భారత్ లో క్రీడల స్పాన్సర్‌షిప్ ఏటికేడు పెరుగుతోంది. 2014తో పోలిస్తే గతేడాది స్పోర్ట్స్ స్పాన్సర్‌షిప్ 12.3 శాతం....
ముంబై: భారత్ లో క్రీడల స్పాన్సర్‌షిప్ ఏటికేడు పెరుగుతోంది. 2014తో పోలిస్తే గతేడాది స్పోర్ట్స్ స్పాన్సర్‌షిప్ 12.3 శాతం పెరిగి రూ. 5185.4 కోట్లకు చేరినట్లు ఈఎస్పీ ప్రాపర్టీస్ అండ్ స్పోర్ట్స్ పవర్ నేషనల్ అనే సంస్థ తెలిపింది. 2015లో మ్యాచ్‌ల నిర్వహణ తక్కువగా ఉన్నప్పటికీ ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం పెరిగింది.
ఇందులో సింహభాగం క్రికెట్‌కు సంబంధించినదే కావడం విశేషం. మరోవైపు క్రికెటేతర క్రీడల స్పాన్సర్‌షిప్ కూడా పెరిగింది. కబడ్డీ, ఫుట్‌బాల్, హాకీ, రెజ్లింగ్ వంటి క్రికెటేతర లీగ్‌లకు స్పాన్సర్‌షిప్‌లో పెరుగుదల ఉండొచ్చని అంచనా.