Sravya
-
సాత్విక–శ్రావ్య జంటకు రజతం
గువాహటి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో చివరి రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఒక్కో రజత పతకం లభించింది. టెన్నిస్ అండర్–21 బాలికల డబుల్స్ విభాగంలో సామ సాత్విక–శ్రావ్య శివాని జంట రన్నరప్‌గా నిలిచి రజత పతకాన్ని దక్కించుకుంది. ఫైనల్లో సాత్విక–శ్రావ్య శివాని ద్వయం 6–3, 3–6, 7–10తో మిహికా యాదవ్–స్నేహల్ మానె (మహారాష్ట్ర) జంట చేతిలో పోరాడి ఓడిపోయింది. స్విమ్మింగ్‌లో అండర్–21 బాలుర 200 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ స్విమ్మర్ ఎం.లోహిత్ రజతం సాధించాడు. లోహిత్ 2ని:21.32 సెకన్లలో రేసును ముగించి రెండో స్థానంలో నిలిచాడు. బుధవారంతో ముగిసిన ఈ క్రీడల్లో ఓవరాల్‌గా తెలంగాణ 7 స్వర్ణాలు, 6 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి మొత్తం 21 పతకాలు సాధించి 15వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ 3 స్వర్ణాలు, 7 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి మొత్తం 17 పతకాలతో 22వ స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర 78 స్వర్ణాలు, 77 రజతాలు, 101 కాంస్యాలతో కలిపి మొత్తం 256 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. హరియాణా (68+60+72) మొత్తం 200 పతకాలు నెగ్గి రెండో స్థానంలో... ఢిల్లీ (39+36+47) మొత్తం 122 పతకాలు సాధించి మూడో స్థానంలో నిలిచాయి. -
నాట్యంలో మేటి.. నటనలో సాటి
తల్లి కూచిపూడి నాట్యకారిణి.. తండ్రి గాయకుడు. తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకున్న వారి బిడ్డ శ్రవ్య మానస భోగిరెడ్డి 9 ఏళ్ల ప్రాయంలో కూచిపూడి నృత్యం నేర్చుకునేందుకు నడుంబిగించింది. నాలుగేళల్లో నాట్యంలో చక్కటి ప్రావీణ్యం సాధించి తనను తాను నిరూపించుకునేందుకు ప్రదర్శనలు ఇచ్చింది. ప్రతి వేదికపైనా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఓ పక్క నాట్యంలో నాట్యంలో పీహెచ్డీ చేస్తూనే.. సమాజంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై యువతను చైతన్యం చేసేందుకు స్వయంగా నాటికలు రాసి నటిస్తోంది. మరోపక్క శ్రావ్య మానస నాట్య గురువుగానూ ఇప్పుడు వందల మందికి శిక్షణనిస్తోంది. సాక్షి,సిటీబ్యూరో: మోతీనగర్‌కు చెందిన భోగిరెడ్డి శ్రీనివాస్, లలిత దంపతుల కుమార్తె శ్రవ్యమానస మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో డిగ్రీ, ఎంటెక్ పూర్తి చేసింది. అయితే, ఆమె చిన్నప్పటి నుంచి నాట్యంపై అమితాశక్తి ఉండడంతో అటువైపు అడుగులు వేసింది. ప్రస్తుతం హెచ్‌సీయూలో ప్రొఫెసర్ డాక్టర్ ఎం.ఎస్.శివరాజు పర్యవేక్షణలో డ్యాన్స్‌లో పీహెచ్డీ చేస్తోంది. కూచిపూడి నృత్యం నేర్చుకుంటున్న సమయంలోనే వెస్ట్రన్ డ్యాన్స్ కూడా చేస్తుండేది. అలా 4వ తరగతిలో ఉన్నప్పుడు స్కూల్ వార్షికోత్సవంలో చేసిన డ్యాన్స్‌కు తొలిసారి బహుమతి అందుకోవడంతో డ్యాన్స్‌పై ప్రేమను పెంచుకుంది. ‘సుమధుర ఆర్ట్స్ అకాడమీ’ని స్థాపించి తను ప్రదర్శనలు ఇస్తూ.. మరో 200 మందికి నాట్యంలో శిక్షణనిస్తోంది. అంతేకాదు.. దేశవ్యాప్తంగా వందల సంఖ్యలోప్రదర్శనలు ఇచ్చి అందరి మెప్పు పొందింది. మలేసియా, దుబాయ్‌లోనూ.. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల ఆహ్వానం మేరకు కృష్ణా, గోదావరి పుష్కరాలకు శ్రవ్యమానస తన బృందంతో పుష్కరాల విశిష్టతను చెబుతూ కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చింది. నగరంలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లోనూ ప్రదర్శనలు ఇచ్చారు. చిదంబరం, ఒడిశా, ఢిల్లీల్లో జరిగిన ఉత్సవాల్లోనూ తన నాట్యంతో మెప్పించింది. మలేసియాలో జరిగిన దసరా సంబరాలు, అబుదాబిలో ఉగాది, శ్రీరామనవమి వేడుకల్లో తన నాట్యంతో ఆ దేశాల్లోని తెలుగువారిని మంత్రముగ్ధులను చేసింది. మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టాలంటూ శ్రావ్య పలు నాటికలను స్వయంగా రూపొందించి çప్రదర్శనలు ఇస్తోంది. ఇటీవల రవీంద్రభారతిలో ‘నిర్భయ’, యాసిడ్ విక్టమ్ లక్ష్మి అగర్వాల్ పడిన వేదనను శ్రావ్య నటలో చూపిన తీరు ప్రేక్షకులను కన్నీరు పెట్టించింది. కేవలం స్త్రీ పాత్రల కాదు.. ‘శ్రీరాముడు, శివుడు, రావణుడు, మహావిష్ణు, శ్రీకృష్ణుడు’ తదితర పురుష పాత్రల్లోనూ చక్కగా ఒదిగిపోయింది. శ్రావ్య మానస తన నటన, నాట్యంతో ప్రతి వేదికపైనా సత్కారాలు, పురస్కారాలు సైతం అందుకుంది. మొదట్లో లైట్ తీసుకున్నా కూచిపూడి నాట్యాన్ని తొలుత సీరియస్‌గా తీసుకోలేదు.. అయితే ప్రదర్శనలు ఇచ్చేకొద్దీ వచ్చిన ప్రశంసలతో పట్టుదల పెరిగి ఇష్టంగా నేర్చుకున్నా. ఇప్పుడే నేనే గురువుగా వందల మందికి నాట్యం నేర్పుతున్నాను. నా శిష్యులు కూడా ఎంతో పట్టుదలగా నాట్యం నేర్చుకుంటుండడంతో ఈ రంగంపై భక్తిభావం పెరిగింది. – శ్రవ్యమానస భోగిరెడ్డి -
ఓటమినీ గెలిపించండి
లైఫ్‌లో పాస్ అవుతాం. ఫెయిల్ అవుతాం. అసలంటూ ఏదో ఒకటి అవడం ‘గెలుపు’. ఫైట్ చేశాం కదా. అందుకే అది గెలుపు. ఫైటింగ్లో ఓడామని ఫీల్ అయితే.. అసలు ఓటమి కన్నా ఫీల్ అవడం ఇంకా పెద్ద ఓటమి అవుతుంది. అందుకే ఓటమినీ గెలిపించాలి. శ్రావ్య అదే పని చేస్తున్నారు. పల్లెల్లో పర్యటించి.. పరిస్థితుల్ని ఎదిరించి జీవించడమే గెలుపు అని చెబుతున్నారు. రెండుసార్లు ఐఏఎస్ ప్రిలిమ్స్ క్లియర్ అయ్యి మెయిన్స్‌లో పోయాయి. అయినా శ్రావ్య నిరాశ పడలేదు. అంతే ఉత్సాహంగా మూడో ఎటెంప్ట్‌కి రెడీ అయింది. ప్రిపరేషన్ మొదలుపెడుతున్న సమయంలో తెలిసింది అంతకుముందు జరిగిన ఐఏఎస్ పరీక్షలో ఉత్తీర్ణులు కాలేదని ఒక అమ్మాయి, అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నట్టు! అబ్బాయి తెలుగువాడే. శ్రావ్యకు తెలిసిన వ్యక్తే. అతనిది చాలా పేద కుటుంబం. తల్లిదండ్రులు ఇద్దరూ కూలీలే. పైసా పైసా కూడబెట్టి కొడుకును చదివిస్తున్నారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన ఆ అబ్బాయి తల్లిదండ్రుల గురించి ఏమాత్రం ఆలోచించకుండా కేవలం రెండుసార్లు ఐఏఎస్ మెయిన్స్ క్లియర్ చేయలేకపోయానే అని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రావ్య వాళ్ల ఫ్రెండ్స్ అంతా కండోలెన్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు. శ్రావ్య వెళ్లలేదు. ఫ్రెండ్స్ నిష్టూరమాడారు. ఎందుకు ఆలోచించరు? ‘‘ఎందుకు రావాలి? ఆ అబ్బాయిది ఎంత పిరికితనం? ఐఏఎస్ రాకపోతే లైఫ్ లేదా? ఇంజనీరింగ్ చదివినవాడు ఐఏఎస్ రాకపోతే ఇంకేదీ చేయలేడా? అతని తల్లిదండ్రులు కొడుకు ఐఏఎస్సే కావాలనే ఆశతో ఉన్నా... ఆ ప్రయత్నం ఫెయిల్ అయితే ఇంకోటి సాధించి తన తల్లిదండ్రుల ఆలోచననూ మార్చాలి. జీవితంలో అనుకున్నవన్నీ జరగవనీ, అయినా అధైర్య పడకుండా అనుకోనివి ఎంత సక్సెస్‌గా అఛీవ్ చేయగలుగుతామో చూపించాలి. ఇన్స్పైర్ చేయాలి. అదీ చదువు నేర్పిన ఓర్పు, విచక్షణ! అంతేకాని నిరాశతో సూసైడ్ చేసుకోవడం కాదు. అరే చేతికొచ్చిన కొడుకు పోయాడు.. ఇప్పుడు ఆ తల్లిదండ్రుల గతేంటి? సింగిల్ మినిట్ అయినా వాళ్ల గురించి ఆలోచించాడా అతను? ఆలోచిస్తే ఇలా ఆత్మహత్య చేసుకునేవాడు కాదు. అందుకే నేను కండోలెన్స్ మీటింగ్‌కి రాలేదు’’ అని తెగేసి చెప్పింది శ్రావ్య. ముప్పై రోజుల్లో అరవై గ్రామాలు ఫ్రెండ్స్‌తో చెప్పడమే కాదు తన ఆలోచనా తీరునూ మార్చుకుంది అప్పటి నుంచే శ్రావ్య. ఇప్పుడు తన ముందున్నది ఐఏఎస్ కాదు... అంతకుమించిన లక్ష్యం! సమాజం కోసం ఏమన్నా చేయాలి... ఏం చేయాలి? పరిశోధన ప్రారంభించింది. ప్రతి జిల్లాలో 60 గ్రామాల చొప్పున తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటించింది. జూలై 1న ప్రయాణం మొదలుపెట్టిన ఈ ప్రయాణం జూలై 31కి పూర్తయింది. ఆర్థిక, సామాజిక, రాజకీయ సమస్యలెన్నో తెలుసుకుంది. అంతకుమించిన అనుభవం గడించింది. శ్రావ్య పూర్తిపేరు మందడి శ్రావ్యారెడ్డి. తల్లిదండ్రులు.. మందడి చంద్రశేఖర్‌రెడ్డి, కాంట్రాక్టర్. తల్లి నీరజారెడ్డి, అడ్వకేట్. శ్రావ్యకు ఓ చెల్లెలు.. శ్రీహారెడ్డి, ఏమ్‌బీఏ గోల్డ్‌మెడలిస్ట్. శ్రావ్య విద్యాభ్యాసం.. స్కూలింగ్.. సెయింట్ ఆన్స్, శ్రీచైతన్య కాలేజ్‌లో ఇంటర్, నల్లమల్లారెడ్డి కాలేజ్‌లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. జన్మభూమి నా దేశం..! శ్రావ్య ఎనిమిదవ తరగతిలో ఉన్నప్పుడే బెల్జియం దేశానికి సంబంధించిన ఓ సంస్థ నిర్వహించిన జనరల్ నాలెడ్జ్, ఎలక్యూషన్ కాంపిటీషన్స్‌లో నెగ్గింది. ఆమె ప్రతిభకు ముచ్చటపడ్డ ఆ సంస్థ తమ ఖర్చుతో బెల్జియంలో శ్రావ్య చదువుకునే చాన్స్‌నూ ఇచ్చింది. అంతేకాదు చదువు తర్వాత ఉద్యోగావకాశాన్నీ ఇస్తామంది. కానీ శ్రావ్య ‘నో’ అంది.‘ తెలియనితనంతో కాదు.. తెలిసిన పరిణతితోనే’ అలా అన్నానని అంటుంది ఆమె. ‘‘ఒక్కసారి వాళ్ల ఆఫర్‌కు ఓకే అన్నామంటే జీవితాంతం ఆ దేశానికి ఊడిగం చేయాలి. అదేదో నా దేశానికే చేసుకోవచ్చు కదా! అనే అభిప్రాయంతో రిజెక్ట్ చేశాను’’ అని చెప్తుంది. ఆ దృఢ నిశ్చయానికి ఆమె తల్లిదండ్రులూ సంబరపడ్డారట కాని అయ్యో అంత అద్భుతమైన అవకాశాన్ని వద్దనుకుంటోందే అని బాధపడలేదట.. ప్రెషర్ పెట్టలేదట. స్కూల్ ప్రిన్సిపాలే ఒకటికిరెండు సార్లు ‘‘వెళితే స్కూల్ పేరు కూడా ఎలివేట్ అవుతుంది కదా’’ అని ప్రస్తావించారట. అయినా శ్రావ్య ‘నో’ అనే మాటమీదే ఉంది. అంటే సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం, అనుకున్నదాని మీద నిలబడ్డం చిన్నప్పటి నుంచే ఉన్నాయి. అది ఆమె వ్యక్తిత్వం. అలాగే నాయకత్వ లక్షణాలు కూడా. బాధ్యత తీసుకున్న లీడర్ స్కూలింగ్ అప్పటి నుంచే క్లాస్ లీడర్‌గా ఉంది శ్రావ్య. ఇంజనీరింగ్ వరకూ ఆ లీడర్షిప్ కంటిన్యూ అయింది. ఏ టాస్క్ ఇచ్చినా సమర్థవంతంగా పూర్తిచేసేది. ప్రశ్నించే తత్వం ఉండేది. ఇంజనీరింగ్ అయిపోయాక అందరిలాగే కార్పొరేట్ జాబ్ గూగుల్‌లో చేరింది. కాని ఎక్కడో అసంతృప్తి. ఏదో చేయాలనే చివరకు ఇదా చేస్తోంది అని తనను తానే విమర్శించుకుంది. విశ్లేషించుకుంది. ఐఏఎస్ సాధిస్తే చాలామందికి ఉపయోగపడొచ్చు కదా అని సివిల్స్‌కి సిద్ధమైంది. అదిగో అప్పుడే పైన చెప్పిన సంఘటన (ఇద్దరి ఆత్మహత్య) జరిగి.. మొత్తం తన దిశనే మార్చుకుంది. ‘‘మాతో పాటు సివిల్స్‌కి ప్రిపేర్ అయిన ఆ ఇద్దరి ఆత్మహత్య నన్ను చాలా ఆలోచించేలా చేసింది. మన దగ్గర కంప్లయినింగ్ నేచర్ చాలా ఎక్కువ. ఏం చేయలేకపోయినా తప్పు సమాజం మీద, దేశం మీదకు నెట్టేస్తాం. బా«ధ్యత తీసుకోవడానికి మాత్రం ముందుకు రాం. అలాంటప్పుడు ప్రశ్నించే హక్కు ఎక్కడుంది? రెస్పాన్సిబుల్ సిటిజన్స్‌గా మనమేం చేస్తున్నాం? హావ్ టు బ్రింగ్ దట్ చేంజ్ అనుకున్నా. ముందుగా కొన్ని ఎన్జీవోలతో కలిసి పనిచేశా’’ అంటూ తన ప్రయాణ ప్రారంభాన్ని చెప్పింది శ్రావ్య. వన్ ఉమన్ ఆర్మీ పనిచేసిన ఎన్జీవోలు, అటెండ్ అయిన సెమినార్లు శ్రావ్యకు చాలా విషయాలే నేర్పాయి. ముఖ్యంగా మన దగ్గర స్త్రీల పరిస్థితి గురించి! రేప్ జరిగినా అమ్మాయిదే తప్పు, భర్త చనిపోతే శుభానికి పనికిరాదు మహిళ, మొగుడు విడాకులిచ్చినా అవమానం మోసేది స్త్రీయే.. ప్రతి తప్పును ఆడవాళ్లే మోయాలి ఎందుకు? ఈ అనుభవమే శ్రావ్య ‘‘వియ్ అండ్ షి’’ అనే సంస్థను పెట్టి తెలంగాణ జిల్లాలను చుట్టేలా చేసింది. ప్రతి ఊరూ వెళ్తున్నా కొద్దీ.. తెలియని కోణాలు, ఊహించని పరిస్థితులు ఆమె కళ్ల ముందు! ఇంకా ఆగని బాల్యవివాహాలు, బాల వితంతువులు.. చదువు, ఉపాధి లేకుండా.. బానిస బతుకులు ఈడుస్తూ.. ఆమె కడుపు తరుక్కు పోయింది. కొంతమందికి అయితే ప్రభుత్వ పథకాల గురించి కూడా తెలియదు. పెన్షన్ ఆగిపోయిన వాళ్లు, పక్కా ఇళ్లు లేని వాళ్లు ఉన్నారు. జోగినీ వృత్తికి దూరమైనా ఇంకా అవమానాలపాలవుతున్న మహిళలు, ‘‘మీకెంతమంది నాన్నలురా’’ అని ఎగతాళికి గురవుతున్న వాళ్ల పిల్లలు, వరకట్న బాధితులు.. ఇలాంటి దాదాపు 73 కేస్‌లను ఐడెంటిఫై చేసింది. తక్షణమే సాయం కావల్సిన వాళ్లకు తనకు తెలిసిన వాళ్ల ద్వారా ఆ సహాయం అందేలా చూసింది. మిగిలిన వాళ్ల వివరాలు రాసుకుంది. కదలండి.. కదలి రండి శ్రావ్య ఇప్పుడు సూసైడల్ టెండెన్సీ ఉన్న వాళ్లను మామూలు మనుషులుగా చేసే ప్రయత్నంలో ఉంది. తర్వాత వాళ్ల నైపుణ్యం, అభిరుచులకు అనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేపడుతుందట. వాటికి కావల్సినవి సమకూర్చుకుంటోంది. తన సంస్థకు సంబంధించిన ఆఫీస్‌ను ప్రారంభించింది. వన్ ఉమన్ ఆర్మీగా సాగుతున్న ఈ జర్నీకి ఆమె ఎవరినుంచీ ఆర్థిక సహకారం ఆశించట్లేదు. వలంటీర్స్నూ ఆహ్వానించట్లేదు. ఒంటరి స్త్రీలకు మెరుగైన జీవితం ఇవ్వడానికి ఒంటరిగానే పోరాడుతోంది శ్రావ్య. కాకపోతే ఎవరైనా వలంటరీగా సర్వీసెస్ ఇస్తామని ముందుకు వస్తున్నవాళ్లకు ఒకటే చెప్తోంది.. ‘‘మీరున్న చోటే.. మీకు వీలైనప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రయత్నం చేయండి.. మీకు తోచిన పని చేయండి’’ అని. యువతలోని చాలామంది ఆ స్ఫూర్తిని పంచుకుంటున్నారు. శ్రావ్య ఇప్పుడు లా కూడా చదువుతోంది. లాయర్ అయి పేదరికంలో ఉన్న మహిళలకు న్యాయసహాయం కూడా చేయాలని ఆమె ఉద్దేశం. అలాగే అవగాహన కూడా కల్పించే పనిలో ఉంది ఆమె. సర్పంచ్‌లు అడ్డుకునేవారు! ‘‘చిన్న చిన్న వానచినుకులే సముద్రాన్ని నింపుతాయి. అలా నేను వేసిన అడుగు కూడా చిన్న వాన చినుకులాంటిదే. తెలంగాణ టూర్‌కి నేనే ఫైనాన్స్ చేసుకున్నా. జాబ్ చేస్తున్నప్పటి నా సేవింగ్స్, నాకున్న కొంచెం జ్యూయెలరీ, మా నాన్న ఇచ్చిన ఎమౌంట్ అన్నీ కలిసి రెండు లక్షలు అయ్యాయి. వాటితోనే రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నా. కొన్ని చోట్ల ఊళ్లోకి అడుగు పెట్టనివ్వకుండా సర్పంచ్‌లు అడ్డుకున్నారు. వాళ్లను కన్విన్స్ చేశా.. వినలేదు కొంతమంది. నేనూ అంతే మెండిగా ఊరి పొలిమేరలో కూర్చున్నా కానీ వెనకడుగు వేయలేదు. వాళ్లకు విసుగొచ్చి సరే వెళ్లండి అని ఊళ్లోకి పర్మిషన్ ఇచ్చారు. గవర్నమెంట్ సర్వే జరగని ఊళ్లకు కూడా వెళ్లా. నన్ను చూసి వాళ్లెంత సంతోషపడ్డారో.. వాళ్ల బాధలన్నీ ఏకరువు పెట్టారు. సర్వే కోసం ఎవరైనా వస్తే.. సర్పంచ్‌లు డబ్బులిచ్చేసి ఊళ్లోకి రానివ్వకుండా పంపించేస్తారని తెలిసి షాక్ అయ్యా. ఇలాంటి నిజాలెన్నో తెలిశాయి. వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్స్‌లో పిల్లల పక్కనే పడుకున్నా. వాళ్ల సమస్యలన్నీ షేర్ చేసుకున్నారు. శ్మశానంలోనే ఇళ్లున్న బ్యాదరి వాళ్ల దగ్గరా ఉన్నా. ఒళ్లు గగుర్పొడిచే లైఫ్ వాళ్లది. వాళ్లకు పెన్షన్ లేదు.. పక్కా ఇల్లు ఉండదు. సోషల్బాయ్కాట్! తలచుకుంటే ఇప్పటికీ మనసు మెలేసినట్టవుతుంది. ఇండిపెండెన్స్ వచ్చి ఇన్నేళ్లయినా ఇంకా ఈ స్థితిలో ఉన్నాం. బాగవ్వాలి. ప్రస్తుతం మా చెల్లెలు నాకు చాలా హెల్ప్ చేస్తోంది. ఫ్రెండ్స్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. మా పేరెంట్స్ సపోర్ట్ గురించైతే చెప్పనవసరం లేదు’’ అంటోంది శ్రావ్యారెడ్డి. – సరస్వతి రమ -
చాంపియన్ శ్రావ్య–హుమేరా జోడీ
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) 50కే ప్రైజ్‌మనీ టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారిణి శ్రావ్య శివాని సత్తా చాటింది. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచిన శివాని... సింగిల్స్ కేటగిరీలో రన్నరప్ ట్రోఫీని అందుకుంది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో టాప్‌సీడ్ శ్రావ్య శివాని–షేక్ హుమేరా (తెలంగాణ) ద్వయం 6–0, 6–4తో ఆకాంక్ష–ముష్రత్ అంజుమ్ జంటపై గెలుపొందింది. సింగిల్స్ టైటిల్‌పోరులో సహజ యామలపల్లి (తెలంగాణ) 6–4, 6–4తో శ్రావ్య శివానిని ఓడించి చాంపియన్‌గా అవతరించింది. పురుషుల సింగిల్స్ విభాగంలో ఏపీకి చెందిన బి. సాయి శరణ్ రెడ్డి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఫైనల్లో టాప్ సీడ్ పృథ్వీ శేఖర్ (తమిళనాడు) 6–3, 6–0తో సాయి శరణ్ రెడ్డిపై గెలుపొందాడు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ సంఘం కోశాధికారి డి. చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను బహూకరించారు. -
శ్రావ్యా.. ప్లీజ్..!
‘నేనేంటి మీకు?’ గుడ్లు తేలేశాడు శ్రీరామ్. ‘నేనేంటి మీకు?’ గద్దించింది శ్రావ్య. ‘అర్థం కాలేదు శ్రావ్యా. భర్తకు భార్య ఏమౌతుంది? భార్యే కదా!’ అన్నాడు శ్రీరామ్. ‘అవుతుంది నిజమే. నేను మీకు అయ్యానా..’ అంది శ్రావ్య. శ్రీరామ్ భయంగా చూశాడు. అది ఆఫీస్ టైమ్. ఆఫీస్‌కు వెళ్లే ముందు కానీ, ఆఫీస్ నుంచి వచ్చాక కానీ సడన్‌గా ఇలా టాటా, బైబై చెబుతుంటుంది శ్రావ్య. ‘ఏంటి అవడం శ్రావ్యా?’.. వెనక్కు వస్తూ అన్నాడు. ‘నేను మీ భార్యను అని కదా అన్నారు. అనడం వరకేనా? అనుకోవడం వరకూనా?’ ‘అనుకోకుండా అనడం ఉంటుందా ఎక్కడైనా?’ ‘కానీ నాకు తెలుస్తోంది శ్రీరామ్.. మీకు నా మీద ప్రేమ పోయింది’. ‘ఎలా చెప్తావ్ శ్రావ్యా?’ ‘పెళ్లికి ముందు మీరిలా లేరు!’ ‘ఇలా’ అంటే? ‘అప్పుడున్నట్లు ఇప్పుడు లేరు’. ‘అప్పుడెలా ఉండేవాడిని?’ ‘అది కూడా గుర్తు లేదా?’ ‘గుర్తు లేకపోవడం కాదు శ్రావ్యా.. ఇప్పుడున్నట్లే అప్పుడూ ఉన్నట్లు గుర్తు. నీకు కోపం వచ్చిందని అర్థం అవుతూనే ఉంది కానీ.. ముందు ‘మీరు’ అనడం ఆపు నన్ను’. ‘అప్పుడు నా కోసం ఎదురు చూసేవాడివి. నా మాట కోసం ఆరాటపడేవాడివి. నా నవ్వు కోసం...’ ‘ఇప్పుడు?’ ‘చూశావా.. నా మాట వినడం కూడా విసుగ్గా ఉంది నీకు!’ ‘విసుగా?! ‘నా నవ్వు కోసం నువ్వేం చేసేవాడివో చెప్పబోతుంటే వినకుండా.. ‘ఇప్పుడు?’ అని బ్రేక్ చేశావ్. ‘ఏం బ్రేక్ చేశాను?’ ‘నా మాటను బ్రేక్ చేశావ్?’ ‘సరే.. చెప్పు. నీ నవ్వు కోసం నేనేం చేసేవాడిని?’ ‘అక్కర్లేదు’. ‘ఏంటక్కర్లేదు’ ‘నా నవ్వు కోసం నువ్వేం చేసేవాడివో నేను గుర్తు చెయ్యనక్కర్లేదు. నువ్వు గుర్తుకు తెచ్చుకోనక్కర్లేదు’. ‘ఏమైంది శ్రావ్యా.. నీకు? టార్చర్ పెడుతున్నావు తెలుసా?’ ‘టార్చరా!! నువ్వా, నేనా.. టార్చర్ పెడుతున్నది శ్రీరామ్?’ ‘రాత్రంతా బాగానే ఉన్నావ్ కదా!’ ‘బాగా.. ఉన్నానా?! ‘అదే.. శ్రావ్యా.. మన మధ్య గొడవేం జరగలేదు కదా అని!’ ‘గొడవ జరగ్గపోతే బాగున్నట్టు.. గొడవ జరిగితే బాగోలేనట్టు.. ఏంటిది శ్రీరామ్? ఏం మాట్లాడుతున్నావ్?’ ‘బాగోవడం, బాగోలేకపోవడం.. గొడవల వల్లే కదా శ్రావ్యా?’ ‘మరి ఏ గొడవా లేకుండానే.. అప్పుడెందుకు నువ్వు అన్నిసార్లు ‘ఏంటి శ్రావ్యా అలా ఉన్నావ్?’ అని అడిగేవాడివి?! ‘అప్పుడు.. అంటే?’ ‘పెళ్లికి ముందు’. ‘పెళ్లికి ముందా?!’ ‘అవును. అప్పుడు ఒంట్లో బాగున్నా.. ‘అలా ఉన్నావేంటి?’ అని అడిగేవాడివి. ఇప్పుడు ఒంట్లో బాగోలేకున్నా ‘ఎలా ఉన్నావ్?’ అని కూడా అడగడం లేదు’. ‘పెళ్లికి ముందు.. పెళ్లికి తర్వాత.. ఒకేలా ఎలా ఉంటుంది శ్రావ్యా?’ ‘చూశావా.. నువ్వే ఒప్పుకున్నావ్.. మారిపోయానని’ ‘నేను మారిపోవడం, నువ్వు మారిపోవడం కాదు శ్రావ్యా.. ప్రేమలో ఎలా ఉంటామో.. పెళ్లి తర్వాత కూడా అలా ఉండలేం అని అంటున్నా’. ‘అంటే.. ప్రేమ ఉండదనా.. శ్రీరామ్?’ ‘ఉండదు అని కాదు శ్రావ్యా.. ఉందీ అని చెప్పడానికి సరిపడినంత టైమ్ ఉండదూ అని’. ‘ప్రేమ ఉంటే టైమ్ ఉండదా శ్రీరామ్?’ ‘మనసుంటే.. మార్గం ఉండదా అన్నట్లు అడిగావ్ శ్రావ్యా. పెళ్లికి ముందు నీ కోసం ఎదురు చూసింది నిజమే. ఇప్పుడూ చూస్తున్నా.. ఆఫీస్‌లో ఉండి, నీ ఫోన్ కాల్ కోసం! పెళ్లికి ముందు నీ మాట కోసం ఆరాటపడిన మాట నిజమే. ఇప్పుడూ పడుతున్నా.. నా పది మాటలకు అలకలో నువ్వొక్క మాటైనా బదులు చెప్పనప్పుడు. పెళ్లికి ముందు కట్టు కథలు చెప్పి నిన్ను నవ్వించాలని చూసింది నిజమే. ఇప్పుడూ చెప్పాలని ట్రయ్ చేస్తున్నా..’ అన్నాడు శ్రీరామ్ నీరసంగా. ‘సో.. ట్రయ్ చేస్తున్నావ్. ప్రేమగా ఉండడానికి ట్రయ్ చేస్తున్నావ్. ప్రేమించడానికి ట్రయ్ చేస్తున్నావ్. ప్రేమ లేకున్నా, ప్రేమ ఉన్నట్లు నమ్మించడానికి ట్రైయ్ చేస్తున్నావ్. అంతే తప్ప.. నిజంగా నీకు నా మీద ప్రేమ లేదు’. ‘శ్రావ్యా.. ప్లీజ్. ఆఫీస్‌కి టైమ్ అవుతోంది. బయల్దేరేదా?’ ‘వెళ్లండి. కానీ సమాధానం చెప్పి వెళ్లండి’. ‘దేనికి సమాధానం?’ ‘నేనేంటి మీకు?’ (‘నువ్వు’ లోంచి మళ్లీ ‘మీరు’ లోకి వచ్చేసింది శ్రావ్య). సినిమాలో సంసారం (మణిరత్నం ‘సఖి’ చిత్రంలోని సీన్ ఇది. మాధవన్, షాలిని లవ్ కపుల్. పెద్దల్ని కాదని, పెళ్లి చేసుకుని వేరుగా ఓ అపార్ట్మెంట్లో ఉంటారు. ఇద్దరివీ ఉద్యోగాలు. సాయంత్రం మాధవన్ వచ్చేటప్పటికి ఇంటికి తాళం వేసి ఉంటుంది. బయట చాలా సేపటిగా వెయిట్ చేస్తాడు. చేస్తూ ఉంటాడు...) సారీ, కూరలు తేవడానికి వెళ్లాను. లేటైంది. నలభై ఐదు నిముషాలుగా వెయిట్ చేస్తున్నాను. సారీ.. ర.. (ర అంటే.. ఇంట్లోకి రమ్మని) లేటౌతుందంటే తాళం చెవి పైన పెట్టి వెళ్లొచ్చుగా. కొంచెం లేటయింది. దానికింత కోపమా? నువ్వు ఎక్కడికైనా వెళ్లి, ఎంత లేటుగా అయినా రావచ్చు. నేను మాత్రం బయట వెయిట్ చెయ్యాలా? నేను మాత్రం ఏమైనా షికార్లు కొట్టడానికి వెళ్లానా? మీకు వండి పెట్టడానికేగా వెళ్లాను. ఎవరు కాదన్నారు? నన్నెందుకు బయట గూర్ఖాలా వెయిట్ చెయ్యించడం? పెళ్లికి ముందు మూడు గంటలు వెయిట్ చెయ్యలా.. బీచ్‌లో. ఇప్పుడు పది నిముషాలు వెయిట్ చెయ్యలేరా?అది వేరు.. వేరు అంటే?! అదప్పుడు పెళ్లి కాక ముందు. మరి పెళ్లి తర్వాత? అంతేనా? ఇప్పుడు ఆ మాట ఎవరన్నారు? తలుపు తియ్. ఇప్పుడు నువ్వన్నావ్గా. తలుపు తియ్ శాంతీ. మాట మార్చకు. తలుపు తియ్. మరెందుకన్నావ్? నువ్ మాత్రం ఎందుకలా మాట్లాడావ్? నువ్వు అన్నావా లేదా? బయట నించుని ఇప్పుడు గొడవ దేనికి? లోపలికి పద చెప్తాను. చెప్పు నాకు. చెప్తాను పదా... (లోపలికి వెళ్లగానే షాలిని అలక తీర్చేపనిలో పడిపోతాడు మాధవన్) సంసారంలో పడ్డాక, బాధ్యతల్లో తలమునకలై మునుపటి ప్రేమానురాగాలు తగ్గినట్లు అనిపిస్తుంది కానీ, నిజంగా తగ్గినట్లు కాదు. గొడవలు, అలకలు కూడా ప్రేమానురాగాల్లో భాగమే. -
‘నారాయణ’ విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్: నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నగరంలోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణ కళాశాలలో ఇంటర్ చదువుతున్న శ్రావ్య(16) ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు కళాశాల యాజమన్యం వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
క్రీడాకారిణి ఆత్మహత్య
కొత్తగూడెం: చించుపల్లి మండలం రుద్రంపూర్‌లో బుధవారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్రావ్య(17) అనే బాలిక ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. శ్రావ్య స్థానిక డిగ్రీ కళాశాలలో సెకండియర్ చదువుతోంది. తల్లిదండ్రులు కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఉన్నత చదువులు చదివే ఆర్థిక స్తోమత లేకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. తన చావుకు ఎవరూ కారణం కాదని, ఉన్నత చదువులు చదువుకునే స్తోమత తనకు లేదని, ఆర్ధిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె సూసైడ్‌నోట్‌లో పేర్కొంది. శ్రావ్య జిల్లా స్థాయి వాలీబాల్ క్రీడాకారిణి కూడా. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఫైనల్లో శ్రేష్ట, శ్రావ్య
► హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ బాలికల సింగిల్స్ (అండర్-13) విభాగంలో శ్రేష్ట రెడ్డి, శ్రావ్య ఫైనల్లోకి దూసుకెళ్లారు. సోమవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో శ్రేష్ట 15-11, 11-15, 15-13 తేడాతో కె.వెన్నెలపై విజయం సాధించింది. మరో సెమీస్‌లో శ్రావ్య 17-15, 19-17తో పల్లవి జోషిని ఓడించింది. బాలుర విభాగం (అండర్-13)లో ఉన్నిత్ కృష్ణ, నికశిప్త శౌర్య తుది పోరుకు అర్హత సాధించారు. తొలి సెమీస్‌లో ఉన్నిత్ 15-8, 15-12తో ఎం. శశాంక్ సాయిపై గెలుపొందగా, మరో సెమీస్‌లో నికశిప్త శౌర్య 15-8, 15-13తో శ్రీమాన్ ప్రీతమ్‌ను చిత్తు చేశాడు. అంతకు ముందు జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్ రెడ్డి ఈ పోటీలను ప్రారంభించారు. హైదరాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వి.చాముండేశ్వరీనాథ్, పాణీరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఈ మెసేజ్ ప్రతి ఆడపిల్లకీ..!
ఫేస్బుక్లో మొదట ముఖాలు చూస్తారు. తర్వాత మెసేజ్‌లు పెడతారు. తర్వాత మెసేజ్‌నే సంభాషణగా మారుస్తారు. ఆ తర్వాత ఆ మెసేజ్‌నే వలగా.. విషపుకోరగా... కబళించే అగాధంగా మారుస్తారు. అన్ని మెసేజ్‌లు పెళ్లి కోసం కాదు... ప్రేమ కోసం కూడా కాదు... మరెందుకో తెలుసుకుంటే ఆ చైతన్యాన్ని ఒక మెసేజ్‌గా అందరికీ చేరవేస్తే ‘శ్రావ్య’లాంటి ఉదంతాలు మళ్లీ జరగవు. శ్రావ్య... ఆమె ఇష్టపడిన ప్రవీణ్‌చక్రవర్తి తనను ఇష్టంగా పిలిచే పేరు అది. ఈ తరం యువత జీవనశైలిలో భాగమైన ఫేస్బుక్లో ఆమెకూ అకౌంట్ ఉంది. అదిగో అక్కడే ఫ్రెండ్ రిక్వెస్ట్‌తో ఆమెకు తారసపడ్డాడు కాకినాడకు చెందిన ప్రవీణ్ చక్రవర్తి. అక్కడి నుంచి శ్రావ్య కథే మరిపోయింది. కువైట్‌లో ఉన్న అమ్మ, అన్న పంపిస్తున్న డబ్బుతో తన చదువేదో తాను చదువుకుంటున్న ఆమె ఇప్పుడు భార్య స్థానం కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమె నేపథ్యం.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని గొల్లల మామిడాడ శ్రావ్య సొంతూరు. దళిత ఆడబిడ్డ. ఆమెకు ఓ అన్న. ఎనిమిదేళ్ల కిందట అమ్మ, నాన్నకు మధ్య స్పర్థలు వచ్చి విడిపోయారు. ఉపాధి కోసం అన్న కువైట్ వెళ్లాడు. ఆరేళ్ల కిందట అమ్మ కూడా వెళ్లింది. అప్పటి నుంచి కాకినాడలోని ఓ హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది శ్రావ్య. ప్రస్తుతం హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తోంది. ప్రవీణ్‌చక్రవర్తి వలలో... ఫేస్బుక్లో మామూలుగా ఇతర స్నేహితులతో చాటింగ్ చేసినట్టే గత ఏడాది మేలో తన ఫ్రెండ్లిస్ట్లో చేరిన ప్రవీణ్‌తోనూ చాటింగ్ చేసింది. కొంచెం చనువు ఏర్పడ్డాక శ్రావ్య ఫోన్ నంబర్ తెలుసుకొని ఒకరోజు ఆమెకు ఫోన్ చేశాడు. తాను ఓ మతబోధకుడినని, చాలామంది సమస్యలను పరిష్కరించానంటూ ఫోన్లో తన గురించి ఇంకొన్ని వివరాలు చెప్పాడు. దాంతో శ్రావ్య ఆమె స్నేహితురాలి అనారోగ్యం గురించి చెప్పింది. ఆమె కోసం ఫోన్లోనే ప్రార్థన చేశాడు. వెంటనే ఆయన స్పందించిన తీరు, అంతకుముందు ఆయన చెప్పిన మాటలను బట్టి శ్రావ్య ప్రవీణ్‌ను ఓ మంచి వ్యక్తిగా నమ్మడం మొదలుపెట్టింది. ఆ స్నేహం మరింత స్ట్రాంగ్ అయింది. పగలు,రేయి తేడా లేకుండా ఫోన్ సంభాషణ కొనసాగింది. ఒకరోజు ఓ వ్యక్తితో శ్రావ్యకు ఐ ఫోన్ పంపాడు. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. నా ప్రేమకానుకగా ఆ ఫోన్ తీసుకో’ అని చెప్పాడు. కొంత బెరుకు, ఎంతో మొహమాటంతోనే ఫోన్ తీసుకుంది శ్రావ్య. ఇంకొన్నాళ్లకు ల్యాప్‌టాప్ పంపాడు. వద్దని వారిస్తే.. నీ చదువుకి ఉపయోగపడ్తుందనే ఇస్తున్నాను తీసుకో అన్నాడు. కాదనలేకపోయింది శ్రావ్య. ఇద్దరి మధ్య ప్రణయబంధం బలపడింది. సెప్టెంబర్ 6... ‘మన ప్రేమ విషయం మన పెద్దలకు చెప్పేద్దాం. ఎలా చెప్పాలో ఒకసారి కలిసి మాట్లాడుకుంటే బాగుంటుంది. ఫలానా చోటకు రా’ అంటూ శ్రావ్యను పిలిపించాడు ప్రవీణ్. అదో హోటల్. తనదే అన్నాడు శ్రావ్యతో. ఆ హోటల్ పేరు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన శ్రావ్యతో ‘మా కుటుంబ సభ్యులందరి పేర్లు కలిపి పెట్టా’నని వివరించాడు. ఈ హోటల్ ఒక్కటే కాదు, తనకో స్కూల్, స్వచ్ఛంద సంస్థా ఉన్నాయని, వాటికి బోలెడు ఫండ్స్ వస్తాయని చెప్పాడు. ఓ గదికి తీసుకెళ్లి అల్మరాలో ఉన్న డబ్బులు, నగలు చూపించాడు. ‘నా భార్యవు కాబోతున్న నీకే ఇవన్నీ’ అన్నాడు. అంతేకాదు హోటల్ మేనేజ్మెంట్ చేశావు కాబట్టి ఈ హోటల్ నిర్వహణ బాధ్యతా నీకే అప్పగిస్తా’ అంటూ ఆ హోటల్లోని 306 రూమ్‌కి తీసుకెళ్లాడు. చేతివేలికి ఉంగరం తొడిగాడు. తమ మత సంప్రదాయం ప్రకారం పెళ్లి అయిపోయినట్లే అన్నాడు. ఆ సందిగ్ధాశ్చర్యాల్లోనే ఉన్న శ్రావ్యను శారీరకంగా వశపర్చుకున్నాడు. ఆ రోజు నుంచి ఆమెతో ఓ భర్త ప్రవర్తించినట్టే ప్రవర్తించసాగాడు. ఆమె పేరు మీద బ్యాంక్ అకౌంట్ తెరిచి 85 వేల రూపాయలు డిపాజిట్ చేశాడు. హోండా యాక్టివా బండి కొనిపెట్టాడు. ఆయనకున్న ఖరీదైన కార్లన్నీ చూపించి.. భవిష్యత్‌లో అవసరం పడొచ్చు అని డ్రైవింగ్ నేర్పించాడు. ‘అంతా బాగుంది.. కానీ ఇంతకీ మన పెళ్లెప్పుడు?’ అని ప్రశ్నించింది శ్రావ్య. గత నవంబర్‌లో కలిసినప్పుడు నిలదీసింది.‘మీ అమ్మను వచ్చి మా పేరెంట్స్‌తో మాట్లాడమను’ అన్నాడు. కువైట్ నుంచి తన తల్లిని పిలిపించింది శ్రావ్య. మొన్న డిసెంబర్లో తన వాళ్లను తీసుకొని ప్రవీణ్ వాళ్లింటికి వెళ్లి పెళ్లి విషయం మాట్లాడి వచ్చింది శ్రావ్య తల్లి. ఈ పెళ్లి కుదరదని ఓ టీచర్ ద్వారా కబురు పంపించాడు ప్రవీణ్. ఆ మాట విని షాక్ అయింది శ్రావ్య. ఈ కబురు పంపింది ప్రవీణేనా? విస్మయం చెందింది. నమ్మలేకపోయింది. కానీ నిజమే అని... నమ్మక తప్పదని నిరూపించింది ప్రవీణ్ ప్రవర్తన. అప్పటిదాకా అందంగా కనిపించిన ప్రపంచం ఒక్కసారిగా శూన్యంగా మారిపోయింది శ్రావ్యకు. నిద్రమాత్రలు మింగింది. శ్వాస ఆగిపోలేదు. చావు కూడా మోసం చేసిందని బాధపడింది. కానీ ఆడుతున్న ఊపిరి తనకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించమనే ధైర్యాన్నిచ్చింది ఆమెకు. ‘ప్రేమిస్తున్నానంటే మనసిచ్చా... కానీ నీ ఆస్తిపాస్తులను చూసి నీకు పడిపోలేదు. నన్ను ‘పెళ్లి చేసుకో... నా బతుకు నాకివ్వు’ అంటూ ప్రవీణ్ ఇంటి తలుపు తట్టింది. ఆత్మాభిమానాన్ని దెబ్బతీశాడు తప్ప భార్యగా స్వీకరించలేదు. లాభం లేదని పోలీసుస్టేషన్‌కు వెళ్లింది. అక్కడా వైద్యపరీక్షలు, శల్యపరీక్షలు అంటూ అవమానమే ఎదురైంది. వారం అయినా ఆ తతంగం ఆగలేదు. ఫేస్బుక్ ప్రేమ చక్రవర్తిపై ఈగ కూడా వాలలేదు. ఇదెక్కడి న్యాయమంటూ మీడియా ముందు మొరపెట్టుకుంది! తనలా మరెవ్వరూ మోసపోకూడదని పోరాటానికి సిద్ధమవుతోంది శ్రావ్య. - అల్లు సూరిబాబు, సాక్షి ప్రతినిధి, కాకినాడ ప్రవీణ్‌ను వదిలేసి నన్ను ఇంటరాగేషన్ చేస్తున్నారు నన్ను మోసం చేయడమే కాకుండా నాపై తిమ్మాపురం పోలీసుస్టేషన్లో తప్పుడు కేసు కూడా పెట్టించాడు. ఈ విషయం వారం రోజుల క్రితం అతనిపై ఫిర్యాదు చేయడానికి కాకినాడ సర్పవరం పోలీసుస్టేషన్‌కు వెళ్తే తెలిసింది. నాకు అసహ్యం వేసింది. కానీ ఎవ్వరినైతే భర్తగా ఊహించుకొని సర్వస్వం అర్పించానో... ఎప్పటికీ అతనే నా భర్త. నన్ను ఎలా వశపరచుకున్నాడో ఈ 500 ఫేస్బుక్ మెసేజ్‌లు, వాట్సాప్‌లో పంపిన ఫొటోలు చూడండి (అవన్నీ ఒక బౌండ్ చేయించారు). వీటిని చూపించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ప్రవీణ్‌ను వదిలేసి... నన్ను ఇంటరాగేషన్ పేరుతో పోలీసుస్టేషన్‌కు తిప్పుతున్నారు. వారం రోజుల్లో ఏడుసార్లు వెళ్లాను. మళ్లీ రమ్మంటున్నారు (ఈ విషయం చెప్తున్నప్పుడే ఆమెకు సీఐ నుంచి ఫోన్ కాల్ వచ్చింది). ఏదిఏమైనా నాకు న్యాయం జరిగేవరకూ పోరాటం చేస్తాను. - శ్రావ్య మేమంతా అండగా ఉంటాం... ఆమెకు ఎవ్వరూ లేరని బెదిరింపులకు పాల్పడుతున్నారు. డబ్బుతో అన్ని వ్యవస్థలను మేనేజ్ చేయాలనుకుంటే పొరపాటు. ఇప్పటికే మీడియా సమావేశంలో అన్ని విషయాలు వెల్లడించాం. ఆమెను ప్రవీణ్ పెళ్లిచేసుకోవాలి. తర్వాత కూడా ఆమెకు ఎలాంటి హాని జరగకుండా మేము అండగా నిలబడతాం. ఆమె పోరాటానికి మద్దతు ఇస్తాం. - సరోజ కాకినాడ మాజీ మేయర్ -
కాయ్ రాజా కాయ్ మూవీ పోస్టర్స్
-
కాయ్ రాజా కాయ్ మూవీ స్టిల్స్
-
'కాయ్ రాజా కాయ్' వర్కింగ్ స్టిల్స్
-
'కాయ్ రాజా కాయ్' ఆడియో ఆవిష్కరణ
-
ఉద్యోగం మానేస్తే!
వేదిక పెళ్లికి ముందు నేను ఉద్యోగం చేయడానికి నా అత్తమామలు, భర్త...అందరూ ఒప్పుకున్నారు. పెళ్లయిన తర్వాత కొన్నాళ్ల వరకూ ఏమీ అనలేదు. పాప పుట్టినపుడు ఓ ఏడాది విరామం తర్వాత మళ్లీ ఉద్యోగంలో చేరాను. ఇప్పుడు మా అత్తగారు ఉద్యోగం చేయొద్దంటున్నారు. నా భర్త కూడా అదే మాట చెబుతున్నారు. ఉద్యోగం మానేయడం పెద్ద పని కాదు. కానీ, తర్వాత నా భవిష్యత్తు తలుచుకుంటుంటేనే భయంగా ఉంది. ఆయన చాలా ఖర్చు మనిషి. చేతిలో ఎంత డబ్బు ఉన్నా ఆగదు. ఉద్యోగంపై పెద్దగా శ్రద్ధ ఉండదు. నా పెళ్లయిన తర్వాత ఐదారు ఉద్యోగాలు మారారు. దీనికి తోడు మద్యానికి బానిస. నేను ఉద్యోగం చేస్తున్నప్పుడే నా చేతిలో చిల్లిగవ్వ ఉండనిచ్చేవారు కాదు. అలాంటిది ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చుంటే చిన్న చిన్న ఖర్చులకి డబ్బులు నేను ఎవరిని అడగాలి. ఈ విషయం గురించి మా అత్తగారితో మాట్లాడితే ‘నువ్వు ఉద్యోగం మానేస్తే వాడే దారిలోకి వస్తాడు’ అంటారు. నిజానికి ఆమె నన్ను ఉద్యోగం మాన్పించడం వెనకున్న కారణం... మా పాపని పగలంతా చూడడం ఆమెకు ఇష్టం లేదు. ‘ఎంచక్కా పదయ్యేసరికి ఆఫీసుకెళిపోతుంది. సాయంత్రం ఆరైతేగాని ఇంటికి రాదు. ఈలోగా ఈ పిల్లతో నానాపాట్లు పడుతున్నాను. హాయిగా విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో నాకు ఈ తిప్పలు ఏమిటో అర్థం కావడం లేదు’ అని చాన్నాళ్ల నుంచి మా అత్తగారు మా పక్కింటామెతో అంటున్నారట. ఇక మావారి సమస్య ఏమిటంటే...మద్యం తీసుకోవద్దని, జీతాన్ని ఆదా చేయమని నేను మాటిమాటికీ చెప్పడం ఆయనకి నచ్చడం లేదు. ఈ విషయంపై మేమిద్దం ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటాం. ‘నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు’ అంటారు. ‘మరి నా జీతం మొత్తం మీరు తీసుకుంటున్నప్పుడు మీ జీతం ఏం చేస్తున్నారో నేను తెలుసుకోకూడదా’ నేను ప్రశ్నించేదాన్ని. ఎన్ని రకాలుగా అడిగినా ఆయన సమాధానం ‘నీకు అనవసరం’ అనే. పాప భవిష్యత్తు గురించి అస్సలు ఆలోచించరు. ఇక ఇప్పుడు నేను ఉద్యోగం మానేస్తే ఆయనకు నాపోరు తప్పుతుంది. మా అత్తగారికి చాకిరి తప్పుతుంది. నా భవిష్యత్తు మాత్రం అంధకారం అవుతుందనడంలో సందేహం లేదు. మా అమ్మానాన్నలు నా తరపున మాట్లాడుతుంటే వాళ్లని నానా మాటలు అని నోళ్లు మూయిస్తున్న మా అత్తింటివారి వేధింపుల నుండి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు. అలాగని కాపురం పాడుచేసుకోలేను. - శ్రావ్య, పఠాన్‌చెరువు, హైదరాబాద్. -
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి కుటుంబంపై కోడలు ఫిర్యాదు
చెన్నై: న్యాయం చెప్పవలసిన న్యాయమూర్తి పైనే ఆయన కోడలు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి చంద్రకుమార్ కుటుంబంపై కట్నం కోసం తనను బెదిరిస్తున్నట్లు ఆయన కోడలు శ్రావ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన మామగారి కుటుంబ సభ్యులు అధికంగా కట్నం కావాలని బెదిరిస్తున్నట్లు శ్రావ్య చెన్నై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. -
'లవ్ యు బంగారం' సినిమా స్టిల్స్