Star player
-
దుబాయ్‌లో ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ ఇల్లు: దిమ్మతిరిగే ఫీచర్లు
దుబాయ్‌లో బ్రెజిలియన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు నేమార్ జూనియర్ అత్యంత ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశాడు. దుబాయ్‌లోని బుగాట్టి రెసిడెన్స్‌లో ఉన్న ఈ పెంట్‌హౌస్ విలాసవంతమైన జీవన కళాఖండ మంటున్నారు నిపుణులు.తాజా కొనుగోలుతో ఈ ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ తన రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోలో లగ్జరీ పెంట్‌హౌస్‌ను కూడా జోడించాడు. దీని ధర రూ.456 కోట్లు. అంతేకాదు దుబాయ్‌లోని బిజినెస్ బే ప్రాంతంలో నిర్మిత మవుతున్న ఇది ప్రపంచంలోని తొలి బుగాట్టి బ్రాండెడ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లలో భాగం. ఫ్రెంచ్ రివేరా- ఆధారిత ప్రైవేట్ బీచ్‌తో పాటు ఇందులో నివసించేందుకు వీలుగా లగ్జరీ ఫీచర్లను అందించారు. ఈ ఆకాశహర్మ్యం (స్కై మాన్షన్) 44,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇక్కడి నుంచి దుబాయ్ అందాలను వీక్షించడమే కాదు, మార్బుల్ బార్ కౌంటర్, కుషన్డ్ కుర్చీలతో కూడిన హై-ఎండ్ బార్, ప్రైవేట్ పూల్‌తోపాటు లగ్జరీ కార్లను నేరుగా అతని పెంట్ హౌస్‌లో పార్క్ చేయడానికి వీలుగా ప్రత్యేక కార్ లిఫ్ట్ లాంటి అత్యాధునిక సౌకర్యాలున్నాయి. ఐవరీ అండ్ బ్లాక్-థీమ్‌తో బెడ్రూమ్స్, గ్రిల్స్, కర్టెన్లు, కుషన్లు సోఫా మరింత ఆకర్షణగా నిలుస్తున్నాయి. View this post on Instagram A post shared by AZR (@azrorganization) -
Manpreet Singh: ‘లాస్ట్’ ఏంజెలిస్!
న్యూఢిల్లీ: ఒకవేళ ఫిట్నెస్ సహకరిస్తే...2028లో జరిగే లాస్ ఏంజెలిస్ (ఎల్ఏ) ఒలింపిక్స్‌లోనూ ఆడి కెరీర్‌కు గుడ్‌బై చెబుతానని భారత హాకీ జట్టు స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ తెలిపాడు. 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మూడేళ్ల క్రితం టోక్యో విశ్వక్రీడల్లో కాంస్య పతకాన్ని గెలిచిన భారత జట్టుకు మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వం వహించాడు. తాజా పారిస్ ఒలింపిక్స్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత్ కాంస్య పతకాన్ని నిలబెట్టుకుంది. ఈ విజయంలోనూ కీలకపాత్ర పోషించిన మన్‌ప్రీత్ వరుస ఒలింపిక్స్ పతకాల్లో భాగమయ్యాడు. ఇప్పటివరకు నాలుగు ఒలింపిక్స్ ఆడిన మన్‌ప్రీత్ దిగ్గజాలు ఉధమ్ సింగ్, లెస్లీ క్లాడియస్, ధనరాజ్ పిళ్లై, ఇటీవలే రిటైరైన గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ సరసన నిలిచాడు. భారత హాకీకి శ్రీజేశ్ చేసిన సేవలు అందరికీ తెలుసని అన్నాడు. అతనో గ్రేటెస్ట్ ప్లేయర్ అని కితాబిచ్చాడు. సరిగ్గా ఒలింపిక్స్‌కు ముందు స్విట్జర్లాండ్‌లో మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన శిబిరం జట్టుకు బాగా ఉపకరించిందన్నాడు. ఓ ఇంటర్వ్యూలో 32 ఏళ్ల స్టార్ మిడ్‌ఫీల్డర్ తన భవిష్యత్ లక్ష్యాలతో పాటు వరుస ఒలింపిక్ పతకాలపై తన మనోగతాన్ని వివరించాడు. లక్ష్యం ఎల్ఏ–2028 ‘లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌ను లక్ష్యంగా పెట్టుకున్నాను. అయితే ఇది సాధించాలంటే నేను పూర్తిస్థాయి ఫిట్నెస్తో ఉండాలి. నేను ఇలాగే ఫామ్‌ను కొనసాగిస్తూ... ఫిట్నెస్ను కాపాడుకుంటేనే లక్ష్యం చేరుకోగలను. ఇప్పుడు హాకీలో ఫిట్నెస్ ప్రధాన భూమిక పోషిస్తోంది. మైదానంలో చురుకైన పాత్రకు ఇదే కీలకం. ఆ తర్వాతే మిగతావన్నీ’ అని మన్‌ప్రీత్ చెప్పాడు. అదృష్టవశాత్తూ ఈ వెటరన్ స్టార్ సుదీర్ఘ కెరీర్లో చెప్పుకోదగ్గస్థాయిలో గాయాల బారిన పడలేదు. 378 అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌లాడిన అతను 44 గోల్స్ చేశాడు. వరుస ఒలింపిక్ పతకాలు ‘ఏ అథ్లెట్ లక్ష్యమైనా ఒలింపిక్ పతకమే! అది ప్రతిఒక్కరి కల. మేం మూడేళ్ల క్రితం టోక్యోలో... ఇప్పుడేమో పారిస్‌లో ఇలా వరుస ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. కొన్ని దశాబ్దాల తర్వాతే భారత్... హాకీలో ఇలా వరుస విశ్వక్రీడల్లో పతకాలు గెలిచింది. నేను ఇప్పటివరకు నాలుగు ఒలింపిక్స్ ఆడాను. తొలి రెండు మెగా ఈవెంట్లలో పతకాల్లేవు. కానీ తర్వాత రెండు ఈవెంట్లలో పతకం కల నెరవేరడంతో నా ఆనందానికి హద్దుల్లేవు’ అని హర్షం వ్యక్తం చేశాడు. జట్టు కోసం ఏ పాత్రకైనా... పారిస్‌లో బ్రిటన్‌తో జరిగిన కా>్వర్టర్ ఫైనల్ పోరులో అమిత్ రోహిదాస్‌కు ‘రెడ్ కార్డ్’ పడటంతో జట్టు పది మందితోనే ఆడాల్సి వచి్చంది. అప్పుడు మన్‌ప్రీత్ డిఫెండర్‌గా రక్షణపంక్తిలో ఉండి జట్టును ఆదుకున్నాడు. ‘నేను దేనికైనా సిద్ధంగా ఉంటాను. జట్టు అవసరాల కోసం నా స్థానం మారినా, ఎక్కడ సర్దుబాటు చేసినా సరే! జట్టు ఏం డిమాండ్ చేస్తే అదే పని నేనూ చేస్తాను. ఇందుకోసం నేను శిక్షణ తీసుకున్నా. ప్రొ లీగ్ హాకీ మ్యాచ్‌ల్లో ఆదే చేశాను. కాబట్టే నా స్థానం మారినా నాకే బెంగ ఉండదు. కష్టమని అనిపించదు. జట్టులో నేను ఎంత కీలకమో... నా బాధ్యతలెంటో నాకు బాగా తెలుసు. మా ప్రణాళికల్ని అమలు చేసేందుకు ఎల్లప్పుడు రెడీగా ఉంటాను’ అని అన్నాడు. మెడలో పతకం... పక్కన భార్యాపిల్లలు! భార్యాపిల్లల సమక్షంలో పతకం గెలుపొందడం చాలా ఆనందాన్నిచి్చందని చెపుకొచ్చాడు. ‘పతకాల ప్రదానోత్సవం ముగిసిన వెంటనే నా భార్య ఇలి నజ్వా సాదిక్ (మలేసియన్), కుమార్తె జాస్మిన్ గ్రౌండ్లోకి రావడం... వారితో నేను సాధించిన పతకం, నా సంతోషం పంచుకోవడం చాలా గొప్ప అనుభూతినిచి్చంది’ అని మన్‌ప్రీత్ చెప్పాడు. మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో తాను సాధించిన కాంస్య పతకాన్ని తల్లి మెడలో వేసిన మన్‌ప్రీత్ ‘పారిస్’ నుంచి తిరిగి వచి్చన వెంటనే అలాగే చేశాడు. -
డిఫెండింగ్ చాంపియన్‌కు బిగ్ షాక్.. కరీమ్ బెంజెమా దూరం
ఫిఫా వరల్డ్‌కప్ 2022 ఆరంభానికి ముందే డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే జట్టు స్టార్ ఆటగాళ్లు పాల్ పోగ్బా, కాంటే, కుంకూలు గాయాలతో సాకర్ సమరానికి దూరమయ్యారు. తాజాగా ఈ ఏడాది ప్రతిష్టాత్మక బాలన్ డీ ఓర్ అవార్డు విజేత కరీమ్ బెంజెమా గాయంతో ఫిఫా వరల్డ్‌కప్ నుంచి వైదొలిగాడు. 34 ఏళ్ల కరీమ్ బెంజెమా ఎడమ తొడ గాయంతో బాధపడుతున్నట్లు జట్టు యాజమాన్యం ప్రకటించించి. అసలు సమరానికి ముందు శనివారం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో గంట పాటు మైదానంలో ఉన్న బెంజెమా చాలా ఇబ్బందిగా కదిలడంతో వైద్యలు అతన్ని పరీక్షించారు. కనీసం మూడు వారాల విశ్రాంతి అవసరమని పేర్కొనడంతో బెంజెమా టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. బెంజెమా దూరమవడం ఫ్రాన్స్‌కు పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. గతేడాది కాలంగా అతను సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. బాలన్ డీ ఓర్ విజేత అయిన కరీమ్ బెంజెమా రియల్ మాడ్రిడ్ తరపున 46 మ్యాచ్‌ల్లో 44 గోల్స్ సాధించడం విశేషం. ఇక గ్రూప్-డిలో ఉన్న ఫ్రాన్స్ మరోసారి చాంపియన్‌గా నిలుస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మంగళవారం ఆస్ట్రేలియాతో తమ తొలి మ్యాచ్ ఆడనున్న ఫ్రాన్స్ .. ఆ తర్వాత డెన్మార్క్, ట్యూనిషియాలను ఎదుర్కోనుంది. 1962లో బ్రెజిల్ వరుసగా రెండోసారి ఫిఫా వరల్డ్‌కప్‌ను నిలుపుకుంది. అప్పటినుంచి ఏ జట్టు కూడా వరుసగా రెండోసారి చాంపియన్ అవలేకపోయింది. తాజాగా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న ఫ్రాన్స్ 1962 సీన్‌ను రిపీట్ చేస్తుందో లేదో చూడాలి. Karim @Benzema has pulled out of the World Cup with a thigh injury. The whole team shares Karim's disappointment and wishes him a speedy recovery💙#FiersdetreBleus pic.twitter.com/fclx9pFkGz — French Team ⭐⭐ (@FrenchTeam) November 19, 2022 చదవండి: FIFA: 1950లో బంగారం లాంటి అవకాశం వదిలేసిన భారత్ FIFA: సాకర్ సమరం.. దిగ్గజాలపై కన్ను వేయాల్సిందే -
French Open: సిట్సిపాస్‌కు చుక్కెదురు
పారిస్: రెండేళ్ల క్రితం ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచిన గ్రీస్ స్టార్ ప్లేయర్ స్టెఫనోస్ సిట్సిపాస్ ఈసారి మాత్రం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటి దారి పట్టాడు. సోవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 40వ ర్యాంకర్, డెన్మార్క్‌కు చెందిన 19 ఏళ్ల హోల్గర్ రూనె 7–5, 3–6, 6–3, 6–4తో నాలుగో సీడ్ సిట్సిపాస్‌ను ఓడించి సంచలనం సృష్టించాడు. ఈ విజయంతో హోల్గర్ రూనె తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. 3 గంటల ఒక నిమిషంపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో హోల్గర్ నాలుగు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. సిట్సిపాస్ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన ఈ డెన్మార్క్ టీనేజర్ తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయాడు. సిట్సిపాస్ ఎనిమిది ఏస్‌లు సంధించడంతోపాటు ఐదు డబుల్ ఫాల్ట్‌లు, 33 అనవసర తప్పిదాలు చేశాడు. రూడ్ ముందంజ ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే), ఏడో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా) తమ ప్రత్యర్థులపై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. రూడ్ 6–2, 6–3, 3–6, 6–3తో 12వ సీడ్ హుర్కాజ్ (పోలాండ్)ను ఓడించి తన కెరీర్లో మొదటిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరగా... 11వ సీడ్ జాక్ సినెర్ (ఇటలీ)తో జరిగిన మ్యాచ్‌లో రుబ్లెవ్ తొలి సెట్‌ను 1–6తో కోల్పోయి రెండో సెట్‌ను 6–4తో నెగ్గి, మూడో సెట్లో 2–0తో ఆధిక్యంలో నిలిచాడు. ఈ దశలో గాయం కారణంగా సినెర్ వైదొలిగాడు. ఈ గెలుపుతో రుబ్లెవ్ తన కెరీర్లో ఐదోసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో వెరోనిరా కుదుర్మెతోవా (రష్యా) 1–6, 6–3, 6–1తో 22వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా)పై, 20వ సీడ్ కసత్కినా (రష్యా) 6–2, 6–2తో కామిలా జార్జి (ఇటలీ)పై, 11వ సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) 4–6, 6–2, 6–3తో ఇరీనా బేగూ (రొమేనియా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. -
హైదరాబాద్.. షాన్‌దార్ సిటీ
లవ్ ఆల్.. గుత్తా జ్వాల ఎంతో ఇష్టంగా తన చేతిపై వేసుకున్న టాటూ! అందరినీ ప్రేమించాలని చెప్పే ఆమెను వ్యతిరేకించేవాళ్లు కూడా చాలా మంది. అయితేనేం నేను.. నా ఇష్టం అని బిందాస్‌గా బతికేయడం జ్వాల నైజం. నడక నేర్చినప్పటి నుంచి స్టార్ క్రీడాకారిణిగా ఎదిగినప్పటి వరకు ఆమె ప్రతి మలుపునకూ హైదరాబాద్ సాక్షి. అందుకే నగరంతో జ్వాలకు ఓ ప్రత్యేక అనుబంధం. ప్రపంచంలో ఏ మూల తిరిగినా భాగ్యనగరిలో ఉండే ఆనందం ఎక్కడా దొరకదని అంటున్న జ్వాల మహానగరం గురించి ఏం చెప్పిందంటే... సిటీని చుట్టేసేదాన్ని... నాన్న మొదటి నుంచి ఆటలను ప్రోత్సహించారు. అందుకోసమే కేంద్రీయ విద్యాలయ(కేవీ)లో చేర్పించారు. అయితే వేర్వేరు కారణాలతో బొల్లారం, పికెట్, గోల్కొండ కేవీలలోనూ చదివాను. అప్పట్లో నాన్నతో కలసి హైదరాబాద్ మొత్తం చుట్టేసేదాన్ని. ఇంటి నుంచి స్కూల్ దూరంగా ఉండటం వల్ల స్కూటర్‌పైనే ప్రయాణించేదాన్ని. బేగంపేట నుంచి గోల్కొండ, ఆర్టిలరీ సెంటర్ నుంచి ఆదర్శ్‌నగర్, ఆ తర్వాత బంజారాహిల్స్.. ఇలా నగరంలో చాలా ఇళ్లు మారాం. ‘భాగ్య’నగరమే.. స్టార్ క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకోవడంలో హైదరాబాద్ పాత్ర ఎంతైనా ఉంది. ఇక్కడే రాకెట్ పట్టి టెన్నిస్‌లో ఓనమాలు నేర్చుకున్నా. హైదరాబాద్ ఎంతగా విస్తరించినా.. మన నగరానికి ఆత్మలాంటి సంస్కృతి మాత్రం మారలేదు. దేశంలో ఎక్కడా లేని ప్రత్యేకతలు మన సిటీకే ఉన్నాయి. ఫుడ్ హ్యాబిట్స్ మొదలుకొని సందర్శకులకు ఇచ్చే ఆతిథ్యం వరకు చక్కటి కల్చర్ ఇక్కడ కనిపిస్తుంది. ఇటీవల ఉబెర్ కప్ సందర్భంగా ఎక్కువ రోజులు ఢిల్లీలో ఉండాల్సి వచ్చింది. చాలా ఇబ్బంది పడ్డా. ఎప్పుడు హైదరాబాద్ వెళ్దామా అని ఆలోచించేదాన్ని. టోర్నీల కోసం పర్యటనలే తప్ప నిజానికి నాకు ప్రయాణాలంటే పరమ చిరాకు. మన సిటీలో ఉన్నప్పుడే ఎంతో హాయిగా అనిపిస్తుంది. హార్ట్ కప్ కాఫీ హైదరాబాద్ వంటకాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఫిట్నెస్ జాగ్రత్తలో భాగంగా ఎంత ఇష్టం ఉన్నా బిర్యానీని మాత్రం తక్కువగా తింటా. నగరంలో ఓవర్ ద మూన్, ఎన్ గ్రిల్ వంటి చోట్లకు బాగా వెళ్లేదాన్ని. ప్రస్తుతం నా ఫేవరేట్ స్పాట్ మాదాపూర్‌లోని ‘హార్ట్ కప్ కాఫీ’ సిటీ సిక్.. మహా నగరంలో ఇబ్బందులు కొన్ని తప్పవు. అయితే నా వైపు నుంచి ఒక్కటే ఫిర్యాదు.. ట్రాఫిక్ గురించే. గతంతో పోలిస్తే ఇదొక్కటే ఇబ్బంది పెట్టే మార్పు. వర్షాకాలంలో రోడ్లు సమస్యగా అనిపిస్తాయి. కానీ, ఇతర నగరాలతో పోలిస్తే మనం ఎంతో మెరుగు. విదేశాల్లో మెరిసిపోయే సిటీస్ ఉన్నా ఎందుకో ఏ మాత్రం నచ్చవు. టోర్నీ కోసం విదేశాలకు వెళితే నేను ఎయిర్పోర్ట్, స్టేడియం.. హోటల్‌కే పరిమితం. గాజులంటే మోజు.. హైదరాబాద్‌లో నేను తిరగని ప్రదేశం లేదు. చిన్నప్పుడే పాతబస్తీ అంతా చుట్టేశా. అక్కడ చాలా మంది ఫ్రెండ్స ఉన్నారు. సాంప్రదాయ దుస్తుల కోసం ఇక్కడే షాపింగ్ చేస్తా. నాకు గాజులంటే చాలా చాలా ఇష్టం. నా దగ్గర ప్రపంచంలోని అన్ని రంగుల, లెక్కపెట్టలేనన్ని రకాల గాజుల సెట్లు ఉన్నాయి. పెద్ద ఎత్తున చీరల కలెక్షన్కూడా ఉంది. ఫ్రెండ్స్‌తో కలసి ప్రేమికుడు సినిమా.. నాకైతే హైదరాబాద్‌లో సినిమాలే పెద్ద వినోదం. రామకృష్ణ, మహేశ్వరి-పరమేశ్వరి, ఆనంద్, సుదర్శన్, శాంతి.. ఇలా అన్ని థియేటర్లలోనూ సినిమాలు చూశాను. అమీర్‌పేట సత్యంలో ఫ్రెండ్సతో కలసి ప్రేమికుడు సినిమా చూస్తూ ఎంజాయ్ చేయడం మరపురాని జ్ఞాపకం. అన్నట్లు సికింద్రాబాద్ కేవీ స్కూల్‌కు దగ్గర్లోనే లాంబా థియేటర్ ఉన్నా ఆ ఛాయలకు పోలేదు లెండి (నవ్వుతూ). హైదరాబాద్ బ్రాండ్ తగ్గదు కొత్త రాష్ట్రంలో క్రీడలకు ప్రాధాన్యం ఉండాలనేదే నా కోరిక. బ్రాండ్ హైదరాబాద్ విలువ ఎప్పటికీ తగ్గదు. సిటీ చరిష్మాను ఎవరూ తగ్గించలేరు. టు బి ఫ్రాంక్.. ది బెస్ట్ సిటీలో నేనుంటున్నానని ఆనందంగా, గర్వంగా చెప్పగలను.