sri durga malleswara swamy varla devasthanam
-
దుర్గగుడి బస్సుల్లో ఉచిత ప్రయాణం! టికెట్ల రద్దు కోసం ప్రతిపాదన
విజయవాడ: శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దర్శనానికి విచ్చేసే భక్తులకు దేవస్థానం బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రైల్వేస్టేషన్, బస్టాండ్, దుర్గాఘాట్ నుంచి ఇంద్రకీలాద్రి పైకి దేవస్థానం నడుపుతున్న బస్సుల్లో వసూలు చేస్తున్న నామమాత్రపు చార్జీని సైతం రద్దు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ మేరకు దేవదాయశాఖ మంత్రి, కమిషనర్‌కు ఆలయ అధికారులు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఉదయం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు.. దుర్గగుడికి తొమ్మిది బస్సులు ఉన్నాయి. వాటిలో నాలుగు బస్సులను రోజూ విజయవాడ రైల్వేస్టేషన్, పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి దుర్గగుడి పైకి నడుపుతున్నారు. మరో మూడు బస్సులను కొండ దిగువన ఉన్న దుర్గాఘాట్ నుంచి కొండ పైకి నడుపుతున్నారు. రెండు బస్సులను స్టాండ్ బైలో ఉంచి పండుగలు, పర్వదినాలు, రద్దీ సమయాల్లో విని యోగిస్తున్నారు. రోజూ ఉదయం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు రైల్వేస్టేషన్, బస్టాండ్–దుర్గగుడి మధ్య బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. సాధారణ రోజుల్లో 16 సార్లు, పండుగలు, ప్రత్యేక రోజుల్లో 20 సార్లు బస్సులు తిరుగుతాయి. దుర్గా ఘాట్ నుంచి కూడా అదే స్థాయిలో బస్సు సర్వీసులు నడుపుతారు. ప్రతి నిత్యం 30వేల నుంచి 40 వేల మంది, శుక్ర, ఆదివారాల్లో 50వేల నుంచి 60 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. వీరిలో సాధారణ రోజుల్లో 4 వేల నుంచి 5 వేల మంది, శుక్రవారం, ఆదివారం, ఇతర ప్రత్యేక రోజుల్లో 7 వేల నుంచి 10వేల మంది వరకు దేవస్థానం బస్సుల్లో ఇంద్రకీలాద్రిపైకి చేరుకుంటారు. బస్టాండ్, రైల్వేస్టేషన్, దుర్గాఘాట్ నుంచి కేవలం రూ.10 మాత్రమే టికెట్ వసూలు చేస్తారు. దీంతో దేవస్థానానికి ఏడాదికి సుమారు రూ.4 కోట్ల మేర ఆదాయం వస్తుండగా, ఆయిల్, రిపేర్లు, జీతాలు ఇతర ఖర్చులు మినహాయించినా రూ. కోటి మేరకు నికర ఆదాయం వస్తుంది. భక్తులకు ఆర్థికంగా ఉపశమనం.. కరోనాకు ముందు రెండు బస్సుల్లో భక్తులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు. కరోనా తర్వాత దానిని రద్దు చేశారు. తాజాగా మొత్తం ఏడు బస్సుల్లోనూ ఉచిత ప్రయాణానికి అనుమతించాలని ప్రతిపాదనలు రూపొందించారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే వచ్చే భక్తులకు ఆర్థికంగా ఉపశమనం కలుగుతుందని దేవదాయ కమిషనర్ హరిజవహర్‌లాల్ పేర్కొన్నారు. చదవండి: తీరానికి అందాల హారం! బీచ్‌లలో ఆధునిక సదుపాయాలు -
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు ప్రారంభం (ఫోటోలు)
-
శరన్నవరాత్రి ఉత్సవాలు: ఇంద్రకీలాద్రిపై భక్తజన సందోహం
-
దుర్గగుడి పాలక మండలి నియామకం
అమరావతి: విజయవాడ శ్రీ దుర్గమలేశ్వర స్వామి వార్ల దేవస్థానం(దుర్గ గుడి) కొత్త పాలక మండలిని నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 16 మందిని పాలక మండలి సభ్యులుగా నియమించిన ప్రభుత్వం వారందరి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సమావేశమై తమలో ఒకరిని చైర్మనుగా ఎన్నుకోవాల్సి ఉంది. పాలక మండలి సభ్యులుగా యలమంచలి గౌరంగ బాబు, వెలగపూడి శంకరబాబు, బి. ధర్మారావు, కోడెల సూర్య లత కుమారి, ఈడి సాంబశివరావు, చెన్నుమోలు సాంబ సుశీల దేవి, పామర్తి విజయశేఖర్, జి. పద్మా శేఖరరావు, విశ్వనాథపల్లి పాప, సీహెచ్ లక్ష్మీ నరసింహరావు, బీరక పూర్ణ మల్లి రాంప్రసాద్, ఇట్టా పెంచలయ్య, డాక్టర్ వాసిరెడ్డి రామనాధం, పెద్దిరెడ్డి రాజా, వీరమాచినేని రంగ ప్రసాద్‌లను సభ్యులుగానూ, ఆలయ ప్రధాన అర్చకుడు ఎల్. దుర్గాప్రసాద్‌ను ఎక్స్ ఆఫిషియో సభ్యునిగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (ఇన్చార్జి) డి. సాంబశివ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాలకమండలిలో సభ్యులుగా నియమించిన వారు రెండేళ్ల పాటు ఆ బాధ్యలలో కొనసాగుతారుని ఉత్తర్వులో పేర్కొన్నారు. -
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భవానీలు
-
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భవానీలు
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి బుధవారం భవానీ భక్తులు పోటెత్తారు. దేవాలయంలోని క్యూలన్నీ భవానీ భక్తులతో నిండిపోయాయి. ఆలయంలో అమ్మవారి ప్రసాదం లడ్డూల కొరత తీవ్రంగా ఉంది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే అనకాపల్లి నుంచి విజయవాడ వస్తున్న భవానీ భక్తులు ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ భవానీ భక్తుడు మరణించగా... పలువురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. -
దుర్గగుడి చైర్మన్‌గా గౌరంగబాబు
చైర్మన్‌గా వై.గౌరంగబాబు! మరో 13 మంది సభ్యులు త్వరలోనే ఉత్తర్వులు జారీ అధికారుల జోరుకు ఇక బ్రేకులు విజయవాడలోని దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం నూతన పాలకవర్గం ఖరారైంది. దేవస్థానం చైర్మన్‌గా టీడీపీ అర్బన్ సీనియర్ నేత యలమంచిలి గౌరంగబాబు నియమితులయ్యారు. విజయవాడ: శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం నూతన పాలకవర్గం ఖరారైంది. ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. దసరా ఉత్సవాలు ప్రారభం కావడానికి కేవలం మరో 24 గంటలు ఉందనగా పాలక మండలిని ఎంపిక చేశారు. దేవస్థానం చైర్మన్‌గా అర్బన్ టీడీపీకి చెందిన సీనియర్ నేత యలమంచిలి గౌరంగబాబును నియమించారు. ఆయన ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్. వెలగపూడి శంకరబాబు, బడెటి ధర్మారావు, కోడెల సూర్యలతా కుమారి, ఈదీ సాంబశివరావు, పామర్తి విజయశేఖర్, డిఆర్ఎస్వివి ప్రసాద్, దుగ్గేంపాటి రాంబాబు, గుడిపాటి పద్మశేఖర్, విశ్వనాధపల్లి పాప, బి.పూర్ణమల్లి రామప్రసాద్, ఇట్టా పెంచిలయ్య, డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, పెద్దిరెడ్డి రాజాలు ట్రస్టు బోర్డు సభ్యులుగా నియమితులయ్యారు. అయితే బీజేపీ నేతలెవరికీ చోటు దక్కినట్లు లేదు. దశాబ్దం తరువాత దుర్గగుడికి దశాబ్ధం కాలం తరువాత పాలకమండలి ఏర్పాటు కాబోతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పి.నారాయణ రెడ్డి అధ్యక్షతన 2005-06లో పాలకమండలి ఏర్పాటు చేశారు. ఆ తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కమిటీలు వేయలేదు. పాలకమండలికి మొత్తం 14 మందిని నియమిస్తుంటే అందులో 10 మంది కృష్ణాజిల్లాకు చెందిన వారు కాగా. బి.పూర్ణమల్లి రామప్రసాద్ పశ్చిమగోదావరి జిల్లాకు, ఇట్టా పెంచలయ్య గుంటూరుకు చెందిన వారు. ఇక తెలంగాణాలోని ఖమ్మంజిల్లాకు చెందిన డాక్టర్ వాసిరెడ్డి రామనాధం, నల్గొండ జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రాజాలకు స్థానం కల్పించారని చెబుతున్నారు. ఏకపక్ష నిర్ణయాలకు చెక్కేనా? దేవస్థానం అధికారులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. కుంకుమార్చన టిక్కెట్లు, దర్శనం టిక్కెట్లు రేట్లు విపరీతంగా పెంచేశారు. దీనిపై ప్రజల్లోను, మంత్రుల్లోను ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఈనేపధ్యంలో పాలకమండలి వస్తే అధికారులు ఏకపక్ష నిర్ణయాలను కొంతవరకు కట్టడి చేసే అవకాశముంది. వెంకయ్యనాయుడు సిపార్సు బేఖాతర్? దుర్గగుడి చైర్మన్ పదవి కోసం నగరానికి చెందిన బీజేపీ రాష్ట్ర నేత వీరమాచినేని రంగప్రసాద్ పోటీపడ్డారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు కూడా రంగప్రసాద్ అత్యంత ఆప్తుడు కావడంతో వెంకయ్యనాయుడు చేత సిపార్సు చేయించుకున్నారని పార్టీ వర్గాల కథనం. బీజేపీ రాష్ట్ర పార్టీ కూడా రంగప్రసాద్ పేరునే దుర్గగుడికి సిపార్సు చేయడంతో ఆయనకే చైర్మన్పదవి వస్తుందని అందరూ భావించారు. వెంకయ్యనాయుడు సిపార్సును బేఖాతర్ చేస్తూ టీడీపీ సీనియర్ నేత యలమంచిలి గౌరంగబాబుకు చైర్మన్ పదవి ఇచ్చారు. ఇదిలా ఉండగా నగరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం పక్షం రోజుల కిందట ఇద్దరు నేతల పేర్లు దేవాదాయశాఖమంత్రి పీ మాణిక్యాలరావు సిఫార్సుతో పంపారు. ఈ ఇద్దరు పేర్లను కృష్ణాజిల్లాకు చెందిన ఒక మంత్రి, బీజేపీకి చెందిన మరొక ఎంపీకి నచ్చకపోవడంతో ఆ పేర్లను పక్కన పెట్టినట్లు సమాచారం. బీజేపీ నేతల్ని రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూడటం, దేవాదాయశాఖ మంత్రి సిఫార్సు చేసిన పేర్లను పక్కన పెట్టడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. -
పాట్లు ఫీట్లు
అన్నప్రసాదం భక్తులకు నరకయాతన బురదలో అడుగేస్తే జారిపడాల్సిందే దుర్గగుడి అధికారులకు పట్టని వైనం ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ అన్న ప్రసాదాన్ని స్వీకరించాలంటే భక్తులకు సర్కస్ ఫీట్లు తెలిసి ఉండాల్సిందే. ఇక్కడ ఏమాత్రం తేడా వచ్చినా ఆస్పత్రిపాలు కావాల్సిందే. గత రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో అర్జున వీధి అడుగు మేర బురద, మట్టి పేరుకుపోయింది. దీంతో అడుగు తీసి అడుగు వేయ డం కనాకష్టమైంది. తేడా వస్తే జారిపడిపోతున్నారు. ఘాట్ రోడ్డు మీదగా కొండపైకి చేరుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకున్న తరువాత ఘాట్‌రోడ్డు మీదుగానే కొండ కిందకు చేరుకుంటున్నారు.. అయితే అన్న ప్రసాదాన్ని మాత్రం అర్జున వీధిలోని శృంగేరీమఠంలోనే కొనసాగిస్తుండటంతో అక్కడకు వెళ్లాలంటే బురద లో నడిచి వెళ్లాలి. ఓ చంకలో బట్టల బ్యాగు, మరో చంకలో చంటి పిల్లలతో బురదలో నడుచుకుంటూ వెళ్లేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరో వైపున బురదలో నడుచుకుంటూ వెళ్లలేక కొంత మంది భక్తులు రోడ్డుకు పక్కనే ఉన్న సిమెంట్ గొట్టాల పైకి ఎక్కి బురదను దాటేందుకు ప్రయత్నిం చారు. ఈ క్రమంలో కొంత మంది పైపు పై నుంచి జారి పడి బురదలో పడిన ఘటనలు చోటు చేసుకున్నాయి. భక్తుల ఇబ్బందులు కనిపించవా? కనీసం భక్తులు ఇంతగా ఇబ్బంది పడుతున్నా అన్నదాన సిబ్బంది కనీసం భక్తులు నడిచేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో గమనార్హం. మరోవైపు నిత్యం రద్దీగా కనిపించే అన్నదానం క్యూలైన్లు గురువారం వెలవెలబోయాయి. దేవస్థానం రూ. 40 లక్షల వ్యయంతో కొత్తగా ఏర్పాటు చేసిన అన్నదానం షెడ్డు ఖాళీగానే ఉన్నప్పటికీ శృం గేరీ మఠంలోనే అన్నదానం చేస్తూ భక్తులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతకు అపచారం... మౌనస్వామిని వదిలేశారిలా ఇంద్రకీలాద్రి: తొలినాళ్లలో దుర్గమ్మ భక్తులకు అన్నదానం చేసిన మౌన స్వామి విగ్రహానికి అపచారం జరిగింది. ఆలయ అధికారులు ఆరు బయట పడేశారు. దీంతో ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ ఉంది. కొండపై మందిరంలో ఉన్న మౌన ముని స్వామి మందిరాన్ని పుష్కరాలకు ముందు దుర్గగుడి అధికారులు కూల్చేయడం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో మౌన ముని విగ్రహాన్ని అర్జున వీధిలోని శంగేరీ మఠంలో నిర్వహిస్తున్న అన్నదాన భవనానికి తరలించారు. రంగులు వేసిన తర్వాత ఇలా ఆరు బయట పడేయడం సరికాదని, దీనికి తగిన షెడ్డు ఏర్పాటు చేసి మౌన ముని స్వామి వారి చరిత్ర అందరికీ తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. -
'తొలి రోజు అమ్మవారి నిజరూప దర్శనం'
విజయవాడ : దసరా నవరాత్రుల తొలిరోజు శ్రీకనకదుర్గ అమ్మవారు నిజరూప దర్శనం ఇస్తారని విజయవాడలోని శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్లు దేవస్థానం ఈవో ఏ సూర్యకుమారి వెల్లడించారు. ఓ భక్తుడు ఇచ్చిన రూ. 4 కోట్లతో రూపొందించిన స్వర్ణ కవచాన్ని అమ్మవారికి అలంకరిస్తామన్నారు. గురువారం విజయవాడలో కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ. బాబు అధ్యక్షతన దసరా ఉత్సవాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీ కేశినేని నాని, జెడ్పీ చైర్మన్ జి.అనురాధ, విజయవాడ నగర్ మేయర్ కె. శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండ్యన్, పోలీసు ఉన్నతాధికారులతోపాటు ఆలయ అధికారులు పాల్గొన్నారు. -
దుర్గగుడికి మహర్దశ!
స్వయం ప్రతిపత్తి కల్పించిన ప్రభుత్వం ఇప్పటికే ఈవోగా ఐఏఎస్ అధికారి ఇక నిర్ణయాలు వేగవంతం త్వరలో పాలకమండలి నియామకం విజయవాడ : శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి మహర్దశ రానుంది. ప్రతిష్టాత్మక దుర్గగుడికి స్వయం ప్రతిపత్తి హోదా ఇస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు దేవాలయంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టాల్సివచ్చినా, తప్పనిసరిగా దేవాదాయశాఖ కమిషనర్, ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఇక నుంచి పాలకమండలి నిర్ణయించిన తర్వాత ప్రభుత్వ అనుమతితో పనులు చేపట్టే అవకాశం ఉంటుంది. రాజధానిగా మారడంతో.... విజయవాడ రాష్ట్ర రాజధానికి కేంద్రంగా మారడంతో రాష్ట్ర ప్రభుత్వం దుర్గగుడిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. విజయవాడలోనే మంత్రివర్గ సమావేశాలు, కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లు, గవర్నరు పర్యటనలు ఉండటంతో వారంతా ఇక్కడకు వచ్చినప్పుడు తప్పకుండా అమ్మవారి దేవాలయాన్ని సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. దేవస్థానం పేరుతో గత అనేక సంవత్సరాలుగా ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు తీసి వేసి, ఆలయం కట్టూ భూములు కొనుగోలు చేస్తున్నారు. నూతన నిర్మాణాలు చేపడుతున్నారు. వీవీఐపీలను ఆకర్షించే విధంగా దేవాలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు. పాలకమండలి నియమాకం! దేవస్థానానికి పాలకమండలి నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేవస్థానం కమిటీని నియమించాలని ఇప్పటికే అనేక మంది తెలుగుదేశం నేతలు ముఖ్యమంత్రిని కోరుతున్నారు. ఇప్పుడు స్వయం ప్రతిపత్తి ఇచ్చిన నేపథ్యంలో పాలకమండలి నియమించే అవకాశం ఉంది. అయితే పాలకమండలిని పుష్కరాల్లోపు నియమిస్తారా? ఆ తర్వాత నియమిస్తారా? అనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది. సిబ్బంది ఇబ్బందులు తీరేనా? దేవస్థానంలో రెండు దశాబ్దాలుగా అనేక మంది ఉద్యోగులు ఎన్‌ఎంఆర్‌లుగానే పనిచేస్తున్నారు. తమను పర్మినెంట్ చేయాలని అనేక మంది సిబ్బంది హైదరాబాద్ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అమ్మవారి దేవాలయానికి పుష్కలంగా ఆదాయం వస్తున్నప్పటికీ సిబ్బంది కుటుంబాలు మాత్రం అర్ధాకలితోనే జీవితాలను వెళ్లదీస్తున్నాయి. ప్రత్యేక ప్రతిపత్తి హోదా వచ్చిన తరువాతైనా వీరి కష్టాలు తీరతాయో.. లేదా.. వేచి చూడాలి. నిర్ణయాలు వికటిస్తే.... ఇప్పటి వరకు కమిషనర్ పర్యవేక్షణలో నిర్ణయాలను ఆచితూచి తీసుకునేవారు. ఇక నుంచి స్థానికంగా తీసుకుని ప్రభుత్వానికి పంపితే నిర్ణయాలు వికటించే అవకాశం ఉంది. ఇప్పటికే దేవస్థానంలో కొంతమంది కాంట్రాక్టర్లు ఇంద్రకీలాద్రిపై అనేక సంవత్సరాలుగా తిష్టవేశారు. వీరు పాలకమండలి సభ్యులు, దేవస్థాన అధికారులను బుట్టలో వేసుకుని మరింత అడ్డగోలుగా దోచుకునే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బంది నియమాకాలు, దేవస్థానానికి చెందిన వర్క్‌లు ఇచ్చే విషయంలో అధికారపార్టీ నేతల హవా పూర్తిస్థాయిలో సాగే అవకాశం ఉంది. ఇటువంటి అనుమానాలకు తావులేకుండా పారదర్శకంగా ఆలయాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. -
అమెరికాలో దుర్గమ్మకు పూజలు
ఏప్రిల్ 22 నుంచి మే 22వ తేదీ వరకు ఏర్పాట్లు చేస్తున్న ప్రవాస భారతీయులు నెల రోజులు శని, ఆదివారాల్లో కార్యక్రమాలు దుర్గగుడి అర్చకులకు ఆహ్వానం విజయవాడ : అమెరికాలో దుర్గమ్మ పూజలు నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది. ఈ మేరకు అమెరికాలోని ప్రవాస భారతీయులు అమ్మవారి పూజలు చేసేందుకు దుర్గగుడి అర్చకులకు ఆహ్వానం పలికారు. వారి కోరిక మేరకు దేవస్థానానికి చెందిన ప్రధాన అర్చకుడు లింగంభొట్ల దుర్గాప్రసాద్, అర్చకులు కోట ప్రసాద్, శంకరశాండిల్య, మారుతి యజ్ఞ నారాయణశర్మ, అమ్మవారి అలంకారం చేయడానికి పరిచార కుల శంకరమంచి ప్రసాద్, కె.గోపాలకృష్ణ తదితరులు ఏప్రిల్ 18న అమెరికా వెళ్లనున్నారు. 22 నుంచి నెలరోజుల పాటు పూజలు ఏప్రిల్ 22 నుంచి మే 22వ తేదీ వరకూ నెల రోజుల పాటు అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో దుర్గమ్మకు త్రిశతి, ఖడ్గమాల, లలితా సహస్రనామ పూజలు, రుద్రాభిషేకాలు, నవార్చనలు నిర్వహించనున్నారు. ప్రతి శని, ఆదివారాల్లో ఈ పూజలు జరుగుతాయి. దీనికోసం హరిద్వారలోని శ్రీస్వామి దయానంద సరస్వతి ఆశ్ర మం నుంచి పంచలోహాలతో చేసిన ప్రత్యేక శ్రీచక్రాన్ని తెప్పించారు. రోజూ కనీసం 300 నుంచి 500 మంది దంపతులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారని దేవస్థానం అర్చకులు అంచనా వేస్తున్నారు. ఈ పూజలు నిర్వహించినందుకు దేవస్థానానికి ప్రవాస భారతీయులు రూ.30లక్షలు ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం. దీంతో పాటు దేవస్థానం సిబ్బందికి అయ్యే ఖర్చులూ వారే భరిస్తారు. లాస్ ఏంజిల్స్‌లో దుర్గమ్మ ఆలయం? అమెరికాలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి, అన్నవరం శ్రీసత్యనారాయణస్వామి దేవాలయాల తరహాలోనే శ్రీదుర్గామల్లేశ్వరస్వామి ఆలయాన్ని కూడా నిర్మించేందుకు ప్రవాస భారతీయులు ముందుకొచ్చారు. చెన్నూరు సుబ్బారావు, బొల్లా అశోక్ కుమార్, బుచ్చిరామ ప్రసాద్, అన్నవరపుకుమార్ తదితరులు పూజలకు కావాల్సిన ఏర్పాట్లు చేయడంతో పాటు లాస్ఏంజిల్స్ లేదా టెక్సాస్‌లో దేవాలయం నిర్మించేందుకు ముందుకు వచ్చారని ఆలయ అర్చకులు చెబుతున్నారు. ప్రస్తుతం పూజలు నిర్వహించడం వల్ల దేవాలయ నిర్మాణానికి మరింతమంది దాతలు ముందుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. -
జై భవానీ... జైజై భవానీ
- క్యూలైన్లు కిటకిట - ఒక్కొక్కరికి గరిష్టంగా 20 లడ్డూలు విక్రయం సాక్షి, విజయవాడ : శ్రీదుర్గమల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న భవానీదీక్షల విరమణకు మూడోరోజు ఆదివారం పెద్దసంఖ్యలో భవానీలు వచ్చారు. దీక్షాధారులు, వారి కుటుంబసభ్యులతో ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు కిటకిటలాడాయి. జై భవానీ...జై జై భవానీ అంటూ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగింది. శనివారం రాత్రి 9 నుంచి ఆదివారం సాయంత్రం ఆరు గంటల వరకు సుమారు 75వేల మంది భక్తులు అమ్మను దర్శించుకున్నారని, రాత్రి ఆలయం మూసే సమయానికి ఆ సంఖ్య లక్షదాటుతుందని ఈవో సీహెచ్ నర్సింగరావు ‘సాక్షి’కి తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కావాల్సిన సౌకర్యాలను దేవస్థానం అధికారులు కల్పిస్తున్నారు. భవానీలు దేవస్థానం దిగువన ఏర్పాటుచేసిన ప్రత్యేక కౌంటర్లలో బియ్యం, పూజా సామగ్రిని అప్పగించి, నేతితో నింపిన కొబ్బరికాయలను హోమగుండాల్లో వేశారు. కొందరు భవానీలు అమ్మవారి వేషధారణతో రావడం విశేషం. భక్తులు తాము తయారు చేసిన పొగళ్లును దుర్గమ్మకు సమర్పించి ప్రసాదంగా తీసుకుంటున్నారు. మూడోరోజు సుమారు 9 వేల మంది అమ్మవారి భోజనప్రసాదాన్ని స్వీకరించారు.. రూ.1,05,650 అన్నదానికి విరాళంగా లభించింది. ఒక్కొక్కరికి 20 లడ్డూలు మాత్రమే..... భక్తులకు కావాల్సిన లడ్డూలను దేవస్థానం అధికారులు సిద్ధం చేస్తున్నారు. అయితే ఒక్కో భక్తుడికి 20 లడ్డూలు మించి విక్రయించకూడదని ఈవో నిర్ణయించారు. వాస్తవంగా క్యూలైన్లలో ప్రతి భక్తుడు నిలబడి ప్రసాదాలు కొనుగోలు చేస్తున్నారు. కొంతమంది భక్తులు ఐదు నుంచి 10 లడ్డూలు కొనుగోలు చేస్తున్నారు. అయితే చివర రెండు రోజులు కొరత వస్తుందని భావిస్తున్న కొంతమంది వందల సంఖ్యలో లడ్డూలు కొనుగోలు చేసి బ్లాక్ చేయాలని భావిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో ఒక్కోభక్తుడికి భక్తుడికి అత్యధికంగా 20 లడ్డూలు మించి విక్రయించకూడదని నిర్ణయించారు. ఆదివారం సుమారు 3 లక్షల లడ్డూలు విక్రయించినట్లు అధికారులు చెబుతున్నారు. పులిహోర పంపిణీకి బాడిగ రూ.25వేల విరాళం అమ్మవారని దర్శించుకున్న భవానీలకు ఉచితంగా పులిహోర ప్రసాదం పంపిణీ చేసేందుకు మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ తన వంతు సహాయం అందించారు. నాలుగోరోజు 300 కేజీల పులిహోరను పంపిణీ చేసేందుకు రూ.25 వేలు ఆయన దేవస్థానానికి చెల్లించారు. రూ. 28.64 లక్షల ఆదాయం మూడోరోజు ఆదివారం అమ్మవారికి రూ 28,64,145 ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. 2.50 లక్షల లడ్డూలు విక్రయం ద్వారా రూ.25లక్షలు, 18,200 పులిహోర ప్యాకెట్లు విక్రయం ద్వారా రూ.91 వేలు, 110 శ్రీ చక్ర లడ్డూల ద్వారా రూ.5,500, కేశఖండన ద్వారా రూ.2.62 లక్షలు, చెవి కట్టుడు టిక్కెట్లు విక్రయం ద్వారా రూ.250 ఆదాయం దేవస్థానానికి లభించింది. శనివారం దేవస్థానానికి రూ.21.91 లక్షలు ఆదాయం రాగా గత ఏడాది రెండో రోజు మంగళవారం 22.97 లక్షలు ఆదాయం వచ్చిందని దేవస్థానం అధికార వర్గాలు వెల్లడించాయి.