sold child
-
నిజామాబాద్: రూ. 50 వేలకు కన్నబిడ్డ విక్రయం
సాక్షి, నిజామాబాద్: కన్నతల్లే కూతురును రూ.50 వేలకు విక్రయించిన ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. రెంజల్ మండలానికి చెందిన ఓ మహిళపై గతేడాది అదే గ్రామానికి చెందిన వ్యక్తి అత్యాచారం చేశాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటికే బాధిత మహిళ గర్భం దాల్చింది. నెలకింద బోధన్ ప్రభుత్వ ఆస్పత్రిలో పాపకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ బలహీనంగా ఉండటంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పాపను వదిలించుకోవాలనుకుని ఓ మహిళతో రూ.50 వేలకు పాపను విక్రయించింది. ఆ మహిళ పాపను మరొకరికి విక్రయించింది. సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం పాప తల్లితో పాటు మరో 8 మందిపై కేసు నమోదు చేశారు. -
‘అప్పు తీరుస్తారా.. బిడ్డను అమ్ముతారా..?’
హుబ్లీ(కర్ణాటక): అప్పులు తీర్చండి... లేదంటే బిడ్డను అమ్మండి అంటూ..వీుటర్ వడ్డీ దారులు హుకుం జారీ చేశారు. గత్యంతరం లేక పేద దంపతులు తమ ఐదు నెలల మగ బిడ్డను వారి చేతిలో పెట్టారు. బిడ్డపై మమకారంతో మనసు మార్చుకొని పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు రంగంలోకి దిగి బాలుడిని రక్షించి చిన్నారిని కొనుగోలు చేసిన నిందితులను అరెస్ట్ చేశారు. వివరాలు.. హుబ్లీలోని విద్యాగిరిలో రూప, మైనుద్దీన్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరు ఇంటి నిర్మాణం కోసం మీటర్ వడ్డీదారుల వద్ద అప్పులు చేశారు. వాటిని తీర్చలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో బాకీ తీర్చాలని ఆసాములు డిమాండ్ చేశారు. అప్పులు తీర్చకపోతే బిడ్డను అమ్మాలని ఒత్తిడి చేశారు. దీంతో తమ ఐదు నెలల మగబిడ్డను రూ. 2.50లక్షలకు విక్రయించారు. బిడ్డ దూరం కావడంతో మనో వేదనకు గురైన దంపతులు పోలీసులను ఆశ్రయించారు. పోలసులు గాలింపు చేపట్టి భారతీ మంజునాథ వాల్మీకి(48), రమేష్ మంజునాథ్(48), రవి బీమసేనా హేగ్డే(38), వినాయక అర్జున మాదర(27), ఉడుపికి చెందిన విజయ్ బసప్ప నెగళూరు(41), చిత్ర విజయ్ నెగళూరును అరెస్ట్ చేశారు. వారినుంచి బిడ్డను స్వాధీనం చేసుకొని బాలల సంక్షేమ సమితికి అప్పగించారు. చదవండి: నగ్న వీడియోలు: వ్యాపారవేత్తను ఇంటికి పిలిచి.. కర్ణాటక రాసలీలల సీడీ కేసులో కీలక మలుపు -
విడిపోయేందుకు బిడ్డ అమ్మకం
కటక్: ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో తల్లిదండ్రుల గొడవకు ఒక చిన్నారి బలయ్యాడు. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి ఒకరికి ఒకరు దగ్గరవుతారు అనుకున్నారు. అయితే గొడవలు సద్దుమణపోయే సరికి వారు విడిపోవాలనుకున్నారు. వారికి ఉన్న ఒక్కగానొక్క కొడుకు విడిపోవడానికి అడ్డుగా మారడంతో అతనిని విక్రయించారు. అనంతరం ఎవరి దారి వారు చూసుకున్నారు. మథిలి మండలం కియాంగ్ పంచాయతీ పరిధిలోని తేలగబేజా గ్రామంలో ఈ అమానవీయ ఘటన జరిగింది. ఆ తల్లి కూడా కన్న ప్రేమ మరచి బాలుడిని విక్రయించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే అదే గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఆ బాలుడిని కొనుకున్నారు. అతనిని పశువుల కాపరిగా నియమించారు. పశువులను మేతకు తీసుకువెళ్లను అంటే తనను ఇష్టం వచ్చినట్లు కొట్టేవారని బాలుడు వాసుదేవ్ వాపోయాడు. అంతేకాకుండా అన్నం కూడా సరిగా పెట్టకుండా హింసించేవారని అందుకే అక్కడి నుంచి పారిపోయినట్లు బాలుడు తెలిపాడు. అక్కడ బాలుడి కథ విన్న గ్రామస్తులు అతడిని అంగన్వాడీ కేంద్రానికి అప్పగించాడు. దీంతో అంగన్వాడీ కార్యకర్తబాలుడిని తమ ఇంటికి తీసుకువెళ్లారు. బాలుడిని కొనుగోలు చేసిన కుటుంబం ఈ విషయం తెలుసుకొని అతడిని తమకు అప్పగించాలని అంగన్వాడీ కార్యకర్తను బెదిరించింది. దీంతో అంగన్వాడీ కార్యకర్త ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో రంగప్రవేశం చేసిన ఉన్నతాధికారులు బాలుడి తల్లిదండ్రుల వద్దకు వెళతామంటే పంపిస్తామని లేదా చదువుకుంటానంటే చదివిస్తామని తెలిపారు. మొత్తానికి బాలుడి కథ విన్నవారందరూ అతని పరిస్థితి చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు. చదవండి: మోసం: సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య -
అమ్మమ్మా.. ఇదేందమ్మా!
వీణవంక (హుజూరాబాద్): నెల రోజుల శిశువును అమ్మమ్మ అమ్మేసింది. మనవరాలి ఆలనా పాలనా చూడాల్సిన ఆమె అప్పులు తీర్చుకోవడం కోసం రూ లక్షకు విక్రయించింది. శిశువు కనిపించకపోవడంపై కూతురు నిలదీయడం.. తల్లీకూతుళ్ల గొడవను ఓ వ్యక్తి డయల్ 100కు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లా వీణవంకకు చెందిన జమల్పూరి పద్మ, రమేశ్ నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. హైదరాబాద్‌లో నెల రోజుల క్రితం పద్మ ఆడశిశువుకు జన్మనిచ్చింది. వారం క్రితం భర్తతో గొడవ పడిన పద్మ.. స్వగ్రామంలోని తల్లి కనకమ్మ ఇంటికి వచ్చింది. కూతురికి మాయమాటలు చెప్పిన కనకమ్మ.. నాలుగు రోజుల క్రితం శిశువును పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి రూ.1.10 లక్షలకు విక్రయించింది. శిశువు కనిపించకపోవడంతో తల్లిని నిలదీయగా మాయమాటలు చెప్పి కాలం వెళ్లదీసింది. పద్మ గట్టిగా నిలదీయడంతో డబ్బులకు అమ్మేశానని చెప్పడంతో రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు శుక్రవారం విచారణ జరిపారు. ప్రేమ వివాహం నచ్చనందుకే..! పద్మకు గతంలోనే వివాహమైంది. కుమారుడు, కూతురు ఉన్నారు. రమేశ్‌ను రెండో వివాహం చేసుకుంది. కులాంతర వివాహం చేసుకోవడంతో తల్లికి నచ్చలేదు. కూతురుపై కక్ష పెంచుకుంది. భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో అదునుగా తీసుకున్న కనకమ్మ.. కూతురును తన ఇంటికి తీసుకొచ్చింది. శిశు విహార్‌కు తరలింపు శిశువు విక్రయంపై ఎస్సై కిరణ్‌రెడ్డి పూర్తి స్థాయిలో విచారణ జరిపి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరు పర్చేందుకు కరీంనగర్‌లోని శిశువిహార్‌కు తరలించారు. కాగా, శిశువు విక్రయంలో కొందరు మధ్యవర్తులుగా వ్యవహరించినట్లు తెలిసింది. కనకమ్మ రూ.2 లక్షలు డిమాండ్ చేయగా రూ.1.10 లక్షలకు బేరం కుదిర్చినట్లు సమాచారం. -
భార్య పిల్లలను అమ్మేసిన కసయి భర్త
-
ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని నిర్వాకం..
బుక్కరాయసముద్రం: ప్రసవించిన గంటల వ్యవధిలోనే శిశువును మరొకరికి అప్పగించి వెళ్లిపోయిన తల్లి ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. బుక్కరాయసముద్రం మండలం పి.కొత్తపల్లికి చెందిన ప్రతాప్, రాజేశ్వరి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. ప్రస్తుతం రాజేశ్వరి గర్భిణి. రోడ్డుప్రమాదంలో చెయ్యి విరగడంతో ప్రతాప్ అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వారం రోజులపాటు చికిత్స చేయించుకున్నాడు. మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. ఇదే ఆస్పత్రిలో పండంటి ఆడబిడ్డను ప్రసవించిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ప్రతాప్ చేతిలో పెట్టి వెళ్లిపోయినట్లు సమాచారం. ప్రతాప్ ఆ శిశువును ఇంటికి తెచ్చుకున్నాడు. గ్రామంలో అంగన్వాడీ కార్యకర్త గోవిందమ్మ విషయం తెలుసుకుని ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సీడీపీఓ వనజా అక్కమ్మ, సూపర్ వైజర్ వాణిశ్రీ, చైల్డ్‌లైన్ ప్రతినిధులు సురేష్, ఆదినారాయణలు గురువారం పి.కొత్తపల్లికి చేరుకుని ప్రతాప్, రాజేశ్వరి దంపతుల వద్ద ఉన్న శిశువును స్వాధీనం చేసుకున్నారు. అక్కడి నుంచి పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం శిశువును వైద్య పరీక్షల నిమిత్తం అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. -
అమ్మ వదిలేసింది.. నర్సులు అమ్మేశారు!
కామారెడ్డిలోని ప్రైవేటు ఆస్పత్రిలో ఘటన ఇందూరు: ఆడపిల్ల భారమనుకుందో ఏమో కానీ ఓ తల్లి పుట్టినబిడ్డను ఆస్పత్రిలోనే వదిలి వెళ్లింది... పాపను రక్షించాల్సిన నర్సులు ఆ బిడ్డను అమ్మేశారు. నిజామాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు... సుమారు నెలన్నర క్రితం కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి మహిళ ప్రసవం కోసం వచ్చింది. ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వారం రోజులు ఆస్పత్రిలోనే ఉన్న ఆ తల్లి, కుటుంబ సభ్యులు ఎందుకో ఆ బిడ్డను ఆస్పత్రిలోనే వదిలి వెళ్లిపోయారు. గమనించిన నర్సులు కుటుంబసభ్యుల వివరాలు రిజస్టర్‌లో ఉన్నప్పటికీ.. ఎవరికీ సమాచారం ఇవ్వకుండానే పాపను అమ్మాలని నిర్ణరుుంచారు. జిల్లాలోని లింగంపేట్ మండలం భావానీపేట్కు చెందిన ఓ దంపతులు పిల్లలు లేక.. దత్తత తీసుకునేందుకు చూస్తున్నారని తెలుసుకొని వారిని సంప్రదించారు. రూ.10 వేలకు బేరం కుదుర్చుకుని పాపను అమ్మేశారు. అయితే.. పాపను తీసుకెళ్లిన దంపతుల గ్రామానికి చెందిన స్థానికులు అనుమానం వచ్చి ఐసీడీఎస్ అధికారులకు సమాచారమందించగా, వారు వచ్చి ప్రశ్నించడంతో అసలు విషయం బయట పడింది. దీంతో పాపను శనివారం జిల్లా కేంద్రంలోని శిశుగృహకు తరలించారు. పాపను అమ్మేసిన నర్సులు, అక్రమంగా దత్తత తీసుకున్న దంపతులతో పాటు ఆస్పత్రి యూజమాన్యం పైనా కేసు నమోదు చేస్తామని ఐసీడీఎస్ అధికారులు తెలిపారు.