speculative
-
స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌కు చెక్
న్యూఢిల్లీ: స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌కు చెక్ పెట్టే బాటలో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్‌అండ్‌వో) నిబంధనలను కఠినతరం చేసింది. ఈక్విటీ ఇండెక్స్ డెరివేటివ్స్‌లో కనీస కాంట్రాక్ట్ పరిమాణాన్ని పెంచడంతోపాటు.. ఆప్షన్స్ ప్రీమియంల ముందస్తు వసూళ్లను తప్పనిసరి చేసింది. ఇన్వెస్టర్ల పరిరక్షణార్ధం పొజిషన్ లిమిట్స్‌పై ఇంట్రాడే పర్యవేక్షణ, ఎక్స్పైరీ రోజున కేలండర్ స్ప్రెడ్ లబ్ధి రద్దు, వీక్లీ ఇండెక్స్ డెరివేటివ్స్‌ను క్రమబద్ధీకరించడం, టెయిల్ రిస్క్ కవరేజీ పెంపు తదితర పలు ఇతర చర్యలను సైతం తీసుకుంది.ఈ చర్యలన్నీ వచ్చే నెల (నవంబర్) 20 నుంచి దశలవారీగా అమల్లోకిరానున్నట్లు తాజాగా విడుదల చేసిన సర్క్యులర్‌లో సెబీ పేర్కొంది. ఇటీవల పరిశీలన ప్రకారం ఎఫ్‌అండ్‌వో విభాగంలో వ్యక్తిగత ఇన్వెస్టర్లు 2022–24 మధ్య కాలంలో సగటున రూ. 2 లక్షలు చొప్పున నష్టపోయినట్లు సెబీ గుర్తించింది. కోటిమంది వ్యక్తిగత ఇన్వెస్టర్లలో 93% మందికి నష్టాలు వాటిల్లినట్లు ఇప్పటికే రిటైలర్లను హెచ్చరించింది. ఈ కాలంలో వ్యక్తిగత ట్రేడర్లకు ఉమ్మడిగా రూ. 1.8 లక్షల కోట్లమేర నష్టాలు నమోదైనట్లు పేర్కొనడం తెలిసిందే. నిబంధనల తీరిదీ... తాజా సర్క్యులర్‌లో సెబీ ఎఫ్‌అండ్‌వో నిబంధనల సవరణలను వెల్లడించింది. వీటి ప్రకారం ఇండెక్స్ డెరివేటివ్స్‌లో కనీస కాంట్రాక్ట్ పరిమాణాన్ని 2015లో నిర్ణయించిన రూ. 5–10 లక్షల నుంచి రూ. 15–20 లక్షలకు పెంచింది. ఇందుకు అనుగుణంగానే లాట్ సైజ్‌ను కూడా నిర్ధారిస్తారు. వీక్లీ ఇండెక్స్ డెరివేటివ్స్‌ను ఒకేఒక ప్రామాణిక ఇండెక్స్‌కు పరిమితం చేస్తారు. షార్ట్ ఆప్షన్స్ కాంట్రాక్టులపై ఎక్స్పైరీ రోజున 2 శాతం అదనపు మార్జిన్ (ఈఎల్ఎం)ను విధిస్తారు. ఆప్షన్ కొనుగోలుదారులు ముందస్తుగా పూర్తి ప్రీమియంను చెల్లించవలసి ఉంటుంది. దీంతో అధిక లెవరేజ్‌ను నివారిస్తారు. మునిసిపల్ బాండ్లకు పన్ను రాయితీలు మౌలిక రంగ అభివృద్ధికి వినియోగించగల నిధుల సమీకరణకు వీలుగా మునిసిపల్ బాండ్లకు పన్ను రాయితీలు ప్రకటించాలని సెబీ తాజాగా ప్రభుత్వాన్ని కోరింది. వీటి సబ్‌్రస్కయిబర్లకు పన్ను మినహాయింపులను అందించాలని అభ్యర్థించింది. -
స్థల వివాదంలో ఆరోపణలు నిరాధారం
ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: ఎంపీ తోట నరసింహం కాకినాడ: న్యాయవాది రవికుమార్‌కు చెందిన స్థల వివాదంలో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా నిరాధారమైన ఆరోపణలు చేసి తన ప్రతిష్టకుభంగం కలిగించారని కాకినాడ ఎంపీ తోట నరసింహం ఆవేదనవ్యక్తం చేశారు. ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలన్నంత మానసిక ఒత్తిడికి లోనయ్యానని కన్నీటి పర్యంతమయ్యారు. న్యాయవాది రవికుమార్ స్థల వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తోట నరసింహం గురువారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రవికుమార్ ఎవరో తనకు తెలియదని, ఇంతవరకూ ఆయనను చూడలేదని చెప్పారు. తన పేరు చెప్పుకొని ఎవరైనా తప్పు చేసి ఉంటే తనను బాధ్యుడిని చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మీడియాలో వచ్చిన కథనాలు ఎంతో ఆవేదన కలిగించాయని అన్నారు. తాను అక్రమార్జన చేసినట్టు నిరూపిస్తే కాకినాడ నడిబొడ్డున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటానని సవాల్ విసిరారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించిన పత్రికలు, చానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్నారు. ఆరోపణలు వచ్చిన రోజు ఆత్మహత్య చేసుకుని, తన మరణాన్ని మీడియాకు అంకితమిద్దామనుకున్నానని, అరుుతే అలాంటి పని సరికాదని తమాయించుకున్నానని చెప్పారు.