Sports Sponsorships
-
క్రీడా స్పాన్సర్షిప్ జోరు
ముంబై: దేశంలో క్రీడల స్పాన్సర్షిప్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. 2017లో స్పాన్సర్షిప్ రూపంలో రూ.7,300 కోట్ల నిధుల వ్యయం జరిగింది. 2016లో రూ.6,400 కోట్ల కంటే 14 శాతం ఎక్కువ. 55 శాతంతో మీడియా పెట్టుబడులే ఇందులో సింహ బాగంగా ఉన్నాయి. ఆ తర్వాత క్రీడా మైదానాల స్పాన్సర్‌షిప్‌లు, ఈఎస్పీ ప్రాపర్టీలు ఉన్నట్టు స్పోర్ట్›్జపవర్ అనే సంస్థ ఓ నివేదికలో తెలియజేసింది. క్రీడలపై మీడియా ఖర్చు గతేడాదిలో 15.8 శాతం వృద్ధితో 3,511 కోట్ల నుంచి రూ.4,065 కోట్లకు పెరిగాయి. ఇందులో టెలివిజన్ పాత్ర కీలకమని ఈ నివేదిక పేర్కొంది. -
రూ. 5185 కోట్లకు స్పోర్ట్స్ స్పాన్సర్షిప్
ముంబై: భారత్ లో క్రీడల స్పాన్సర్షిప్ ఏటికేడు పెరుగుతోంది. 2014తో పోలిస్తే గతేడాది స్పోర్ట్స్ స్పాన్సర్షిప్ 12.3 శాతం పెరిగి రూ. 5185.4 కోట్లకు చేరినట్లు ఈఎస్పీ ప్రాపర్టీస్ అండ్ స్పోర్ట్స్ పవర్ నేషనల్ అనే సంస్థ తెలిపింది. 2015లో మ్యాచ్‌ల నిర్వహణ తక్కువగా ఉన్నప్పటికీ ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం పెరిగింది. ఇందులో సింహభాగం క్రికెట్‌కు సంబంధించినదే కావడం విశేషం. మరోవైపు క్రికెటేతర క్రీడల స్పాన్సర్షిప్ కూడా పెరిగింది. కబడ్డీ, ఫుట్‌బాల్, హాకీ, రెజ్లింగ్ వంటి క్రికెటేతర లీగ్‌లకు స్పాన్సర్‌షిప్‌లో పెరుగుదల ఉండొచ్చని అంచనా.