జకీర్ మెడకు మరో ఉచ్చు
తిరువనంతపురం: ప్రముఖ ఇస్లాం బోధకుడు, టెలివిజనిస్టు జకీర్ నాయక్ ఉపన్యాసాలతో ఉగ్రవాదులు ప్రేరణ పొందుతున్నారా? అతని బోధనలతో ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్నారా? ఐసిస్ లాంటి కరడుగట్టిన ఉగ్రవాద సంస్థసైతం జకీర్ ను మేజర్ ఇన్ప్పిరేషన్ గా భావిస్తోందా? తాజాగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులకు పట్టుబడిన ఓ ఉగ్రవాది చెప్పిన విషయాలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది. కేరళలో ఐఎస్ ఉగ్రవాద మాడ్యూల్‌ను నిర్వహిస్తున్న మన్సీద్ అలియాస్ ఒమర్ అల్ హింది ఎన్ఐఏ విచారణలో వెల్లడించిన విషయాలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. జకీర్ నాయక్ ఉపన్యాసాలు, సోషల్ మీడియాలో ఆయన చేసే పోస్టుల నుంచే ఐసిస్, తాము ప్రేరణ పొందుతున్నామని మన్సీద్ వెల్లడించాడు.
మన్సీద్ గత పన్నెండేళ్లుగా ఐసిస్‌కు కేరళలో ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నాడు. ఆర్ఎస్ఎస్ కదలికలపైనా అతను ఎప్పటికప్పుడు ఐసిస్‌కు సమాచారమందిస్తుంటాడు. తాజాగా కొచ్చిలో ప్రాన్స్‌లో జరిగిన నైస్ తరహాదాడికి కుట్రపన్నినట్టు విచారణలో వెల్లడించాడు. ఇందుకోసం అతను ఆరుగురు యువకులకు రూ.38,000 ఇచ్చాడు. పాత హెవీ సెకండ్ హ్యాండ్ వెహికిల్ వారికి సమకూర్చాడు. కొచ్చిలో ప్రజలు గుమిగూడిన చోట ఆక్సిడెంట్ చేసి ఎక్కువ మందిని హతమార్చేందుకు కుట్ర పన్నినట్టు అంగీకరించాడు. గతంలో సేల్స్ మెన్ గా పని చేసిన మన్సీద్ గత కొంత కాలంగా ఆన్లైన్లో యువతను ఐసిస్ లోకి చేర్చుకునే మార్గాలపై దృష్టి పెట్టాడు. మన్సీద్ వెల్లడించిన విషయాలతో జకీర్ నాయక్ పై మరింత లోతుగా విచారణ జరుపనున్నారు.
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో ఉగ్రదాడికి పాల్పడిన వారిలో ఓ ఉగ్రవాది తనకు జకీరే ఇన్సిరేషన్ అని పేర్కొన్నాడు. కశ్మీర్లో ఆర్మీ మట్టుబెట్టిన ఉగ్రవాది బుర్హాన్ వనీ పెద్ద ఎత్తున జకీర్ ను బలపర్చాలని పిలుపునిచ్చాడు. ఈ నేపథ్యంలో తాజా అధికారులు జకీర్ నాయక్ పై విచారణను మరింత వేగవంతం చేసే అవకాశాలున్నయి.