spices park
-
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ఇదొక నిదర్శనం
సాక్షి, పల్నాడు: దేశంలోనే కాదు.. ఆసియాలోనే అతిపెద్ద సుగంధ ద్రవ్యాల తయారీ ప్లాంట్‌కి ఏపీ నెలవు కాబోతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. జిల్లాలోని యడ్లపాడు మండలం వంకాయల పాడు గ్రామంలో శుక్రవారం గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ఈ స్పైసెస్ ఫెసిలిటీ.. పద్నాలుగు వేల మంది రైతులకు గొప్ప వరంగా నిలుస్తుందని సీఎం జగన్ అన్నారు. సుమారు 200 కోట్లతో ఏటా 20 వేల మెట్రిక్ టన్నుల సుగంధ ద్రవ్యాలను ప్రాసెసింగ్ చేస్తారు. దాదాపు 15 రకాల సుగంధ ద్రవ్యాలను ప్రాసెసింగ్ చేస్తారు. ఇది మొదటి దశ మాత్రమే. రెండవ దశ కూడా పూర్తైతే దేశంలోనే కాదు.. ఆసియాలోనే అతిపెద్ద స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్ ఘనత మనకు దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. నవంబర్ 2020లో మొదలుపెట్టి.. ఇప్పుడు కమిషన్ చేయడం దాకా కేవలం 24 నెలల్లోనే అడుగులు పడడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎంతో ఉందని సీఎం జగన్ ప్రస్తావించారు. రెండో దశ పనుల కోసం ఐటీసీ కంపెనీకి ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో సహకారం అందుతుందని భరోసా ఇచ్చారు సీఎం జగన్. ఏపీలో ఈజ్ ఆఫ్ డూయింగ్‌కు ఇదొక నిదర్శనం. ఈ ఏడాది పారిశ్రామికవేత్తలను అడిగి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్ ఇచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరుసగా మూడు సంవత్సరాల్లో నెంబర్ వన్ స్థానం తీసుకోవడం గొప్ప మార్పుగా సీఎం జగన్ అభివర్ణించారు. రైతులకు ఇంకా మెరుగైన పరిస్థితులు కల్పించాలనే ఉద్దేశంతో.. రాష్ట్రవ్యాప్తంగా 26 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను 3,450 కోట్ల పెట్టుబడులతో ప్రభుత్వం ప్లాన్ చేసిందని, దీనివల్ల ప్రతీ జిల్లాలో ఉన్న రైతులకు మంచి జరగడంతో పాటు ఉద్యోగ కల్పన కూడా జరుగుతుందని తెలిపారు. ఇవి రైతుల పాలిట వరంగా మారనున్నాయన్నారు. ప్రాసెసింగ్ వల్ల రైతుల పంటకు మంచి గిట్టుబాటు దక్కుతుందని తెలిపారు సీఎం జగన్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అన్ని విధాల మైనార్టీలకు న్యాయం చేస్తున్నాం: సీఎం జగన్
Updates 12:35PM మైనార్టీ దినోత్సవంలో సీఎం జగన్ స్పీచ్ ►నేడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ 135వ జయంతి ►మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ సేవలు మరువలేనివి ►ముస్లింల్లో పేదలందరికీ తొలిసారిగా రిజర్వేషన్లు కల్పించింది వైఎస్సార్ ►పదవుల నుంచి సంక్షేమం వరకూ అన్ని విధాల మైనార్టీలకు న్యాయం చేస్తున్నాం ►ఒక మైనార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చాం ►నలుగురికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చాం ►శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవిని మైనార్టీకి కేటాయించాం ►మూడేళ్లలో మైనార్టీలకు డీబీటీ ద్వారా రూ. 10,309 కోట్లు అందించాం ►నాన్ డీబీటీ ద్వారా మరో రూ. 10 వేల కోట్లు అందించాం ►చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో మైనార్టీలకు రూ. 2,665 కోట్లు ఇస్తే..మూడేళ్లలోనే మేము రూ. 20 వేల కోట్లకు పైగా ఇచ్చాం ►వక్ఫ్ ఆస్తులు కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నాం ►ఇప్పటికే అన్యాక్రంతమైన 580 ఎకరాలను స్వాధీనం చేసుకున్నాం ►ఈ ప్రభుత్వం మీది అని మర్చిపోవద్దు 12:17PM గుంటూరు: మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో పాల్గొన్న సీఎం జగన్ 11:06AM గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ స్పీచ్ ►ఐటీసీ సంస్థకు అభినందనలు ►ఐటీసీ గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ వల్ల వేలాది మంది రైతులకు మేలు కలుగుతుంది ►ఇదొక వండర్ ఫుల్ మూమెంట్ ►సుమారు 200 కోట్లతో ఏటా 20 వేల మెట్రిక్ టన్నుల సుగంధ ద్రవ్యాలను ప్రాసెసింగ్ చేస్తారు ►15 రకాల సుగంధ ద్రవ్యాలను ప్రాసెసింగ్ చేస్తారు ►రెండవ దశ కూడా పూర్తైతే దేశంలోనే అతిపెద్ద స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్ మన దగ్గరే ఉంటుంది ►ఈ యూనిట్ 14 వేల మంది రైతులకు ఉపయోగపడుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నా ►24 నెలల్లోనే యూనిట్ ను పూర్తి చేశారు ►ఏపీలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ఇదొక నిదర్శనం ►మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉంది ►3450 కోట్లతో ప్రతీ జిల్లాలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయబోతున్నాం ►ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు వల్ల 33 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి ►మొదటి దశ కింద 1250 కోట్లతో 10 యూనిట్లకు డిసెంబర్ , జనవరి నెలల్లో శంకుస్థాపన ►ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రైతులకు వరంగా మారనున్నాయి ►రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటను ప్రాసెసింగ్ చేసే విధానం చాలా బాగుంది ►ప్రాసెసింగ్ వల్ల రైతుల పంటకు మంచి గిట్టుబాటు దక్కుతుంది ►ఐటీసీ కంపెనీకి ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో సహకారం అందుతుంది ►ఏ చిన్న సమస్య ఉన్నా... ఒక్క ఫోన్ చేసినా చాలు వెంటనే స్పందిస్తాం 10:37AM ►వంకాయలపాడు సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ ►గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్‌కు ప్రారంభోత్సవం 10:01AM ►వంకాయలపాడు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ►ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పల్నాడు, గుంటూరు జిల్లాల్లో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ►పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని వంకాయలపాడు సుగంధ ద్రవ్యాల పార్క్‌లో ఐటీసీ సంస్థ ఏర్పాటు చేసిన గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్‌ను ఆయన ప్రారంభించనున్నారు. ► ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ ఐటీసీ.. రాష్ట్రంలో భారీగా విస్తరణ కార్యక్రమాలు చేపడుతోంది. ఇప్పటికే రూ.140 కోట్లతో వెల్కమ్ పేరుతో గుంటూరులో ఫైవ్ స్టార్ హోటల్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు పల్నాడు జిల్లా యడ్లపాడు వద్ద రూ.200 కోట్లతో అభివృద్ధి చేసిన గ్లోబల్ స్పైసెస్ పార్క్‌ను అందుబాటులోకి తేనుంది. ► సుమారు 6.2 ఎకరాల్లో ఈ సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్ చేసి, ఎగుమతి చేసే విధంగా గ్లోబల్ స్పైసెస్ పార్క్‌ను అభివృద్ధి చేసింది. మిర్చితో పాటు పసుపు, అల్లం, ధనియాలు, యాలకులు తదితర సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్ చేసి ఎగుమతి చేయనుంది. ► సుమారు 20,000 టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఉంది ఈ గ్లోబల్ స్పైసెస్ పార్క్‌కు. పార్కు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,500 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ► గతంలో ఐటీసీ గ్రూపు రాష్ట్రంలో పొగాకు వ్యాపారానికే పరిమితం కాగా, 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో గుంటూరు కేంద్రంగా సుగంధ ద్రవ్యాల విభాగంలోకి అడుగు పెట్టింది. ఇందుకోసం ఐటీ స్పైసెస్ పేరుతో ప్రత్యేకంగా కంపెనీ ఏర్పాటు చేసి, వేగంగా విస్తరించింది. ► సుమారు 170 గ్రామాల్లో 10,000 మందికి పైగా రైతులతో 35,000 హెక్టార్లల్లో వివిధ సుగంధ ద్రవ్యాలను సాగు చేయిస్తోంది. ఆ పంటలను ఈ కంపెనీ నేరుగా కొనుగోలు చేయడం ద్వారా రైతులు మంచి ఆదాయం పొందుతున్నారు. ఐటీసీ గ్రూపు దేశంలో ఆశీర్వాద్ బ్రాండ్ పేరుతో వివిధ సుగంధ ద్రవ్యాల ఉత్పత్తులను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ ప్రారంభ కార్యక్రమ అనంతరం.. గుంటూరులోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించే మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో పాల్గొంటారు. ఆపై గుంటూరు మెడికల్ కళాశాలకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్లాటినం జూబ్లీ పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు సీఎం జగన్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మసాలా.. అదిరింది
సాక్షి, అమరావతి: ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ ఐటీసీ రాష్ట్రంలో భారీగా విస్తరణ కార్యక్రమాలు చేపడుతోంది. ఇప్పటికే రూ.140 కోట్లతో వెల్కమ్ పేరుతో గుంటూరులో ఫైవ్ స్టార్ హోటల్‌ను ఏర్పాటు చేసిన ఈ కంపెనీ.. తాజాగా రూ.200 కోట్లతో అభివృద్ధి చేసిన గ్లోబల్ స్పైసెస్ పార్క్‌ను అందుబాటులోకి తేనుంది. పల్నాడు జిల్లా యడ్లపాడు సమీపంలో సుమారు 6.2 ఎకరాల్లో సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్ చేసి, ఎగుమతి చేసే విధంగా గ్లోబల్ స్పైసెస్ పార్క్‌ను అభివృద్ధి చేసింది. మిర్చితో పాటు పసుపు, అల్లం, ధనియాలు, యాలకులు తదితర సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్ చేసి ఎగుమతి చేయనుంది. సుమారు 20,000 టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ గ్లోబల్ స్పైసెస్ పార్క్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ పార్కు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,500 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. గతంలో ఐటీసీ గ్రూపు రాష్ట్రంలో పొగాకు వ్యాపారానికే పరిమితం కాగా, 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో గుంటూరు కేంద్రంగా సుగంధ ద్రవ్యాల విభాగంలోకి అడుగు పెట్టింది. ఇందుకోసం ఐటీ స్పైసెస్ పేరుతో ప్రత్యేకంగా కంపెనీ ఏర్పాటు చేసి, వేగంగా విస్తరించింది. సుమారు 170 గ్రామాల్లో 10,000 మందికి పైగా రైతులతో 35,000 హెక్టార్లల్లో వివిధ సుగంధ ద్రవ్యాలను సాగు చేయిస్తోంది. ఆ పంటలను ఈ కంపెనీ నేరుగా కొనుగోలు చేయడం ద్వారా రైతులు మంచి ఆదాయం పొందుతున్నారు. ఐటీసీ గ్రూపు దేశంలో ఆశీర్వాద్ బ్రాండ్ పేరుతో వివిధ సుగంధ ద్రవ్యాల ఉత్పత్తులను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. పల్నాడు, గుంటూరు జిల్లాల్లో రేపు సీఎం పర్యటన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం పల్నాడు, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని వంకాయలపాడు సుగంధ ద్రవ్యాల పార్క్‌లో ఐటీసీ సంస్థ ఏర్పాటు చేసిన గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్‌ను ఉదయం 9.40 – 10.35 గంటల మధ్య ప్రారంభిస్తారు. అనంతరం 11 గంటలకు గుంటూరు నగరంలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించే మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు గుంటూరు మెడికల్ కళాశాలకు చేరుకుంటారు. ఈ కళాశాల ఏర్పాటై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్లాటినం జూబ్లీ పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం 1.30 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
రాజన్న వరం.. యడ్లపాడు స్పైసెస్ పార్క్
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మానసపుత్రిక యడ్లపాడు స్పైసెస్ పార్కు ప్రస్తుతం రైతులకు మేలు చేస్తోంది. ఇప్పటికే ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటయ్యాయి. ఇంకా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. పూర్తిస్థాయిలో ఇవి అందుబాటులోకి వస్తే.. రూ.వంద కోట్ల భారీ కలల ప్రాజెక్టు సాకారమవుతుంది. రైతులు, వ్యాపారులు ఆర్థిక పురోగతి సాధిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో మన జిల్లా ఎగుమతులు ఊపందుకుంటాయి. యడ్లపాడు: మిరప, పసుపు తదితర పంట ఉత్పత్తులను ముడి రూపంలో ఎగుమతి చేస్తే ఏమాత్రం ప్రయోజనం ఉండదు. అంతర్జాతీయ స్థాయిలో సుంగంధ ద్రవ్యాల ఆదాయంలో మన వాటాను పెంచుకోవాలంటే మేలు రక వంగడాల ఉత్పత్తితోపాటు పంట దిగుబడులను గ్రేడింగ్ చేసి పొడులు, ఇతరత్రా రూపాల్లో వివిధ సైజుల్లో ప్యాకింగ్ చేస్తే ఎగుమతులు పుంజుకుంటాయి. అందుకే ప్రభుత్వం ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం పల్నాడు జిల్లా యడ్లపాడులో దేశంలోనే అతిపెద్ద సుంగంధ ద్రవ్యాల(స్పైసెస్) పార్కును ఏర్పాటు చేసింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ, స్పైసెస్ బోర్డు ఆధ్వర్యంలో రూ.24 కోట్లతో మైదవోలు–వంకాయలపాడు గ్రామాల పరిధిలో 124.79 ఎకరాల్లో అన్ని మౌలిక సదుపాయాలతో ఈ పార్కును నిర్మించడం విశేషం. వైఎస్సార్ చలువే దేశంలో 6 చోట్ల సుగంధ ద్రవ్యాల పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేయాలని 2007లో కేంద్రప్రభుత్వం భావించింది. దీంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏపీకి స్పైసెస్ పార్కు కేటాయించాలని కేంద్రాన్ని పట్టుబట్టారు. దేశంలో ఉత్పత్తి అయ్యే మిర్చి పంటలో 60 శాతం ఏపీలోనే.. అందులోనూ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉత్పత్తి అవుతుందని, అక్కడే పార్కు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపి కేంద్రం ఆమోదాన్ని పొందారు. వెనువెంటనే భూసేకరణ ప్రక్రియ చేపట్టి దేశంలోనే అతిపెద్ద పార్కు నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత 2015లో పార్కు నిర్మాణం పూర్తయింది. పార్కు వల్ల ప్రయోజనాలు ► రైతులు తమ ఉత్పత్తులకు మంచి ధరను పొందేందుకు ఎగుమతిదారులతో ప్రత్యక్ష మార్కెట్ అనుసంధానాన్ని ఏర్పరుచుకోవాలి. దీనికి ఈ పార్కు ఎంతో దోహదపడుతుంది. ► క్లీనింగ్, గ్రేడింగ్, ప్యాకింగ్ కోసం సాధారణ అవస్థాపన సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ► నాణ్యమైన ఉత్పత్తుల తయారీ, నిర్ధారణకు దోహదం చేస్తుంది. ఫలితంగా మంచి ధర లభిస్తుంది. ఇంకా ఏమేం వస్తాయి? ► పార్కులో ఇంకా గ్రేడింగ్, క్లీనింగ్, ప్యాకింగ్ స్టెరిలైజేషన్, స్టీమ్, చిల్లీపౌడర్, చిల్లీపేస్ట్, క్లోనింగ్ ఎక్స్‌పోర్టుకు కావాల్సిన ప్యాకింగ్ సిస్టం వంటి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు కానున్నాయి. ► మిర్చి నుంచి రంగు, ఘాటు వేరు చేసే యూనిట్లు, ఓలియేరేజిన్ వంటివి తయారు చేసేవి, మసాల తయారీ, వివిధ మిర్చి ఉత్పత్తుల యూనిట్లు త్వరలోనే రానున్నాయి. ► ఈ రంగంలో ఇప్పటికే పేరున్న బహుళ జాతి కంపెనీలూ ఇక్కడ సొంత యూనిట్లు ప్రారంభించనున్నాయి. ► చిల్లీ డ్రైయర్స్, లేబొరేటరీస్, వేబ్రిడ్జిలు, బ్యాకింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ► మిర్చి, పసుపు అనుబంధన సంస్థలు, కంపెనీలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. స్పైసెస్ పార్కు అభివృద్ధికి కృషి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి వల్లే స్పైసెస్ పార్కు ఏర్పాటైంది. దీని అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృషి చేస్తాను. ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తాను. ఈ పార్కు వల్ల రైతులకు, వ్యాపారులకు ఎంతో మేలు జరుగుతుంది. ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. పార్కుకు వెళ్లే ప్రధాన మార్గం విస్తరణకు చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. – విడదల రజిని, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శీతల గిడ్డంగులతో ఉపయోగం శీతల గిడ్డంగుల వల్ల రైతులకు మేలు కలుగుతోంది. గతంలో పంట ఉత్పత్తులను గుంటూరుకు తీసుకువెళ్లేవారం. ఇప్పుడు స్పైసెస్ పార్కులో గిడ్డంగులు ఉండడంతో దూరంతోపాటు రవాణా భారం తగ్గింది. – బండారు వెంకటసాంబశివరావు, మిర్చిరైతు, వంకాయలపాడు గ్రామం మిర్చి రైతులకు బంగారు భవిత గతంలో పంటను భద్రపరిచే అవకాశం లేక మిర్చి పంటను కల్లాల్లోనే తెగనమ్ముకునేవాళ్లం. ప్రస్తుతం స్పైసెస్‌పార్కులో రెండు కోల్డ్‌స్టోరేజీలు రావడంతో సరైన ధర వచ్చేవరకు భద్రపరుచు కుంటున్నాం. ప్రాసెసింగ్ యూనిట్లూ రావడంతో మేమే గ్రేడింగ్ చేసుకుంటున్నాం. పార్కు వల్ల మా భవిత బంగారంలా ఉంటుంది. – కర్రా పెదరాజారావు, మిర్చిరైతు జాలాది గ్రామం రైతుకు భరోసా స్పైసెస్ పార్కులో సరుకు నిల్వ ఉంచుకునే అవకాశం ఉంది. దీనివల్ల ధర వచ్చినప్పుడే అమ్ముకోవచ్చు. పార్కు ఏర్పాటైనప్పటి నుంచి మా ప్రాంతంలో మిర్చి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. మంచి గిట్టుబాటు ధర లభిస్తోంది. పార్కు రైతుకు భరోసాగా ఉంది. – కొసన సాంబశివరావు, రైతు చెంఘీజ్‌ఖాన్‌పేట క్యూ కట్టిన కంపెనీలు ప్రస్తుతం పార్కులో స్పైసెస్ బోర్డు సొంతంగా కారంపొడి తయారు యూనిట్‌ను ఏర్పాటు చేసింది. దేశంలోనే ప్రముఖ కంపెనీ అయిన పైలెట్ స్మి తిరుచూరు నుంచి రూ.2 కోట్లతో ‘చిల్లీప్రాసెసింగ్ యూనిట్ మిషన్’ను తెప్పించి లీజుకు ఇచ్చింది. యూనిట్ల ఏర్పాటు కోసం కంపెనీలకు కేటాయించేందుకు బోర్డు 93.42 ఎకరాల విస్తీర్ణాన్ని 58 ప్లాట్లుగా విభజించింది. వీటికోసం 100కు పైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో 49 ప్లాట్లను 18 మంది పారిశ్రామికవేత్తలకు ప్రైవేట్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు బోర్డు కేటాయించింది. వీరిలో ఐదుగురు యూనిట్లను స్థాపించి నిర్వహిస్తున్నారు. డాలి, రామి ఆగ్రో, ఎస్ఎంఈ అగ్రిటెక్, స్వమి స్పైస్మిల్, ఉమా ఎక్స్‌పోర్ట్స్, డీకే ఎంటర్ప్రైజెస్ వంటి మరో ఏడు కంపెనీలు యూనిట్ల ఏర్పాటుకు నిర్మాణ పనులను చేపట్టాయి. ఇప్పటికే ఉన్న యూనిట్లలో క్వాలిటీ స్పైసెస్, స్పైస్ఎగ్జిన్, నంద్యాల సత్యనారాయణ, ఆగ్రోట్రేడ్, ఐటీసీ, జాబ్స్ ఇంటర్నేషనల్ యూనిట్లు ప్రధానమైనవి. సరుకు నిల్వకు గిడ్డంగులు 2018లో పార్కులో రూ.53.2 కోట్లతో 4 గోదాములను నిర్మించారు. 12 ఎకరాల్లో ఏర్పాటైన వీటి సామర్థ్యం 23 వేల మెట్రిక్ టన్నులు. వీటిలో 13వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఐదంతస్తుల రెండు శీతల గిడ్డంగులు ఉన్నాయి. వీటి విద్యుత్ అవసరాల కోసం 200కేవీఏ సామర్థ్యంగల రెండు సోలార్ యూనిట్లనూ ఏర్పాటు చేశారు. వీటితో పాటు అదనపు నిల్వల కోసం ప్రత్యేక యూనిట్ నిర్మించారు. పంట ఉత్పత్తుల రక్షణ కోసం కావాల్సిన యంత్రాలు, పరికరాలు సమకూర్చారు. రైతుల కోసం విశ్రాంతి గదులు నిర్మించారు. మిర్చి, పసుపు మాత్రమే కాకుండా అపరాలు, బియ్యం, నూనెవస్తువులు, వేరుశనగ, నువ్వులు, కందులు, పెసలు వంటి వాటినీ నిల్వ చేసుకునే అవకాశం కల్పించారు. శీతల గిడ్డంగులు ప్రైవేటు వ్యక్తులకు లీజుకిచ్చారు. సాధారణ గోదాములను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ నిర్వహిస్తోంది. రాయితీపై సేవలందిస్తోంది. (క్లిక్: పరిశోధన, ప్రయోగాల నిలయం ఏఎన్‌యూ) -
రాజకీయాల్లో రాజర్షి!
సాక్షి, గుంటూరు: నిస్వార్థం ఎంత గొప్పదో నిరూపించాడు.. నిశీధి మాటున వెలుగులు పంచాడు.. దాహార్తిని తీర్చగా జలసిరులను పొంగించాడు.. బీడు భూముల్లో పసిడి కాంతుల కోసం జలయజ్ఞం సంకల్పించాడు.. పేదవాడి గోడువిని గూడు నిర్మించాడు.. అనారోగ్యానికి ఆరోగ్యశ్రీతో వైద్యం చేశాడు.. కార్పొరేట్ విద్యను పేదలకు దాసోహమనిపించాడు.. ముగింపు లేని కథలా.. భవిష్యత్తు తరాలకు దిక్సూచిలా.. మనుష్యులందు మహర్షిలా.. రాజకీయాల్లో రాజర్షిలా.. కీర్తిగడించాడు. చెరగని జ్ఞాపకాలను పంచి.. ప్రవేశపెట్టిన పథకాలకు వందేళ్ల ఆయుష్షునిచ్చి.. జనహృదయాల్లో నిలిచాడు. నేడు మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. వైఎస్సార్ జిల్లాపై చెరగని ముద్ర వేశారు. తొలి ఐదేళ్ల కాలంలో ఏకంగా 57 సార్లు జిల్లాలో పర్యటించారు. ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 2.26 లక్షల ఇళ్లు నిర్మించి గూడు లేని నిరుపేదకు ఆశ్రయం కల్పించారు. పులిచింతలతో డెల్టాను సస్యశామలం చేశారు. సాగర్ చివరి ఆయకట్టు వరకూ నీళ్లందించి పల్నాట ఫ్యాక్షన్ రక్కసిని రూపుమాపారు. సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న జిల్లాలో ఆ పార్టీ అడ్రస్ గల్లంతు చేసిన ఘణత వైఎస్‌కే దక్కింది. 2004 సార్వత్రిక ఎన్నికల్లో 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 18 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆ ఎన్నికల్లో గెలుపొందారు. ప్రభుత్వ కూర్పులోనూ వైఎస్ జిల్లాకు పెద్ద పీట వేశారు. నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టి జిల్లాను మిని కేబినెట్‌గా మార్చారు. 2009 ఎన్నికల్లోనూ అదే ప్రభంజనం కొనసాగించారు. 12 మున్సిపాల్టీల్లో వైఎస్సార్ మార్క్.. పొన్నూరు పట్టణంలో మున్సిపాల్టీ నూతన భవన నిర్మాణానికి దివంగత మహానేత వైఎస్సార్ రూ.1 కోటి నిధులను మంజూరు చేశారు. రూ.1 కోటి వ్యయంతో హిందూ స్మశాన వాటికను అభివృద్ధి చేశారు. తెనాలి పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.100 కోట్ల వ్యయంతో రక్షిత మంచినీటి పథకానికి 2009లో మహానేత శంకుస్థాపన చేశారు. మంగళగిరి పట్టణంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని రూ.60 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. ఇక్కడ సీమాంధ్రలో ఎక్కడా లేని విధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి వైఎస్సార్ ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ ఆయన మరణానంతరం పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. రాజీవ్ గృహకల్ప ద్వారా వెయ్యి మంది నిరుపేదలకు సొంత ఇళ్లు నిర్మించేందుకు వైఎస్సార్ ప్రణాళిక రూపొందించి తొలి విడతలో 504 మందికి ఇళ్లు నిర్మించి ఇచ్చారు. ఆయన అకాల మరణంతో రెండో విడత రాజీవ్ గృహకల్ప నిలిచిపోవడంతో 500 మంది నిరుపేదలకు సొంతింటి కల కలగానే మిగిలిపోయింది. తాడేపల్లి పట్టణాన్ని కూడా మున్సిపాల్టీగా మార్చేందుకు వైఎస్సార్ హయాంలోనే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూ.40 కోట్ల వ్యయంతో మంచినీటి పథకాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల మున్సిపాల్టీలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు దివంగత మహానేత హయాంలో అప్పటి ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి విజ్ఞప్తి మేరకు గోవిందాపురం వద్ద కృష్ణానది నుంచి పిడుగురాళ్లకు రూ. 36 కోట్ల వ్యయంతో మంచినీటి పథకాన్ని నిర్మించారు. మాచర్ల పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు బుగ్గవాగు రిజర్వాయర్ నుంచి మాచర్ల పట్టణానికి మంచినీటినందించే పథకానికి రూ.16 కోట్లతో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే వైఎస్సార్ అకాల మరణంతో ఆ పథకం అంశం మురుగున పడింది. వైఎస్సార్ నగరబాట కార్యక్రమంలో మాచర్ల పట్టణానికి వచ్చి అడగకుండానే సిమెంట్‌రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి రూ. 50 లక్షలు మంజూరు చేశారు. సత్తెనపల్లి పట్టణంలో వైఎస్సార్ హయాంలో రూ.14.5 కోట్ల వ్యయంతో 120 ఎకరాలను కొనుగోలు చేసి మంచినీటి చెరువును తవ్వించారు. అంతేకాకుండా రూ. 20 కోట్ల నిధులతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు, ఓవర్‌హె డ్ ట్యాంకుల నిర్మాణం పూర్తి చేశారు. 60 కి.మీ మేర పైప్‌లైన్ నిర్మాణం పట్టారు. మురికివాడల అభివృద్ధి కోసం రూ. 15.38 కోట్ల నిధులను అందించారు. చిలకలూరిపేట పట్టణంలో వైఎస్సార్ హయా ంలో మురికివాడల అభివృద్ధి కోసం రూ. 16.74 కోట్ల నిధులను మంజూరు చేశారు. 2005లో మున్సిపల్ నూతన భవన నిర్మాణానికి రూ.70 లక్షలు, నిరుపేదలకు నివాస గృహాలు నిర్మించుకునేందుకు, ఇల్ల పట్టాలు ఇచ్చేందుకు రూ.8 కోట్లతో 52 ఎకరాల భూమిని కొనుగోలు చేసి పంపిణీ చేశారు. నరసరావుపేట మున్సిపాల్టీలో మురుగు రోడ్లపైకి చేరకుండా శాశ్వత పరిష్కారం కోసం 2008లో మహానేత రూ.44 కోట్ల వ్యయంతో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పథకానికి శంకుస్థాపన చేశారు. అంతే కాకుండా రూ.22 కోట్లతో చిలకలూరిపేట రోడ్డులో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన, నిరుపేదలకు సొంతింటి కళ సాకరం అయ్యేందుకు రాజీవ్ గృహకల్ప వంటి కార్యక్రమాలు చేపట్టారు. బాపట్ల పట్టణంలో వైఎస్సార్ హయాంలో మురుగునీరు సమస్య శాశ్వత పరిష్కారం కోసం రూ. 49 కోట్ల వ్యయంతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజి పథకాన్ని ప్రవేశపెట్టారు. అంతేకాకుండా రూ. 2 కోట్ల వ్యయంతో నిరుపేదలకు రాజీవ్ గృహకల్ప పేరుతో గృహ సముదాయాలు నిర్మించారు. దివంగత మహానేత వైఎస్సార్ వినుకొండ పట్టణాన్ని 2005లో మున్సిపాల్టీగా మార్చి రూ.30 కోట్లతో పట్టణంలో సిమెంట్ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణాలు చేపట్టారు. పట్టణ ప్రజల దామార్తిని తీర్చేందుకు రూ.15 కోట్ల వ్యయంతో మంచినీటి పథకాన్ని నిర్మించారు. రేపల్లె పట్టణంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.13 కోట్ల వ్యయంతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నిర్మించారు. చివరి సంతకం కూడా రైతుల కోసమే 2009లో రెండో సారి అధికారంలోకి వచ్చిన వైఎస్సార్.. మరణానికి ముందు రోజు మిర్చి రైతులకు బీమా పరిహారం ఫైల్ పైనే సంతకం చేశారు. 2009 సెప్టెంబరు 1న వాతావరణ ఆధారిత బీమా రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. వైఎస్ హెలికాఫ్టర్ ఎక్కే ముందు వ్యక్తిగత కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డికి ఈ విషయాన్ని గుర్తు చేయడంతో ఆ సమయంలో ప్రభాకరరెడ్డి గుంటూరు జిల్లా వ్యవసాయాధికారులతో వాతావరణ ఆధారిత భీమాతో రైతులకు రూ.22 కోట్లు పరిహారం అందించాలని సూచించారు. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించేందుకు ముఖ్యమంత్రిగా ఆయన సంతకం చేశారు. 15వేల మంది రైతులకు రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు ఎకరాకు పరిహారం అందింది. ఆరోగ్య శ్రీ ఇక్కడి నుంచే నిరుపేదల పాలిటి అపర సంజీవనిగా పేరొందిన ఆరోగ్యశ్రీ పథకాన్ని 2008లో గుంటూరు నుంచే ఆయన ప్రారంభించారు. రాజీవ్ పల్లెబాట, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిర ప్రభ వంటి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు ఇక్కడే జరిగాయి. దేశంలో రెండో స్పైసెస్ పార్క్ భారతదేశంలోనే రెండో స్పైసెస్ (సుగంధ ద్రవ్యాల)పార్క్‌ను యడ్లపాడు మండలంలో ఏర్పాటు చేసిన ఘనత మహానేత వైఎస్‌కే దక్కుతుంది. ఆయన సీఎంగా ఉన్న సమయంలో దేశవ్యాప్తంగా కేంద్రం మూడు స్పైసెస్ పార్క్‌లను మంజూరు చేసింది. అందులో ఒక స్పైసెస్ పార్క్‌ను యడ్లపాడు మండలంలో ఏర్పాటు చేయడానికి వైఎస్ విశేష కృషి చేశారు. సుమారు రూ.1.5 కోట్లతో 124.79 ఎకరాల్లో ఈ పార్క్‌ను నిర్మించారు. కొండవీడు కోట అభివృద్ధికి శ్రీకారం చుట్టిన మొదటి వ్యక్తి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. సుమారు రూ.100కోట్ల నిధులతో ఈ ప్రాంతాన్ని సమగ్ర అభివృద్ధి చేయాలని ఆయన సంకల్పించారు. అందులో భాగంగా 2007లో జులైలో రూ.5కోట్లతో కొండవీడుకోట పైకి ఘాట్‌రోడ్డు ఏర్పాటు కోసం నిధులను మంజూరు చేశారు. -
పసుపుబోర్డు ఏర్పాటు చేయండి
నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని ఎంపీ కల్వకుంట్ల కవిత శుక్రవారం పార్లమెంట్లో కోరారు. జీరో ఆవర్‌లో ఎంపీ కవిత మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో పసుపు పంటకు మద్దతు ధర లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీంతో దళారులు లాభపడుతున్నారని పేర్కొన్నారు. పసుపుబోర్డు ఏర్పాటు చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలను వివరించాలని కేంద్ర మంత్రిని కోరారు. అనంతరం కేంద్ర మంత్రి నిర్మలసీతారామన్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో 11 స్పైసెస్ అభివృద్ధి ఏజెన్సీలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాలని నిర్ణయించగా.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్పైసెస్ పార్కుకు భూమి కేటాయిస్తే ముం దుకు వెళతామన్నారు. అనంతరం ఎంపీ కవిత స్పందిస్తూ ఇప్పటికే రాష్ట ప్రభుత్వం 40 ఎకరాల భూమిని సేకరించి ఇచ్చిందన్నారు. భూమిని స్పైసెస్ పార్కుకు అనుబంధం కాలేదన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన స్పైసెస్ పార్కు నిర్వహణ బాధ్యతను తెలంగాణలో ఉన్న వరంగల్ ప్రాంతీయ కార్యాలయానికి కాకుండా.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు ప్రాంతీయ కార్యాలయానికి అనుసంధానించారని తెలిపారు. నిర్వహణ బాధ్యతలను వరంగల్‌కు మార్చాలని కోరారు. -
ఆలోచనలు ఘనం ... ఆచరణ శూన్యం
యడ్లపాడు: మండలంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారీ ప్రాజెక్టులకు మోక్షం ఎప్పుడు కలుగుతుందా అని ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇవి పూర్తయితే బోయపాలెం పారిశ్రామిక హబ్‌గా , కొండవీడుకోట పర్యాటక కేంద్రంగా, చెంఘీజ్‌ఖాన్‌పేట ఆధ్యాత్మిక క్షేత్రంగా మారతాయి. మైదవోలు-వంకాయలపాడు పరిధిలో స్పైసెస్‌పార్కు అన్ని పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దీనికి శంకుస్థాపన చేశారు. ఇది దేశంలోనే రెండోదిగా నిలవనుంది. బోయపాలెంలో టెక్స్‌టైల్‌పార్కు, చెంఘీజ్‌ఖాన్‌పేటలో ఇస్కాన్ స్వర్ణమందిర నిర్మాణాలకు అప్పటి సీఎం కె. రోశయ్య శంకుస్థాపన చేశారు. ఇవి శిలాఫలకాలకే పరిమితమయ్యాయి. ఇవిగాక మరికొన్ని ప్రాజెక్టులను ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలనే ఆలోచనలో పాలకులు ఉన్నారు. వివిధ దశల్లో పలు ప్రాజెక్టులు... స్పైసెస్ పార్కు కోసం 124.78 ఎకరాలు కేటాయించగా, టెక్స్టైల్ పార్కుకోసం 108 ఎకరాలను కేటాయించారు. చెంఘీజ్‌ఖాన్‌పేటలో స్వర్ణమందిరం ఏర్పాటు చేస్తామంటూ ముందుకొచ్చిన అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘం (ఇస్కాన్)కు 26 ఎకరాల దేవాదాయ భూములను అప్పగించారు. మరో 124 ఎకరాలను దశల వారీగా ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు ఏపీఐఐసీ భూములు తీసుకోవడం మినహా ఏ ఒక్క పని చేయలేదు. ఇక ఆధ్యాత్మిక ప్రాజెక్టుకు సంబంధించి ఇస్కాన్ కొండవీడులో ఒక్క గోశాల నిర్మాణం తప్ప మరే పనులను ప్రారంభించలేదు. మూడేళ్ల కిందట కొండవీడు రెవెన్యూలోని చౌడవరం ప్రాంతంలో డంపింగ్‌యార్డు, ఫుడ్పార్కుకోసం ప్రభుత్వం భూములు చూడడం జరిగి ంది. స్థానికుల వ్యతిరేకతతో డంపింగ్‌యార్డు రూరల్ మండలానికి వెళ్లగా, పుడ్‌పార్క్ వ్యవహారం స్థలపరిశీలతోనే నిలిచిపోయింది. కొత్త ప్రాజెక్టుల ఏర్పాటు యోచన... దీర్ఘకాలం నుంచి జిల్లా పోలీసు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు చౌడవరం, ప్రత్తిపాడు రెవెన్యూ పరిధిలోని భూములను ఎంపిక చేశారు. తాజాగా మరో మూడు ప్రాజెక్టుల ఏర్పాటుకు కొండవీడు రెవెన్యూలో భూములను పరిశీలిస్తున్నారు. పుడ్‌ప్రాసెసింగ్ పార్కు కు 300 ఎకరాలు, జేఎన్టీయూ 70 ఎకరాలు, రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటుకు మరో ఐదు ఎకరాలు అవసరం అవుతాయని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు. ఇవిగాక ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా శివుడి విగ్రహాన్ని, ధ్యాన మందిరాన్ని 100 ఎకరాలలో నిర్మించాలని భారత సంస్కృతి ఆయుర్వేద వికాస పరిషత్ ప్రయత్నం చేస్తోంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 150 అడుగుల విగ్రహాన్ని, అంతర్జాతీయ స్థాయి దళిత యూనివర్సిటీని కొండవీడు ప్రాంతంలోనే స్థాపించాలని ఐడియల్దళిత ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రభుత్వ దృష్టికి తీసుకువె ళ్లింది. కొండవీడు రెవెన్యూ పరిధిలో ఎమ్మెల్యే క్వార్టర్లు నిర్మించాలని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జిల్లాస్థాయి ఉన్నతాధికారులతో కలసి పరిశీలించారు. 300 ఎకరాల అటవీ భూములు అవసరమవుతాయని అంచనా వేశారు. ఏపీ స్పిన్నింగ్‌మిల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా టెక్స్‌టైల్‌పార్కు ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వం కేవలం రాజధాని ప్రాంతాన్నే కాకుండా జిల్లాలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి సాధించేలా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.