sri ram reddy
-
మంచి నిర్మాతను కోల్పోయాం : దర్శకుడు చంద్రమహేశ్
‘‘ఏక కాలంలో నాలుగు భాషల్లో నిర్మితమైన తొలిచిత్రం ‘రెడ్ అలర్ట్’. ఈ చిత్ర నిర్మాత పి.వి. శ్రీరాంరెడ్డి సినిమా రంగం గురించి ఎన్నో కలలు కన్నారు. ఇంత మంచి నిర్మాతను కోల్పోవడం తెలుగు సినిమా దురదృష్టం’’ అని చంద్రమహేశ్ పేర్కొన్నారు. హెచ్.హెచ్. మహాదేవ్, రవి, అమర్, తేజ హీరోలుగా చంద్రమహేశ్ దర్శకత్వంలో సినీ నిలయ క్రియేషన్స్ పతాకంపై తెలుగు, తమిళ, కన్నడ మలయాళ భాషల్లో పీవీ శ్రీరాంరె డ్డి నిర్మించిన చిత్రం ‘రెడ్ అలర్ట్’. గురువారం హైదరాబాద్‌లో ఈ సినిమా థియేటర్ ట్రైలర్‌ను నటుడు పోసాని కృష్ణమురళి ఆవిష్కరించారు. ఇటీవలే మృతిచెందిన నిర్మాత శ్రీరాం రెడ్డికి యూనిట్ సభ్యులు నివాళులు అర్పించారు. డబ్బుతో పాటు ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అందరిపై ఉందని పోసాని కృష్ణమురళి పేర్కొన్నారు. హెచ్.హెచ్. మహాదేవ్ మాట్లాడుతూ- ‘‘ నాన్న చనిపోయారంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ఈ రోజు నాలుగు భాషల్లో సినిమా విడుదల చేయాలని నాన్న అనుకున్నారు. త్వరలోనే పాటలను, చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. నటుడు ‘గుండు’ సుదర్శన్ మాట్లాడుతూ- ‘‘శ్రీరాంరెడ్డి గారు బంగారం లాంటి మనిషి. కొత్త దర్శకులను ప్రోత్సహించాలని ఎన్నో ప్రణాళికలు రచించారు. ఆయన లోటు ఎన్నటికీ తీరనిది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటులు అమర్, తేజ, రచయిత వెనిగళ్ల రాంబాబు, శ్రీరాం చౌదరి, ఛాయాగ్రాహకుడు కల్యాణ్ సమి, నృత్య దర్శకులు ప్రకాశ్, చంద్రకిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
పాలకుర్తి బరిలో శ్రీరాంరెడ్డి
పాలకుర్తి, న్యూస్‌లైన్: ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్ఎంయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లింగాల శ్రీరాంరెడ్డి... వరంగల్ జిల్లా పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాది పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు. వరంగల్ జిల్లా లింగాలఘణపురానికి చెందిన శ్రీరాంరెడ్డి 1989 నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకపోవడంతో ఆయన సమాజ్‌వాది పార్టీ తరపున నామినేషన్ వేశారు. శ్రీరాంరెడ్డి తండ్రి లింగాల చెన్నకృష్ణారెడ్డి దాతృత్వ కార్యక్రమాల ద్వారా స్థానికంగా సుపరిచితులు. వారసత్వంగా వచ్చిన భూములను రఘునాథపల్లి, జనగామ, లింగాలఘణపురం మండలాల్లో పేదలకు పంచిపెట్టారు. తండ్రిలా శ్రీరాంరెడ్డి కూడా కమ్యూనిటీ, పాఠశాల భవనాలకు, బాలవికాస స్వచ్ఛంద సంస్థలకు, గ్రామ పంచాయతీ భవనాలకు సొంత భూములను విరాళంగా గతంలో అందజేశారు. కాగా, తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని లింగాల శ్రీరాంరెడ్డి చెప్పారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. మిజోరంలోని ఏకైక లోక్‌సభ స్థానానికి శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 9నే జరగాల్సిన ఎన్నికలు.. బ్రూ తెగ శరణార్థులకు త్రిపురలో ఓటేసేందుకు అనుమతించడంపై ప్రజాసంఘాలు బంద్‌కు పిలుపునివ్వడంతో వాయిదా పడ్డాయి. బీజేపీ బహిష్కృత నేత జశ్వంత్ సింగ్ తనయుడు, ఎమ్మెల్యే మానవేంద్ర సింగ్‌ను బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి తప్పించారు. ఆయన బార్మర్ లోక్‌సభ స్థాన బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మోడీ ఆరెస్సెస్‌లో పెద్ద గూండా అని వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి బేణీప్రసాద్ వర్మకు ఈసీ నోటీసు జారీ చేసింది. ఆయన ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని, ఈ నెల 12లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.