Stamping
-
పుట్టినవాడు గిట్టక తప్పదు
లక్నో: హత్రాస్ తొక్కిసలాట తనను తీవ్రంగా కలచివేసిందని, అయితే విధిరాతను ఎవరూ తప్పించలేరని భోలే బాబా అన్నారు. అందరూ ఏదో ఒకరోజు మరణించక తప్పదని వేదాంతం వల్లెవేశారు. భోలే బాబా సత్సంగ్‌లో తొక్కిసలాటలో ఇటీవల 121 మంది మరణించడం తెలిసిందే. బుధవారం ఆయన పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. ‘పుట్టినవాడు ఏదో ఒకరోజు గిట్టక తప్పదు. కాస్తా ముందూ వెనకా అంతే’ అన్నారు. తొక్కిసలాట వెనుక కుట్ర ఉందని పునరుద్ఘాటించారు. ‘జూలై 2 దుర్ఘటన తర్వాత నేను తీవ్ర నిరాశకు లోనయ్యా, కలత చెందా. కానీ జరిగేదాన్ని ఎవరూ తప్పించలేరు. విషపూరిత రసాయనాలను స్ప్రే చేశారని నా న్యాయవాది, ప్రత్యక్షసాక్షులు చెప్పింది ముమ్మాటికీ నిజం. దీనివెనుక కచి్చతంగా కుట్ర ఉంది’ అని బాబా పేర్కొన్నారు. -
స్టాంపింగ్ తంటా.. మధు యాష్కీ ట్వీట్ వైరల్
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు స్టాంప్ వేయడానికి ఉపయోగించే సిరా నాణ్యతపై ఆందోళకర విషయం వెలుగులోకి వచ్చింది. విదేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు వేసే స్టాంపింగ్ తరువాత తన చేతిపైవచ్చిన కెమికల్ రియాక్షన్ గురించి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మధుయాష్కీగౌడ్ ట్వీట్ చేశారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఉపయోగిస్తున్న ఇంక్ కారణంగా తన చేతికి ఇన్ఫెక్షన్ వచ్చిందంటూ కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరికి ట్యాగ్ చేశారు. దీన్ని పరిశీలించాలంటూ సంబంధిత ఫోటోలను పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌పై స్పందిస్తూ హర్దీప్ పూరి ఎయిర్పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌తో మాట్లాడినట్లు తెలిపారు. మంత్రి సత్వర స్పందనపై మధు యాష్కీ సంతోషం వ్యక్తం చేశారు. తనలాంటి అనుభవం మరో ప్రయాణికుడికి రాకూడదని కోరుకున్నారు. అటుఈ అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ స్పందించిన ఢిల్లీ విమానాశ్రయ అధికారులు ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చినందుకు మధుయాష్కీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. కరోనా మహమ్మారి విలయంతరువాత విదేశీ విమాన ప్రయాణీకులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల క్వారంటైన్ నిబంధనల కనుగుణంగా కొన్ని విమానాశ్రయాలలో స్టాంపింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా గడిచిన 24 గంటల్లో 74,441 కరోనా కేసులతో, ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 66,23,815కు చేరింది. మరణించిన వారి సంఖ్య 1,02,695 గా ఉంది. Dear @HardeepSPuri Ji, can you please look into the chemical being used at Delhi airport for stamping on passengers coming from abroad? Yesterday I was stamped at @DelhiAirport and this is how my hands look now. pic.twitter.com/Gt1tZvGc8L — Madhu Goud Yaskhi (@MYaskhi) October 4, 2020 -
విమాన ప్రయాణీకులకు శుభవార్త!
న్యూఢిల్లీ: విమానం ప్రయాణం అంటే లగేజీ స్కానింగ్..హ్యాండ్ బ్యాగుల సెక్యూరిటీ తనిఖీలు ఓ పెద్ద తతంగం. అయితే ఇక విమాన ప్రయాణీకుల హ్యాండ్ బ్యాగుల స్టాంపింగ్, ట్యాగింగ్ సమస్యలకు ఇక శుభం కార్డు పడినట్టే. ఈ మేరకు సివిల్ ఏవియేషన్ బ్యూరో ఒక కొత్త పైలట్ ప్రాజెక్టు కు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల పూర్తి భద్రతను నిర్వహించే సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ బ్యూరో (బీసీఏఎస్) అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చెకింగ్ వ్యవస్థను గురువారం ప్రారంభించింది. హై రిజల్యూషన్ సీసీటీవీ కెమెరాలు, సంబంధిత ఇతర టెక్నాలజీతో సహాయంతో హ్యాండ్ బ్యాగుల తనిఖీని మరింత కట్టుదిట్టంగా చేపట్టనున్నారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, కోలకతా, అహ్మదాబాద్ విమానాశ్రయాల్లో ప్రయోగాత్మకంగా (పైలట్ ప్రాజెక్ట్) ఈ ప్రక్రియను మొదలు పెట్టింది. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే ఈ పద్ధతిని అన్ని విమానాశ్రయాల్లో ప్రారంభించనున్నట్టు సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సామాను భద్రత, స్క్రీనింగ్ సౌకర్యాన్ని బలోపేతం చేయడానికి, ప్రయాణీకులకు హ్యాండ్ బ్యాగు టాగ్స్ , స్టాంపింగ్ కష్టాలను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఈ పద్థతిని అవలంబిస్తున్నట్టు చెప్పింది. బాధ్యత బీసీఏఎస్ ది. -
చుక్క చుక్కకూ మోసం
పెట్రోల్ బంకుల్లో దగా తూనికలు, కొలతల శాఖ స్పెషల్ డ్రైవ్ వరుసగా ఐదు రోజులు దాడులు అక్రమాల గుర్తింపు సిటీబ్యూరో: కొలతల్లో చేతివాటం... డిస్ప్లేలో దగా... స్టాంపింగ్ లేకుండా నిర్వహణ... ఇదీ గ్రేటర్ హైదరాబాద్‌లోని పెట్రోల్ బంక్‌ల తీరు. తూనికలు, కొలతల శాఖ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా తాజాగా ఐదు రోజుల పాటు నిర్వహించిన దాడుల్లో బంకుల అక్రమాలు బహిర్గతమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 7 నుంచి 11 వరకు దాడులు చేసి... తక్కువ పెట్రోల్ పోయడం... స్టాంపింగ్ లేని 37 బంకులపై కేసులు నమోదు చేసినట్లు రాష్ట్ర తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ గోపాల్ రెడ్డి శుక్రవారం వెల్లడించారు. మొత్తం కేసుల్లో 19 గ్రేటర్లో నమోదయ్యాయి. వీటిలో నగరంలో 8... శివార్లలో 11 బంకులు ఉండటం గమనార్హం. ఏడాది క్రితం స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్వోటీ) పోలీసులు, తూనికలు, కొలతల శాఖ దాడుల్లో ఫిల్లింగ్ మిషన్ల సాఫ్ట్‌వేర్‌లో ప్రత్యేక చిప్‌లు ఏర్పాటు చేయడం... రిమోట్ కంట్రోలింగ్ మోసాల వంటివి బయటపడ్డాయి. అప్పట్లో అధికారులు కేవలం నోటీసులు జారీ చేసి... జరిమానాలతో సరిపెట్టారు. దీంతో మోసాలకు అడ్డుకట్ట పడలేదు. ప్రతి లీటర్‌కు 20 ఎంఎల్ కోత గ్రేటర్ హైదరాబాద్ పెట్రోల్ బంకుల్లో డీలర్లు భారీగా చేతివాటం చూపుతున్నారు. ప్రతి లీటర్‌కు సగటున 8 నుంచి 20 ఎంఎల్ వరకు తక్కువగా ఉంటోంది. తాజాగా కుత్బుల్లాపూర్‌లో ఐఓసీకి చెందిన విజయా ఫిల్లింగ్ స్టేషన్‌పై అధికారులు దాడులు చేశారు. అక్కడ కొలతల తీరు పరిశీలించి... భారీగా తేడా ఉన్నట్టు గుర్తించారు. ధరలోనూ మాయ పెట్రోల్, డీజిల్ ధరల హెచ్చు, తగ్గుల సమయాల్లోనూ డీలర్లు హస్తలాఘవం ప్రదర్శిస్తున్నారు. నేరుగా రిమోట్, కీ ప్యాడ్, హ్యాండిల్ టెర్మినేషన్, మాన్యువల్విధానాల్లో మార్పు చేస్తున్నారు. తూనికల, కొలతల శాఖ నిబంధనల ప్రకారం సంబంధిత అధికారుల పర్యవేక్షణలో మెమోరైజ్డ్ ప్రింటెడ్ మార్పిడి చేయాలి. కానీ ఆయిల్ కంపెనీల నుంచి ధరలకు సంబంధించిన సమాచారం అందగానే డీలర్లు, ఉద్యోగులు అంచనా మేరకు మార్పులు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. లాక్ ఏదీ? తూనికల, కొలతల శాఖ అధికారులు ఏడాదికోసారి కొలతలను పరిశీలించి... ఫిల్లింగ్ మిషన్‌కు సీల్‌వేసి స్టాంపింగ్ చేస్తారు. దీని కోసం డీలర్లు ఏటా గడువు కంటే పక్షం రోజుల ముందు సంబంధిత శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. తూనికలు, కొలతల శాఖతో పాటు ఆయిల్ కంపెనీల అధికారులు, ఇద్దరు టెక్నీషియన్ల సమక్షంలో కొలతలు పరిశీలించి... స్టాంపింగ్ చేస్తారు. కానీ ఎక్కడా కీ ప్యాడ్లకు లాక్ కనిపించడం లేదు. కేంద్ర తూనికలు, కొలతల చట్టం-2009 సెక్షన్ 22 ప్రకారం బంకులలో రిమోట్ వినియోగించడం నిబంధలకు వ్యతిరేకం. ఇది బాహాటంగా సాగడం అధికారుల తీరుకు అద్దం పడుతోంది.