చంద్రబాబు బోగస్ మాటలు నమ్మొద్దు
ప్రాదేశిక ఎన్నికల ప్రచారంలో వై.విశ్వేశ్వరరెడ్డి
ధర్మపురి (వజ్రకరూరు),న్యూస్‌లైన్ : అధికార దాహంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇస్తున్న బోగస్ హామీలను నమ్మవద్దని ఉరవకొండ నియోజకవర్గ వైస్సార్సీపీ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ప్రజలకు సూచించారు. ధర్మపురి, చిన్నహోతురు, పొట్టిపాడు, గూళ్యపాళ్యం, వజ్రకరూరు గ్రామాల్లో గురువారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈయన వెంట ఆయా గ్రామాల్లో ఎంపీటీసీ అభ్యర్థులు నారాయణప్ప, దేవేంద్ర, రవికుమార్, రజియాబేగం, వెంకటేశ్ నాయక్, జెడ్పీటీసీ అభ్యర్థి నంచర్ల ఇందిరమ్మ ఇంటింటా ప్రచారం చేశారు. విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కుక్కలు చింపిన విస్తరిలా మారిందన్నారు.
ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్పుకోలేని ఆ పార్టీ నాయకులు పచ్చకండువాలు వేసుకుంటున్నారన్నారు. దీంతో టీడీపీ బలపడినట్లు ఆ పార్టీ నాయకులు చంకలు గుద్దుకుంటున్నారని, ఎన్నికల తర్వాత చంద్రబాబు దిమ్మతిరుగుతుందన్నారు. వైఎ స్సార్సీపీ విజయఢంకా మోగించడం ఖాయమన్నారు. విజన్ 2020 అం టూ చంద్రబాబునాయుడు నగరాలకే పరిమితమై పల్లెలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో గ్రామీణాభివృద్ధికి, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారని ఆయన గుర్తుచేశారు.
ఆయన అందించిన సంక్షేమ పాలన తిరిగి రావాలంటే అది జగన్మోహన్రెడ్డి వల్లనే సాధ్యమన్నారు. పార్టీ ఫ్యాను గుర్తుకు ఓటువేసి ఆయనకు మద్దతుగా నిలవాలని ప్రజలను కోరారు. పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సుశీలమ్మ, తాలుకా కమిటీ సభ్యులు శైలజారాజశేఖరరెడ్డి, వెంకటరెడ్డి, నారాయణరెడ్డి, స్టీరింగ్ కమిటీసభ్యులు లాయర్ ఉమాపతి, మండల పార్టీ కన్వీనర్లు జ యేంద్రరెడ్డి, భూమాకమలారెడ్డి, మండల నాయకులు భరత్‌రెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, చలపతి, ఉమాపతి, మహానందరెడ్డి, కిశోర్‌కుమార్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.