st case
-
ఎస్సీ ఎస్టీ కేసు విచారణ
పుట్టపర్తి అర్బన్ : రాచువారిపల్లిలో ఇటీవల నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసుకు సంబంధించి ధర్మవరం డీఎస్పీ వేణుగోపాల్ బుధవారం విచారణ చేశారు. దళితుల శ్మశాన వాటికలో రెవెన్యూ సిబ్బంది నాటిన సరిహద్దు రాళ్లను అదే గ్రామానికి చెందిన కొందరు తొలగించడంతో తొమ్మిది మందిపై కేసు నమోదైన విషయం విదితమే. ఆ కేసు విచారణ నిమిత్తం పుట్టపర్తి రూరల్ ఎస్ఐ రాఘవరెడ్డి. సిబ్బందితో కలసి గ్రామానికి వచ్చిన డీఎస్పీ విచారణ చేపట్టారు. -
వలస నేత.. ఎదురీత!
► నియోజకవర్గ ఇన్‌చార్జ్‌తో కుదరని సమోధ్య ► మంత్రులకు ఫిర్యాదు ► రాజీ అంటే పార్టీ నుంచిబయటకే అంటూ హెచ్చరిక ► సీఎం వద్ద పంచాయితీ చేస్తామని బుజ్జగింపు ► టీడీపీలో భగ్గుమన్న విభేదాలు సాక్షి ప్రతినిధి, కర్నూలు: అభివృద్ధి కోసమంటూ ఇటీవలే పార్టీ మారిన ఎమ్మెల్యే అతను. అయితే ఆ నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జ్కు అతనికి పొసగలేదు. పలు మార్లు వారు బహిరంగంగానే విమర్శలు దిగారు. ఈ నేపథ్యంలో పార్టీలో ఇమడలేక వలసనేత ఎదురీదాల్సి వస్తోంది. ఆదివారం కర్నూలులో నిర్వహించిన సమావేశంలో తన ఆవేదనను మంత్రుల ఎదుట వెళ్లగక్కారు. ‘‘ఆయనతో రాజీ అంటే నేను ఒప్పుకునేదే లేదు. అవసరమైతే పార్టీ నుంచి బయటకైనా వెళతాను కానీ కలిసి పనిచేసే ప్రశ్నేలేదు. ఆయన, ఆయన కుమారుడిపై పెట్టిన ఎస్సీ, ఎస్టీ కేసు వ్యవహారంలో నా ప్రమేయం లేదు. వేరే వాళ్లు పెట్టారు’’ అని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, జిల్లా ఇన్చార్జీ మంత్రి అచ్చెన్నాయుడుల సమక్షంలో పార్టీ మారిన ఓ ఎమ్మెల్యే ఖరాఖండిగా తేల్చిచెప్పారు. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యే ఏ మాత్రం సమన్వయం లేకుండా ఇంకా ప్రతిపక్షంగానే వ్యవహరిస్తున్నారని మరో నేత ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రులు జోక్యం చేసుకుని.. ముఖ్యమంత్రి సమక్షంలో పంచాయితీ చేస్తామని ఇరువురి నేతలను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఇరువురి నేతలు మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా సమావేశం నుంచి వెళ్లిపోయారు. పార్టీలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలతో పాటు జిల్లా అధికారులతో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రి అచ్చెన్నాయుడులు ప్రభుత్వ అతిథి గృహంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. గతం నుంచి పార్టీలో ఉన్న నేతలు, తాజాగా పార్టీలో చేరిన నేతల మధ్య సయోధ్య కుదర్చడంతో పాటు అధికారులు చెప్పిన పనులు చేసే విధంగా చేసేందుకు ఉద్దేశించిన సమావేశంలో సయోధ్య ఏ మాత్రమూ కుదరలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. అయితే, అధికారులపై మాత్రం పార్టీ నేతలు చేసిన ఫిర్యాదులపై సదరు అధికారులను పిలిపించి చెప్పిన పనులు చేయాల్సిందేనని ఇన్చార్జీ మంత్రి గట్టిగా మందలించినట్టు తెలిసింది. మాకు తెలియకుండానే బదిలీలా...! ఈ సమావేశంలో ప్రధానంగా ఉద్యోగుల బదిలీలపైనా చర్చ జరిగినట్టు సమాచారం. విద్యుత్‌శాఖలో తమకు తెలియకుండానే ఇంజినీర్లను బదిలీ చేశారని దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్ధ (ఎస్పీడీసీఎల్) ఎస్ఈని పిలిచి నిలదీశారు. ప్రధానంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కొద్ది మందిని మార్చాలని గంగుల ప్రభాకర్ రెడ్డి కోరినట్టు తెలిసింది. అదేవిధంగా కోడుమూరు నియోజకవర్గంలో తనకు తెలియకుండా కొంతమందిని మర్చారని పార్టీ ఇన్చార్జీ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఇక నంద్యాల నియోజకవర్గంలో అధికారులు మాట వినడం లేదని..ఆయన మాటలు వినాల్సిన అవసరం లేదని జిల్లా బాధ్యుడే చెబుతున్నారని ఇన్చార్జీ మంత్రి దృష్టికి ఇంకో నేత ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అంతకు ముందు జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలోనూ ఇదే తరహాలో ఒకరికొకరు ఫిర్యాదు చేసుకున్నట్లు తెలిసింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ విజయమోహన్, జేసీ హరికిరణ్, ఎస్పీ రవికృష్ణతో పాటు అధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి, పార్టీ నేతలు బీసీ జనార్దన్ రెడ్డి, భూమా నాగిరెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి, విష్ణువర్దన్ రెడ్డి, మీనాక్షి నాయుడు, ఎస్వీ మోహన్ రెడ్డి, మణిగాంధీ, కేఈ ప్రతాప్, వీరభద్రగౌడు తదితరులు పాల్గొన్నారు. అయితే, ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం సోదరుడు, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ దూరంగా ఉన్నారు. -
స్నేహితుడే ప్రధాన నిందితుడు!
► ఆర్థిక లావాదేవీల్లో మనస్పర్థలు ► విజయ్ హత్య కేసులో నలుగురికి రిమాండ్ ► 5రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసులు మహబూబ్‌నగర్ క్రైం : ఆర్థిక లావాదేవీల్లో ఏర్పడిన మనస్పర్థలతో ఓ యువకుడిని స్నేహితుడే తుదముట్టించినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ హత్య కేసులో ఎట్టకేలకు నలుగురు నిందితులను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. ఈ వివరాలను శనివారం ఇక్కడ రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ కృష్ణమూర్తి వెల్లడించారు. కొయిలకోండ మండలం కేశ వాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రాజునాయక్తండాలోని ఇస్లావత్ విజయ్‌కుమార్ (35), మహబూబ్‌నగర్ పట్టణం షాషాబ్‌గుట్టకు చెందిన చెన్నంగారి మహేష్ చిన్ననాటి స్నేహితులు. ఇద్దరూ ఒకేచోట చదువుకున్నారు. ఈ క్రమంలోనే కొన్నేళ్ల నుంచి జిల్లా కేంద్రంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్, డైలీ ఫైనాన్స్ నిర్వహిస్తున్నారు. కొన్నేళ్లక్రితం మద్దూర్‌లో ఐదున్నర ఎకరాల భూమి కొనుగోలు చేసి ప్లాట్లు వేశారు. రెండేళ్లక్రితం ఆర్థిక లావాదేవీల్లో మనస్పర్థలు రావడంతో గొడవపడి విడిపోయారు. అనంతరం విజయ్‌కుమార్ ఆ పక్కనే మరో ఎకరం భూమి తీసుకుని పోటీగా వెంచర్ వేశాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ తారస్థాయికి చేరుకోగా స్నేహితులు, కుటుంబ సభ్యులు సర్దిచెప్పారు. రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ చిట్టీల విషయంలో తరచూ అడ్డువస్తున్నాడని ఎలాగైనా తుదముట్టించాలని మహేష్ పథకం పన్నాడు. ఇందులోభాగంగా ఈనెల 23వ తేదీ రాత్రి జిల్లా ప్రధాన ఆస్పత్రి ఎదుట ఉన్న విజయ్‌కుమార్‌పై మహేష్, సోదరుడు చెన్నంగారి నరేష్కుమార్, అరుణ్‌కుమార్, రమేష్ కలిసి కత్తులతో దాడిచేసి చంపేసి పరారీ అయ్యారు. ఈ సంఘటన జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించింది. దీనిపై మృతుడి అన్న ఫిర్యాదు మేరకు హత్యతోపాటు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు జరిపారు. చివరకు శనివారం నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సమవేశంలో టూటౌన్ సీఐ డి.వి.పి.రాజు, భూత్పూర్ సీఐ గిరిబాబు పాల్గొన్నారు. -
కొత్తపేట సీఐపై మహిళాగ్రహం
♦ సీఐ అసభ్యకరంగా మాట్లాడి, బూటుకాలితో తన్నారు ♦ సస్పెండ్ చేసి ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి ♦ ఎస్పీ కార్యాలయం ఎదుట ప్రజా సంఘాల ధర్నా గుంటూరు క్రైం : మహిళా సంఘాల సభ్యులతో అసభ్యంగా, అవమానకరంగా వ్యవహరించిన గుంటూరు కొత్తపేట పోలీస్‌స్టేషన్ ఎస్హెచ్ఓ సీఐ వెంకన్న చౌదరిని విధుల నుంచి తొలగించి, ఎస్సీ,ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు జరపాలని కోరుతూ పలు ప్రజా సంఘాల నాయకులు, మహిళలు ఎస్పీ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా చేపట్టారు. మహిళ అయి వుండీ అసభ్య పదజాలాన్ని వాడిన మహిళా హెడ్ కానిస్టేబుల్ భాగ్యలక్ష్మిని వెంటనే సస్పెండ్ చేసి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎన్.విష్ణు మాట్లాడుతూ సోమవారం మద్యం దుకాణాల లెసైన్స్‌లు కేటాయించే విధానాన్ని నిరసిస్తూ గుంటూరులో ప్రదర్శన చేస్తున్న మహిళలపై కొత్తపేట సీఐ వ్యవహరించిన తీరు అనుచితంగా ఉందని, దీనిపై ఉన్నతాధికారులు విచారించి, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ప్రధాన కార్యదర్శి పద్మ మాట్లాడుతూ తమను సీఐ బూటుకాలుతో తన్ని, అసభ్యకరంగా మాట్లాడుతూ, రక్తం కారేలా కొట్టారన్నారు. సామాజిక న్యాయం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వై.కోటేశ్వరరావు(వైకే) మాట్లాడుతూ సీఐ వెంకన్న చౌదరిపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ ప్రణాళిక రూపొందించుకొని ముందుకు వెళతామని తెలిపారు. అనంతరం అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని కలసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు పి.ప్రసాద్, ఎస్.సురేష్, భావన్నారాయణ, జంగాల అజయ్‌కుమార్, కె.వినయ్‌కుమార్, బి.కొండారెడ్డి, మహిళా సంఘాల నాయకులు శీలం ఏసమ్మ, ఎన్,సాంబ్రాజ్యం, దేవి,అరుణ,ఐద్వా సంఘం మహిళలు పాల్గొన్నారు. -
రోజాపై అక్రమకేసుతో ఆగ్రహం
* నగరిలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో దళితుల ధర్నా, రాస్తారోకో * రాజకీయంగా ఎదుర్కొలేకే తప్పుడు కేసులంటూ ఆగ్రహం విజయపురం (నగరి ) : నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో దళితులు సోమవారం నగరిలో పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఎమ్మెల్యే రోజాపై పెట్టిన అక్రమ కేసు ఎత్తి వేయాలని దళితులు నినాదాలు చేస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్రయువజన కార్యదర్శి శ్యామ్‌లాల్, నత్తం కృష్ణమూర్తి తదితర ఐదు మండలాల దళితనేతల ఆధ్వర్యంలో పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయ సమీపంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద నుంచి ర్యాలీ బయలుదేరి ఓం శక్తి దేవాయలయం వద్దకు చేరుకుంది. అక్కడ దళితులు బైఠాయించి ధర్నా, రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలంటే ఎమ్మెల్యే రోజాకు ఎంతో అభిమానమని, వారి ఇంట జరిగే శుభాకార్యాలకు అందరికి కంటే ముందుగా ఉంటూ వారిని ఆదరిస్తున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు ఎస్సీ, ఎస్టీలపై ప్రత్యేకమైన ప్రేమ ఉన్నట్లు ఇది చేస్తా, అది చేస్తా అని ఆశ చూపించి ఓట్లు దండుకుని ఇప్పుడు అనేక కారణాలు చూపించి మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నగరి మాజీ శాసనసభ్యుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు నేడు దళితులపై కపట ప్రేమను చూపించి తమలో తమకు చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. నిజంగా ఎస్సీ, ఎస్టీల హక్కుల కోసం పోరాడుతున్న ఎమ్మెల్యే రోజా దళిత వ్యతిరేకి అని అభాండాలు వేయించి తమలో చీలిక తేవడానికి ప్రయత్నించే నీచ రాజకీయాలను ఆయన మానుకోవాలని హితవు పలికారు. అటువంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా నెరవేరవ రని, తమ హృదయాల్లో స్థానం సంపాదించి తమ కోసం పోరాడుతున్న నేత ఎవరో తమకు స్పష్టంగా తెలుసునని చెప్పారు. కుట్రపూరిత పన్నాగాలకు తాము లోబడమని హెచ్చరించారు. తమ లో తమకు చిచ్చుపెట్టే ప్రయత్నాలు మానుకోకుంటే టీడీపీకి తగిన గుణపాఠం చెబుతామని, దళితులు టీడీపీలో ఉండే పరిస్థితి లేదని తీవ్రంగా హెచ్చరించారు. ఈ ధర్నా,రాస్తారోకోలో మున్సిపల్ చైర్పర్సన్ కేజే శాంతి, వైస్ చైర్మన్ నీలమేఘం, చంద్రారెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. కొం దరు నాయకులు రాజకీయంగా ఎదుర్కొలేక ఎస్సీ, ఎస్టీలను రెచ్చకొట్టి నడిరోడ్డుకు ఈడుస్తున్నారని వారు విమర్శించారు. దళితనాయకులు ఆర్ముగం, సుబ్రమణ్యం, యోహాన్, యకోబ్, రవి, శీన, వజ్రవేలు, రాజాముత్తు, చిన్నదొర, పిచ్చెమ్మ (కౌన్సిలర్) దినకర్, సీఫెన్, సెల్వం, బాలన్, అమ్ములు, మురుగన్, తెరణిరవి, శేఖర్, కన్నప్ప, గోవర్థన్, శేఖర్, నాటరాజన్, ధనపాల్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, కేజే సురేష్, యువరాజ్, రాజాదాస్, తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీ కేసులను సత్వరం విచారించాలి
* ప్రత్యేక కోర్టు, పోలీస్‌స్టేషన్, లీగల్ సెల్ ఏర్పాటుచేయాలి * గిరిజన కార్పొరేషన్‌ను వెంటనే విభజించాలి * యువజన శిక్షణ కేంద్రాలకు మౌలిక వసతులు కల్పించాలి * టీ సర్కార్‌కు గిరిజన సంక్షేమశాఖ నివేదిక సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్ కులాలు, తెగలపై అత్యాచారాలు, దాడులకు సంబంధించి కేసులను సత్వరం విచారించి నిందితులకు శిక్ష పడేలా చేయాలని గిరిజన సంక్షేమశాఖ తెలం గాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇందుకోసం ప్రత్యేక కోర్టులు, పోలీస్స్టేషన్లు, విడిగా లీగల్‌సెల్‌ను ఏర్పాటుచేయాలని, స్పెషల్ మేజిస్ట్రేట్ పోస్టుల భర్తీని వెంటనే చేపట్టాలని కోరింది. రాష్ర్టంలోని గిరిజనుల సంక్షేమానికి అందిస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను మెరుగైన రీతిలో అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ, ప్రభుత్వపరంగా అందాల్సిన సహాయం, ఆయారంగాలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, సూచనలు, సలహాలతో ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించింది. ఈ మేరకు పలు ప్రతిపాదనలు చేసింది. రాష్ర్ట విభజన జరిగినప్పటికీ గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని ట్రైకార్, ట్రిప్కో, ట్రిమ్‌కో, గిరిజన సహకార సంఘాలను విభజించకపోవడం వల్ల ఆయా పథకాలు, కార్యక్రమాల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. షెడ్యూ ల్ ఏరియాల్లో నివసిస్తున్న షెడ్యూల్ తెగల వారి సమగ్ర ఆర్థికాభివృద్ధి పూర్తిగా నిలిచిపోయింది. వెంటనే కార్పొరేషన్లను విభజించి సీనియర్ అధికారులకు పూర్తి బాధ్యత అప్పగిస్తే వీటి నిర్వహణ సజావుగా సాగుతుంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ లో గిరి జనుల జనాభా 9.34 శాతం (2011 జనాభా లెక్కల ప్రకారం) అని స్పష్టమైంది. అయితే, ఉ న్న ఒకేఒక అదనపు డెరైక్టర్ పోస్టు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. గిరిజన జనాభా దృష్ట్యా ఆయా పథకాలను సమర్థవంతంగా అమలు చే సేందుకు తెలంగాణకు అదనపు డెరైక్టర్ పోస్టును, ఇతర సిబ్బందిని మంజూరుచేయాలి. నిర్మాణదశలో ఉన్న ఇరవై యువజన శిక్షణా కేంద్రాల్లో మౌలికసదుపాయాలు కల్పించడంతో పాటు జాతీయస్థాయిలో శిక్షణను అందించి వారికి మార్గదర్శనం చేయడం, ఉపాధిని కల్పించేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని ఎప్పటికప్పుడు అందించాలి. అత్యంత వెనుకబడిన చెంచు. తోటి. కోలామ్, కొండారెడ్డి గిరిజన తెగల కోసం ఆర్థిక సహాయ పథకాలకు అందజేస్తున్న 60 శాతం సబ్సిడీని 80 శాతానికి (గ్రూపులకు గరిష్టంగా రూ.లక్ష వరకు) పెంచాలి. విద్యాహక్కు చట్టంలో భాగంగా గిరిజనుల పిల్లలకు విద్యనందించేందుకు చర్యలు తీసుకోవాలి. కనీస టీచర్, విద్యార్థి నిష్పత్తి ప్రాథమిక పాఠశాలల్లో 1:30, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1:35, హైస్కూల్లో 1:40 ఉండేలా చూడాలి. ప్రస్తుతం పెద్ద సంఖ్యలో టీచర్ల ఖాళీలు ఉండడంతో అనుకున్న ధ్యేయం నెరవేరడం లేదు. గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలలు, గురుకులాల్లో కలుపుకుని దాదాపు 3,800 టీచర్‌పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మైదానప్రాంతాల్లోని ఆశ్రమ పాఠశాలల్లోనూ ప్రమాణాలు పాటించి, నాణ్యమైన విద్యనందించేందుకు టీచర్పోస్టులను మంజూరు చేయాలి. తొమ్మిది జిల్లాల్లోని మైదాన ప్రాంతాల్లోని ఆశ్రమ పాఠశాలకు 1,500 టీచర్ పోస్టులను మంజూరు చేయాలి. కాగా, ఇటీవల జరిగిన సంక్షేమరంగ టాస్క్‌ఫోర్స్ సమావేశంలోనూ గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ వివిధ ప్రతిపాదనలు, ప్రభుత్వపరంగా వెంటనే తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ ఒక నివేదికను సమర్పించారు. -
గల్లా రామచంద్రనాయుడుపై ఎస్సీ, ఎస్టీ కేసు
రేణిగుంట: అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత గల్లా రామచంద్ర నాయుడిపై రేణిగుంట పోలీసులు శనివారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. తిరుపతి రూరల్ మండలం పేరూరుకు చెందిన కేశవులు, పుదిపట్లకు చెందిన శ్రీరాములు శుక్రవారం కోడూరుకు వెళ్తుండగా కరకంబాడి రైల్వే గేటు వద్ద వీరికి ఎదురుగా వచ్చిన గల్లా రామచంద్రనాయుడు ‘‘సాధారణ ఎన్నికల్లో మాకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తారా.. మీ అంతుచూస్తాం’’ అంటూ తమను కులం పేరుతో దూషించి, దాడికి యత్నించినట్లు కేశవులు, శ్రీరాములు రేణిగుంట డీఎస్పీ కార్యాలయంలో శనివారం ఫిర్యాదుచేశారు. ఆ సమయంలో డీఎస్పీ శ్రీనివాస్ లేకపోవడంతో ఆయన సీసీ ప్రసాద్ రాజు ఫిర్యాదును స్వీకరించారు. సాయంత్రం డీఎస్పీ ఆదేశాల మేరకు సీఐ రామచంద్రారెడ్డి క్రైమ్ నంబర్ 138-14 కింద ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు.