21 మంది విగ్రహాల దొంగలు అరెస్టు
మూడు వాహనాలు స్వాధీనం సూత్రధారి సస్పెన్షన్‌లో ఉన్న ఓ కానిస్టేబుల్
తిరుపతి క్రైం : ఈ నెల 21వ తేదీన ఏర్పేడు మండలం కోబాకలోని చెరువు కట్ట వద్ద ఉన్న పురాతన వినాయక విగ్రహాన్ని చోరీచేసేందుకు ప్రయత్నించిన ముఠా ను ఏర్పేడు సీఐ సాయినాథ్ అరెస్టు చేశారని అర్బన్ జిల్లా ఎస్పీ గోపీనాథ్‌జెట్టి తెలి పారు. ఆయన సోమవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆయన కథనం మేరకు ఏర్పేడు సమీపంలోని ముసలి పేడు అటవీ ప్రాంతంలోని బత్తెనయ్య ఎస్టీకాలనీ వద్ద ముగ్గురు వ్య క్తులు అనుమానాస్పదంగా తిరుగుతుం డగా అదుపులోకి తీసుకున్నామని తెలిపా రు. విచారణలో వారు వినాయకుడి విగ్రహాన్ని చోరీ చేసేందుకు ప్రయత్నించిన దుండగులని తేలిందన్నారు. వారిచ్చిన సమాచారంతో మిగిలిని 18 మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
విగ్రహంలో వజ్రాలు ఉన్నాయని..
కృష్ణా జిల్లా కంకిపాడు మండలం హరి జనవాడకు చెందిన కంటేటి రవి హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ ఒకటవ బెటాలియన్‌లో కానిస్టేబుల్ (పీసీనెం.669)గా పనిచేసేవాడు. తన తాత, తండ్రుల ద్వా రా గుప్తనిధుల గురించి సమాచారం తెలుసుకున్నాడు. అలాగే విగ్రహాలను చోరీ చేసేందుకు మంత్రతంత్రాలు తెలుసుకున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెం దిన నరసారావు, మంగపట్ల వెంకటేశ్వరరావు, పలుపులాజరు కలిసి రవి వద్దకు వచ్చి తమ సమస్యలు చెప్పుకుని సా యం చేయాలని కోరారు. దీన్ని ఆసరాగా తీసుకున్న రవి వారితో చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం కోబాకలోని చెరువుకట్ట వద్ద కుడివైపు తొండం కలిగి ఉన్న పురాతన వినాయకుడి విగ్రహం ఉంద న్నాడు. దాని వెనుక తామరపుప్వు ఆకారంలో మూతలాగా ఉంటుందని, అందు లో రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల విలువైన వజ్రాలు ఉన్నాయని తెలిపాడు. దాన్ని తెస్తే విక్రయించి వచ్చిన మొత్తాన్ని పంచుకుందామని ప్రోత్సహించాడు.
మొదటి సారి విఫలం
విగ్రహాన్ని చోరీ చేయడానికి నరసింహా రావు, వెంకటేశ్వరరావు, మరికొంతమంది ముఠా సభ్యులతో కలిసి కోబాకలోని వినాయక విగ్రహాన్ని చోరీ చేయడానికి ప్రణాళి క సిద్ధం చేసుకున్నారు. జనవరి 30న గునపాలతో పెళ్లగించి చోరీ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు.
తాడు తెగి శబ్దం రావడంతో వెలుగులోకి..
ఫిబ్రవరి 20, 21 తేదీల్లో అర్దరాత్రి టిప్పర్, టవేరా, క్వాలిస్‌కారు, మోటార్ సైకిల్‌పై 22 మంది వచ్చారు. వినాయకుడి విగ్రహాన్ని చోరీ చేయడానికి ప్రయత్నించారు. విగ్రహానికి తాడు కట్టి టిప్పర్‌తో లాగేందుకు ప్రయత్నించారు. ఆ తాడు తెగి పెద్దగా శబ్దం రావడంతో గ్రామస్తులు మేల్కొని గుడి వద్దకు వచ్చారు. ముఠాలోని వారు ఇనుపరాడ్లు, పైపులతో గ్రామస్తులను బెదిరించి వాహనంలో పరారయ్యారు. కోబాకకు చెందిన భరత్‌కుమార్ ఫిర్యాదు మేరకు ఏర్పేడు ఎస్ఐ రామకృష్ణ కేసు నమోదు చేసుకుని రేణిగుంట రూరల్ సీఐ సాయిరాథ్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేశారు. దుండగులను శనివా రం మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని ద్విచక్ర వాహనం, టిప్పర్, టవేరా, నాలుగు సెల్ఫోన్లు, ఇనుపపైపులు, రాడ్లను స్వాధీ నం చేసుకున్నామన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రవి పోలీసు కానిస్టేబుల్‌గా కొన్ని చోరీలు చేశాడని, పోలీసు అధికారులపై దాడిచేసి సస్పెం డ్ అయ్యాడన్నారు. రవి, మరొక నిందితుడు ఏడుకొండలును అరెస్ట్ చేయాల్సి ఉందని తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన ఎస్బీ డీఎస్పీ రవిమనోహరాచారి, సీఐ సాయినాథ్, ఎస్ఐ రామకృష్ణ, సిబ్బం దిని ఎస్పీ అభినందించారు.