ముగిసిన ఐపీఎల్ వేలం.. 'స్టార్' చేతికి టీవీ ప్రసార హక్కులు
గత రెండ్రోజులుగా ముంబైలో జరుగుతున్న ఐపీఎల్ మీడియా హక్కుల వేలం మంగళవారంతో ముగిసింది. టీవీ ప్రసార హక్కుల కోసం సోనీ నెట్‌వర్క్‌తో రసవత్తరంగా సాగిన పోటీలో స్టార్ నెట్వర్క్ పైచేయి సాధించింది. ఐపీఎల్ 2023 నుంచి 2027 సీజన్ వరకు టీవీ ప్రసార హక్కులను స్టార్ నెట్వర్క్ రూ.23,575 కోట్లకు దక్కించుకుంది.
ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను రిలయన్స్ చెందిన ‘వయాకామ్–18’, టైమ్స్ ఇంటర్నెట్ సంస్థలు 23,773 కోట్లకు సొంతం చేసుకోగా.. టీవీ ప్రసార హక్కులను స్టార్ నెట్వర్క్ మరోసారి చేజిక్కించుకుంది. 2018-22 సీజన్లో స్టార్ నెట్వర్క్ తొలిసారి ఐపీఎల్ టీవీ ప్రసార హక్కులను దక్కించుకుంది. మొత్తంగా ఐపీఎల్ 2023-27 సీజన్ మీడియా హక్కుల విక్రయం ద్వారా బీసీసీఐకి 48,390.52 కోట్ల భారీ ఆదాయం సమకూరింది.
ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం జరిగిన బిడ్డింగ్‌లో వయాకామ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, సోనీ పిక్చర్స్, జీ గ్రూప్, అమెజాన్, గూగుల్, స్కై స్పోర్ట్స్, ఫ్యాన్ కోడ్, ఎంఎక్స్ ప్లేయర్, సూపర్ స్పోర్ట్, ఫేస్బుక్, యాపిల్ వంటి కార్పొరేట్ దిగ్గజ సంస్థలు పోటీపడగా స్టార్ నెట్వర్క్ భారీ మొత్తం చెల్లించి మీడియా హక్కులను సొంతం చేసుకుంది.
చదవండి: ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ రికార్డు బద్దలు కొట్టిన ఐపీఎల్