SPILL WAY
-
విజయవంతంగా పోలవరం స్పిల్‌వే గేట్ల ఆపరేటింగ్
-
ధవళేశ్వరం నుంచి గోదావరి డెల్టాకు సాగునీరు
సాక్షి, తూర్పుగోదావరి: ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి గోదావరి డెల్టాకు సాగునీటిని విడుదల చేశారు. తూర్పు డెల్టా ప్రధాన కాల్వకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భరత్ మంగళవారం సాగునీరు విడుదల చేశారు. దీంతో పోలవరం స్పిల్‌వే మీదుగా మొదటిసారి గోదావరి జిల్లాలకు సాగునీరు అందనుంది. చదవండి: జూలై నుంచి కాళేశ్వరం ఎత్తిపోత! -
పోలవరంలో మరో ముఖ్య ఘట్టం
సాక్షి, అమరావతి: పోలవరం స్పిల్ వే పనుల్లో మరో కీలక ఘట్టం మొదలైంది. స్పిల్ వే గేట్లను ఎత్తడానికి, దించడానికి వీలుగా ప్రపంచంలోనే అతి పెద్ద హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్లను అమర్చే ప్రక్రియను మేఘా సంస్థ సోమవారం ప్రారంభించింది. ఈ హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్లను జర్మనీకి చెందిన మాంట్ హైడ్రాలిక్ సంస్థ నుంచి దిగుమతి చేసుకున్నారు. జర్మనీ నుంచి సంస్థ ఇంజనీర్లు పోలవరానికి చేరుకుని గేట్లకు సిలిండర్ల బిగింపు పనులను పర్యవేక్షిస్తున్నారు. వరద పోటును తట్టుకునేలా... పోలవరం పూర్తి స్థాయి నీటి మట్టం 45.72 అడుగులు కాగా గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 194.6 టీఎంసీలు. ప్రాజెక్టులో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరాక మిగులు జలాలను స్పిల్ వే ద్వారా దిగువకు విడుదల చేస్తారు. 1986 ఆగస్టు 16న ధవళేశ్వరం బ్యారేజీకి గోదావరి నుంచి 36 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది. గోదావరి చరిత్రలో ఇప్పటివరకూ వచ్చిన గరిష్ట వరద ప్రవాహం అదే. పోలవరం జలాశయం భద్రత దృష్ట్యా గోదావరికి 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా స్పిల్ వే నిర్మాణ డిజైన్లను కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదించింది. ఆ మేరకు 1,128 మీటర్ల పొడవున స్పిల్ వేను నిర్మిస్తున్నారు. స్పిల్ వే పిల్లర్లకు 25.72 అడుగుల నుంచి 45.72 అడుగుల మధ్య 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పుతో 48 గేట్లను అమర్చాలి. ఇప్పటికే 29 గేట్లను అమర్చారు. ఒక్కో గేటు బరువు 300 టన్నులు ఉంటుంది. పోలవరం ప్రాజెక్టులోకి నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరాక వరదను దిగువకు విడుదల చేయాలంటే గేట్లను ఎత్తాలి. వరద ప్రవాహం తగ్గాక నీటిని గరిష్ట స్థాయిలో నిల్వ చేయాలంటే గేట్లను దించాలి. ఇలా గేట్లను ఎత్తడానికి, దించడానికి వీలుగా ఒక్కో గేటుకు కుడి వైపున ఒకటి, ఎడమ వైపున ఒకటి చొప్పున రెండు హైడ్రాలిక్ సిలిండర్లను అమర్చాలి. తాజాగా ఈ పనులు ప్రారంభమయ్యాయి. గేట్లు, హైడ్రాలిక్ సిలిండర్ల అమరిక ఇలా.. ► భారీ క్రేన్లతో ఆర్మ్ గడ్డర్లను ఎత్తి పిల్లర్లలో నిర్మించిన ట్రూనియన్ బీమ్‌కు బిగిస్తారు. రెండు పిల్లర్ల ట్రూనియన్ బీమ్ బ్రాకెట్లకు ఒక్కోదానికి నాలుగు ఆర్మ్ గడ్డర్ల చొప్పున బిగిస్తారు. రెండు పిల్లర్లకు బిగించిన ఆర్మ్ గడ్డర్స్‌ను హారిజాంటల్ గడ్డర్లతో అనుసంధానం చేస్తారు. ► భారీ క్రేన్ల సహకారంతో ఎనిమిది స్కిన్ ప్లేట్లను ఎత్తి రెండు పిల్లర్లకు అమర్చిన ఆర్మ్ గడ్డర్స్, హారిజాంటల్ గడ్డర్స్ మధ్య ఎగువన నాలుగు స్కిన్ ప్లేట్లు(ఎలిమెంట్స్), దిగువన నాలుగు స్కిన్ ప్లేట్లను అతికిస్తారు. స్కిన్ ప్లేట్ల మధ్య ఖాళీ ప్రదేశాలు లేకుండా వెల్డింగ్ చేస్తారు. దీంతో ఒక గేటు సిద్ధమవుతుంది. ► పిల్లర్లకు 45 మీటర్ల ఎత్తు వద్ద డౌన్ స్ట్రీమ్ (స్పిల్ వేకు దిగువ) వైపు కార్దానిక్ అరైంజ్మెంట్కు బిగిస్తారు. రెండు పిల్లర్లకు ఏర్పాటు చేసిన కార్దానిక్ అరైంజ్‌మెంట్.. గేటు అడుగున ఉన్న హారిజాంటల్ గడ్డర్‌కు అమర్చిన బ్రాకెట్ మధ్య స్పిల్ వేకు ఇరువైపులా డౌన్ స్ట్రీమ్‌లో ఒక్కొక్కటి 215 టన్నుల సామర్థ్యంతో కూడిన రెండు హైడ్రాలిక్ సిలిండర్లను బిగిస్తారు. స్పిల్ వే పిల్లర్లకు 55 మీటర్ల స్థాయిలో ఏర్పాటు చేసిన పవర్ ప్యాక్‌లతో కార్దానిక్ అరైంజ్మెంట్ను అనుసంధానం చేస్తారు. ప్రతి రెండు గేట్లకు ఒకచోట ఈ పవర్ ప్యాక్‌లను అనుసంధానం చేస్తూ స్పిల్ వే బ్రిడ్జిపై కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేస్తారు. గేట్లను ఎత్తాలకున్నప్పుడు కంట్రోల్ రూమ్ వద్దకు వెళ్లి పవర్ ప్యాక్ స్విచ్ ఆన్ చేస్తారు. గేటుకు అడుగున హారిజాంటల్ గడ్డర్‌కు ఇరు వైపులా బిగించిన హైడ్రాలిక్ బ్రాకెట్‌కు అమర్చిన హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్ సహకారంతో గేటుపైకి లేస్తుంది. నిమిషానికి అర మీటర్ చొప్పున గేటు పైకి లేస్తుంది. దించాల నుకున్నప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తారు. పిల్లర్ 45 మీటర్ల స్థాయిలో కార్దానిక్ అరైంజ్మెంట్కు అమర్చిన హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్ల సహాయంతో గేటు కిందకు దిగుతుంది. ► జర్మనీ నుంచి ఇప్పటికే 70 సిలిండర్లు పోలవరానికి చేరుకున్నాయి. మిగిలిన 26 సిలిండర్లు మార్చి 15లోగా పోలవరానికి చేరుకుంటాయి. ఒకవైపు ఇప్పటికే అమర్చిన 29 గేట్లకు సిలిండర్లను బిగిస్తూ మరోవైపు మిగిలిన 19 గేట్లను బిగిస్తూ వాటికి సిలిండర్లను అమరుస్తారు. ఈ ప్రక్రియను ఏప్రిల్‌లోగా పూర్తి చేస్తామని అధికార వర్గాలు వెల్లడించాయి. -
ఏప్రిల్‌కు పోలవరం స్పిల్ వే రెడీ
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వేను వచ్చే ఏప్రిల్ నాటికి పూర్తిచేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్పిల్ చానల్లో నిల్వ ఉన్న నీటిని తొలగిస్తేగానీ అక్కడ కాంక్రీట్ పనులు సాధ్యం కాదు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్పిల్ వే, స్పిల్ చానల్లో నిల్వ ఉన్న వరద నీటిని తోడేసే (డీవాటరింగ్) పనులను అధికారులు వేగవంతం చేశారు. 83.5 హార్స్ పవర్ సామర్థ్యం కలిగిన 22 పంపులతో స్పిల్ చానల్లో 15.795 మీటర్ల ఎత్తున నిల్వ ఉన్న నీటిని ఎత్తి గోదావరిలోకి పోస్తున్నారు. సోమవారం నుంచి మరిన్ని పంపులను అమర్చనున్నారు. స్పిల్ చానల్లో 18.75 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ బ్లాక్‌ల పనులకుగానూ 15.6 మీటర్ల పనులను ఇప్పటికే పూర్తి చేశారు. మిగిలిన పనులను ఏప్రిల్ నాటికి పూర్తి చేయడానికి చర్యలు చేపట్టారు. స్పిల్ చానల్లో మిగిలిపోయిన 75.02 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మట్టిని తొలగించే పనులను వేగవంతం చేశారు. స్పిల్ చానల్‌తో పాటు స్పిల్‌వేను పూర్తి చేయనున్నారు. స్పిల్ వేలో 48 పియర్స్ (కాంక్రీట్ స్తంభాలు) 52 మీటర్ల స్థాయికి పూర్తయ్యాయి. వాటి మధ్య 20 మీటర్ల ఎత్తు, 18 మీటర్ల వెడల్పుతో 48 గేట్లు బిగించాలి. ఇప్పటికే గేట్లు సిద్ధంగా ఉన్నాయి. వాటిని బిగించే పనులను నెలాఖరు నుంచి ప్రారంభిస్తారు. స్పిల్‌వే పియర్స్ మధ్య గేట్లను అమర్చడానికి 98 హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్లు అవసరం. వాటిలో ఇప్పటికే 46 సిలిండర్లను జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నారు. మిగతా వాటిని డిసెంబర్‌లోగా దిగుమతి చేసుకోనున్నారు. నేడు కాఫర్ డ్యామ్‌ల పరిశీలనకు సీఎస్ఎంఆర్ఎస్ బృందం: ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్) నిపుణుల బృందం ఆదివారం పరిశీలించనుంది. గోదావరి వరదల ఉధృతి ప్రభావం కాఫర్ డ్యామ్‌లపై ఎలా ఉందనే విషయాన్ని అధ్యయనం చేసి.. వాటిని పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆ బృందం దిశానిర్దేశం చేస్తుంది. ఈ నేపథ్యంలో కాఫర్ డ్యామ్‌ల్లో మిగిలిన పనులను పూర్తి చేయడానికి వీలుగా గోదావరి ఎడమ గట్టు నుంచి అప్రోచ్ రోడ్లను వేస్తున్నారు. సీఎస్ఎంఆర్ఎస్ నిపుణులు సూచనల మేరకు తొలుత కాఫర్ డ్యామ్‌లలో ఎడమ వైపు ఖాళీ ప్రదేశాలను భర్తీ చేస్తారు.. ఆ తర్వాత కుడి వైపు ఖాళీ ప్రదేశాలను భర్తీ చేసి.. పోలవరం స్పిల్ వే రివర్స్ స్లూయిజ్ గేట్ల ద్వారా గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేస్తారు. గోదావరికి జూన్‌లో వచ్చే వరదను స్పిల్ వే మీదుగానే నదిలోకి మళ్లించనున్నారు. నదీ ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించడానికి అప్రోచ్ చానల్ తవ్వకం పనులో్ల మిగిలిన వాటిని ఏప్రిల్ నాటికి పూర్తి చేయనున్నారు. మే నుంచి ఈసీఆర్ఎఫ్ పనులు పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైన ఆనకట్ట (ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్-ఈసీఆర్ఎఫ్)ను మూడు భాగాలుగా నిర్మిస్తారు. ఇందులో గ్యాప్-1, గ్యాప్-3ల మధ్య ఈసీఆర్ఎఫ్ పనులను ప్రారంభించడానికి కసరత్తు చేస్తున్నారు. గ్యాప్-2లో ప్రధానమైన ఈసీఆర్ఎఫ్ పనులను వచ్చే మేలో ప్రారంభించి.. నిరాటంకంగా చేయడం ద్వారా డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నారు. ఆలోగా కుడి, ఎడమ కాలువలను జలాశయంతో అనుసంధానం చేసే పనులను పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. -
స్పిల్‌వే పనులు పరిశీలించిన సీఎం
మధ్యాహ్నం 12 గంటలకు రాక పనుల ప్రగతిని వివరించిన ఈఎన్సీ అధికారులతో సమీక్షించిన చంద్రబాబు పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పరిశీలించారు. మధ్యాహ్నం 12 గంటలకు హెలీకాప్టర్‌లో ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకున్నారు. జలవనరుల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ తోట సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు స్వాగతం పలికారు. వ్యూపాయింట్ నుంచి పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు పనుల వివరాలను సీఎంకు తెలియజేశారు. అక్కడ నుంచి స్పిల్‌వే నిర్మాణ ప్రాంతానికి చేరుకుని పనులు పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన మ్యాప్ ద్వారా ఈఎన్సీ స్పిల్‌వే వివరాలను తెలియజేశారు. అలాగే గేట్లు తయారీ కేంద్రానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ట్రాన్స్ట్రాయ్ కార్యాలయంలో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో పాటు ఏజెన్సీ ప్రతినిధులతో పనులపై రివ్యూ జరిపారు. అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు కె.భాస్కర్, కార్తీకేయ మిశ్రా, డీఐజీ పీవీఎస్ రామకృష్ణ, కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, ఎస్ఈ వీఎస్ రమేష్‌బాబులు పాల్గొన్నారు. -
19న కాంక్రీట్ పనులు ప్రారంభం
పోలవరం రూరల్ : పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నిర్మాణ ప్రాంతంలో ఫౌండేష¯ŒSకు సంబంధించి కాంక్రీట్ పనులను ఈ నెల 19న ప్రారంభించనున్నట్లు జలవనరుల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులను ఆయన గురువారం పరిశీలించారు. స్పిల్‌వే, స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, డ్యామ్ నిర్మాణ ప్రాంతాలను పరిశీలించి పనుల తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కాంక్రీట్ పనులు ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు ఉమాభారతి, వెంకయ్యనాయుడును ఆహ్వానించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ప్రాజెక్టు నిర్మాణం పనులకు రూ.2,200 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. కాంక్రీట్ నిర్మాణం పనులకు 18వేల మెట్రిక్ టన్నుల ఇనుము, 10 లక్షల టన్నుల సిమెంట్ సిద్ధం చేస్తున్నామన్నారు. డ్యామ్ నిర్మాణ ప్రాంతంలోనే గేట్లు తయారు చేస్తారన్నారు. రోజూ 2లక్షల 10వేల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు జరుగుతున్నాయన్నారు. జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో 14,828 వేల ఎకరాల భూమి సేకరించామని, పాత భూసేకరణ చట్టం ప్రకారం రూ.520 కోట్లు ఖర్చు అయ్యిందని పేర్కొన్నారు. ఇంకా కుక్కునూరు, వేలేరు పాడు ప్రాంతాల్లో 12వేల ఎకరాలు భూమి సేకరించాల్సి ఉందన్నారు. నెలలో భూసేకరణ పనులు పూర్తిచేస్తామన్నారు. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు ఎకరానికి రూ. 10.50 లక్షలు నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. పనుల పరిశీలన అనంతరం ట్రా¯Œ్సట్రాయ్ ఏజెన్సీ కార్యాలయంలో ఇరిగేష¯ŒS అధికారులు , ఏజెన్సీ ప్రతినిధులతో పనులు జరుగుతున్న తీరుపై ఉమామహేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. పనులు మరింత వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు, ప్రాజెక్టు సీఈ ఎస్.హరిబాబు, ఏఎంసీ చైర్మ¯ŒS పారేపల్లి రామారావు, ఎంపీపీ పైల అరుణకుమారి, జెడ్పీటీసీ కుంజం సుభాషిణి, ఆర్డీవో ఎస్.లవన్న, డీఎస్పీ కేటీవీ రవికుమార్, డిప్యూటీ ఎస్ఈ కె.వెంకటేశ్వరరాజు, ఈఈ పి.మునిరెడ్డి పాల్గొన్నారు.