sp rahul dev sharma
-
ఎస్పీ రాహుల్‌దేవ్‌పై వేటు వేసిన ఎన్నికల సంఘం
సాక్షి, కడప: కడప ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మపై ఎన్నికల కమిషను వేటు పడింది. కమిషన్‌కు లోబడి విధి నిర్వహణ లేకపోవడం, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు దిశా–నిర్దేశం అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా పరిగణించింది. మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసి ఎన్నికల విధుల నుంచి తప్పించింది. 2011 బ్యాచ్‌కు చెందిన రాహుల్‌దేవ్ శర్మ ఫిబ్రవరి 18న కడప ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. కడప ఎస్పీ అభిషేక్ మహంతి విధుల్లో ఉండగా మంత్రి ఆదినారాయణరెడ్డి ఆయన ఉంటే ఎన్నికల్లో కష్టమని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బదిలీ చేయించారు. గత ఏడాది నవంబర్ 2న జాయిన్ అయిన ఆయన్ను కేవలం 102 రోజులకు ఫిబ్రవరి14న బదిలీ చేయించారు. అనతి కాలంలోనే అభిషేక్ మహంతి తనదైన శైలిని రాజకీయ నేతలకు రుచిచూపించారు. జిల్లాలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధ్దంగా నిర్వహిస్తారని భావించిన తరుణంలో అభిషేక్మహంతిని పట్టుబట్టి బదిలీ చేయించారు. ఆ స్థానంలో వచ్చిన రాహుల్‌దేవ్‌శర్మ బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఎన్నికల విధుల నుంచి తప్పించినట్లు పలువురు చర్చించుకుంటున్నారు. రాహుల్‌దేవ్ శర్మ విశాఖపట్నం రూరల్ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తుండగా ఎమ్మెల్యే కిడారి వెంకటేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మావోయిస్టుల చేతిలో హత్యకు గురైయ్యారు. అక్కడి నుంచి కడప ఎస్పీగా బదిలీపై వచ్చిన రాహుల్‌దేవ్ శర్మ విధులో చేరిన నెలలోపు మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి మార్చి 15న దారుణహత్యకు గురైయ్యారు. మన్యంలో మావో యిస్టుల చేతిలో ఎమ్మెల్యే హత్యకు గురైన ఘటన, కడపలో మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఘటన రాహుల్‌దేవ్‌శర్మ హయాంలో చోటుచేసుకున్నవే కావడం విశేషం. వివేకానందరెడ్డి హత్య అనంతరం ప్రభుత్వం సూచనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ తన నేతృత్వంలో ఓ బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేయిస్తూ వైఎస్సార్సీపీ నాయకులను వేధింపులకు గురిచేస్తూ వచ్చారు. ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు డైరెక్షన్ మేరకు కడప డీపీఓ యాక్షన్ చేస్తూ వచ్చింది. ఈతరుణంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. వివేకా హత్యానంతరం ఆయన కుటుంబ సభ్యులను.., సన్నిహితులను వేధింపులకు గురిచేస్తుండంపై హతుని కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి కూడా ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో విచారించి ప్రా«థమిక అంచనాకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా ఎస్పీగా రాహుల్దేవ్శర్మను బాధ్యతల నుంచి తప్పించారు. రాష్ట్ర హెడ్ క్వార్టర్లో రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
పులివెందుల సీఐపై సస్పెన్షన్ వేటు
సాక్షి, కడప : పులివెందుల సీఐ శంకరయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. దివంగత వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించిన విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయనను జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా హత్య జరిగి వారం రోజులు గడుస్తున్నా కేసు వ్యవహారం ఓ కొలిక్కిరాలేదు.. సరికదా నిందితులెవరన్నది వెల్లడికాలేదు. హత్య జరిగిన తీరు పరిశీలిస్తే కిరాయి హంతకులు చేసిన పనేనని స్పష్టమవుతున్నా అందుకు సూత్రధారులు, పాత్రధారులు ఎవ్వరన్న విషయం తెలియలేదు. మరోవైపు తన తండ్రి హత్యకేసును నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలంటూ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి నిన్న ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి విజ్ఞప్తి చేశారు. -
ఫింగర్ ప్రింట్స్ దొరికింది, క్లూస్ వెతుకుతున్నాం..
సాక్షి, పులివెందుల : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిది హత్యగానే తాము భావిస్తున్నట్లు ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. ఆయన శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ...నిన్న రాత్రి 11.30 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య ఏం జరిగిందో విచారణ జరుపుతున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఇంట్లో ఉన్న పనిమనుషులను అందరినీ విచారణ చేస్తున్నాం. ఘటనా స్థలంలో వేలిముద్రలు దొరికాయని, మరిన్ని ఆధారాల కోసం అన్వేషిస్తున్నామని రాహుల్ దేవ్ శర్మ వెల్లడించారు. చదవండి...(వైఎస్ వివేకానందరెడ్డిది హత్యే!) హత్య కేసుగా నమోదు మరోవైపు వైఎస్ వివేకానందరెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ముందుగా కేసు నమోదు చేసిన పోలీసులు అనంతరం హత్యకేసుగా మార్చారు. ఇవాళ ఉదయం వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ 171 కింద కేసు నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదిక అనంతరం అనుమానాస్పద మృతి సెక్షన్‌ను 302 సెక్షన్ కింద మార్చారు. సీబీఐ విచారణ జరపాలి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరపాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, చంద్రబాబు జీవితం అంతా కుట్రలు, కుతంత్రాలేనని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. -
లొంగిపొమ్మన్నా వినలేదు..
మల్కన్‌గిరి నుంచి సాక్షి ప్రత్యేక బృందం: కూంబింగ్‌కు వెళ్లిన పోలీసు బలగాలకు తారసపడిన మావోయిస్టులను లొంగిపోవాల్సిందిగా హెచ్చరించినప్పటికీ వారు వినకుండా కాల్పులు ప్రారంభించారని, తప్పనిసరి పరిస్థితుల్లో ఎదురుకాల్పులు జరపడం వల్ల ఇంతమంది చనిపోయారని మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ మిత్రభాను మహాపాత్రో, విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ చెప్పారు. మల్కన్‌గిరి ఎస్పీ కార్యాలయంలో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు. ఎన్కౌంటర్లో చనిపోయిన వారు కాకుండా మరికొందరు తీవ్రంగా గాయపడి తప్పించుకు పారిపోయారని, ఒక్కరు కూడా లొంగిపోలేదని స్పష్టంచేశారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో అగ్రనేతలు ఆర్కే, అరుణలు లేరని చెప్పారు. కాగా కాల్పుల్లో ఆర్కే కుమారుడు మున్నా మృతి చెందినట్లు వెల్లడించారు. ఏపీ హైకోర్టు ఆదేశాల ప్రకారం మృతదేహాలను 72గంటల పాటు భద్రపరుస్తామని, మృతుల సంబంధీకులు వస్తే అప్పగిస్తామన్నారు. విజయనగరంలో ఉంటున్న మురళీ కుటుంబ సభ్యులు మాత్రమే ఇప్పటికవరకూ తమను ఫోన్లో సంప్రదించినట్లు తెలిపారు. మురళీ మృతదేహాన్ని వారికి అప్పగిస్తామని చెప్పారు. ఇంకా 11 మృతదేహాలను గుర్తించాల్సి ఉందన్నారు. మృతదేహాల్లో ఎక్కువ మంది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందినవారివేనని చెప్పారు. ఆపరేషన్‌లో పాల్గొన్న ఆంధ్ర, ఒడిశా పోలీసులకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి అభినందనలు అందుతున్నాయని, రివార్డులు కూడా వచ్చే అవకాశముందని తెలిపారు.