Sports development
-
ఫ్యూచర్ సిటీలో స్పోర్ట్స్ యూనివర్సిటీ: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ (నాలుగో నగరం)లో ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ పేరిట సమీకృత క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో క్రీడల వాతావరణం పెంపొందించేందుకు ఈ యూనివర్సిటీ దోహద పడుతుంది. ఇందులో భాగంగా సుమారు డజనుకు పైగా క్రీడలకు సంబంధించిన ఆధునిక మౌలిక వసతులతో పాటు స్పోర్ట్స్ అకాడమీలను నెలకొల్పు తారు. క్రీడా విజ్ఞాన శాస్త్రం, క్రీడల వైద్యానికి సంబంధించిన కేంద్రాలు కూడా ఇందులో ఉంటాయి. ఈ యూనివర్సిటీని వెంటనే ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రస్తుతం హకీంపేటలో ఉన్న స్పోర్ట్స్ స్కూల్, గచ్చిబౌలిలోని క్రీడా ప్రాంగణాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇటీవల దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సియోల్‌లోని కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించిన విషయం తెలిసిందే. ప్రపంచ క్రీడా రంగంలో ఇది అగ్రస్థానంలో ఉంది. 1976లో ఏర్పాటైన ఈ వర్సిటీలో అథ్లెటిక్స్‌కు సంబంధించిన అనేక కోర్సులు అందిస్తున్నారు. ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో దక్షిణ కొరియా సాధించిన 32 పతకాల్లో 16 పతకాలు కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో శిక్షణ పొందిన అథ్లెట్లు సాధించినవే కావడం గమనార్హం. కాగా యూనివర్సిటీ సందర్శన సందర్భంగా పారిస్ ఒలింపిక్స్‌లో విలువిద్య పోటీల్లో మూడు బంగారు పతకాలు సాధించిన లిమ్ సి హైయోన్తోనూ సీఎం భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలను సాంకేతిక భాగస్వాములుగా చేర్చుకుని భవిష్యత్తు ఒలింపిక్స్ విజేతలకు శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలపై సీఎం సమీక్షకొత్త హైకోర్టు నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు మీదుగా ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గం ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫ్యూచర్ సిటీలో రేడియల్ రహదారులు అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలు ఉండాలని స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సీఎంవో అదనపు కార్యదర్శి అజిత్‌రెడ్డి, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, రంగారెడ్డి కలెక్టర్ శశాంక్‌లతో శనివారం తన నివాసంలో సీఎం సమీక్షించారు. రోడ్డు, మెట్రో మార్గాలకు సంబంధించి భూసేకరణ, ఇతర అంశాలపై అధికారులు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. వీలైనంత త్వరగా పూర్తి స్థాయి ప్రణాళిక, రూట్ మ్యాప్ సిద్ధం చేయాల, యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
భారత జట్టులోనూ ‘వై నాట్ ఏపీ’.. సీఎం జగన్ విజన్!
‘‘పిల్లలకు మనం ఇచ్చే నిజమైన ఆస్తి చదువే’’... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తరచూ చెప్పే మాట. ఓట్లు వేసిన ‘పెద్దోళ్ల’కు ఇచ్చిన హామీలే నెరవేర్చని నాయకులు ఉన్న ఈరోజుల్లో.. ఓటు హక్కులేని పిల్లల గురించే ఎక్కువగా ఆలోచించడం ఆయనకే చెల్లింది. నేటి బాలలే.. రేపటి పౌరులు కదా.. అందుకే చిన్ననాటి నుంచే వారిని మెరికల్లా తీర్చిదిద్దడంతో పాటు.. అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించేలా ఇప్పటికే విద్యా వ్యవస్థలో ఆంగ్ల మాధ్యమం వంటి పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. బాలల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నారు. అంతేకాదు.. నాడు- నేడు పేరిట పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారు. అదే విధంగా చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి ఉన్న యువత ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించాలనే సంకల్పంతో ఉన్నారు సీఎం జగన్. అందుకు అనుగుణంగా ‘‘ఆడుదాం ఆంధ్రా’’ పేరిట సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కీలకమైన ప్రతీ క్రీడాంశంలో భాగమైన భారత జట్టులో ‘వై నాట్ ఏపీ’ అనే స్థాయికి ఎదగాలంటే క్షేత్రస్థాయి నుంచే బలమైన పునాదులు పడాలన్న తలంపుతో ముందుకు సాగుతున్నారు. అంబటి రాయుడు, పీవీ సింధు, జ్యోతి సురేఖ, హనుమ విహారి, జ్యోతి యర్రాజీ, కోన శ్రీకర్ భరత్, సాత్విక్ సాయిరాజ్‌లా తాము తమకిష్టమైన స్పోర్ట్‌లో రాణించాలనుకునే వాళ్ల కోసమే ఈ క్రీడా సంబరాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా.. క్రికెట్, ఖో ఖో, బ్యాడ్మింటన్, కబడ్డీ, వాలీబాల్ వంటి ఐదు క్రీడాంశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోటీలు నిర్వహించనుంది. కనీవినీ ఎరుగని రీతిలో క్రీడా సంబరానికి నాంది ఇందుకోసం ఇప్పటికే ముప్పై లక్షలకు పైగా మంది ఔత్సాహికులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం విశేషం. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నడిచే మెగా ఈవెంట్లో మండల, మున్సిపల్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించనున్నారు. ఇందుకోసం.. క్రీడాకారులకు రూ. 41.43 కోట్ల విలువైన ఐదు లక్షల స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది కూడా! క్రీడల్లో రాణిస్తున్న వాళ్లకు పెద్దపీట వివిధ రంగాల్లో రాణిస్తున్న ప్రముఖులతో పాటు అంతర్జాతీయ స్థాయిలో దేశానికి, రాష్ట్రానికి గుర్తింపు తీసుకువస్తున్న క్రీడాకారులను ప్రోత్సహించడంలో సీఎం జగన్ ముందు వరుసలో ఉంటారు. ఆర్చరీలో ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ పతకాలు సాధించిన విజయవాడ అమ్మాయి వెన్నం జ్యోతికి సురేఖకు డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది జగన్ ప్రభుత్వం. గత సర్కారు పాలనలో జ్యోతి సురేఖ ప్రతిభకు తగిన గుర్తింపు దక్కలేదన్న విషయాన్ని గుర్తించి.. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చింది. అదే విధంగా రెండుసార్లు ఒలింపిక్ పతకం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును సముచిత రీతిలో గౌరవించింది. అదే విధంగా.. వర్ధమాన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అన్ని విధాలా అండగా ఉంటోంది. -
ఒడిషాలో 89 స్టేడియాలు!
భువనేశ్వర్: భారత పురుషుల, మహిళల హాకీ జట్లకు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తూ క్రీడల పట్ల తమ ప్రాధాన్యతను చూపించిన ఒడిషా ప్రభుత్వం ఇప్పుడు తమ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టింది. ఒడిషాలో మొత్తం రూ. 693.35 కోట్ల వ్యయంతో 89 మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియాలను నిరి్మంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ‘స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్’ కింద 18 నెలల వ్యవధిలోనే ఈ నిర్మాణాలు పూర్తవుతాయి. ప్రకృతి వైపరీత్యాలు, మహమ్మారివంటివి ఎదురైనప్పుడు వసతి కేంద్రాలుగా, ఆస్పత్రులుగా కూడా ఉపయోగించుకునే విధంగా ఈ స్టేడియాలను నిరి్మస్తున్నారు. 2023లో భారత్‌లో హాకీ ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో రూర్కెలాలో ‘బిర్సా ముండా’ పేరుతో అధునాతన హాకీ స్టేడియాన్ని రూ. 120 కోట్ల వ్యయం తో ఒడిషా ప్రభుత్వం ఇప్పటికే నిర్మిస్తోంది. -
క్రీడాకారులకు సీఎం వైఎస్ జగన్ వరాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు వరాలు ప్రకటించారు. స్పందన కార్యక్రమాన్ని సీఎం మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఆ సందర్భంగా సీఎం మాట్లాడుతూ దిగువ స్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలను ఇవ్వాల్సిందిగా సీఎం ఆదేశించారు. జూనియర్లను ప్రోత్సహిస్తే వాళ్లంతా సింధులా మారతారని అన్నారు. ఈనెల 29న జాతీయ క్రీడా దినోత్సవం రోజున ఈ కార్యక్రమం చేపట్టాలని, ఈ నెల 29 నుంచి వారం రోజుల పాటు కార్యక్రమం కొనసాగించాలని, ఏటా ఈ కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రోత్సాహకాలు ఇలా.. - జాతీయ స్థాయిలో స్వర్ణ పతకం వచ్చిన వారికి రూ. 5 లక్షలు - రజత పతకం వచ్చిన వారికి రూ. 4 లక్షలు - కాంస్యం వచ్చిన వారికి రూ. 3 లక్షలు చొప్పున నగదు ప్రోత్సాహకాలను ఇవ్వాలి - జూనియర్, సబ్ జూనియర్ స్థాయి క్రీడాకారులనూ గుర్తించాలి - ఈ కేటగిరీలో జాతీయ స్థాయిలో స్వర్ణ పతకం సాధించిన వారికి రూ.1.25 లక్షలు - రజత పతకం వచ్చిన వారికి రూ.75 వేలు - కాంస్య పతకం సాధించిన వారికి రూ.50 వేలు చొప్పున నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలి (చదవండి : క్రీడాకారులకు సీఎం జగన్ వరాలు) -
క్రీడాకారులకు సీఎం జగన్ వరాలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్రీడాకారులపై వరాలు కురిపించారు. పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులకు నగదు ప్రోత్సాకాలు అందించాలని నిర్ణయించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ‘క్రీడల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. దిగువ స్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించాలి. మన రాష్ట్ర క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. 2014 రాష్ట్ర విభజన తర్వాత.. జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన మన రాష్ట్ర క్రీడాకారులకు నగదు పోత్సాహకాలు ఇద్దాం. బంగారు పతకం సాధించిన వారికి రూ.5 లక్షలు, వెండి పతకం సాధించిన వారికి రూ.4 లక్షలు, కాంస్యం గెలుచుకున్న వారికి రూ.3 లక్షలు అందిద్దాం. జూనియర్, సబ్ జూనియర్ స్థాయి క్రీడాకారులనూ గుర్తించాలి. ఈ కేటగిరీలో జాతీయ స్థాయిలో బంగారు పతకం వచ్చిన వారికి రూ.1.25 లక్షలు, వెండిపతకం సాధిస్తే రూ.75 వేలు, కాంస్య పతకం సాధించిన వారికి రూ.50 వేలు ఇచ్చి ప్రోత్సహిద్దాం. తగిన ప్రోత్సాహం ఇస్తేనే వీళ్లంతా పీవీ సింధూలుగా మారతారు. ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చేద్దాం. 29 నుంచి వారం రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగాలి’ అన్నారు. (చదవండి: క్రీడారంగానికి కొత్త శోభను తీసుకొస్తాం) -
గురి తప్పిన గాండీవం
కనిగిరి(ప్రకాశం): క్రీడాభివృద్ధి కోసం అంటూ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ప్రాజెక్టు గాండీవం లక్ష్యాన్ని గురిపెట్టడం లేదు. ఎంతో ప్రచార ఆర్భాటంగా చేపడుతున్న ఈ పథకం లక్ష్యం మంచిదే అయినా క్షేత్ర స్థాయిలో కనీస వసతుల సమకూర్చలేదు. దీంతో విద్యార్థుల్లో క్రీడాభివృద్ధి మాటల గారడిగానే మారనుందనే విమర్శలున్నాయి. జిల్లాలోని 56 మండలాల్లో మొత్తం 2,985 పాఠశాలలుండగా, అందులో 2,411 ప్రాథమిక, 179 ప్రాథమికోన్నత, 395 ఉన్నత పాఠశాలలున్నాయి. వాటికి సంబంధించి గతేడాది లెక్కల ప్రకారం 4,78,050 లక్షల మంది విద్యార్థులున్నారు. జిల్లాలో 150 మంది పీడీలు, 250 మంది పీఈటీలున్నారు. నియోజక వర్గంలోని ఆరు మండలాల్లో 464 ప్రభుత్వ పాఠశాలుండగా అందులో సుమారు 29,226 మంది విద్యార్థులున్నట్లు అంచనా. కనిగిరి మండలంలో సుమారు 10 వేల మంది విద్యార్థులున్నారు. జూలై 1 నుంచి 12 వరకు పాఠశాల స్థాయిలో.. 13 నుంచి నెలాఖరు వరకు మండల స్థాయిలో పోటీలు నిర్వహించారు. వీరిలో ప్రతి పాఠశాలలో 6–10 తరగతి తరగతి విద్యార్ధులను 20 మందిని ఎంపిక చేసి మండలానికి 250 మందిని క్రీడా ప్రతిభ కలిగిన వారిని జిల్లా స్థాయికి పంపారు. జిల్లా మొత్తంలో సుమారు 12 వేల మంది ఉన్నారు. వీరిలో కొందరిని జల్లెడపట్టి ప్రతిభ కలిగిన వారిని వెయ్యిమందిని గాండీవం క్రీడలకు వెలికితీసి క్రీడా శిక్షణ ఇస్తారు. మిగతా వారిని పాంచజన్యకు (రెండో విడతకు) ఎంపిక చేసే అవకాశం ఉందని తెలిసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో సుమారు 100 శిక్షణ కేంద్రాలను ఎంపిక చేయగా, జిల్లాలో 6 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో కనిగిరి మండలం కంచర్లవారిపల్లి, ఇంకొల్లు, కరేడు, యద్దనపూడి, కొత్తపట్నం, ఉలవపాడులలో శిక్షణా కేంద్రాలు నిర్వహించనున్నారు. వాస్తవికత ఇదీ.. క్రీడాకారుల ఎంపికలో క్షేత్ర స్థాయిలో 9 విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఎత్తు, బరువు, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబులిటీ, షటిల్ రన్, స్పీడ్‌రన్, స్టాండింగ్ జంప్, మెడిసిన్‌బాల్, 200 మీటర్స్ రన్ వీటిలో జిల్లాలోని 56 మండలాల్లో ఐదు, ఆరు మండలాల్లో తప్పా ఎక్కడా 200 మీటర్ల పరుగుపందెం నిబంధన ప్రకారం జరగలేదు. ఎందుకంటే ఎక్కడా రన్ ట్రాక్ లేదు. అంతేగాక టెన్వీక్స్ సంస్థ నిర్దేశించిన సమయంలో 200 మీటర్ల పరుగును 10 ఏళ్ల విద్యార్థి 30 సెకండ్లల్లో, 16 ఏళ్ల విద్యార్థి 25 సెకండ్లలో పరుగు పెట్టడం అసాధ్యం. దీన్ని బట్టి చూస్తే లక్ష్యం అనుకున్న స్థాయిలో నెరవేరే అవకాశం లేదు. క్రీడా మైదానాలకు గ్రహణం.. జిల్లాలో క్రీడా మైదానాల అభివృద్ధికి గ్రహణం ఏర్పడింది..ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ కింద జెడ్పీ ఉన్నత పాఠశాలల గ్రౌండ్ల అభివృద్ధికి గతేడాది పనులు చేపట్టింది. (ఎన్ఆర్ఈజీఎస్, ఉపాధి కూలీలు) లేబర్ వర్క్ తో సగం, మెటీరియల్ కాంపోనెంట్‌తో సగం ఫిప్టి, ఫిఫ్టిగా ఒక్కో పాఠశాల ప్లే గ్రౌండ్ అభివృద్ధికి రూ.5 లక్షల అంచనా విలువతో మంజూరు చేశారు. అందులో రన్నింగ్ ట్రాక్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ కోర్ట్లు తయారు చేయాల్సి ఉంది. అంచనా విలువలు తగ్గించడం.. రాజకీయ జోక్యాలు.. ఇలా కారణాలు ఏమైనా జిల్లాలో 15 శాతం క్రీడా మైదానాలు కూడా అభివృద్ధికి నోచుకోలేదు. దీంతో జిల్లాలో వేలాది మంది క్రీడా విద్యార్థులు ఆట స్థలాలకు దూరంగా ఉన్నారు. గతేడాది లెక్కల ప్రకారం జిల్లాలోని జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో 82,321 మంది విద్యార్థులు చదువుతున్నారు. వేలాది మంది విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తితో చదువుతో పాటు క్రీడల్లో పాల్గొంటున్నారు. జిల్లాలోని 56 మండలాల్లోని 290 జెడ్పీ, ఉన్నత పాఠశాలల్లో ప్లే గ్రౌండ్ అభివృద్ధికి ప్రతిపాదనలు పంపగా మొదటి విడతగా..232 స్కూల్స్‌ను అనుమతి ఇచ్చారు. వాటిలో 20 శాతం కూడా ప్లే గ్రౌండ్లు పూర్తికాలేదు. కొన్ని చోట్ల ఆరంభానికే నోచుకోలేదు. కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో కనిగిరిలో 6, హెచ్‌ఎంపాడులో 5, పామూరులో 5, సీఎస్‌పురంలో 5, వెలిగండ్లలో 6, పీసీపల్లిలో 5 జెడ్పీ ఉన్నత పాఠశాలలకు ప్లే గ్రౌండ్లు మంజూరు కాగా వాటిలో 10 శాతం మాత్రమే పనులు ప్రారంభమై ఆరంభం శూరత్వంగా నిలిచాయి. హెచ్‌ఎంపాడు మండలంలో మొహమ్మదాపురం పాఠశాలలో కొన్ని పనులు జరిగాయి. కారణాలు ఏమైనా కనిగిరి మండలంలో పాతపాడు, ఏరువారిపల్లి, గురువాజీపేట, దిరిశవంచలో అసలు మొదలు కాలేదు. తాళ్లూరు, కంచర్లవారిపల్లిలో గ్రౌండ్‌ను తవ్వి వదిలేశారు. దీంతో ఆయా పాఠశాలల్లో విద్యార్ధులు ఆటకు అనేక అవస్థలు పడుతున్నారు. చిన్నపాటి వర్షం పడినా ఆయా పాఠశాలల్లో కనీస నడిచే పరిస్థితి లేదు. -
క్రీడాభివృద్ధికి ప్రభుత్వ సహకారం పెంచాలి
ఘనంగా ఎస్జీఎఫ్ఐ క్రీడలు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట : దేశ కీర్తిని పెంపొందించడంలో క్రీడలు ముఖ్య భూమిక పోషిస్తున్నందువల్ల క్రీడలకు ప్రభుత్వాల సహకారం పెంచాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. పట్టణంలోని బాలుర హైస్కూల్లో మంగళవారం 62వ ఎస్జీఎఫ్ఐ క్రీడలను ఎమ్మెల్యే మాధవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యున్నత విలువలతో కూడిన విద్యను అందించడంతోపాటు క్రీడాకారులకు మెరుగైన వసతులు ప్రభుత్వ పాఠశాలల్లోనే లభిస్తాయన్నారు. ఆర్డీఓ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ క్రీడల్లో మహిళలు కూడా రాణిస్తున్నందున పాఠశాలల స్థాయి నుంచే బాలికలు క్రీడా విభాగంలో శిక్షణ పొందాలన్నారు. డిప్యూటీ డీఈఓ రవీందర్ మాట్లాడుతూ క్రీడాభివృద్ధికి పాఠశాలల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే క్రీడాకారులను పరిచయం చేసుకొని వారితో కలసి కబడ్డీ ఆడారు. డిప్యూటీ డీఈఓ, ఎమ్మెల్యే ఇరుజట్లకు కెప్టెన్లుగా వ్యవహరించి అలరింపజేసారు. కార్యక్రమంలో ఖానాపురం ఎంపీపీ తక్కళ్లపల్లి రవీందర్రావు, కౌన్సిలర్ పాలాయి శ్రీనివాస్, పుల్లూరి స్వామి, ఎంఈఓ సారయ్య, గుడిపూడి రాంచందర్‌రావు, పుల్లూరి శ్రీనివాస్, ఎర్ర జగన్మోహన్రెడ్డి, వంగేటి అశోక్, పీఈటీలు బిక్షపతి, తదితరులు పాల్గొన్నారు. -
క్రీడాభివృద్ధిపై ప్రభుత్వం మొద్దు నిద్ర
ఒంగోలు: క్రీడలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని, ఇలా అయితే 2019లో జాతీయ క్రీడలు లేనట్లే అని జాతీయ ఒలింపిక్ అసోసియేషన్ సీనియర్ ఉపాధ్యక్షుడు కరణం పున్నయ్య చౌదరి అన్నారు. తన సహచర మిత్రుడు, సీనియర్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన అంకమ్మ చౌదరి ఇటీవల పక్షవాతానికి గురి కావడంతో ఆయనను పరామర్శించేందుకు ఆయన ఒంగోలు వచ్చారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ జాతీయ క్రీడల నిర్వహణకు సంబంధించి రూ.4.54 కోట్ల ను రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ ద్వారా డిపాజిట్ చేయాల్సి ఉందని, కానీ ప్రభుత్వం ఇప్పటికీ రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్‌ను గుర్తించకపోవడం బాధాకరం అన్నారు. జూన్ 8వ తేదీలోగా ఆ మొత్తాన్ని జమచేయకపోతే ఉత్తరాఖండ్ ఈ అవకాశాన్ని చేజిక్కించుకునేందుకు సిద్ధమవుతుందన్నారు. జూన్ 9వ తేదీ చెన్నైలోని తాజ్హోటల్లో ఒలింపిక్ అసోసియేషన్ జాతీయ సర్వసభ్య సమావేశం జరగనుందని, ఆ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం వెలువడనుందన్నారు. రాష్ట్రంలో క్రీడా ప్రాంగణాలు, క్రీడా శిక్షకుల కొరత వేధిస్తున్నాయని, దీనిపై మాట్లాడేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రిని అపాయింట్మెంట్ కోసం మూడుసార్లు యత్నించినా అవకాశం దక్కలేదన్నారు. ఇంత వరకు జాతీయ క్రీడల్లో పాల్గొనే క్రీడా జట్ల ఎంపిక లేదని, వాటికి శిక్షణ ఇచ్చేం దు కు అవసరమైన కోచ్‌ల నియామకం కూడా పూర్తి కాలేదన్నారు. ముందుగా జాతీయ క్రీడల కమిటీ ఏర్పడాల్సి ఉన్నా ఇంతవరకు అతీగతీ లేదని, ఈ నేపథ్యంలో మంత్రులు జారీ చేస్తున్న ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శించారు. క్రీడా పాలసీ అంటూ సలహాలు, సూచనలు తీసుకున్న ప్రభుత్వం ఆ పాలసీని ఏం చేసిందో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. క్రీడాబోర్డును ఏర్పాటు చేశారని, కానీ పదిసార్లు బోర్డు సమావేశమై ప్రతిపాదనలు చేసినా వాటిని ఆమోదించేందుకు ప్రభుత్వం ముందుకురాని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయన్నారు. రాష్ట్ర జట్లకు శిక్షణ, ఇతర మౌలిక సౌకర్యాల కల్పన చేపట్టేందుకు కనీసంగా మరో రూ.500 కోట్లు తక్షణం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన అవసరం ఉందని లేకుంటే తాము సిద్ధం అంటూ ఇప్పటికే ఉత్తరాఖండ్ సంసిద్ధంగా ఉందని, సైట్ కూడా ఓపెన్‌చేసి దాని వివరాలను పూర్తిస్థాయిలో అందరికీ అందుబాటులో ఉంచిందన్నారు. ఇటువంటి పరిస్థితిలో మంత్రులు మాత్రం ఒకరు జాతీయ క్రీడలంటే మరొకరు ఒలింపిక్ క్రీడల నిర్వహణకు సన్నద్ధమవుతున్నామం టూ హాస్యాస్పద ప్రకటనలు చేస్తుండడం బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. స్టేడియం లేని ప్రాంతం ఒంగోలు ఒక్కటే జిల్లా కేంద్రంలో స్టేడియంలేని ఏకైక ప్రాంతం ఒంగోలు ఒక్కటే అని పున్నయ్య చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా జాతీయ క్రీడల ఖిల్లా అన్నారు. 22 మంది అంతర్జాతీయ క్రీడాకారులు ప్రకాశం జిల్లావాసులే అన్నారు. బ్యాడ్మింటన్‌లో ఆరు అవార్డులను సొంతం చేసుకున్న గోపీచంద్ ప్రకాశం జిల్లావాసే అన్నారు. క్రీడా ప్రాంగణాల కోసం అంటూ ఉన్న స్థలాలను వదిలి ఇతరుల స్థలాలను ఉచితంగా ఇవ్వమని జిల్లా యంత్రాంగం వెంపర్లాడడం హాస్యాస్పదమన్నారు. 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఒంగోలు ఊరచెరువులో క్రీడా ప్రాంగణం కోసం శంకుస్థాపన కూడా చేశారని, ప్రస్తుతం అందులో ఆక్రమణలు పోగా మరో 15 ఎకరాల స్థలం ఉందని అందులో స్టేడియం నిర్మాణానికి ఎందుకు వెనుకాడుతున్నారో అర్థం కావడంలేదన్నారు. మంగమ్మ కాలేజీ స్థలం ఎంతో విలువైనదని, ఆ స్థలాన్ని ఉచితంగా ఇచ్చేందుకు ఆ కమిటీ సిద్ధంగా లేదన్నారు. అందులో ఏదైనా మంచి విద్యాసంస్థలను ఏర్పాటుచేయాలని ఆ కమిటీ భావిస్తుందన్నారు. ఒంగోలు నూతన జాతీయ రహదారి పక్కన కూడా విలువైన ప్రభుత్వ భూమి ఉందని, ఆ స్థలాన్ని తీసుకున్నా మంచి స్టేడియం నిర్మించుకోవ చ్చన్నారు. ఇక ఒంగోలులో మధ్యలో నిలిచిన స్టేడియంకు పర్వతరెడ్డి ఆనంద్ కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారని, ఆ నిధులు ఏమయ్యాయో బహిర్గతం చేయాలన్నారు. 2002లో ఇంకొల్లులో గోపీచంద్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం కోటి రూపాయలు ప్రకటించిందని, కానీ ఆ కోటి కూడా ఏమయ్యాయో లెక్కలు తేలడంలేదని, వెంటనే వాటిని దేని కోసం ఎంత వినియోగించారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. -
క్రీడల అభివృద్ధికి కృషి
♦ మహేశ్వరంలో మినీ స్టేడియం నిర్మిస్తాం ♦ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ♦ మహేశ్వరంలో రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ ఖోఖో పోటీలు ప్రారంభం మహేశ్వరం: క్రీడల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. క్రీడల్లో ప్రావీణ్యమున్న గ్రామీణ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. శుక్రవారం మహేశ్వరంలో జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో 27వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ ఖోఖో పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడలు శారీరక దారుఢ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు ప్రభుత్వం ఉద్యోగాలిస్తుందన్నారు. మహేశ్వరం మండలంలో కబడ్డీ, క్రికెట్, ఖోఖోలో జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడాకారులు ఉన్నారని తెలిపారు. మహేశ్వరంలో మినీస్డేడియం నిర్మిస్తామని చెప్పారు. ప్రావీణ్యం ఉన్న క్రీడల్లో క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి ఉన్నత స్థానానికి వెళ్లేలా సహకరిస్తామని మంత్రి మహేం దర్‌రెడ్డి చెప్పారు. ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ మహేశ్వరంలో మినీ స్టేడియం నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. అంతకుముందు గడికోటలో జ్యోతి వెలిగించి రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాసరావు, జిల్లా సెక్రటరీ రామకృష్ణ, టీఆర్ఎస్ నియోజకవర్గ మాజీ ఇన్చార్జి కొత్త మనోహర్‌రెడ్డి, తహసీల్దార్ షర్మిల, జెడ్పీటీసీ సభ్యుడు ఈశ్వర్ నాయక్, వైస్ ఎంపీపీ మునగపాటి స్వప్న, మహేశ్వరం సర్పం చ్ ఆనందం, ఉప సర్పంచ్ రాములు, టీఆర్ఎస్ నాయకులు కూన యాదయ్య, బోద జైపాల్‌రెడ్డి, తడకల యాదయ్య, అశోక్, పీఈటీలు రాాజ్కుమార్, మహేందర్, తదితరులు పాల్గొన్నారు. -
క్రీడల అభివృద్ధికి ప్రత్యేక పాలసీ
బాల్‌బ్యాడ్మింటన్ పోటీల ప్రారంభ సభలో సీఎం చంద్రబాబు విజయవాడ స్పోర్ట్స్ : ఒలింపిక్స్‌లో సత్తాచాటగల క్రీడాకారులను రాష్ట్రం నుంచి తయారు చేసేలా క్రీడల అభివృద్ధికి ప్రత్యేక పాలసీ అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. స్థానిక ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో బుధవారం చుక్కపల్లి పిచ్చయ్య స్మారక 60వ జాతీయ సీనియర్ బాల్‌బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అనువైన వాతావరణం కల్పిస్తామన్నారు. విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లో ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాలు ఉన్న స్టేడియాలు నిర్మిస్తామని ప్రకటించారు. రాష్ట్ర క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం లేని కారణంగా రాణించలేకపోతున్నారని అభిప్రాయం వ్యక్తంచేశారు. కొరియా, జపాన్ వంటి చిన్నచిన్న దేశాలు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఒలింపిక్స్‌లో పతకాలు సాధిస్తున్నాయని వివరించారు. బాల్‌బ్యాడ్మింటన్‌ను అంతర్జాతీయస్థాయికి తీసుకొచ్చిన ఫెడరేషన్ అధ్యక్షుడు సిహెచ్.రాజశేఖర్‌ను సీఎం అభినందించారు. గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జాతీయ క్రీడలు, ఆఫ్రో ఏషియన్ గేమ్స్‌తో పాటు పలు జాతీయస్థాయి పోటీల నిర్వహించామని, హైదరాబాద్ గచ్చిబౌలీలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో స్టేడియం నిర్మించామని గుర్తుచేశారు. 2018లో జాతీయ క్రీడలు ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. బాల్‌బ్యాడ్మింటన్ తమిళనాడులోని తంజావూరుకు చెందిన ప్రాచీన ఆటని పేర్కొన్నారు. ఇది ఎక్కువగా కావేరి, కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిందన్నారు. రాష్ట్రంలో గ్రామీణ క్రీడలైన కబడ్డీ, ఖోఖోతో పాటు బాల్‌బ్యాడ్మింటన్ అంతర్జాతీయస్థాయికి ఎదిగిందన్నారు. చిన్నతనంలో బాల్‌బ్యాడ్మింటన్ ఆడిన రోజులు గుర్తుకొస్తున్నాయని పేర్కొన్నారు. శాసన సభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం కలిగిన క్రీడాకారులు ఎందరో ఉన్నారని, వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభను వెలికి తీస్తామన్నారు. ప్రారంభోత్సవానికి విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్ అధ్యక్షత వహించగా, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ, పార్లమెంటు సభ్యులు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ రావు, ఎమ్మెల్యేలు బొండా ఉమా, గద్దె రామ్మోహన్, బోడె ప్రసాద్, కాగిత వెంకట్రావ్, శ్రీరాం తాతయ్య, తంగిరాల సౌమ్య, డెప్యూటీ మేయర్ గోగుల వెంకటరమణారావు, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ జె.మురళీ, డీఎస్డీవో పి.రామకృష్ణ, బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ అధ్యకక్షుడు సిహెచ్.రాజ శేఖర్, ఏపీ బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి చుక్కపల్లి అమర్‌కుమార్, ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి సింగరాజు మురళీకృష్ణ,జిల్లా ఒలింపిక్స్ సంఘ కార్యదర్శి కె.పి.రావు తదితరులు పాల్గొన్నారు. తొలుత వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు మార్చ్ఫాస్ట్ నిర్వహించారు. వీఎం రంగా మునిసిపల్ స్కూల్, బీఎస్ఆర్కే మునిసిపల్ స్కూల్ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలంరించాయి. అనంతరం జరిగిన పోటీల్లో క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు. బాల్ బ్యాడ్మింటన్ తొలి రోజు ఫలితాలు పురుషుల విభాగంలో ముంబాయి జట్టు 29-9, 29-7 తేడాతో మణీపూర్పై, పశ్చిమబెంగాల్ జట్టు 29-2, 29-3 తేడాతో ఎన్సీఆర్ పై, మహారాష్ట్ర జట్టు 29-13, 29-10 తేడాతో జార్ఖండ్‌పై, పాండిచ్చేరి 29-9, 29-10 తేడాతో పంజాబ్జట్టుపై, ఇస్రో జట్టు 29-19, 29-18 తేడాతో బీహార్ జట్టపై, మేజర్ పోర్టు జట్టు 29-21, 29-18 తేడాతో ఒడిసా జట్టుపై గెలుపొందాయి. మహిళల విభాగంలో : కేరళ జట్టు 29-2, 29-2 తేడాతో మణిపూర్ జట్టుపై, జార్ఖండ్ జట్టు 29-13, 29-7 తేడాతో హర్యానాపై, బీహార్ 29-9, 29-5 తేడాతో పశ్చిమబెంగాల్ పై విజయం సాధించాయి. -
ఓటమే గెలుపునకు నాంది
శ్రీరాంపూర్ : ఓటమే గెలుపునకు నాంది అని రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. శ్రీరాంపూర్ ప్రగతి మైదానంలో మూడు రోజులుగా నిర్వహించిన 41వ రాష్ట్రస్థాయి జూ నియర్ కబడ్డీ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హా జరై ఫైనల్ మ్యాచ్‌లు తిలకించారు. అనంతరం బహుమతుల ప్రదానోత్సవం కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, ఓటమితో ఎప్పుడు కుంగిపోవద్దన్నారు. 2009 ఎన్నికల్లో తాను ఓ డిపోయాయని, అయినా వెనకడుగు వేయకుండా ప్రజల కోసమే పని చేశానని పేర్కొన్నా రు. ఆ ప్రజలే తనను 2014లో గెలిపించారని గుర్తు చేశారు. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జిల్లాలోని పలు ప్రాంతా ల్లో రూ.3 కోట్లతో స్టేడియాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. మన ఊరు-మన ప్రణాళిక లో కూడా క్రీడల కోసం ప్రత్యేక నిధులు కేటాయించామన్నారు. తెలంగాణలోని చాలా పాఠశాలలకు పీఈటీలు, పీడీలు, గ్రౌండ్లు లేవన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యతోపాటు క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. ప్రస్తుతం క్రీడాకారులకు విద్యా, ఉద్యోగాల్లో 2 శాతం రిజర్వేషన్ ఉందని దాన్ని 5 శాతానికి తాము సీఎంను కోరుతామన్నారు. రూ.90 కోట్లతో బడ్జెట్ ఇటీవల బడ్జెట్లో క్రీడలకు ప్రభుత్వం రూ.90 కోట్లు కేటాయించిందని మంచిర్యాల ఎమ్మెల్యే ఎన్ దివాకర్‌రావు తెలిపారు. దాన్ని రెండింత లు చేస్తామన్నారు. అనంతరం బెల్లంపల్లి ఎ మ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ తెలంగాణ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాక్షించారు. విజేతలకు వీరే.. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు చివరి రోజు హోరాహోరీగా సాగాయి. ఫైనల్ పోటీ లను చేసేందు కు స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చారు. బా లుర విభాగంలో నిజామాబాద్ జట్టు ప్రథమ స్థానం సాధించగా, వరంగల్ ద్వితీయ స్థానం లో నిలిచింది. హైదరాబాద్, కరీంనగర్ జట్ల కు ఉమ్మడిగా తృతీయ స్థానం ఇచ్చారు. బాలి కల్లో వరంగల్ జట్టు ప్రథమ స్థానం, నల్గొండ జట్టు ద్వితీయ స్థానం సాధించాయి. ఆదిలాబాద్, నిజామాబాద్ జట్లకు ఉమ్మడిగా తృతీ య స్థానం ఇచ్చారు. ఇదిలా ఉంటే జిల్లా జట్టు కేవలం మహిళ విభాగంలో తృతీయ స్థానంలో సరిపెట్టుకోవడం స్థానిక క్రీడాకారులను, నిర్వాహకులను నిరాశ పరిచించింది. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులతో ప్రాబబుల్స్ జట్టును ఎంపిక చేసి నేషనల్స్ ఆడిస్తామని ని ర్వాహకులు తెలిపారు. వీరికి 15 రోజులపా టు హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చి వచ్చే నెల చివరి వారంలో ఢిల్లీ జరిగే జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. పోటీల నిర్వాహణకు మైదానంతోపాటు ఇతర వనరు లు సమకూర్చిన సిం గరేణి కి వారు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అతిథులను, క్రీడాకారులను సన్మానించారు. కార్యక్రమంలో కబడ్డీ అసోసియేష న్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అజీజ్‌ఖాన్, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజీరెడ్డి, జెడ్పీటీసీ ఆర్.ఆశలత, టీఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, ఒలింపిక్స్ అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.నారాయణరెడ్డి, కార్యదర్శి పి.రఘునాథరెడ్డి, దివాకర్‌రావు తనయుడు విజిత్‌రావు, రెస్క్యూ జీఎం సూర్యదాస్, డీజీఎం(పర్సనల్) శర్మ, కబడ్డీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఈ.రాంచందర్, సహాయ కార్యదర్శి, సర్పంచ్ ఎం .రాజేంద్రపాణి, టీబీజీకేఎస్ కేంద్ర ఉపాధ్యక్షుడు ఏనుగు రవీందర్‌రెడ్డి, డివిజన్ ఉపాధ్యక్షుడు బండి రమేశ్, నేతలు పానుంటి సత్తయ్య, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
క్రీడాభివృద్ధికి పెద్దపీట
గ్రామ స్థాయి నుంచి శాస్త్రీయంగా, ప్రణాళికాబద్ధంగా క్రీడలు అభివృద్ధి చెందాలంటే జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్డీవో) పాత్ర కీలకం. జిల్లాలో డీఎస్డీవోగా మూడేళ్ల క్రితం బాధ్యతలు స్వీకరించిన ప్రత్తిపాటి రామకృష్ణ అందరితో కలిసి క్రీడాభివృద్ధికి కృషిచేస్తున్నారని పేరుపొందారు. జిల్లాలో క్రీడాభివృద్ధికి మరింత కృషి చేయాలనే ఉద్దేశంతో ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న అథ్లెటిక్స్ మీట్లో పాల్గొంటున్న క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు, కోచ్‌లు, ఇతర అఫిషియల్స్ అభిప్రాయాలు, అనుభవాలు తెలుసుకునేందుకు శనివారం ఆయన ‘సాక్షి వీఐపీ రిపోర్టర్’గా మారారు. అందరి అభిప్రాయాలు తెలుసుకుని.. ప్రాధాన్యత క్రమంలో వాటిని అమలుచేయడం ద్వారా జిల్లాలో క్రీడాభివృద్ధికి పాటుపడతానని చెప్పారు. డీఎస్డీవో : మీరు ఎక్కడ నుంచి వచ్చారు.. ఇక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయి? క్రీడాకారిణులు : చాలా బాగున్నాయండి. ట్రాక్, స్టేడియం బాగున్నాయి. ఈ స్థాయి పోటీల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. పలు రాష్ట్రాల క్రీడాకారుల శక్తి సామర్థ్యాలు తెలుసుకునే అవకాశం వచ్చింది. భోజనాలు, వసతి బాగున్నాయి. డీఎస్డీవో : ఏ జిల్లా నుంచి వచ్చావమ్మా.. పతకాలు సాధించావా.. మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎలా ఉంది? ఆర్.కుసుమ : మా సొంతూరు పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం. హైదరాబాద్ స్పోర్ట్స్ స్కూల్లో చదువుతున్నాను. ఇక్కడ స్టేడియం చాలా బాగుంది. జంపింగ్ పిట్లు బాగున్నాయి. సింథటిక్ ట్రాక్ కూడా ఉంటే బాగుంటుంది సార్. మా నాన్నగారు లేరు. అమ్మ నన్ను చాలా ప్రోత్సహిస్తోంది. ఇప్పుడు రాష్ట్రానికి మెడల్ సాధించాను. చాలా సంతోషపడుతుంది. జాతీయ స్థాయిలో పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం అమ్మాయి మెడల్ సాధించిందని పేపర్లో వేస్తారు. మా ఊరు, జిల్లా వాళ్లంతా సంతోషిస్తారు. డీఎస్డీవో : నీ పేరు ఏమిటమ్మా.. ఎక్కడి నుంచి వచ్చావు.. పోటీలు ఎలా ఉన్నాయి? హారిక : సార్ నా పేరు హారిక. నేను 100 మీటర్ల రన్నింగ్ చేస్తాను. మట్టి ట్రాక్ బాగుంది. సింథటిక్ ట్రాక్ ఉంటే మరింత బాగుండేది. ప్రస్తుతం రాష్ట్ర స్ప్రింటర్లం 6 నుంచి 8వ స్థానంలో ఉన్నాం. అదే సింథటిక్ ట్రాక్ వేస్తే మొదటి మూడు స్థానాల్లో నిలుస్తాం సార్. డీ ఎస్డీవో : కోచ్‌లుగా మీరు పడుతున్న కష్టాలేంటి? శాప్ కోచ్ వంశీధర్ : ప్రభుత్వం కోచ్‌లకు సముచిత గౌరవం ఇవ్వాలి. రాష్ట్రంలో కోచ్‌లు లేరు. చాలా తక్కువ మంది ఉన్నారు. జిల్లాకు ఇద్దరు కోచ్‌లు ఉండాలి. విజయవాడ రాజధాని కాబట్టి నలుగురు కన్నా ఎక్కువ ఉన్నా మంచిదే. ఉన్న కోచ్‌లను పర్మినెంట్ చేయలేదు. టార్గెట్ పెట్టి ఇచ్చే ఫలితాలను బట్టి గ్రేడింగ్ ప్రకారం కోచ్‌లకు వేతనాలు ఇవ్వాలి. మంచి జీతాలు ఇచ్చి కోచ్‌లను కూడా ప్రోత్సహించాలి. అప్పుడే కొత్త రాష్ట్రంలో మంచి ఫలితాలు వస్తాయి. ప్రస్తుతం ట్రాక్ బాగుంది. చాలా తక్కువ సమయంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మంచి ఫాస్ట్ ట్రాక్ తయారు చేశారు. దీనితోనే సరిపెట్టుకుంటే కుదరదు. భవిష్యత్తులో దీనిమీదే ప్రాక్టీస్ చేస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీకి తట్టుకోలేం. సింథటిక్ ట్రాక్ తప్పనిసరి. డీఎస్డీవో : మీరు పోటీలను చాలా ఆసక్తిగా చూస్తున్నట్లు ఉన్నారు... మరి మీ పిల్లల్ని కూడా ఆటల్లో చేర్పిస్తారా? జె.అంజనేయులు, వాణి దంపతులు : ఆటలంటే ఎవరికైనా ఇష్టమే కదండీ!. ఈ స్థాయి పోటీలను టీవీలో చూస్తాం. ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాం. చాలా బాగుంది. మా పిల్లలు చాలా చిన్నవారు. ఆటల్లో తప్పకుండా చేర్పిస్తాం. ఆటలాడితే ఆరోగ్యంగా ఉంటారు. రాణిస్తే మాకు, ఊరికి, రాష్ట్రానికి పేరొస్తుందని ఇక్కడి పరిస్థితి చూస్తే అర్థమవుతోంది. డీఎస్డీవో : ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నారు.. మీ సమస్యలేంటి? భారతి : ఇంత పెద్ద పోటీల్లో పనిచేయడం సంతోషంగా ఉంది. ఇబ్బందులు ఏమీ లేవు. పనికి తగ్గట్టుగా జీతాలు ఇస్తే మరింత బాగుంటుంది సార్? వెంకటేశ్వర్లు : పనిచేస్తూనే జాతీయ స్థాయి పోటీలు చూస్తున్నాం. నగర వ్యాప్తంగా ప్రజలు ఉత్సాహంగా చూస్తున్నారు. నగర ఖ్యాతి పెరుగుతోంది. జాతీయ స్థాయి పోటీలు కాబట్టి ఆ స్థాయిలో పనిచేయాల్సి ఉంది. కాకపోతే జీతాలు నెలనెలా ఇస్తే మా జీవితాలు బాగుంటాయి సార్. డీఎస్డీవో : ఏ రాష్ట్రం నుంచి వచ్చారు.. ఇక్కడ వసతులు, స్టేడియం ఎలా ఉన్నాయి? గౌతమ్ గుప్తా : యూపీ నుంచి వచ్చాం. స్టేడియం బాగుంది. సింథటిక్ ట్రాక్ ఉంటే మరింత బాగుంటుంది. ఉండడానికి వసతి అంతగా బాగుండలేదు. భోజనం చాలా బాగుంది. డీఎస్డీవో : శాయ్ కోచ్‌గా మీరు చెప్పండి. స్టేడియం ఎలా ఉంది. క్రీడాకారులకు ఏమి కావాలి. స్పోర్ట్స కోటా ఎంత ఉండాలి. క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి?. డీవీవీ వినాయక ప్రసాద్ : కలెక్టర్, కమిషనర్, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ సహకారంతో ఉన్నంతలో మంచి ట్రాక్ ఏర్పడింది. విభజన విషయంలో క్రీడాకారులు సంతోషపడ్డారు. కానీ మౌలిక సదుపాయాలన్నీ తెలంగాణకే వెళ్లిపోయాయి. ఒక్క క్రీడా సామగ్రి లేదు. రాష్ట్రంలో కోచ్‌లు లేరు. అథ్లెట్లకు మౌలిక సదుపాయాలు లేవు. సింథటిక్ ట్రాక్‌లు లేవు. కేరళలో 11, కర్ణాటకలో 11, తమిళనాడులో 20 సింథటిక్ ట్రాక్‌లు ఉన్నాయి. మన రాష్ట్రంలో ఒక్కటీ లేదు. రాష్ట్రం నలువైపులా సింథటిక్ ట్రాక్‌లు, పల్లెపల్లెకు క్రీడా మైదానాలు కావాలి. శాయ్ హాస్టల్స్ లేవు. కోచింగ్ అకాడమీలు లేవు. వాటిని వెంటనే ఏర్పాటుచేయాలి. జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తేనే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వస్తాయి. మన వద్ద జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులు లేక అధికారులు పక్క రాష్ట్రాల వారికి ఉద్యోగాలు ఇస్తున్నారు. 100 బెడ్లు ఉన్న స్పోర్ట్స్ హాస్టల్స్ ఉండాలి. అప్పుడే క్రీడలు మరింత అభివృద్ధి చెందుతాయి. ప్రెజెంటర్ : ఆలూరి రాజకుమార్, విజయవాడ స్పోర్ట్స్ ఫొటోలు : వీర భగవాన్ తెలగరెడ్డి, సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ అందరి సహకారం ఉంటే వేగంగా క్రీడాభివృద్ధి ‘ఖోఖో, కబడ్డీ ఆటగాడిగా, కోచ్‌గా క్రీడాకారుల సమస్యలపై నాకు అనుభవం ఉంది. క్రీడాకారులకు ఏమి కావాలి. కోచ్‌లకు ఏరకమైన వాతావరణం కల్పించాలి. నూతన రాష్ట్రం, అందులోనూ రాజధాని కావడంతో బాధ్యతలు మరింత పెరిగాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇందిరాగాంధీ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. స్పోర్ట్స్ అకాడమీలు, హాస్టల్స్ ఏర్పాటుచేయాల్సి ఉంది. పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సెక్టార్ నుంచి కూడా సహకారం అందితే క్రీడాభివృద్ధి మరింత వేగవంతమవుతుంది. క్రీడాకారులకు మంచి భవిష్యత్తు ఇవ్వాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.’ - డీఎస్డీవో ప్రత్తిపాటి రామకృష్ణ -
చక్కటి వేదిక క్రీడా కాంప్లెక్స్
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కడప స్పోర్ట్స్ : కడప నగరంలోని డీఎస్ఏ ఆవరణంలో నిర్మించనున్న క్రీడాకాంప్లెక్స్ యువతకు చక్కటి వేదిక అని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. ఆదివారం డీఎస్ఏ ఆవరణంలో స్విమ్మింగ్‌పూల్ నిర్మాణానికి భూమిపూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జిల్లాలో క్రీడాభివృద్ధి శరవేగంగా సాగిందన్నారు. వచ్చే వేసవి నాటికి స్కేటింగ్ మైదానంతో పాటు స్విమ్మింగ్‌పూల్ నగర ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. కడప నగరపాలక మేయర్ కె. సురేష్‌బాబు మాట్లాడుతూ క్రీడాకారుల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కడప కార్పొరేషన్, ఎంపీ, ఎమ్మెల్యే నిధులు రూ. 32 లక్షలతో స్కేటింగ్ మైదానాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా, సీఆర్ఐ సుబ్బారెడ్డి తదితరులు మాట్లాడారు.