SSP
-
ఎక్కడికీ వెళ్లరు, ఇక్కడే ఉంటారు: పోలీసు
ఇటావా: పౌరసత్వ సవరణ చట్టంపై దేశం ఆగ్రహావేశాలతో ఊగిపోతోంది. సీఏఏకు వ్యతిరేకంగా సాధారణ యువత, యూనివర్సిటీ విద్యార్థులు రోడ్లమీదకు వచ్చి చేపట్టిన నిరసనలు పలుచోట్ల హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ బాధ్యతాయుతమైన పోలీసు జనాల్లో సీఏఏపై ఉన్న అపోహలను పోగొట్టే ప్రయత్నం చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాలో ఎస్ఎస్పీ సంతోష్ మిశ్రా శుక్రవారం ఉదయం ముస్లిం సోదరులను కలిశాడు. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర జాబితా(ఎన్ఆర్సీ)ల గురించి వివరిస్తూనే వాటివల్ల కలిగే లాభనష్టాలను వారికర్థమయ్యే రీతిలో వివరించాడు. సంతోష్ మిశ్రా అక్కడి ముస్లిం యువకులతో మాట్లాడుతూ.. ‘మీరు వెళ్లిపోవాల్సిందేనని ఎవరు చెప్పారు? మీరు ఎక్కడికీ వెళ్లరు.. ఇక్కడే ఉంటారు, ఇక్కడే చదువుకుంటారు. కలిసి ప్రార్థనలు చేసుకుంటారు. ఈ బిల్లు గురించి వచ్చే పుకార్లను నమ్మకండి. చట్టాన్ని మాత్రమే నమ్మండి. భారత్‌లో ఉన్న ముస్లింలకు సీఏఏ వల్ల ఎలాంటి నష్టం వాటిల్లదు. కేవలం ఇతర దేశాల నుంచి భారత్‌లోకి వచ్చేవాళ్ల గురించే ఈ చట్టం చెబుతోంది. దయచేసి అందరూ శాంతియుతంగా, సామరస్యంగా మెలగండి’ అని అక్కడి జనాన్ని కోరాడు. దీనికి సంబంధించిన వీడియోను బాలా అనే వ్యక్తి ట్విటర్లో షేర్ చేశాడు. ‘పోలీసులంటే ఇలా ఉంటారు. పోలీసులు ప్రజలకు హాని చేయరు. కానీ ఆవేశంతో మీరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని చూస్తే సామాన్య జనాన్ని కాపాడటానికి పోలీసులు వారి శక్తిని చూపించక తప్పద’ని పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారగా అందులోని పోలీసుకు నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు. చదవండి: నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఇంటింటిపై త్రివర్ణం ఎగరాలి! Sir Santosh Mishra is explaining CAA & communicating with public, this is the real face of Police, don't fall in the narrative of Media, Police has no intention to harm it's own people. but if you take law & order in your hands they have to use their power to save other people. pic.twitter.com/Ael9h3hKJR — BALA (@erbmjha) 21 December 2019 -
హృదయాలను కలిచి వేస్తోన్న ఫోటో
కశ్మీర్ : ఖాకీలనగానే కాఠిన్యం.. కరకు రాతి గుండెలున్న మనుషులుగా ఓ చిత్రం మన కళ్ల ముందు కదులుతుంది. కానీ విధి నిర్వహణలో భాగంగానే వాళ్లు అలా కఠినంగా ప్రవర్తిస్తారు. అనునిత్యం నేరస్తులతో కలిసి ఉండటం మూలానా వారి గుండెలు కూడా బండ బారిపోతాయేమో. అయితే ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతోన్న ఓ ఫోటో చూస్తే ఖాకీలు కూడా అందరిలాంటి వారేనని వారికి కూడా స్పందించే హృదయం ఉంటుందని అర్థం అవుతుంది. ఓ ఉన్నతాధికారి.. చనిపోయిన సహోద్యోగి కుమారుడిని ఎత్తుకుని కన్నీటి పర్యంతమవుతున్న ఫోటో ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది వివరాలు.. గత వారం అనంతనాగ్‌లో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో అర్షద్ ఖాన్ అనే పోలీసు అమరుడయ్యాడు. ప్రభుత్వ లాంఛనాలతో అతని అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ సుపరిండెంట్ ఆఫ్ పోలీస్ హసీబ్ ముఘల్ హాజరయ్యారు. ఈ క్రమంలో హసీబ్, మరణించిన అర్షద్ ఖాన్ నాలుగేళ్ల కుమారుడు ఉబన్‌ను ఎత్తుకుని కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రస్తుతం ఈ ఫోటో ఇంటర్నెట్లో వైరలవుతూ ఎంతో మందిని కదిలిస్తోంది. ముష్కరులకు, భద్రతా దళాలలకు మధ్య జరిగిన కాల్పుల్లో అర్షద్ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతన్ని ఢిల్లీ ఎయిమ్స్‌లో చేర్చారు. కానీ దురదృష్టవశాత్తు రెండు రోజుల క్రితం అర్షద్ మరణించాడు. శ్రీనగర్‌కు చెందిన అర్షద్‌కు ఇద్దరు కుమారులున్నారు. వీరితో పాటు తల్లిదండ్రులు, సోదరుడు కూడా అర్షద్ మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. అర్షద్ మరణంతో ‘పెద్ద దిక్కును కోల్పోయాం.. ఇక మేమెలా బతకాలి’ అంటూ ఆ కుటుంబ సభ్యులు చేస్తోన్న ఆక్రందనలు అక్కడి వారి హృదయాలను కలిచి వేశాయి. -
ఇద్దరు ఇండో అమెరికన్లకు ‘జూనియర్ నోబెల్ ప్రైజ్’
వాషింగ్టన్: శాస్త్రీయ పరిశోధనలకు ఇచ్చే భారీ నజరానాగా ఇచ్చే సొసైటీ ఫర్ సైన్స్ అండ్ ద పబ్లిక్(ఎస్ఎస్పీ) పురస్కారం ఈ ఏడాది ఇద్దరు ఇండో అమెరికన్లకు దక్కింది. మెదడుకు అయ్యే గాయాలు, సంక్రమించే వ్యాధులను నయం చేసే పరిశోధనకుగాను ఇంద్రాణి దాస్ మొదటిస్థానంలో నిలిచి.. రెండున్నర లక్షల డాలర్ల ప్రైజ్ మనీ గెలుచుకోగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో పరిశోధనకుగాను అర్జున్ రమణీ మూడోస్థానంలో నిలిచి లక్షన్నర డాలర్ల ప్రైజ్ మనీని గెలుచుకున్నారు. జూనియర్ నోబెల్ ప్రైజ్‌గా పిలిచే ఈ అవార్డు ఈ ఏడాది ఇద్దరు ఇండో అమెరికన్లకు దక్కడంపై అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయులు హర్షం వ్యక్తం చేశారు. సమాజానికి ఉపయోగపడే పరిశోధనలను ప్రోత్సహించేందుకుగాను 1942లో వెస్టింగ్‌హౌస్ ఈ పురస్కారాన్ని ఇవ్వడం ప్రారంభించారు. ఆ తర్వాత 1998 నుంచి ఈ పురస్కారం కింద ఇచ్చే నగదును ఇంటెల్ సంస్థ అందజేస్తోంది. ఇక ఈ బహుమతి గెలుచుకున్న 40 మంది ఫైనలిస్టుల్లో ఎనిమిది మంది భారతీయ మూలాలున్న యువతీయువకులే కావడం విశేషం. బహుమతి ప్రదానోత్సవంలో ఎస్ఎస్పీ ప్రెసిడెంట్ మాయా అజ్మీరా మాట్లాడుతూ... పురస్కారాన్ని అందుకున్న ప్రతిఒక్కరూ భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా మరింత ఎత్తుకు ఎదగాలని ఆక్షాంక్షిస్తున్నట్లు చెప్పారు. -
డీఎంకేలోకి యువరాజ్
సాక్షి, చెన్నై: తమ దారికి డీఎండీకే అధినేత విజయకాంత్ రాని దృష్ట్యా, ఇక ఆపరేషన్ ఆకర్ష్‌తో ఆ పార్టీ వర్గాల్ని తమ వైపునకు తిప్పుకునే పనిలో డీఎంకే సిద్ధమైంది. ఇందుకు తగ్గ వ్యూహల అమలులో డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ నిమగ్నమయ్యారు. ఉత్తర చెన్నై జిల్లా పార్టీ కార్యదర్శి యువరాజ్, సేలం యూనియన్ నేత షణ్ముగం తమ బుట్టలో పడడంతో, ఇక వారి ద్వారా పావుల్ని కదిపే పనిలో పడ్డారు. డీఎండీకే అధినేత విజయకాంత్‌ను తమ వైపునకు తిప్పుకునేందుకు డీఎంకే ప్రయత్నిం చిన విషయం తెలిసిందే. అ యితే, ఆయన దూరం కావడంతో ఇక, ఆ పార్టీ కేడర్‌ను తమ వైపునకు తిప్పుకునేందుకు డీఎంకే సిద్ధమైంది. విజయకాంత్‌ను సీఎం అభ్యర్థిగా ప్రజా కూటమి ప్రకటించినా, ఆయన నిర్ణయాన్ని తప్పుబట్టే వాళ్లే ఆ పార్టీలో ఎక్కువ. డీఎంకేతో కలసి నడుద్దామని విజయకాంత్ మీద మెజారిటీ శాతం జిల్లాల కార్యదర్శులు ఒత్తిడి కూడా తె చ్చారు. అయితే, తమ అభిప్రాయాల్ని విజ యకాంత్ ఖాతరు చేయకపోవడంతో వారం తా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పవచ్చు. వీరందర్నీ గురి పెట్టి, ప్రస్తుతం ఆపరేషన్ ఆకర్ష్‌కు డీఎంకే దళపతి స్టాలిన్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఉత్తర చెన్నై జిల్లా డీఎండీ కే కార్యదర్శి, విజయకాంత్ సన్నిహితుడు యువరాజ్‌ను తమ వైపునకు తిప్పుకోవడంలో సఫలీకృతులయ్యారు. బుధవారం గోపాలపురంలో అడుగు పెట్టిన యువరాజ్ అధినేత కరుణానిధి సమక్షంలో డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. అలాగే, సేలం యూనియన్ నేత షణ్ముగం నేతృత్వంలో వందకు పైగా ఆ జిల్లాలోని నాయకులు డీఎంకేలోకి చేరడం గమనార్హం. డీఎంకేలో తమ కోసం తలుపులు తెరవడంతో లోనికి అడుగులు పెట్టేందుకు పెద్ద సంఖ్యలో డీఎండీకే జిల్లాల కార్యదర్శులు ఉరకలు తీయడానికి సిద్ధమవుతున్నారని యువరాజ్ ప్రకటించారు. తన లాంటి వారెందరో డీఎంకేతో కలసి అడుగులు వేద్దామని సూచించినా, తమకు విలువ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జయలలిత పతనం లక్ష్యం అంటున్న విజయకాంత్, అందుకు తగ్గ నిర్ణయం తీసుకోకుండా పెద్ద తప్పు చేశారని , ఈ ఎన్నికల ద్వారా ఆయనకు తీవ్ర కష్టాలు, నష్టాలు తప్పదని హెచ్చరించడం గమనార్హం. కాగా, విజయకాంత్‌ను నమ్ముకుని పార్టీ కోసం కోట్లు ఖర్చు పెట్టినా, తమకు ఇంత వరకు ఎలాంటి ప్రయోజనం లేదని, ఇక్కడే ఉండి ఉన్నది రాల్చుకోవడం కన్నా, డిఎంకే తీర్థం పుచ్చుకుని భవిష్యత్తులో ఏదో ఒక పదవినైనా దక్కించుకోవచ్చన్న ఆశాభావంతో జంప్ జిలానీకి జిల్లాల కార్యదర్శులు సిద్ధం అవుతుండడం గమనార్హం. ఇక, ఈ వలసల్ని అడ్డుకునేందుకు విజయకాంత్ తీవ్ర కసరత్తులు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు. యువరాజ్ బయటకు వెళ్లడంతో తక్షణం ఆ పదవిని ఎగ్మూర్ ఎమ్మెల్యే నల్ల తంబి ద్వారా బర్తీ చేశారు. బరిలోకి ఎస్ఎస్పీ: రిటైర్డ్ ఐఎఎస్ అధికారిని శివగామి నేతృత్వంలోని సమూహ సమత్తువ మక్కల్ పడై ఉదయ సూర్యుడి చిహ్నంతో ఎన్నికల బరిలో దిగనుంది. ఈ మేరకు కరుణానిధితో శివగామి భేటీ అయ్యారు. ఒక్క సీటును అప్పగించడంతో డీఎంకే చిహ్నం మీదే పోటీకి శివగామి నిర్ణయించారు. మద్య నిషేధం అమలు లక్ష్యంగా డీఎంకే నిర్ణయం తీసుకోవడంతో ఆ పార్టీతో కలసి ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు సిద్ధమైనట్టు పేర్కొన్నారు.