నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత
నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని ఎంపీ కల్వకుంట్ల కవిత శుక్రవారం పార్లమెంట్‌లో కోరారు. జీరో ఆవర్‌లో ఎంపీ కవిత మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో పసుపు పంటకు మద్దతు ధర లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీంతో దళారులు లాభపడుతున్నారని పేర్కొన్నారు. పసుపుబోర్డు ఏర్పాటు చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలను వివరించాలని కేంద్ర మంత్రిని కోరారు. అనంతరం కేంద్ర మంత్రి నిర్మలసీతారామన్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో 11 స్పైసెస్ అభివృద్ధి ఏజెన్సీలను ఏర్పాటు చేశామన్నారు.
ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాలని నిర్ణయించగా.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్పైసెస్ పార్కుకు భూమి కేటాయిస్తే ముం దుకు వెళతామన్నారు. అనంతరం ఎంపీ కవిత స్పందిస్తూ ఇప్పటికే రాష్ట ప్రభుత్వం 40 ఎకరాల భూమిని సేకరించి ఇచ్చిందన్నారు. భూమిని స్పైసెస్ పార్కుకు అనుబంధం కాలేదన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన స్పైసెస్ పార్కు నిర్వహణ బాధ్యతను తెలంగాణలో ఉన్న వరంగల్ ప్రాంతీయ కార్యాలయానికి కాకుండా.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు ప్రాంతీయ కార్యాలయానికి అనుసంధానించారని తెలిపారు. నిర్వహణ బాధ్యతలను వరంగల్‌కు మార్చాలని కోరారు.
పసుపుబోర్డు ఏర్పాటు చేయండి
Published Sat, Aug 8 2015 3:44 AM | Last Updated on Thu, Aug 9 2018 4:51 PM
Advertisement
Advertisement