శాన్ఫ్రాన్సిస్కోలో భారత నూతన కాన్సులేట్ జనరల్‌గా తెలుగు వ్యక్తి!
అమెరికా... అందులోనూ సిలికాన్ వాలీ అంటే తెలుగు రాష్ట్రాల వారికి ఎంతో ఆసక్తి. ఐటీ ఇండస్ట్రీకి పెట్టింది పేరైన ఈ ప్రాంతానికి ఇప్పుడు భారత నూతన కాన్సులేట్ జనరల్‌గా తెలుగు వ్యక్తి నియమితులయ్యారు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా శ్రీకర్ రెడ్డి పని చేస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నల్గొండ జిల్లా యాదాద్రి మోత్కూరు మండలంలోని కొండగడప శ్రీకర్ రెడ్డి స్వస్థలం.
కాకతీయ వర్సిటీ నుంచి మెడిసిన్ చదివిన శ్రీకర్ రెడ్డి.. యూపీఎస్సీ పరీక్ష రాసి ఐఎఫ్ఎస్కు ఎంపికయ్యారు. జర్మనీలోని బెర్లిన్‌లో పనిచేసిన శ్రీకర్‌రెడ్డి.. దిల్లీలోని ఫారిన్ అఫైర్స్‌లో కూడా సేవలందించారు. ప్రస్తుతం భారత్‌లో డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్‌లో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న డాక్టర్ శ్రీకర్ కె రెడ్డి (ఐఎఫ్ఎస్) శాన్ఫ్రాన్సిస్కోలో కాన్సులేట్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు.
The Consulate General of India, San Francisco @CGISFO announces with pleasure, Dr. Srikar Reddy has assumed charge as the Consul General. pic.twitter.com/WW09HDiwPl
— India in SF (@CGISFO) August 21, 2023
బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన ఇండిపెండెన్స్ డే కార్యక్రమంలో శ్రీకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన్ను సాక్షి టీవీ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. "రెండు తెలుగు రాష్ట్రాల్లో పాస్ పోర్ట్ అధికారిగా పని చేశాను. ఇక్కడ ఇండిపెండెన్స్ డే సమయంలో శాన్ఫ్రాన్సిస్కోలో కాన్సుల్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించడాన్ని సంతోషంగా భావిస్తున్నాను. ఎంతో మంది తెలుగు వారు టెకీలుగా ఈ ప్రాంతంలో ఉన్నారు. భారత్, అమెరికా ప్రభుత్వాలు రెండు దేశాల మధ్య సంబంధాల మెరుగుదలకు ప్రయత్నించడం శుభదాయకం. అమెరికా వీసాల కోసం పెరుగుతున్న టైంలైన్ను ఇప్పటికే ఇక్కడి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. విద్యార్థుల డీపోర్టేషన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని" శ్రీకర్ రెడ్డి తెలిపారు.
ఈ విషయంపై డీజీపీ అంజనీ కుమార్ స్పందించారు. తెలంగాణకు చెందిన శ్రీకర్ రెడ్డి శాన్ ఫ్రాన్సిస్కోలో కాన్సుల్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించడం తమకెంతో గర్వంగా ఉందంటూ ఆయనకు అభినందనలు తెలిపారు.
Srikar Reddy, IFS from Telangana, has been posted as CG of India at San Francisco, USA. He will be incharge of eight States there. We look forward to more trade and business promotion.
Best wishes, Srikar. We are so proud of you.#TelanganaPolice pic.twitter.com/N5HOa4YTzE
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) July 12, 2023
(చదవండి: "మా తుఝే సలామ్" అని హోరెత్తిన లండన్ వీధులు)