Speed Post
-
డార్క్ వెబ్‌లో హెరాయిన్ ఆర్డర్.. స్పీడ్ పోస్ట్‌లో డెలివరీ!
ఖమ్మం క్రైం: సాధారణంగా మానవ కొరియర్ల ద్వారా డ్రగ్స్ సరఫరా జరుగుతుంటుందన్న విషయం తెలిసిందే. కానీ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణా, సరఫరాపై ప్రభుత్వం, పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో డ్రగ్స్ బానిసలు కొత్తదారులను ఆశ్రయిస్తున్నారు. తాజా గా ఓ యువకుడు డార్క్ వెబ్‌లో ఆర్డర్ పెట్టి స్పీడ్ పోస్ట్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకున్న ఉదంతం ఖమ్మంలో వెలుగుచూసింది.అస్సాం నుంచి: ఖమ్మం టూటౌన్ ప్రాంతానికి చెందిన ఓ సాప్ట్వేర్ ఇంజనీర్ మత్తుపదార్థాలకు అలవాటు పడ్డాడు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న అతను అక్కడ పోలీసు నిఘా ఎక్కువగా ఉండటంతో ఖమ్మంకు తెప్పించుకుంటే ఎవరికీ అనుమానం రాదని భావించాడు. ఇందుకోసం హ్యాకర్లు, మాఫియా, విమెన్ ట్రాఫికింగ్, ఆయుధాల స్మగ్లింగ్ చేసేవారు ఉపయోగించే డార్క్ వెబ్ (తమ గుర్తింపు, జాడను ఇతరులకు తెలియనివ్వకుండా ఇంటర్నెట్లోని హిడెన్ వెబ్సైట్లను ఉపయోగించేందుకు అవకాశం కల్పిస్తుంది) ఎంచుకున్నట్లు సమాచారం. ఆపై తన క్రెడిట్ కార్డు, ఇతర యాప్‌లు వాడకుండా క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేసి హెరాయిన్‌ను అస్సాంలోని సిల్పుకురి నుంచి బుక్ చేసుకున్నాడు.యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నిఘాతో..: డ్రగ్స్ ఆన్లైన్లో విక్రయిస్తుండగా కొందరు తెప్పించుకుంటున్నారనే అను మానంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు చెందిన సాంకేతిక బృందం కొన్నాళ్లుగా నిఘా వేసింది. ఇందులో భాగంగా గ త నెల 31న ఖమ్మం యువకుడు డ్రగ్స్ బు క్ చేసుకున్నట్లు పసి గట్టింది. స్పీడ్ పోస్ట్ పార్సిల్ నంబర్‌ను హెరాయిన్ సరఫరా దారు ఖమ్మం యువ కుడికి పంపడంతో అస్సాంలో పార్సిల్ మొదలైనప్పటి నుంచి నిఘా వేసింది. ఈ నెల 8న ఖమ్మం చేరుకున్న పార్సిల్‌ను 9న ఆ యువకుడికి డెలివరీ చేస్తుండగా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులతోపాటు ఖమ్మం టూటౌన్ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.ఆ పార్సిల్లో మ్యాగజైన్ మాత్రమే ఉండటంతో తొలుత యువకుడు బుకాయించాడు. అనంతరం అధికారులు మ్యాగజైన్‌లోని ఒక్కో పేజీని పరిశీలిస్తుండగా మధ్యలో ఓ కాగితానికి టేప్ వేసి ప్లాస్టిక్ కవర్లో ఉంచిన 2 గ్రా ముల హెరాయిన్ బయటపడింది. దీంతో హెరాయిన్‌ను స్వాధీనం చేసుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. దాన్ని సరఫరా చేసిందెవరు? రాష్ట్రంలో ఇంకా ఎవరెవరు తెప్పించుకున్నారనే కోణంలో ప్రశ్నించారు. యువకుడి కెరీర్ దృష్ట్యా కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎక్కడైనా డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తుపదార్థాల విక్రయం జరి గినట్లు తెలిస్తే 87126 71111 లేదా 1908 నంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. -
స్పీడ్‌పోస్ట్‌లో మంగళసూత్రం.. ఆన్లైన్లో అతిథులు
పుణె : కరోనా లాక్‌డౌన్‌తో పెళ్లిళ్లు చేసుకునేవారు చాలా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. కొందరు చాలా నిరాండబరంగా పెళ్లి చేసుకుంటుంటే.. మరికొందరు వీడియో కాలింగ్ ద్వారా తమ సన్నిహితులు చూస్తుండగా వివాహ బంధంతో ఒకటవుతున్నారు. తాజాగా కేరళకు చెందిన ఓ జంట.. పుణెలో వివాహ బంధంతో ఒకటైంది. కేరళ ఉన్న వధూవరుల కుటుంబాలు, వివిధ ప్రాంతాల్లో ఉన్న వారి సన్నిహితులు జూమ్ యాప్ ద్వారా ఈ వేడుకను వీక్షించారు. అయితే పెళ్లికి కావాల్సిన పవిత్రమైన మంగళసూత్రాన్ని వధూవరుల తల్లిదండ్రులు కేరళ నుంచి స్పీడ్‌పోస్ట్‌లో పంపించడం విశేషం. వివరాల్లోకివెళితే.. కేరళకు చెందిన విఘ్నేష్, అంజలిలు పుణెలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఏడాది క్రితమే వీరు పెళ్లి నిశ్చయమైంది. అయితే ఇప్పుడు కరోనా లాక్డౌన్ కొనసాగుతుండటంతో వారు పుణెలో చిక్కుకుపోవాల్సి వచ్చింది. అయితే ఇందుకు వారు ఏ మాత్రం నిరాశ చెందలేదు. ముందుగా నిర్ణయించిన రోజునే పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వరుడు విఘ్నేష్ నివాసం ఉంటున్న ఫ్లాట్‌లో ఈ వివాహం జరిగింది. ఇందుకు పుణెలోని విఘ్నేష్, అంజలి ఫ్రెండ్స్ తగిన ఏర్పాట్లు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పెళ్లిని వీక్షిస్తున్న వధూవరుల సన్నిహితులు ‘అంతా బాగానే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్నేహితులు, బంధువులు ఆన్లైన్లో మా పెళ్లిని వీక్షించారు. ఇది చాలా భిన్నమైన అనుభూతి.. కానీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అని విఘ్నేష్ అన్నారు. ‘లాక్డౌన్ ప్రారంభమైన కొత్తలో మే తొలి వారంలోనైనా మేము ఇళ్లకు చేరుకుంటామని అనుకున్నాం. ఆ తర్వాత ప్రస్తుత పరిస్థితుల్లో మేము ఇళ్లకు వెళ్లలేమని అర్థమైంది. అయినప్పటికీ మేము మా పెళ్లిని వాయిదా వేసుకోవాలని అనుకోలేదు’ అని అంజలి చెప్పారు. అలాగే సమయానికి మంగళసూత్రం డెలివరీ చేసిన ఇండియన్ పోస్టల్ శాఖకు నూతన దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. -
స్పీడ్ పోస్టులో తలాఖ్ పంపిన భర్త
-
‘స్మార్ట్’ వ్యథ!
► డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీల జారీలో నిర్లక్ష్యం ► వాహనదారులకు చేరవేయడంలో విఫలం ► ఆర్టీఏ, పోస్టల్ శాఖల మధ్య సమన్వయ లోపం ► నెలలు గడిచినా అందని స్మార్ట్‌కార్డులు ► వాహనదారులపై ఈ చలాన్ ల మోత సాక్షి, సిటీబ్యూరో బాగ్ అంబర్‌పేట్‌కు చెందిన నారాయణరావు మూడు నెలల క్రితం డ్రైవింగ్ లైసెన్సు రెన్యూవల్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ అధికారులను సంప్రదించారు. నిబంధనల మేరకు ఆన్ లైన్ స్లాట్ నమోదు చేసుకొని, ఈ సేవ ద్వారా ఫీజులు చెల్లించి, స్మార్ట్ కార్డు ఇంటికి స్పీడ్ పోస్టు చేసేందుకు అయ్యే రుసుము కూడా ఈ సేవా ద్వారానే చెల్లించి అధికారుల వద్దకు వెళ్లాడు. డ్రైవింగ్ లైసెన్సు రెన్యూవల్ ప్రక్రియను ముగించిన అధికారులు.. మరో వారంలో స్మార్ట్‌కార్డు పోస్టులో నేరుగా ఇంటికే వస్తుందన్నారు. ♦ గతేడాది నవంబర్ నుంచి ఈ ఫిబ్రవరి వరకు ఆయన అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. 3 నెలల క్రితమే కార్డు పోస్టు చేశామని చెప్పారు ఆర్టీఏ ఉద్యోగులు. ♦ ఇప్పుడు ఆ స్మార్ట్‌కార్డు సంబంధిత వినియోగదారుడు పేర్కొన్న చిరునామాకు చేరలేదు. అలాగని వెనక్కి తిరిగి రాలేదు. రవాణా అధికారుల వద్దకు తిరిగి రాకుండా, వాహనదారుడి చిరునామాకు చేరుకోకుండా ఆ విలువైన డ్రైవింగ్ లైసెన్సు స్మార్ట్ కార్డు ఏమైనట్లు... ♦ ఇది ఒక్క నారాయణరావు సమస్య మాత్రమే కాదు. గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రతి రోజు వందలాది వినియోగదారులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్య. ♦ డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్ ల కోసం వందల రూపాయల ఫీజులు చెల్లించినప్పటికీ సకాలంలో అందక అనేక మంది వినియోగదారులు ఆర్టీ ఏ కార్యాలయాల చుట్టూ పడిగాపులు కాస్తున్నారు. బాధ్యతారాహిత్యం... గ్రేటర్‌లోని ఖైరతాబాద్, సికింద్రాబాద్, మెహిదీపట్నం, అత్తాపూర్, చాంద్రాయణగుట్ట, మలక్‌పేట్, ఉప్పల్, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, కూకట్పల్లి, తదితర ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రతి రోజు సుమారు 3500 మంది వరకు వాహనాల రిజిస్ట్రేషన్ లు, డ్రైవింగ్ లైసెన్సులకు సంబంధించిన సేవలను పొందుతారు. ఈ వినియోగదారులందరికీ స్పీడ్ పోస్టు ద్వారా స్మార్ట్‌కార్డులను అందజేయవలసి ఉంటుంది. గతంలో వినియోగదారులకే ప్రత్యక్షంగా అందజేసే పద్ధతికి స్వస్తి చెప్పి స్పీడ్ పోస్టును ప్రవేశపెట్టారు. రవాణాశాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పద్ధతిలో వినియోగదారుల చిరునామా ధృవీకరణ ప్రధానమైన అంశం. కానీ ఆచరణలో మాత్రం లక్ష్యం నీరుగారుతోంది. కొన్నిసార్లు వినియోగదారులే సరైన చిరునామా నమోదు చేయకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతుండగా చాలా సార్లు పోస్టల్ శాఖ బాధ్యతారాహిత్యం, రవాణా అధికారుల నిర్లక్ష్యం కారణంగా సకాలంలో స్మార్ట్‌కార్డులు వినియోగదారులకు చేరడం లేదు. కొన్ని స్మార్ట్‌కార్డులపై పోస్టల్ సిబ్బంది ‘డోర్‌లాక్’ అని ముద్ర వేసి వెనక్కి పంపుతుండగా, చాలా వరకు నెలలు దాటినా ఇటు ఆర్టీఏకు వెనక్కి తిరిగి రాక, అటు వినియోగదారుడికి చేరకుండా మధ్యలోనే బుట్టదాఖలా అవుతున్నాయి. ఇలాంటి వాటిపై రెండు శాఖల్లో ఎలాంటి సమన్వయం, నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవడం గమనార్హం. ఇదేం స్పీడ్‌పోస్ట్? ♦ ప్రతి రోజు గ్రేటర్ పరిధిలో సుమారు 3500 స్మార్ట్ కార్డులు బట్వాడా చేయవలసి ఉంటుంది. వివిధ కారణాల వల్ల వాటిలో 35 శాతం కార్డులు పెండింగ్‌లో పెట్టేస్తారు. ♦ బట్వాడా చేసిన 65 శాతం కార్డులలో కనీసం 15 శాతం కార్డులు వినియోగదారులకు చేరడం లేదు. ♦ మొత్తంగా రోజుకు 500 నుంచి 600 స్మార్ట్‌కార్డులు వినియోగదారులకు బట్వాడా కావడం లేదు. ♦ స్పీడ్ పోస్టు అంటే కనీసం 48 గంటల్లోనైనా వినియోగదారుడికి ఆ పోస్టు అందాలి. కానీ ఆర్టీఏ బట్వాడా చేసే కార్డులు వినియోగదారుడికి చేరేందుకు వారం నుంచి 10 రోజుల సమయం పడుతుంది. ఒక్కోసారి 15 రోజులు కూడా దాటుతోంది. ♦ ఇక నెలలు దాటినా పౌరసేవలను అందుకోలేకపోతున్న సగటు వినియోగదారులు ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది.