‘ఆధార్’ యంత్రాలకు ఎస్టీక్యూసీ తప్పనిసరి
న్యూఢిల్లీ: ఆధార్‌ను ధ్రువీకరించేందుకు ఉపయోగించే అన్ని యంత్రాలకు జూన్ 1 నుంచి ఎస్టీక్యూసీ(స్టాండర్డైజేషన్ టెక్నిక్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్) తప్పనిసరి కానుంది. ఈ మేరకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
ఆధార్ సమాచారానికి మరింత భద్రత కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. కొత్త నిబంధల ప్రకారం ఎస్టీక్యూసీ లేని యంత్రాలతో జూన్ 1 నుంచి ఆధార్‌ను ధ్రువీకరించటం కుదరదు.