అక్రమార్కులపై ప్రత్యేక నిఘా
సాక్షి, మహబూబ్నగర్ : కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న మాగనూరు మండలంలోని పలు గ్రామాల కేంద్రంగా జరుగుతున్న అక్రమ దందాపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నట్టు స్పెషల్బ్రాంచ్ డీఎస్పీ రామేశ్వర్ తెలిపారు. అంతర్రాష్ట్ర సరిహ ద్దులోని భౌగోళిక పరిస్థితులను ఆసరా చేసుకొని కొందరు అక్రమార్కులు కల్లు, మట్కా, జూదం వంటి చట్ట విరుద్ధమైన కార్యకలాపాలపై ‘సాక్షి’ శనివారం ‘నిఘా.. నిద్ర’ శీర్షికతో కథనం ప్రచురించింది.
ఈ వార్తపై శనివారం స్పెషల్బ్రాంచ్ పోలీ సులు ఆరా తీశారు. ఈ విషయంపై స్పెషల్బ్రాంచ్ డీఎస్పీ సాక్షి’తో మాట్లాడుతూ మాగనూరు మండలంలోని సరిహ ద్దు గ్రామాలపై ప్రత్యేక నిఘా వేస్తున్నట్లు తెలిపారు. అక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేకృబందాలను ఏర్పాటు చేస్తామన్నారు. చట్టవిరుద్ధంగా వ్యవహరించే వారు ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామని రామేశ్వర్ స్పష్టం చేశారు.