పాదరక్షలు ఫుల్ షూస్, హాఫ్ షూ, బెల్ట్ షూ, పీప్ టోస్, వెడ్జెస్, శాండల్స్... ఏ రకమైనా సరే సాక్స్ ధరించడం కామన్. సాక్స్ చాలా మందికి డైలీ రొటీన్లో భాగమైపోయాయి కూడా. అయితే సాక్స్ ఎంపికలో మనకు తెలియకుండానే జరిగిపోయే పొరపాట్లు అనేకం. సాక్స్ అంటే సెకండ్ స్కిన్ అని చెప్పాలి. ఎక్కువసేపు పాదాలను అంటిపెట్టుకునే ఉంటాయి. అందుకే అవి స్కిన్ ఫ్రెండ్లీగా ఉండాలి. సాక్స్ వదులుగా జారిపోతూ ఉంటే వెంటనే స్పందిస్తాం. సాక్స్ బిగుతుగా ఉంటే ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలంలో కానీ బయటపడవు. ఆ క్షణంలో తెలియదు కాబట్టి మనం ఏ మాత్రం పట్టించుకోం. చదవండి: సంక్రాంతికి వీటిని తినే ఉంటారు.. అయితే వాటి లాభాలు కూడా తెలుసుకోండి! పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంటాం. సాక్స్ మరీ టైట్‌గా ఉంటే పాదం, వేళ్ల కదలికలు తగ్గిపోతాయి. అది రక్తప్రసరణ మీద ప్రభావం చూపిస్తుంది. కండరాల కదలికలు, రక్తప్రసరణ వేగం తగ్గిపోతూ ఉంటే చర్మం కూడా జీవం కోల్పోతుంటుంది. అందుకే సాక్స్ కాలివేళ్ల కదలికలను నియంత్రించకూడదు. సాక్స్ ధరించిన తర్వాత వేళ్లను సులువుగా కదిలించగలిగేటట్లు ఉండాలి. రకరకాల ప్రయత్నాల తర్వాత ఏదైనా ఒక కంపెనీ సాక్స్ సౌకర్యంగా ఉన్నట్లు అనిపిస్తే ఇక ఆ బ్రాండ్‌నే కొనసాగించడం మంచిది. ఇక పిల్లల విషయానికి వస్తే... పిల్లలకు ఉదయం స్కూలుకు వెళ్లేటప్పుడు వేసిన సాక్స్ సాయంత్రం ఇంటికి వచ్చేవరకు అలాగే ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సాక్స్ బిగుతుగా ఉండకూడదు. అలాగే సాక్స్ పాతవైపోయి వదులై జారిపోతున్నప్పుడు ‘ఆదివారం సెలవు రోజు వెళ్లి కొత్తవి కొందాం’ అనుకుని ఆపద్ధర్మంగా ఒక రబ్బర్ బ్యాండ్ వేయడం జరుగుతుంటుంది. అలా రబ్బర్ బ్యాండ్‌తోనే రోజులు గడిపేస్తుంటారు. అది చాలా ప్రమాదం. తాత్కాలికంగా ఒకటి –రెండు రోజులు వేసే రబ్బర్ బ్యాండ్ కూడా పిల్లల కాళ్ల మీద ఒత్తిడి పడి చర్మం ఎర్రబడేటట్లు ఉండకూడదు. రక్తప్రసరణకు ఆటంకం కలిగించని విధంగా ఉండాలి. ఇంతకంటే తక్షణం కొత్త సాక్స్ కొనడమే ఉత్తమం. -
నా దగ్గర అన్ని రకాల సాక్స్ కలెక్షన్ ఉంది : హీరోయిన్
నిధి అగర్వాల్.. వైవిధ్యమైన ఆలోచన, ఆచరణే ఆమె విజయ రహస్యం. ఫ్యాషన్‌లోనూ అదే ఫార్ములా! ఆమె ఫేవరేట్ బ్రాండ్సే నమూనా!! స్టార్స్‌కు ఎస్వీఏ ఫేవరేట్ 'సోనమ్, ప్రకాశ్ మోదీ అనే ఇద్దరు డిజైనర్స్ కలసి స్థాపించిన సంస్థ ఎస్వీఏ. దాదాపు ఏడు సంవత్సరాలుగా ఎవర్ గ్రీన్ డిజైన్స్‌ను అందిస్తున్నారు. అదే వీరి బ్రాండ్ వాల్యూని పెంచింది. డిజైన్స్‌కు ఎంత ప్రాధాన్యం ఇస్తారో.. ఫ్యాబ్రిక్కూడా అంతే ప్రాధాన్యం ఇస్తారు. నాణ్యమైన వస్త్రాల కోసం ముంబైలో ఓ పరిశ్రమనే స్థాపించారు. అక్కడ తయారైన ఫ్యాబ్రిక్‌తో మాత్రమే వీరు డిజైన్స్ చేస్తారు. అందుకే చాలా మంది స్టార్స్‌కు ఎస్వీఏ ఫేవరేట్. విదేశాల్లో కూడా వీరి దుస్తులకు మంచి గిరాకీ ఉంది. డిజైనర్ పీస్ కాబట్టి కాస్త ఎక్కువగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లో ఈ బ్రాండ్ డిజైన్స్ లభిస్తాయి. నీతా బూచ్రా.. ప్రసిద్ధ బంగారు ఆభరణాల వ్యాపారి లలిత్ కుమార్ బూచ్రా వారసురాలు. నగల మీదున్న మోజుతో జ్యూయెలరీ డిజైనర్‌గా మారింది నీతా. స్టార్స్ కోసం ప్రత్యేకంగా ఆభరణాలను డిజైన్ చేస్తుంది. ప్రియాంక చోప్రా, విద్యా బాలన్ వంటి సెలబ్రిటీస్‌కు ఆమె అభిమాన డిజైనర్. జైపూర్‌లో ‘నీతా బూచ్రా జ్యూయెలరీ ’ పేరుతో బంగారం, వెండి, వజ్రాల ఆభరణాల దుకాణం ఉంది. కేవలం డిజైన్ ఆధారంగానే ఆభరణాల ధర నిర్ణయిస్తారు. పలు ప్రముఖ ఆన్ లైన్ స్టోర్స్‌లో ఈ డిజైన్స్ లభిస్తాయి. ఏది కొనాలన్నా రూ. వేల నుంచి లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. క్రిస్ట్యా లుబుటా టాప్ మోస్ట్ లగ్జూరియస్ ఫ్యాషన్ బ్రాండ్స్‌లో క్రిస్ట్యా లుబుటా ఫుట్‌వేర్ ఒకటి. దాదాపుగా ప్రతి హాలీవుడ్ స్టార్ దగ్గర దీని కలెక్షన్ ఉంటుంది. 1991లో మొదలైన ఈ సంస్థను ది గ్రేట్ డిజైనర్ క్రిస్ట్యా లుబుటా స్థాపించారు. ఫ్యాషన్ వరల్డ్ .. ప్యారిస్‌లో దీని మెయిన్ బ్రాంచ్ ఉంది. ఇప్పటి వరకు సుమారు ఆరు లక్షల ఫుట్‌వేర్ డిజైన్స్‌ను ఈ సంస్థ అందించింది. ఈ బ్రాండ్‌కు ప్రపంచమంతా స్టోర్స్ ఉన్నాయి. ఈ ఫుట్‌వేర్ ఖరీదు చాలా చాలా ఎక్కువ. పలు ప్రముఖ ఆన్ లైన్ స్టోర్స్‌లోనూ దొరుకుతాయి. బ్రాండ్ వాల్యూ డ్రెస్ బ్రాండ్: ఎస్వీఏ ధర: రూ. 65,000 జ్యూయెలరీబ్రాండ్: నీతా బూచ్రా జ్యూయెలరి ధర: డిజైన్ పై ఆధారపడి ఉంటుంది. ఫుట్‌వేర్ బ్రాండ్: ఐరిజ క్రిస్ట్యా లుబుటా పంప్స్ ధర:రూ. 55,567 ఎవరైనా రకరకాల షూస్ ఇష్టపడ్తారు. నాకైతే రకరకాల సాక్స్ ఇష్టం. ఎప్పుడూ ఒకేరకమైన సాక్స్ ధరించను. నా దగ్గర వివిధ బ్రాండ్స్ సాక్స్ కలెక్షన్ ఉంది.– నిధి అగర్వాల్ -దీపిక కొండి -
ఎన్నిరోజులు వేసుకున్నా ఈ సాక్స్ కంపు కొట్టవు!
నాగరికుడు కావడంలో మనిషికి ఎదురయ్యే అతిముఖ్యమైన సమస్య సాక్స్. షూ విప్పగానే సాక్స్ గుప్పున కంపుకొడితే.. వాడు అనాగరికుడికిందే లెక్క! సినిమాల్లో సాక్స్ ల వాసన మీద బోలెడన్ని సీన్లు, పేజీలకొద్దీ డైలాగులు రాసేది కూడా మనల్ని నాగరికులు కమ్మని చెప్పేందుకే! అఫ్ కోర్స్, ఆ రాసేవాడు మంచి సాక్స్ లు వేసుకుంటాడా లేదా చెప్పలేమనుకోండి! రోజుకో సాక్స్ జత వేస్తే ఉతికేవాళ్లకు బాధ, రోజూ ఒకటే వేసుకుంటే పక్కవాళ్లకు బాధ. మరిలాంటప్పుడు ఏం చెయ్యాలి? డీసెంట్ గా మారుతున్న జీవితాల్లో అన్ డీసెన్సీలా మారిన ఈ సాక్స్ వ్యథకు గొప్ప ముగింపు పలికారు స్టీవ్, జెన్నీ దంపతులు. ఎన్ని రోజులు వేసుకున్నా వాసనరాని సాక్స్ ను ఈ మధ్యే తయారుచేశారు వీళ్లు. శాంపిల్ గా బంధువులతో, తెలిసినవాళ్లతో ఈ కొత్తరకం సాక్స్ లు తొడిగించారు. 'అద్భుతం.. ఏడునెలలు వేసుకున్నా సాక్స్ వాసనరాలేదు!' అని ఒకరు, 'ఏడాది వేసుకున్నా ఏమీ కాలేదు'అని మరొకరు స్టీవ్, జెన్నీ ల సాక్స్ ల పనితీరును ప్రశంసించారట. ఈస్ట్ డెవోన్ (ఇంగ్లాడ్)లో నివసించే ఈ జంటకు ఓ గోట్ ఫామ్ (కోళ్ల ఫారం లాగా మేకలను పెంచే ఫామ్ అన్నమాట) ఉంది. అందులో వందలాది అంగోరా జాతి మేకలున్నాయి. ఇతర మేకలతో పోల్చుకుంటే అంగోరా మేకల ఒంటిపై బొచ్చుబాగా పెరుగుతుంది. రకరకాల ప్రయోగాల తర్వాత అంగోరా మేకనుంచి సేకరించిన ఉన్నికి వాసనను నిరోధించే గుణం ఉంటుందని కనిపెట్టిన స్టీవ్ దంపతులు.. దానితో సాక్స్ తయారుచేశారు. ఆనోటా ఈనోటా వాసన రాని సాక్స్ కు పబ్లిసిటీ పెరిగి క్రమంగా కస్టమర్లు పెరిగారు. -
మీరు 'వాటిని' పోగొట్టుకున్నారా?
న్యూజిల్యాండ్: ఇళ్ళల్లోకి చొరబడి బంగారం, నగలు ఎత్తుకుపోయేవాళ్ళను చూశాం. బ్యాంకుల్లో, కార్యాలయాల్లో డబ్బు, వస్తువులు చోరీ చేసేవాళ్ళను చూశాం. అయితే ఓ దొంగ విచిత్ర వస్తువుల చోరీకి పాల్పడుతోందట. తరచుగా ఇళ్ళల్లో మిస్సవుతున్న ఆ వస్తువులు ఎవరు దొంగిలిస్తున్నారో తెలియక అంతా తలలు పట్టుకుంటుంటే చివరికి ఆ దొంగే ఓరోజు వస్తువులన్నీయజమాని ఇంటికి తెచ్చి పెట్టేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చిందట. ఇంతకూ ఆ టక్కరి దొంగ ఏ వస్తువులను కొట్టేసిందనేగా మీరు తెలుసుకోవాలనుకుంటున్నది?... ఎందుకాలస్యం ఈ స్టోరీ చదివెయ్యండి.... న్యూజిల్యాండ్ హామిల్టన్ లో బర్గ్లర్ అనే ఓ పిల్లి.. తరచుగా అందరి ఇళ్ళల్లో చోరీకి పాల్పడుతోందట. అయితే పిల్లి చోరీ చేస్తోందంటే ఏ పాలో, పెరుగో అనుకునేరు. సాక్షాత్తూ ఆ ఇళ్ళల్లోని మగవాళ్ళ అండర్ వేర్లు, సాక్స్ లు తస్కరిస్తోందట. ఇళ్ళల్లో లో దుస్తులు అదృశ్యం అవుతుంటే ఇంట్లోవాళ్లకు అవి ఎలా పోతున్నాయో అర్థం కాకుండా పోయిందట. ఏ డబ్బో, బంగారమో అయితే కేసులు పెట్టడమో, ఫిర్యాదు చేయడమో చేస్తారు. ఈ చోరీ అటువంటిది కాదుకదా... పోతున్నది లో దుస్తులు కావడంతో ఏం చేయాలో పాలుపోక ఆలోచనలో పడ్డారట. రెండు నెలల్లో ఆరేళ్ళ వయసున్న ఆ టాంకినీస్ క్యాట్.. మొత్తం పదకొండు జతల అండర్ వేర్లు, ఏభై వరకూ సాక్స్ చోరీ చేసి, తిరిగి తెచ్చి యజమాని ఇంట్లో పెట్టేయడంతో చివరికి అసలు విషయం బయట పడింది. ఈ సరదా న్యూస్ ను 'మీరు అండర్ వేర్లు పోగొట్టుకున్నారా?' అన్న టైటిల్ తో ఫేస్ బుక్ వినియోగదారుడు సారా నాథన్ ఫొటోలతో సహా పోస్ట్ చేశాడు. ఆ దొంగ పిల్లిని గురించి జనాన్ని అప్రమత్తం చేసేందుకు తానా వివరాలను అందిస్తున్నట్లు చెప్పాడు. అందుకోసం వీధుల్లోని ప్రతి లెటర్ బాక్స్ లోనూ నోట్ పెట్టానని, జార్జి సెంటర్ ప్రాంతంలోని వారెవరైనా సదరు ఆస్తులు పోగొట్టుకుంటే తనకు తెలియజేయాలని ఫేస్ బుక్ లో రాశాడు. ఇంకెదుకాలస్యం మరి తమ తమ ... దుస్తులు పోగొట్టుకున్నవారు త్వర పడాల్సిందే...