The Srirangasagar project
-
జూన్ నాటికి ఎస్సారెస్పీ–2
పూర్తి చేయాలని అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రెండో దశ ప్రాజెక్టు పనులను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని అధికారులను నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. పనుల పురోగతిని ఇకపై ప్రతివారం సమీక్షించాలని చెప్పారు. బుధవారం జలసౌధలో ఈ ప్రాజెక్టు పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఎస్సారెస్పీ–2 నుంచి పాత నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని కరువు పీడిత ప్రాంతాల్లో 4 లక్షల ఎకరాలకు సాగు నీరందించే పనుల వేగం పెంచాలని కోరారు. ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద రూ.1,321 కోట్లతో పనులు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని, ప్రస్తుత ప్రభుత్వం ఎస్సారెస్పీ స్టేజ్–2 పరిధిలో 2.25 లక్షల ఎకరాలు స్థిరీకరించిందని, మరో 1.75లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నారు. కాకతీయ ప్రధాన కాలువలో లైనింగ్ దెబ్బతినడం, పూడికతో వరంగల్, ఖమ్మం, నల్లగొండల్లోని కరువు పీడిత ప్రాంతాల్లో భూములకు నీరందడం లేదని.. ఈ మరమ్మ తులు పూర్తి చేసి, ఫీల్డ్ చానల్స్ అన్నింటినీ ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పారు. ఈ పథకంతో పాత నల్లగొండ జిల్లాలో తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,13,175 ఎకరాలకు.. ఖమ్మం జిల్లాలో పాలేరు, మధిర అసెంబ్లీ నియోజకవర్గాలలో 75, 262 ఎకరాలు, వరంగల్ జిల్లాలో వర్ధన్నపేట, పాలకుర్తి, డోర్నకల్ నియోజకవర్గాల్లో 1,09,512 ఎకరాలకు సాగు నీరందుతుందని గుర్తు చేశారు. శ్రీరాంసాగర్ చివరి భూములకు నీరు శ్రీరాంసాగర్ ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందించాలని సీఎం కేసీఆర్ నడుం బిగించారని హరీశ్‌రావు అన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యే, ఎంపీల సహకారంతో సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. వచ్చే ఏడాది కాళేశ్వరంతో ఎస్సారెస్పీని కలుపుతున్నందున ఈ లోగా ఎస్సారెస్పీ–2 పనులు పూర్తి కావాలని.. ఎల్ఎండీకి ఎగువ, దిగువ ప్రాంతాలలో కాలువల్లో నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చూడాలని కోరారు. సమావేశంలో వ్యవసాయ మంత్రి ఈఎన్సీ మురళీధర్, ఈఎన్సీ(అడ్మిన్) నాగేంద్ర రావు తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల్లో ముంపు గ్రామాలు
♦ డీ1 పట్టాలు లేక రుణాలు లేవు ♦ ఇబ్బందుల్లో పునరావాస గ్రామాలు మామడ(నిర్మల్): శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఆ గ్రామాల వారు తమ విలువైన భూములను కోల్పొయారు. ప్రాజెక్ట్ కోసం త్యాగం చేసిన వారికి ఇప్పటికి పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందడం లేదు. తమ ఇళ్లు, భూములు సర్వస్వం వదిలివచ్చిన వారు కోలుకోలేకపోతున్నారు. ముంపునకు గురైన 33 గ్రామాలు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో జిల్లాలోని 33 గ్రామాలు ముంపు గురయ్యాయి. ముంపు గురైన గ్రామాలల్లో వారికి 1970లో పునరావాసంగా ఐదెకరాలతోపాటు, ఇంటిస్థలం, వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.600 నుంచి రూ800 పరిహారంగా ఇచ్చారు. అర్హులైన వారికి కుటుంబం నుంచి ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు హామీఇచ్చారు. ముంపు గురై పునరావాసం ఏర్పాటు చేసిన గ్రామాలకు చెందిన సమస్యలను పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా 2007లో పునరావాస సాయం కింద రూ.52 కోట్లతో సీసీరోడ్లు, మురుగు కాలువ, ఎత్తిపోతల పథకాలు, ఆలయాలు, సరస్వతీ కాలువ మరమ్మతు నిర్వహించారు. సమస్యలు పరిష్కారం కాక అభివృద్ధికి దూరం అవుతున్నారు. సమస్యలతో సతమతం మామడ మండలంలోని కమల్‌కోట్ పంచాయతీ పరిధిలో ఆదర్శనగర్, న్యూటెంబుర్ని, కొరిటికల్ పంచాయతీ పరిధిలో న్యూలింగంపెల్లి, న్యూసాంగ్వి, లక్ష్మణచాంద మండలంలోని న్యూవెల్మల్, బొప్పారం, పొట్టపెల్లి(కె), నిర్మల్, దిలావార్పూర్ గ్రామాలలో పునరావాస గ్రామాలు ఉన్నాయి. ముంపు గ్రామాల పరిష్కరించక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల సమయంలో ప్రజాప్రతినిధులు హామీలకే పరిమితం అవుతున్నాయి. ఆదర్శనగర్, న్యూటెంబుర్ని పునరావాస గ్రామంలో వంద కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరికి కేటాయించిన భూములకు ఇప్పటికి డీ1 పట్టాలు లేక పోవడంతో బ్యాంకు రుణాలు, ఎరువులు, విత్తనాలు పొందలేక ఇబ్బందులు పడుతున్నారు. కేటాయించిన భూముల సాగు కోసం ఎత్తిపోతల పథకం ప్రారంభించిన మరమ్మతుకు నోచుకోలేదు. దీంతో నీటి వసతి లేక పోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తమ ఇళ్లు,భూములు ప్రాజెక్ట్ నిర్మాణంలో కోల్పోయి చదువుకుని అర్హత కలిగి కొంత మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు. మరికొంత మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఊరుతో పాటు ఉపాధి కోల్పోయాను మాది దిలావార్పూర్ మండలంలోని కొత్తూర్ గ్రామం. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో మా గ్రామం ముంపునకు గురవడంతో కమల్‌కోట్ పంచాయతీ పరిధిలో 1982లో పునరావాసం కల్పించారు. కొత్తూర్‌లో సుంకరిగా పనిచేసేవాడిని. ప్రతి నెల రూ. 12వందలు ఇచ్చేవారు. ఇక్కడికి రావడంతో సుంకరిగా పనిచేద్దామన్నప్పటికి ఇవ్వడం లేదు. ఉన్న ఉపాధిని కోల్పోయాను. – ముత్యం, ఆదర్శనగర్ నష్టపరిహారం అందించాలి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఐదెకరాల కంటే ఎక్కువగా ముంపులో కోల్పోయాను. ప్రభుత్వం ఐదెకరాల భూమి ఇచ్చింది. పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించాలని అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేదు. ఇచ్చిన భూములకు డీ1 పట్టాలు ఇవ్వడం లేదు. పాస్‌పుస్తకాలు లేక బ్యాంకు రుణాలు అందడం లేదు. సమస్యలు పరిష్కరించాలి. – గంగారెడ్డి, ఆదర్శనగర్