నేటితో ముగియనున్న వార్షిక తెప్పోత్సవాలు
తిరుమల: తిరుమలలో నేటితో వార్షిక తెప్పోత్సవాలు ముగియనున్నాయి. శ్రీవారి పుష్కరిణిలో రాత్రి 7.00 గంటలకు తెప్పోత్సవం జరగనుంది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి అవతారంలో దర్శనం ఇవ్వనున్నారు. అయితే పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. అయితే బుధవారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
శ్రీవారి దర్శనం కోసం నాలుగు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతుంది. అదే విధంగా తిరుమలలో తుంభర తీర్థ మహోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో భారీగా భక్తులు తిరిగిరానున్నారు. దీంతో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.