Sought
-
వీటిలో అయితే పనిచేస్తాం.. మహిళల ఛాయిస్ ఇవే..
ముంబై: బ్యాంకింగ్, ఫైనాన్షియల్, బీమా (బీఎఫ్ఎస్ఐ), టెలికం, ఈ-కామర్స్ రంగాల్లో కెరీర్ అవకాశాల పట్ల ఎక్కువ మంది మహిళా ఉద్యోగార్థులు సుముఖంగా ఉన్నారు. అలాగే మెజారిటీ మహిళలు ఇంటి నుంచి పనిచేసే అవకాశాల కోసం చూస్తున్నారు. ఈ వివరాలను ఆప్నా డాట్ కో ఓ నివేదిక రూపంలో విడుదల చేసింది. కెరీర్లో సౌకర్యం, అంకిత భావానికి మధ్య సమతుల్యం ఉండాలని చాలా మంది మహిళలు కోరుకుంటున్నారు. నైట్ షిఫ్ట్‌లలో 18 లక్షల మంది మహిళలు అప్నా డాట్ కో ప్లాట్‌ఫామ్‌పై మహిళల ఉద్యోగ శోధన వివరాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. 18 లక్షల మంది మహిళలు రాత్రి షిఫ్ట్‌లలో పనిచేస్తున్నారని.. సవాళ్లను అంకిత భావంతో ఎదుర్కొనేందుకు వారు సంసిద్ధంగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. అప్నా ప్లాట్‌ఫామ్‌పై 1.38 కోట్ల మంది మహిళలు సభ్యులుగా ఉంటే, అందులో 67 లక్షల మంది టైర్–2 పట్టణాలకు చెందిన వారు. గతేడాదితో పోలిస్తే 33 శాతం మేర పెరిగారు. చండీగఢ్, పాట్నా, లక్నో, అజ్మీర్, వదోదర పట్టణాల నుంచి సభ్యుల పెరుగుదల ఎక్కువగా ఉంది. ఈ పట్టణాలకు చెందిన మహిళా ఉద్యోగార్థులు ఎక్కువగా బిజినెస్ డెవలప్మెంట్, హెచ్ఆర్, బ్యాక్ ఆఫీస్, బోధన, కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలను కోరుకుంటున్నారు. ‘‘ఉద్యోగుల్లో మహిళల సంఖ్య పెరగడం కేవలం జనాభాపరమైన మార్పు కంటే కూడా ఆర్థిక పునరుజ్జీవనానికి సంబంధించినది. ఇది కుటుంబాల శ్రేయస్సు, సామాజిక పురోగతికి తోడ్పడుతుంది’’అని అప్నా డాట్ కో వ్యవస్థాపకుడు, సీఈవో నిర్మిత్ పారిఖ్ తెలిపారు. -
బ్యాంకు మేనేజర్‌పై టీచర్ ఫిర్యాదు
లేపాక్షి : స్థానిక ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు మేనేజరు, అసిస్టెంట్ మేనేజర్లపై ఎన్ఎస్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు తులసీనాయక్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పత్రాన్ని సోమవారం ‘మీ కోసం’లో తహశీల్దార్ ఆనంద్‌కుమార్‌కు అందజేశారు. ఆ మేరకు వివరాలు... ఈనెల 2వ తేదీ డబ్బులు డ్రా చేసుకోడానికి తులసీనాయక్ బ్యాంకుకు వెళ్లారు. ఇంటి అవసరాలకు ఏ మాత్రం డబ్బుల్లేవని, నిబంధనల మేరకు రూ.4వేలు నగదు ఇవ్వాలని అక్కడి అధికారులకు విన్నవించుకున్నారు. అయినప్పటికీ వారు కనికరం చూపకుండా బ్యాంకులో డబ్బుల్లేవని చెప్పారు. వెనుదిరిగి వెళ్తుండగా.. తనకన్నా వెనుక వచ్చిన వారు డబ్బులు తీసుకెళ్లిపోవడం చూశారు. అదేమని అడిగితే తన ఇష్టం వచ్చిన వారికి ఇస్తానని, అడగడానికి మీరెవరని బ్యాంకు మేనేజరు పదిమందిలో అవమాపరిచేలా మాట్లాడారు. కావాలంటే నీ అకౌంటు ఇక్కడ తీసేసుకుని ఇంకోచోట చేసుకోమన్నారు. అందరూ గౌరవించే ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న తులసీనాయక్ దీన్ని జీర్ణించుకోలేకపోయారు. మూడురోజులు గడిచినా ఆ బాధ తగ్గకపోవడంతో అలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ‘మీ కోసం’ ద్వారా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మీ కోసం కార్యక్రమంలో మరో 13 ఫిర్యాదులు అందినట్లు తహశీల్దార్ ఆనందకుమార్ తెలిపారు. ఇళ్లకు సంబంధించి 7, రేషన్‌కార్డులపై 6 ఫిర్యాదులు వచ్చాయన్నారు. -
డెబిట్ కార్డుల వ్యవహారంలో కేంద్రం సీరియస్
న్యూఢిల్లీ: వివిధ బ్యాంకుల లక్షలాది డెబిట్ కార్డుల డాటా లీక్ వహారంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. వెంటనే దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా బ్యాంకులను ఆదేశించింది. హ్యాకింగ్ పై ఆందోళన వద్దని భరోసా ఇచ్చిన కేంద్రం, బ్యాంకుల నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. 32 లక్షల డెబిట్ కార్డుల సెబర్ ఎటాక్ పై రిజర్వ్ బ్యాంకు ను , బ్యాంకులను వివరాలను కోరినట్టు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం ప్రకటించారు. అలాగే సైబర్ నేరాల సమయంలో రక్షణ చర్యల వివరాలను కూడా బ్యాంకులను కోరామని విలేకరులకు తెలిపారు. సైబర్ సెక్యూరిటీ చాలా కీలకమైన విషయం.. భద్రతా ఉల్లంఘన విషయంలో బ్యాంకుల నుంచి వివరణాత్మక నివేదికలను కోరామని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తి కాంత్ దాస్ చెప్పారు. విచారణ జరుగుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.ఈ విషయంలో వినియోగదారులు అందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన హామీ ఇచ్చారు. కాగా దాదాపు 32 లక్షల కార్డులు డేంజర్ జోన్ లోపడ్డాయన్న వార్తలు ప్రకంపనలు పుట్టించాయి. మరోవైపు దాదాపు అన్ని బ్యాంకులు ఏటీఎం పిన్ నెంబర్లు మార్చుకోవాల్సిందిగా ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
చదవలేక చావు కోరింది!
పుట్లూరు: కాలేజీకి వెళ్లి చదుకోవాలని తల్లిదండ్రులు చెప్పినందుకు పురుగులు మందు తాగి ఇంటర్ విద్యార్థిని లావణ్యేశ్వరి (16) ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో బుధవారం చోటు చేసుకుంది. మండలంలోని గరుగుచింతలపల్లి గ్రామానికి చెందిన హనుమంతురెడ్డి, లక్ష్మిదేవిల కుమార్తె లావణ్యేశ్వరి తాడిపత్రి పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. రంజాన్ పండుగ సెలవులకు ఇంటికి వచ్చిన లావణ్యేశ్వరి కాలేజీకి వెళ్లనని, తనకు ఎంపీసీ చదవడం కష్టంగా ఉందని తల్లిదండ్రులకు చెప్పింది. తన కూతురును ఉన్నత చదువులు చదివించాలని భావించిన తల్లిదండ్రులు ఎంపీసీకి బదులుగా నీకు ఇష్టం ఉన్న గ్రూపు తీసుకొవాలని సూచించారు. అయితే కాలేజీకి వెళ్లడం ఇష్టం లేని విద్యార్థినీ ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం తాడిపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నిందితులకు రాష్ట్రమంత్రి అండ...?
-
వీఐపీలు వేధి స్తే అది నేరం కాదా?