special grevance
-
30 ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్
అనంతపురం అర్బన్ : ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం ఈ నెల 30 (సోమవారం) కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ఉదయం 9.30 గంటలకు కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ఎస్.రోశన్న శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దళిత, గిరిజన సంఘాల నాయకులు, ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వారు తమ ఫిర్యాదులను అందజేయాలని వెల్లడించారు. -
రేపు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్
అనంతపురం ఎడ్యుకేషన్ : ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్ ఈ నెల 22న స్థానిక రెవెన్యూ భవనంలో నిర్వహించనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు రోశన్న ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11న జరగాల్సిన ఈ గ్రీవెన్స్ స్వాతంత్య్ర వేడుకల నేపథ్యంలో వాయిదా వేసినట్లు గుర్తు చేశారు. 22వ తేదీన మీకోసంతో పాటు ప్రత్యేక గ్రీవెన్స్ ఉంటుందని, జిల్లాలోని దళిత, గిరిజన సంఘాల నాయకులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.