ఆనందంగా వెళ్తున్నా.. బై బై | Urban SP gopinathjetti media interview | Sakshi
Sakshi News home page

ఆనందంగా వెళ్తున్నా.. బై బై

Published Fri, May 13 2016 8:36 AM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

ఆనందంగా వెళ్తున్నా..  బై బై - Sakshi

ఆనందంగా వెళ్తున్నా.. బై బై

తిరుపతి: నూతనంగా ఏర్పడిన రాష్ట్రాల్లో  హైటెక్ టెక్నాలజీ వినియోగంలో తిరుపతి అర్బన్ జిల్లా పోలీసు కేంద్రాన్ని మొదటిస్థానంలో నిలిపినందుకు చాలా సంతోషంగా ఉందని అర్బన్ జిల్లా ఎస్పీ గోపినాథ్‌జెట్టి తెలిపారు.  అందుకు సహకరించిన ప్రజలకు, అధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. బదిలీపై వెళుతున్న ఎస్పీ గురువారం విలేకరులతో ముఖాముఖి కార్యక్రమం  నిర్వహించారు.  నగరంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు వాట్సప్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌ల ద్వారా ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించామని గుర్తుచేశారు. ట్రాఫిక్ నియంత్రణలో ‘రెడ్‌లైట్ వయోలేషన్ డిటెక్షన్’ వంటి ఆధునిక కెమెరాలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.

నగరంలో ఏర్పాటుచేసిన పోలీస్ టాస్క్‌ఫోర్స్ సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. తాను పనిచేసిన 21 నెలల్లో కేవలం రెండు రోజులు మాత్రమే సెలవు తీసుకున్నారని, తనతో ఎలాగైతే సహకరించారో వచ్చే అధికారికి కూడా సహ కరించాలని సిబ్బందిని కోరారు. ఎస్పీని మీడియా సిబ్బందితో పాటు పలువురు అధికారులు ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement