ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి బుధవారం భవానీ భక్తులు పోటెత్తారు.
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి బుధవారం భవానీ భక్తులు పోటెత్తారు. దేవాలయంలోని క్యూలన్నీ భవానీ భక్తులతో నిండిపోయాయి. ఆలయంలో అమ్మవారి ప్రసాదం లడ్డూల కొరత తీవ్రంగా ఉంది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే అనకాపల్లి నుంచి విజయవాడ వస్తున్న భవానీ భక్తులు ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ భవానీ భక్తుడు మరణించగా... పలువురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.