అమ్మ వదిలేసింది.. నర్సులు అమ్మేశారు! | nurses sold a mother leaved child | Sakshi
Sakshi News home page

అమ్మ వదిలేసింది.. నర్సులు అమ్మేశారు!

Published Sun, Apr 19 2015 2:33 AM | Last Updated on Sun, Sep 3 2017 12:28 AM

అమ్మ వదిలేసింది.. నర్సులు అమ్మేశారు!

అమ్మ వదిలేసింది.. నర్సులు అమ్మేశారు!

  • కామారెడ్డిలోని ప్రైవేటు ఆస్పత్రిలో ఘటన
  • ఇందూరు: ఆడపిల్ల భారమనుకుందో ఏమో కానీ ఓ తల్లి పుట్టినబిడ్డను ఆస్పత్రిలోనే వదిలి వెళ్లింది...  పాపను రక్షించాల్సిన నర్సులు ఆ బిడ్డను అమ్మేశారు. నిజామాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు... సుమారు నెలన్నర క్రితం కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి మహిళ ప్రసవం కోసం వచ్చింది. ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వారం రోజులు ఆస్పత్రిలోనే ఉన్న ఆ తల్లి, కుటుంబ సభ్యులు ఎందుకో ఆ బిడ్డను ఆస్పత్రిలోనే వదిలి వెళ్లిపోయారు. గమనించిన నర్సులు కుటుంబసభ్యుల వివరాలు రిజస్టర్‌లో ఉన్నప్పటికీ.. ఎవరికీ సమాచారం ఇవ్వకుండానే పాపను అమ్మాలని నిర్ణరుుంచారు.
     
    జిల్లాలోని లింగంపేట్ మండలం భావానీపేట్‌కు చెందిన ఓ దంపతులు పిల్లలు లేక.. దత్తత తీసుకునేందుకు చూస్తున్నారని తెలుసుకొని వారిని సంప్రదించారు. రూ.10 వేలకు బేరం కుదుర్చుకుని పాపను అమ్మేశారు. అయితే.. పాపను తీసుకెళ్లిన దంపతుల గ్రామానికి చెందిన స్థానికులు అనుమానం వచ్చి ఐసీడీఎస్ అధికారులకు సమాచారమందించగా, వారు వచ్చి ప్రశ్నించడంతో అసలు విషయం బయట పడింది. దీంతో పాపను శనివారం జిల్లా కేంద్రంలోని శిశుగృహకు తరలించారు. పాపను అమ్మేసిన నర్సులు, అక్రమంగా దత్తత తీసుకున్న దంపతులతో పాటు ఆస్పత్రి యూజమాన్యం పైనా కేసు నమోదు చేస్తామని ఐసీడీఎస్ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement