to solve the problems
-
సమస్యల ‘వాణి’ కి అందిన 400 దరఖాస్తులు..
కరీంనగర్: కలెక్టరేట్ సముదాయంలో సోమవారం జనసందోహం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవుతుందన్న సమాచారంతో ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి, తమ సమస్యలను ఏకరువు పెట్టారు. అత్యధికంగా భూ సమస్యలు, పింఛన్లు, రేషన్ కార్డులు, దళిత బంధు, డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించి 400కు పైగా దరఖాస్తులు రాగా ఆన్లైన్, మాన్యువల్‌గా స్వీకరించారు. కలెక్టర్ బి.గోపి, అదనపు కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్ పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు చొరవ చూపారు. భూమి విషయంలో బెదిరిస్తున్నడు ఏళ్లుగా భూమిని అనుభవిస్తున్నం. పంటల సాగుతోనే కుటుంబాన్ని పోషిస్తున్నం. కానీ మా భూమితో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి అతని భూమి అంటూ మమ్మల్ని బెదిరిస్తున్నడు. సర్వే నంబర్ 126బి/3, 126ఎ/3 తదితర సర్వే నంబర్లలో మా భూమి ఉంది. అధికారులు న్యాయం చేయాలి.– బండారి కుటుంబసభ్యులు, చామనపల్లి, కరీంనగర్ రూరల్ పట్టాదారు పేరు మార్చండి చల్లూరు గ్రామంలో సర్వే నంబర్ 91, 728/2లో మూడెకరాల భూమి ఉంది. భూ రికార్డుల్లో తాతల కాలం నుంచి మేమే ఉన్నాం. కానీ సంబంధం లేని వ్యక్తి పేరిట మార్చారు. ఈ విషయంలో గత కొన్నేళ్లుగా తహసీల్దార్, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న. అయినా స్పందన లేదు. అధికారులు మోకాపై విచారణ జరిపి, న్యాయం చేయాలి. – గాజుల ప్రసాదరావు, చల్లూరు, వీణవంక వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలి మాది కరీంనగర్‌లోని 42వ డివిజన్. కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్న. ఇప్పుడు శరీరం సహకరించడం లేదు. పని చేయాలంటే చేతకాని పరిస్థితి. వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని మూడేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న. రేపుమాపంటూ తిప్పుకుంటున్నరు. – బాసం మల్లయ్య, ప్రశాంత్‌నగర్, కరీంనగర్ వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలి మాది కరీంనగర్‌లోని 42వ డివిజన్. కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్న. ఇప్పుడు శరీరం సహకరించడం లేదు. పని చేయాలంటే చేతకాని పరిస్థితి. వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని మూడేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న. రేపుమాపంటూ తిప్పుకుంటున్నరు. – బాసం మల్లయ్య, ప్రశాంత్‌నగర్, కరీంనగర్ పరిహారం ఇయ్యలే.. మాది కొత్తపల్లి మండలంలోని ఎలగందుల గ్రామం. మా ఇల్లు ఎస్సారెస్పీ ముంపునకు గురైంది. సర్వే నంబర్ 271లో ఇంటి నంబర్ 10–84 కాగా పరిహారం ఇచ్చే సమయంలో నా సోదరికి పక్షవాతం రావడంతో ఆస్పత్రిలో ఉన్నారు. అధికారులు కాలయాపన చేస్తున్నరు. – గడ్డం ఆంజనేయులు, రేకుర్తి, కరీంనగర్ -
సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్
నంద్యాల, న్యూస్‌లైన్: సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు భూమానాగిరెడ్డి మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నంద్యాల నియోజకవర్గంలోని ప్రజలు ఏ సమస్య తలెత్తినా తక్షణం వివరించడానికి ఒక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇది 24గంటల పాటు పనిచేయనుంది. కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేసినా సమస్యను పరిష్కరించడానికి కొన్ని బృందాలను నంద్యాల పట్టణంలోని వార్డుల వారీగా, గ్రామాల వారీగా ఏర్పాటు చేస్తున్నారు. ఫిర్యాదు అందిన వెంటనే దాని అవసరాన్ని బట్టి స్పందిస్తారు. ఇందు కోసం కాల్‌సెంటర్ నం: 7660888881ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఇది శాశ్వతంగా పని చేసే విధంగా నంద్యాల పట్టణంలోని పద్మావతినగర్‌లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాలలో శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఏపీ మీడియా సహకారంతో చేపడుతున్న ఈ కాల్ సెంటర్ కార్యక్రమానికి రామకృష్ణ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు ఏవీ సుబ్బారెడ్డి, ఏవీఆర్ ప్రసాద్, డాక్టర్ బాబన్, ఏపీ మీడియా ప్రతినిధి రమేష్ తదితరులు పాల్గొన్నారు. మీ అన్నగా.. తమ్ముడిగా.. సేవలందిస్తా.. ‘‘ మీ అన్నగా.. మీ తమ్ముడిగా సేవలు అందిస్తాను.. నిర్మొహమాటంగా మీ కున్న సమస్యలను తెలపండి’ అని నం ద్యాల నియోజకవర్గ ప్రజలకు భూమా భరోసాను ఇచ్చారు. తన ఇమేజిని తట్టుకోలేక ప్రత్యర్థులు జీతాలు, కూలీలు ఇ చ్చి విమర్శలు చేయిస్తున్నారని.. అయితే వాటిని ప్రజలు నమ్మడం లేదన్నారు. ప్రజలకు మేలు జరిగే విషయంలో తాను ఎలాంటి సాహసానికైనా సిద్ధమని చెప్పారు. ఇటువంటి విషయాల్లో విమర్శలను లెక్కచేయనని పేర్కొన్నారు. అందుకే తాను నంద్యాల పట్టణంలో ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నానని వివరించారు. అధికార పార్టీకి చెందిన నాయకులు ఎన్నో అడ్డంకులు సృష్టిస్తున్నారని, వాటన్నింటిని ప్రాణం ఇచ్చే వైఎస్సార్సీపీ కార్యకర్తల ద్వారా, ప్రజల ద్వారా అధిగమిస్తున్నట్లు భూమా తెలిపారు. నంద్యాల పట్టణంలో అర్ధరాత్రి సైతం ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నా కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. చట్టపరిధిలో అధికారులు విధులు నిర్వహిస్తారన్నారు. కాల్ సెంటర్ పరిధిలోకి వచ్చే నెట్‌వర్క్‌లో సభ్యత్వం తీసుకుంటే నెలకు రూ.99తో ఎన్నో సమాచారాలను పొందవచ్చన్నారు. భారీఎత్తున సెల్‌పోన్ బిల్లులో ఆదా అవుతుందన్నారు. రైతులు ఎప్పటికప్పుడు గిట్టుబాటు ధరలను, నిరుద్యోగులు ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకోవచ్చన్నారు. ఎన్నో రకాలుగా ప్రయోజనం కలిగించే ఈ నెట్‌వర్క్‌లో సభ్యత్వం తీసుకోవాలన్నారు. తన వంతు సహకారం కార్యకర్తలకు అందిస్తానన్నారు. నంద్యాలతో పాటు ఆళ్లగడ్డ, అసెంబ్లీ నియోజకవర్గాల్లోని వైఎస్సార్సీపీ కార్యకర్తలందరికీ గ్రూప్ సిమ్‌లను ఏర్పాటు చేశారు. తాను క్లీన్‌సిటీ ఉద్యమం చేపట్టిన సమయంలో ఎన్నో విమర్శలు వచ్చాయని వాటిని లెక్కచేయకుండా ముందుకు సాగడం వల్లే ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయన్నారు. అలాగే కాల్ సెంటర్ వల్ల సమస్యల పరిష్కారం మరింత వేగంగా జరుగుతుందన్నారు.