sri raja rajeshwara swamy devasthanam vemulawada
-
వేములవాడ : వైభవంగా పార్వతీ రాజరాజేశ్వర కల్యాణం (ఫొటోలు)
-
రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ
వేములవాడ: రాజన్నను దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. శివరాత్రి ఉత్సవాలకు ఆలయాన్ని ముస్తాబు చేశారు. సిద్దిపేట కలెక్టర్ పి.వెంకట్రామ్రెడ్డి ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. మహాశివరాత్రి జాతర మహోత్సవాలు– 2018 యాప్‌ను కలెక్టర్ కృష్ణభాస్కర్ ప్రారంభించారు. వేములవాడ మహాశివరాత్రి జాతర అని టైప్ చేసి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల కోసం గుడి చెరువులో స్టేజీఏర్పాటు చేసినట్లు చెప్పారు. భక్తులు లోకల్‌గా తిరిగేందుకు నాలుగు మినీబస్సులను ఉచితంగా తిప్పుతున్నట్లు చెప్పారు. శివరాత్రి సందర్భంగా తీసుకోవాల్సిన బందోబస్తుపై ఎస్పీ విశ్వజిత్‌కంపాటి సమీక్షించారు. -
ఎములాడ రాజన్న ముస్తాబు
వేములవాడ: కోరిన కోర్కెలు తీర్చే కొండంత దేవుడు ఎములాడ రాజన్న. నిత్యం పంచాక్షరి మంత్రంతో రాజన్న కోవెల ప్రతిధ్వనిస్తుంది. హరిహర క్షేత్రంగా వెలుగొందుతూనే... హిందూ ముస్లింలు నిత్యం దర్శించుకునే విధంగా ఆలయంలో దర్గా ఉంది. దీంతో వేములవాడ మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. యేటా అంగరంగ వైభవంగా నిర్వమించే మహాశివరాత్రి వేడుకలు ఈనెల 12 నుంచి 14 వరకు మూడు రోజులు ఘనంగా జరగనున్నాయి. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యాల కోసం రూ. 1.20 కోట్లతో ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితోపాటు రాష్ట్ర సాంస్కృతిశాఖ ఆధ్వర్యంలో రూ.50 లక్షలు వెచ్చించి శివార్చన కార్యక్రమాలు చేపడుతున్నారు. రాజన్న గుడి చెరువు ఖాళీ స్థలంలో నితంరతం సాంస్క ృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగులో రాజన్న క్షేత్రం దేదీప్యమానంగా వెలుగొందుతోంది. భక్తుల కోసం చలవ పందిళ్లు వేశారు. పార్కింగ్ కోసం 9 చోట్ల ప్రత్యేక స్థలం కేటాయించారు. మహిళా భక్తుల కోసం రేకులతో తయారు చేసిన తాత్కాళిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. దాహార్తిని తీర్చేందుకు నీటి ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, కూల్ వాటర్ అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలందించేందుకు ఆరుచోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. రాజన్న గుడికి సమీపంలో తాత్కాళిక బస్టాండు ఏర్పాటు చేశారు. బస్సులు దిగిన వెంటనే కాలినడకన రాజన్న సన్నిధికి చేరుకునేలా రోడ్డు మార్గం వేశారు. వేములవాడకు చేరుకునే అన్ని రోడ్లను చదును చేశారు. ఆదివారం సాయంత్రం నుంచే భక్తుల రాక ప్రారంభమైంది. అందరిచూపు రాజన్న వైపు... మహాశివరాత్రి జాతర సోమవారం నుంచి ప్రారంభం కానుంది దీంతో అందరి చూపు వేములవాడ రాజన్నవైపు మళ్లింది. ప్రతి ఒక్కరూ రాజన్నను దర్శించుకుని తరించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో కలసి కొందరు, బంధువులు, మిత్రులతో కలసి కొందరు వేములవాడకు వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్ టు వేములవాడ రాష్ట్ర రాజధాని నుంచి వేములవాడకు చేరుకోవాలంటే బస్సుమార్గం, లేదా ప్రైవేట్ వాహనాలు, సొంత వాహనాల్లో రోడ్డు మార్గంలో వచ్చేందుకు చాలా మంది ఇష్టపడతారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల నుంచి నేరుగా రాజీవ్‌రహదారి నుంచి సిద్దిపేట వరకు చేరుకుని, అక్కడ్నుంచి సిరిసిల్ల మీదుగా వేములవాడకు చేరుకోవచ్చు. ఇందుకు బస్సులు ప్రతీ అరగంటకు ఒకటి చొప్పున సీబీఎస్, జేబీఎస్ బస్టాండులలో అందుబాటులో ఉన్నాయి. సిటీ నుంచి 160 కిలో మీటర్లలో వేములవాడ రోడ్డు మార్గం ఉంది. బస్సులో వస్తే నాలుగు గంటల నుంచి ఐదు గంటల సమయం, ప్రైవేట్ వాహనాల్లో అయితే మూడు నుంచి మూడున్నర గంటల సమయంలో వేములవాడకు చేరుకోవచ్చు. వరంగల్ నుంచి.. రాజన్నను దర్శించుకునేందుకు వరంగల్, ఖమ్మం పాత జిల్లాల నుంచి వచ్చే భక్తులు వరంగల్ నుంచి హుజూరాబాద్, కరీంనగర్ మీదుగా వేములవాడకు చేరుకోవచ్చు. రోడ్డు మార్గం గుండా 110 కిలో మీటర్లు ఉంటుంది. బస్సులో మూడు గంటల సమయం, ప్రైవేట్ వాహనాల్లో అయితే రెండున్నర గంటల సమయంలో చేరుకునే అవకాశాలు ఉన్నాయి. బస్సుల్లో వచ్చే భక్తులు రాజన్న గుడి చెరువు కట్టకింద దిగి కేవలం కాలినడకన రాజన్న గుడికి చేరుకోవచ్చు. -
రాజన్నకు మహర్దశ
రూ.250 కోట్లతో {పతిపాదనలు సిద్ధం సీఎం రాకే తరువాయి ఊపందుకోనున్నరాజన్న గుడి అభివృద్ధి వేములవాడ అర్బన్ : తెలంగాణలోనే అతి పెద్ద దేవాలయమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి క్షేత్రాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది. ఆలయ అభివృద్ధి కోసం రూ.250 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉంచారు. సీఎం కేసీఆర్‌ను వేములవాడకు తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే రమేశ్‌బాబు కృషి చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం టూర్ ఖరారుకు ముందుగానే అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసి ఉంచుతోంది. నెల రోజులుగా ఇంజినీరింగ్ విభాగం అధికారులు రూ.250 కోట్ల ప్రతిపాదనల తయారీ, పవర్ పాయింట్ ప్రజంటేషన్లపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగా వచ్చే 30 ఏళ్లకు సరిపడా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఇందులో పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం 500 వసతిగదుల నిర్మాణం, ఆదాయవ్యయాలను చూపించే పట్టిక సిద్ధం చేశారు. రూ.15 కోట్లతో కల్యాణ మంటపాల ఏర్పాటు, రూ.80 కోట్లతో గుడి చెరువునకు ఉత్తర భాగంలో 121 ఎకరాల భూమి కొనుగోలు, రూ.15 కోట్లతో దేవస్థానం రెండో ప్రాకారం, రూ.10 కోట్లతో ధర్మగుండం పునరుద్ధరణ చేపట్టనున్నారు. రూ.60 కోట్లతో గుడి చెరువు ఈశాన్యభాగం పునరుద్ధరణ, ఉత్తర భాగంలో ఆధ్యాత్మిక ఉద్యానవనం, రూ.30 కోట్లతో శివపురం, శంకరపురం వద్ద 300 వసతి గదులు, రూ.10 కోట్లతో వేద-ఆగమ-సంగీత-నాట్య కళాశాల ఏర్పాటు, రూ.5 కోట్లతో బద్దిపోచమ్మ ఆలయానికి క్యూ కాంప్లెక్స్, రూ.15 కోట్లతో రాజేశ్వరపురం వద్ద చౌల్ట్రీల నిర్మాణం, రూ.10 కోట్లతో నాంపల్లి దేవాలయం అభివృద్ధి పనులకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన బుక్‌లెట్‌ను సిద్ధం చేసి ఉంచారు. ఇప్పటికే సీఎం కార్యాలయానికి ఈ బుక్‌లెట్‌ను అందజేసినట్లు తెలిసింది. వీటితోపాటు సీఎం కేసీఆర్ రాకతో మరిన్ని అభివృద్ధి పనులు సాధించుకునే అవకాశం ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇందులో ఒక్కో అంశానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన బుక్‌లెట్‌ను అధికారులు సిద్ధం చేసి ఉంచారు. ఈ పనులన్నీ పూర్తయితే రాజన్న గుడి భూతల స్వర్గంగా భక్తులకు దర్శనమివ్వనుందని జనం చర్చించుకుంటున్నారు.