special aircraft
-
అంబానీల విమానంలో శ్రీదేవి మృతదేహం తరలింపు
ముంబై : దివంగత సినీతార శ్రీదేవీ పార్థివదేహం మరికొద్ది సేపట్లోనే దుబాయ్ నుంచి ముంబైకి తరలించనున్నారు. భారత కుబేరులు అంబానీ కుటుంబానికి చెందిన ప్రత్యేక జెట్ విమానంలో భౌతికకాయాన్ని తీసుకురానున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. దుబాయ్‌లో శ్రీదేవీకి పోస్ట్‌మార్టం ప్రారంభమైన సమయంలోనే ముంబై నుంచి అంబానీ విమానం బయలుదేరి వెళ్లింది. 13 సీట్లున్న ఈ ప్రత్యేక విమానం(ఎంబ్రార్-135బీజే) రిలయన్స్ ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రావెల్ లిమిటెడ్‌కు చెందినది. ఈ సంస్థ ప్రస్తుతం అనిల్ అంబానీ ఆధ్వర్యంలో నడుస్తోంది. బోనికపూర్ మేనల్లుడు మొహిత్ మార్వా పెళ్లి కోసం రస్ ఆల్ ఖైమాకు వెళ్లిన శ్రీదేవి శనివారం రాత్రి తీవ్ర గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. దుబాయ్‌లోని రషీద్ ఆసుపత్రిలో ఇప్పటికే శ్రీదేవి పోస్టుమార్టం పూర్తయింది. అయితే, దౌత్య వ్యవహారాల కారణంగా భౌతికాయం తరలింపు ఆలస్యమవుతోంది. సోమవారం మధ్యాహ్నాంలోగా ఈ ప్రక్రియ పూర్తికానుంది. శ్రీదేవి పార్థివదేహాన్ని మొదట ఆమె ఇంటికి తరలిస్తారు. అటు నుంచి మెహబూబా స్టూడియోకు తీసుకెళతారు. అనంతరం జుహూలోని శాంతా క్రజ్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. టీనా-అనిల్ అంబానీ దంపతులతో శ్రీదేవీ-బోనీ జంట(పాత ఫొటో) -
వెల్కం సార్..
శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో హకీంపేట్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు కలెక్టర్ రఘునందన్‌రావు కరచాలనం చేసి స్వాగతం పలికారు. - సాక్షి, రంగారెడ్డి జిల్లా -
సంక్రాంతి సంబరాలకు సీఎం
మహారాణిపేట: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం విశాఖ రానున్నారు. ఉదయం 9.30 గంటలకు ప్రత్యేక విమానంలో సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో కలిసి విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడ నుంచి జాతీయ రహదారి గుండా కైలాసగిరి చేరుకొని అక్కడ జిల్లా యంత్రాంగం అధికారకంగా ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలను గాలిపటాలు ఎగరేసి ప్రారంభించనున్నారు. అక్కడ కొంతసేపు పండగ సంబరాల్లో అధికారులు, ప్రజలతో గడపనున్నారు. అనంతరం అక్కడ నుంచి బీచ్‌రోడ్ గుండా హోటల్ నోవాటెల్‌లో పారిశ్రామికవేత్తలతో జరిగే సదస్సులో సింగపూర్ ప్రతినిధులతో కలిసి పాల్గొంటారు. అనంతరం 12 గంటలకు బయల్దేరి విజయవాడ వెళ్తారు. సరకుల కొరత వల్లే సంక్రాంతి కానుకల పంపిణీ రద్దు? జిల్లాలో తెల్లకార్డుదారులకు సరిపడినన్ని చంద్రన్న సంక్రాంతి కానుకలు రాకపోవడం వల్లే మంగళవారం సత్యం జంక్షన్లో సీఎం పంపిణీ చేయాల్సిన సంక్రాంతి కానుక కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు తెలిసింది. ఒక వేళ ఆర్భాటానికి పోయి ప్రారంభిస్తే సరకులు అందని వారు ఆందోళన చేసే అవకాశం ఉందని గ్రహించి ఈ కార్యక్రమాన్ని రద్దు చేశారని సమాచారం. -
కడచూపూ కరువాయే..
♦ అశ్రునయనాలతో శ్రీనిధి అంత్యక్రియలు ♦ కన్నీటిసంద్రమైన రేకుర్తి కరీంనగర్ రూరల్ : కరీంనగర్ మండలం రేకుర్తికి చెందిన దాసరి రాజిరెడ్డి-అనంతలక్ష్మి దంపతుల రెండో కూతురు శ్రీనిధి(19) హైదరాబాద్‌లోని వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ (ఈఈఈ) ద్వితీయ సంవత్సరం విద్యార్థిని. విజ్ఞానయాత్రలో భాగంగా కళాశాల విద్యార్థులతో కలిసి గతనెల 3న శ్రీనిధి వెళ్లింది. 8న హిమాచల్‌ప్రదే శ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన 24 మంది విద్యార్థుల్లో శ్రీనిధి కూడా ఉందనే సమాచారంతో కుటుంబసభ్యులు హతాశులయ్యారు. ఆమె అచూకీ కోసం తండ్రి రాజిరెడ్డి హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లాడు. బియాస్ నది ఒడ్డున కూతురు అచూకీ కోసం పదిరోజులపాటు పడిగాపులు పడ్డప్పటికీ ఫలితం లేకపోవడంతో గతనెల 20న రేకుర్తికి తిరిగి వచ్చాడు.శ్రీనిధి జ్ఞాపకాలతో కాలం గడుపుతున్న కుటుంసభ్యులకు ఆదివా రం బియాస్ నదిలో చేపట్టిన గాలింపు చర్యల్లో శ్రీనిధి మృతదేహం లభించినట్టు సమాచారం అందింది. దీంతో వారిలో దు:ఖం మిన్నంటింది. ప్రత్యేక విమానంలో మృతదేహం తరలింపు శ్రీనిధి మృతదేహానికి ఆదివారం మండి జిల్లాలో పోస్ట్‌మార్టం నిర్వహించిన పోలీస్ అధికారులు ప్రత్యేక విమానంలో సోమవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు పంపించారు. శ్రీనిధి మృతదేహం కోసం హైదరాబాద్‌కు ఆమె మేనమామ లింగారెడ్డి, డెప్యూటీ తహశీల్దార్ లింబాద్రి, ఆర్ఐ ఖాజా వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటలకు రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన శ్రీనిధి మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకుని సాయంత్రం 4.45 గంటలకు రేకుర్తికి చేరుకున్నారు. కన్నీటి సంద్రమైన రేకుర్తి శ్రీనిధి మృతదేహమున్న శవపేటికను అంబులెన్స్ నుంచి కిందకు దించడంతోనే తల్లిదండ్రులు అనంతలక్ష్మి, రాజిరెడ్డి, సోదరి శ్రీతేజ, కుటుంబసభ్యులు బోరున విలపించారు. శ్రీనిధి శవపేటికపైపడి రోదించడం చూసిన గ్రామస్తులు సైతం కంటతడిపెట్టారు. శ్రీనిధి శవపేటికను తిరిగి అంబులెన్స్‌లో చేర్చి శ్మశానవాటికకు తీసుకెళ్లారు. శవపేటికలో నుంచి మృతదేహాన్ని బయటకు తీయడంతో దుర్వాసన వెలువడింది. చివరిసారిగా శ్రీనిధి ముఖం చూడాలనే తల్లిదండ్రుల కోర్కే మేరకు మృతదేహానికి చుట్టిన కవర్లను బంధువులు విప్పేందుకు ప్రయత్నించగా, దుర్వాసన రావడంతో వెనుకడుగేశారు. శ్రీనిధిని చివరిసారి చూస్తానంటూ తల్లి అనంతలక్ష్మి, అక్క శ్రీతేజ రోదించిన తీరు పలువురి హృదయాలను కలచివేసింది. చివరకు హిందూ సాంప్రదాయరీతిలో అంతిమసంస్కారాలు నిర్వహించిన అనంతరం కుమార్తె చితికి తండ్రి రాజిరెడ్డి నిప్పంటించారు. శ్రీనిధి మృతదేహానికి జిల్లా జడ్జి నాగమారుతిశర్మ, ఎంపీపీ వాసాల రమేష్, జెడ్పీటీసీ సభ్యుడు ఎడ్ల శ్రీనివాస్, బీజేపీ నేత బండి సంజయ్‌కుమార్, సర్పంచ్ నందెల్లి పద్మప్రకాశ్, ఎంపీటీసీ సభ్యులు శేఖర్, నాగరాణి, బాలయ్యతో పాటు స్థానిక నాయకులు నివాళులర్పించారు. -
స్వదేశానికి మరో 200 మంది
* ఇరాక్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి.. * రెండు రోజుల్లో మరో 2,200 మంది న్యూఢిల్లీ: అంతర్యుద్ధంలో చిక్కుకున్న ఇరాక్ నుంచి మరో 201 మంది భారతీయులు ఆదివారం స్వదేశానికి చేరుకున్నారు. భారత విదేశాంగ శాఖ వీరిని నజాఫ్ నుంచి ఇరాకీ ఎయిర్వేస్కు చెందిన ప్రత్యేక విమానంలో వేకువజామున ఢిల్లీకి తీసుకొచ్చింది. ఎయిరిండియా, ఇతర విమాన సంస్థల ప్రత్యేక విమానాల ద్వారా వచ్చే రెండు రోజుల్లో మరింత మంది భారతీయులను స్వదేశానికి తీసుకురానున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ఆదివారం తెలిపారు. ఘర్షణలు లేని దక్షిణ ఇరాక్‌లో ఉన్న దాదాపు 2,200 మంది భారతీయులు అక్కడి నుంచి వస్తామని చెప్పారని, రెండు రోజుల్లో వీరినీ భారత్‌కు తీసుకొస్తామన్నారు. వీరిలో 600 మందికి వారి యాజమాన్య కంపెనీలు టికెట్లు ఇచ్చాయని, మిగతా 1600 మందికి భారత ప్రభుత్వం టికెట్లు ఇస్తోందని తెలిపారు. ‘వచ్చే 48 గంటల్లో నజాఫ్ నుంచి 200 మందిని, బస్రా నుంచి 280 మందిని ప్రత్యేక విమానాలు ఢిల్లీకి తీసుకొస్తాయి. నజాఫ్ నుంచి మరో వాణిజ్య విమానంలో 117 మంది సోమవారం ఢిల్లీ చేరుకుంటారు. బాగ్దాద్‌లోని భారత ఎంబసీ.. హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా, ముంబైలకు చెందిన 600 మందికి ఇదివరకే టికెట్లు సమకూర్చింది. వీరిలో చాలా మంది స్వస్థలాలకు చేరుకున్నారు. నజాఫ్, కర్బలా, బస్రా, బాగ్దాద్లలో నాలుగు సంచార బృందాలు స్వదేశానికి రావాలనుకునే భారతీయుల వివరాలు సేకరిస్తున్నాయి’ అని తెలిపారు. నావి తప్పులైతే సలహాలివ్వండి: ఐఎస్ఐఎస్ నేత బకర్ బాగ్దాద్: ఇరాక్ మిలిటెంట్లు ఇస్లామిక్ రాజ్యాధినేత(ఖలీఫా)గా ప్రకటించిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) నేత అబూ బకర్ అల్ బగ్దాదీ తొలిసారిగా ఓ వీడియోలో కనిపించారు. ఆయన మోసుల్ లో శుక్రవారం ఓ మసీదులో ప్రసంగిస్తున్నట్లున్న ఈ వీడియోను మిలిటెంట్లు ఆన్లైన్లో ఉంచారు. ‘మీలో నేను సమర్థుడిని కాకపోయినా నేనే మీ నాయకుడిని. నేను సరైన దారిలో వెళ్తుంటే మద్దతివ్వండి. నావి తప్పులైతే సలహాలివ్వండి’ అని బకర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. -
చక్రపాణికి కన్నీటి వీడ్కోలు
ఎస్పీనగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు గౌతంనగర్: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య సరయూ నదిలో స్నానానికి వెళ్లి మృతి చెందిన చక్రపాణి అంత్యక్రియలు శుక్రవారం మల్కాజిగిరి ఎస్పీనగర్ శ్మశాన వాటికలో బంధు, మిత్రుల కన్నీటి వీడ్కోల మధ్య జరిగాయి. గత నెల 30న అయోధ్యలో నిర్వహించిన సుందరకాండ పారాయణ యాగానికి వెళ్లిన చక్రపాణి నదిలో స్నానం చేస్తూ మృత్యువాత చెందిన విషయం తెలిసిందే. కాగా, శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరిన చక్రపాణి మృతదేహాన్ని మండల రెవెన్యూ అధికారులు ప్రత్యేక అంబులెన్స్‌లో మల్కాజిగిరి వాణినగర్‌లోని చక్రపాణి నివాసానికి తీసుకొచ్చారు. మృతదేహాన్ని చూడగానే అతని తల్లిదండ్రులు కృ ష్ణ కిశోర్‌శర్మ, రాజేశ్వరి గుండెలు పగిలేలా రోదిం చారు. పెద్ద సంఖ్యలో స్థానికులు, బంధువులు చ క్రపాణి మృతదేహాన్ని చూసి నివాళులర్పించారు. అలాగే, స్థానిక కార్పొరేటర్ ఆర్. సుమలతారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు ఎన్. రాంచందర్‌రావు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించి, సంతాపం వ్యక్తం చేశారు. మృతిని కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని రాంచందర్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.