Sri Padmavati ammavaru
-
ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు
-
వసంతోత్సవాలకు అంకురార్పణ
చంద్రగిరి (తిరుపతి జిల్లా): తిరుచానూరులో కొలువైన శ్రీపద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు బుధవారం నుంచి ఈ నెల 24వ తేదీ వరకు మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనుంది. వసంతోత్సవాలకు అవరోధాలు కలగకుండా సకల దేవతలను కోరుతూ మంగళవారం రాత్రి పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు అంకురార్పణ నిర్వహించారు. అమ్మవారిని వేకువనే సుప్రభాతంతో మేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. యాగశాలలో సిద్ధంగా ఉంచిన నవపాళికలలో పుట్టమన్ను నింపి, అందులో నవధాన్యాలు వేసి అంకురార్పణకు శ్రీకారం చుట్టడంతో వసంతోత్సవాలు ప్రారంభమయ్యాయి. వసంతోత్సవాల సందర్భంగా రోజూ మధ్యాహ్నం 3 గంటలకు ఉద్యానవనంలో అమ్మవారికి స్నపన తిరుమంజనం, రాత్రి 7.30 గంటలకు తిరువీధోత్సవం నిర్వహించనున్నారు. రేపు స్వర్ణరథోత్సవం వసంతోత్సవాల్లో రెండో రోజైన గురువారం ఉదయం 7.45 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై కొలువై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వసంతోత్సవాలు పురస్కరించుకుని మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు. వసంతోత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్ళు, తాగునీటి వసతి ఏర్పాటు చేశారు. స్నపన తిరుమంజనం జరిగే మండపం చుట్టూ చల్లదనం కోసం వట్టివేళ్లతో తెరలను ఏర్పాటు చేశారు. భక్తులను ఆకట్టుకునేలా రంగోళి, అమ్మవారి చిత్రపటాలతో కూడిన ఫ్లెక్సీలు, విద్యుత్ దీపాలంకరణతో ఉద్యానవనం నూతన శోభను సంతరించుకుంది. అంకురార్పణ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో గోవింద రాజన్, అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ మధు, టెంపుల్ ఇన్స్పెక్టర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
తిరుమల: శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు
-
తిరుచానూరులో శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతం
తిరుచానూరు(తిరుపతి జిల్లా): తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో శుక్రవారం శ్రీవరలక్ష్మీ వ్రతం శాస్త్రోక్తంగా జరిగింది. అమ్మవారు బంగారు చీరతో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామున సహస్రనామార్చన, నిత్యార్చన, మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీపద్మావతీ అమ్మవారి ఉత్సవమూర్తిని విశేషంగా అలంకరించిన ఆస్థాన మండపానికి వేంచేపు చేసి పద్మపీఠంపై ఆశీనులను చేశారు. విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అషో్టత్తర శత నామావళి నిర్వహించారు. అమ్మవారిని తొమ్మిది గ్రంథులతో(నూలుపోగు) అలంకరించారు. ఒక్కో గ్రంథిని ఒక్కో దేవతకు గుర్తుగా ఆరాధించారు. 12 రకాల నైవేద్యాలను అమ్మవారికి నివేదించారు. అనంతరం మహా మంగళ హారతితో వరలక్ష్మీ వ్రతం ముగిసింది. సాయంత్రం అమ్మవారు స్వర్ణరథంపై ఆశీనులై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. అమ్మవారి రథాన్ని లాగేందుకు మహిళలు పోటీపడ్డారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి దంపతులు, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, తిరుపతి మున్సిపల్ కమిషనర్ హరిత, ఎస్వీబీసీ సీఈవో షణ్ముఖ కుమార్ పాల్గొన్నారు. -
ఆకట్టుకుంటున్న ఫలపుష్ప ప్రదర్శన
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఉద్యానవనంలో టీటీడీ ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసిన ఫల పుష్ప ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రదర్శనశాల ను శుక్రవారం టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో ఎంజీ.గోపాల్, జేఈవో పోలా భాస్కర్ ప్రారంభించారు. అనంతరం అక్కడున్న పురాణాలకు సంబంధించిన కళాకండాలు, కూరగాయలతో రూపొందించిన బొమ్మలను ఆసక్తిగా తిలకించారు. -
ఆకట్టుకుంటున్న ఫలపుష్ప ప్రదర్శన
తిరుచానూరు, న్యూస్‌లైన్: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఉద్యానవనంలో టీటీడీ ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసిన ఫల పుష్ప ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రదర్శనశాల ను శుక్రవారం టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో ఎంజీ.గోపాల్, జేఈవో పోలా భాస్కర్ ప్రారంభించారు. అనంతరం అక్కడున్న పురాణాలకు సంబంధించిన కళాకండాలు, కూరగాయలతో రూపొందించిన బొమ్మలను ఆసక్తిగా తిలకించారు. ఎస్వీ ఆయుర్వేద వైద్య కళాశాల ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం, పుస్తక ప్రదర్శన, విక్రయ స్టాల్‌ను ప్రారంభించారు. ఆకట్టుకుంటున్న కళాకండాలు పురాణాలకు సంబంధించి ఏర్పాటు చేసిన శ్రీకృష్ణుని తులాభారం, గజేంద్ర మోక్షం, హిరణ్యాక్షకుడనే రాక్షసు న్ని సంహరించి భూదేవిని కాపాడుతున్న శ్వేత వరాహస్వామి, మారువేషంలో వచ్చి సీతమ్మను భిక్షమడిగే రావణాసురుడు, మహిరావణుడనే రాక్షసున్ని సంహరించి రామలక్ష్మణులను భుజంపై తీసుకెళ్తున్న హనుమంతుడు వంటి సన్నివేశాలకు సంబంధించిన కళాకండాలు ఆకట్టుకుంటున్నాయి. పూలతో అలంకరించిన ఏనుగు బొమ్మ, కూరగాయలతో చేసిన కళాకృతులు కూడా భక్తులను ఆకట్టుకుంటున్నాయి.