Standoff
-
నిలిచిన బందీల విడుదల!
జెరుసలేం: ఇజ్రాయెల్–హమాస్ బందీల విడుదల ఒప్పందానికి రెండో రోజే అవాంతరం ఎదురైంది. శనివారం దాదాపు 14 మంది ఇజ్రాయెలీలను వదిలేయాల్సిన హమాస్ అడ్డం తిరిగింది. గాజాకు అత్యవసర సాయం అందడంలో ఆలస్యంపై కినుక వహించింది. ఒప్పందంలో భాగంగా గాజాకు మరింత సాయాన్ని అనుమతించేందుకు ఇజ్రాయెల్ అంగీకరించడం తెలిసిందే. ఆ మేరకు గత రెండు రోజుల్లో 340కి పైగా ట్రక్కులు ఈజిప్టు వైపు నుంచి రఫా క్రాసింగ్ దాటాయి. కానీ ఇప్పటికీ అవి గాజాకు చేరుకోకపోవడంపై హమాస్ ఆగ్రహంగా ఉంది. వాటన్నింటినీ అనుమతించడంతో పాటు మరింత సాయం కూడా అందాల్సిందేనని పట్టుబడుతోంది. అప్పటిదాకా బందీలను వదిలేది లేదని చెప్పడంతో గందరగోళం నెలకొంది. అయితే గాజాలోకి వెళ్తున్న ట్రక్కులన్నింటినీ క్షుణ్నంగా తనిఖీ చేసి గానీ పోనిచ్చేది లేదని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. దానికి సమయం పడుతోంది తప్ప మరేమీ లేదని చెప్పింది. ఈ నేపథ్యంలో కాస్త ఆలస్యమైనా ఒప్పందం మేరకు బందీల విడుదల ప్రక్రియ కొనసాగుతుందని ఇజ్రాయెల్ విశ్వాసం వెలిబుచి్చంది. ఇజ్రాయెల్–హమాస్ మధ్య బుధవారం నాలుగు రోజుల కాల్పుల విరామణ ఒప్పందం కుదరడం తెలిసిందే. అందులో భాగంగా 50 మంది ఇజ్రాయెలీ బందీల విడుదలకు హమాస్, ప్రతిగా 150 మంది పాలస్తీనియా ఖైదీలను వదిలేసేందుకు ఇజ్రాయెల్ అంగీకరించాయి. గాజాకు మరింత అత్యవసర సాయాన్ని అనుమతించేదుకు కూడా ఇజ్రాయెల్ ఒప్పుకుంది. శుక్రవారం తొలి రోజు 24 మందిని హమాస్, 39 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ విడుదల చేశాయి. శనివారం 14 మందిని వదిలేయనున్నట్టు హమాస్ ప్రకటించింది. 42 మంది పాలస్తీనియన్లను విడుదల చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
ఊహించని పరిణామం: వెనక్కి తగ్గిన చైనా
న్యూఢిల్లీ: సరిహద్దు దేశం చైనా కవ్వింపు చర్యలతో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన విషయం తెలిసిందే. సరిహద్దులో గుంటనక్కలా వేచి చూస్తున్న చైనా చివరకు ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. సరిహద్దు వివాదంపై చైనా రక్షణ శాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. భారత్‌లోని తూర్పు లద్దాఖ్‌లో పాంగాంగ్ సరస్సు నుంచి తమ బలగాలను వెనక్కి తీసుకున్నట్లు చైనా రక్షణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన జారీ అయ్యింది. భారత బలగాలు కూడా వెనక్కి వెళ్లిపోతున్నాయని చైనా తెలిపింది. కమాండర్ల స్థాయి చర్చలు ఫలించాయి. ఆ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనా వెల్లడించింది. తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. గాల్వాన్ లోయలో భారత్-చైనా బలగాల మధ్య ఘర్షణ మొదలు.. ఇప్పటి వరకు సరిహద్దుల వెంట తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. సరిహద్దుల్లో భద్రతా బలగాలు భారీగా మోహరించడంతో యుద్ధ వాతావరణం ఏర్పడింది. పరిస్థితి రోజురోజుకు తీవ్రంగా మారడం.. ఎప్పుడైనా యుద్ధం జరుగుతుందేమో అనే దాక పరిస్థితి వచ్చింది. చివరకు అకస్మాత్తుగా చైనా వెనక్కి తగ్గింది. గాల్వాన్ ఘటన నుంచి ఇరు దేశాల సైనికాధికారులు చేస్తున్న చర్చలు ఇప్పటికీ ఫలించాయి. కమాండర్ల స్థాయి చర్చల తర్వాత ఇరు దేశాలు తమ సైన్యాన్ని సరిహద్దుల్లోంచి ఉపసంహరించుకోవాలని నిర్ణయించాయి. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. -
‘సరిహద్దు ఉద్రిక్తతలకు చెక్’
సాక్షి, న్యూఢిల్లీ : లడఖ్‌లో నియంత్రణ రేఖ వెంబడి భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలను నివారించేందుకు ఈనెల 6న ఇరు దేశాల సీనియర్ కమాండర్ స్ధాయి సైనిక సంప్రదింపులు జరగనున్నాయి. భారత్-చైనాల సీనియర్ సైనికాధికారుల సమావేశం ఈనెల 6న జరుగుతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ధ్రువీకరించారు. లడఖ్‌లో నియంత్రణ రేఖ వెంబడి చైనా తన సైన్యాన్ని గణనీయంగా మోహరించిందని భారత్ అప్రమత్తమై తగు చర్యలు చేపట్టింని ఆయన చెప్పారు. సరిహద్దు వివాదం నేపథ్యంలో పెరిగిన ఉద్రిక్తతలను నిరోధించేందుకు ఇరు దేశాలకు చెందిన సీనియర్ సైనికాధికారుల సంప్రదింపులు జరుపుతారని చెప్పారు. కాగా మే 5న తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్ తీరంలో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణతో నెలరోజులుగా ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తత నెలకొంది. లడఖ్ ఘర్షణల అనంతరం మే 9న ఇండో-చైనా సరిహద్దు ప్రాంతంలోని సిక్కిం సెక్టార్ నకులా పాస్ వద్ద ఇరు దేశాల సైనికులు ముఖాముఖి తలపడటంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభవన మొదలైన తర్వాత ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు పక్షాలకు చెందిన బెటాలియన్, బ్రిగేడ్ స్ధాయిలో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఇరు దేశాల సైన్యం మధ్య ఉద్రిక్తతలను నివారించేందుకు దౌత్య మార్గాల్లో ప్రయత్నాలు సైతం ఊపందుకున్నాయి. చదవండి : బాయ్‌కాట్ చైనా -
ఆర్బీఐ సొమ్ము కోరలేదు..
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్బీఐ మిగులు నిల్వల నుంచి రూ 3.6 లక్షల కోట్లు బదిలీ చేయాలని ప్రభుత్వం కోరుతోందన్న వార్తలను కేంద్రం శుక్రవారం తోసిపుచ్చింది. ఆర్బీఐ నిల్వల నుంచి సొమ్మును తమకు బదలాయించాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని సాగుతున్న ప్రచారం నిరాధారమని, ఇవి కేవలం ఊహాగానాలేనని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ద్రవ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, ఆర్బీఐ నిల్వలను బదిలిచేయాలన్న వార్తలు నిరాధారమైనవని పేర్కొన్నారు. ఆర్బీఐ కోసం తగిన ఆర్థిక మూలధన కార్యాచరణ కసరత్తు కేవలం ప్రతిపాదన దశలో ఉందని తెలిపారు. ప్రభుత్వం ద్రవ్య లోటును 5.1 శాతం నుంచి విజయవంతంగా నియంత్రిస్తూ వస్తోందన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును 3.3 శాతానికి తగ్గిస్తామన్నారు. కాగా ఆర్బీఐ వద్దనున్న రూ 9.59 లక్షల కోట్ల నుంచి రూ 3.6 లక్షల కోట్లను బదలాయించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనే ఆర్బీఐ-కేంద్ర ప్రభుత్వం మధ్య ప్రతిష్టంభనకు కేంద్రబిందువని ఓ వర్గం మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తల నేపథ్యంలో ప్రభుత్వం వ్యవస్ధలను వ్యూహాత్మకంగా నిర్వీర్యం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై విమర్శలతో విరుచకుపడింది. -
పారిస్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
-
చనిపోయి 11నెలలైంది..ఆయన బతికొస్తారా?
ప్రపంచం ఓవైపు సాంకేతికపరంగా దూసుకెళుతుంటే...మరోవైపు ప్రజలు మాత్రం మూఢనమ్మకాలతో సహ జీవనం చేస్తూనే ఉన్నారు. హర్యానాలో వివాదాస్పద గురువు రాంపాల్ ఘటన మరవక ముందే...పంజాబ్‌లోని జలంధర్‌లో మరో సంఘటన చోటుచేసుకుంది. 'స్వామి' భక్తి తారాస్థాయికి చేరటంతో ..చివరకు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే జలంధర్‌లో అశుతోష్ మహారాజ్ అనే స్వామీజీ మరణిస్తే ..భక్తులు మాత్రం ఆయనకి అంత్యక్రియలు చేసేందుకు ఇప్పటికీ ఒప్పుకోవటం లేదు. అది కూడా ఒకరోజు...రెండు రోజులు కాదు ఏకంగా...11నెలలుగా స్వామిజీకి అంతిమ సంస్కారాలు నిర్వహించటం లేదు. స్వామీజీ బతికొస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది జనవరి 29 తేదీన అశుతోష్ మహారాజ్ మరణించగా అప్పటి నుంచి ఆయన మృతదేహాన్ని ఫ్రీజర్‌లో భద్రపరిచారు. దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాంతో హైకోర్టు జ్యోకం చేసుకుని అశుతోష్ మహారాజ్ ..వైద్యపరంగా మరణించినట్లు ప్రకటించినా భక్తులు మాత్రం తమ పట్టు వీడటం లేదు. ఎక్కడ స్వామీజీకి బలవంతంగా అంత్యక్రియలు నిర్వహిస్తారో అనే భయంతో... ఆయన భౌతికకాయానికి కాపలా కాస్తున్నారు. దాంతో అశుతోష్ మహారాజ్ అంత్యక్రియలు డిసెంబర్ 15లోగా నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. గత 48 గంటలుగా దివ్యజ్యోతి జాగృతి సంస్థాన్ ఆశ్రమం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటంతో పోలీసులు భారీగా మోహరించారు. కాగా న్యాయస్థానం తీర్పుపై అసంతృప్తిగా ఉన్న కొంతమంది భక్తులు పైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధం అవుతున్నారు.