హీరోల పక్కన చోటు వద్దా?!
గాసిప్
హీరోయిన్గా ఎంత గ్లామర్ ఒలకబోసినా... ఎప్పుడూ పర్ఫార్మెన్స్ని నిర్లక్ష్యం చేయలేదు ప్రియాంక. మొదట్నుంచీ హీరోతో పాటు తనకూ ప్రాధాన్యత ఉండేలా చూసుకుంది. పోటీపడి నటించింది. అయితే ఇప్పుడు ఏకంగా హీరోలని మించిపోతోంది. గత కొంతకాలంగా హీరోయిన్ ఓరియెంటెడ్ రోల్స్‌నే ఎక్కువగా ఎంచుకుంటూ వస్తోంది ప్రియాంక. ఫ్యాషన్, మేరీకోమ్ లాంటి చిత్రాలతో స్పెషల్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుంది. త్వరలో ఓ ఇంటర్నేషనల్ టెలివిజన్ షోలో ఎఫ్‌బీఐ ఏజెంట్‌గా కనిపించబోతోంది.
ఫైట్లవీ బాగా చేయాలి కాబట్టి ఎంతసేపూ జిమ్‌కే అతుక్కుపోతోం దని, వర్కవుట్లతోనే కాలం గడుపుతోందని సమాచారం. ఆమెకు అంతర్జాతీయ ఖ్యాతి రావడాన్ని కొందరు హర్షిస్తుంటే... కొందరు మాత్రం... ఇలా తనే హీరోలా ఫీలయ్యి చేస్తూ ఉంటే, కొన్నాళ్లకు హీరోల పక్కన చోటు కరువవుతుంది అంటూ హెచ్చరిస్తున్నారు. మరి ఆ హెచ్చరికలు ప్రియాంక చెవిన పడ్డాయో లేదో!