State Bank of India ATM
-
ఏటీఎం సెంటర్లలో రూల్స్ మారాయ్..వాటి గురించి మీకు తెలుసా?
కరోనా కారణంగా ఆన్లైన్ మోసాలు బాగా పెరిగిపోతున్నాయి. ఈజీ మనీ కోసం సైబర్ నేరస్తులు బ్యాంక్ అకౌంట్లలో ఉన్న డబ్బుల్ని కాజేసేందుకు కొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ సంస్థ ఎస్బీఐ వినియోగదారుల కోసం జాగ్రత్తలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఏటీఎం సెంటర్లలో జరిగే మోసాల్ని అరికట్టేందుకు వన్ టైమ్ పాస్ వర్డ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ విధానం వల్ల ఏటీఎం సెంటర్లలో జరిగే సైబర్ నేరాల్ని నివారించేలా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. Our OTP based cash withdrawal system for transactions at SBI ATMs is vaccination against fraudsters. Protecting you from frauds will always be our topmost priority.#SBI #StateBankOfIndia #ATM #OTP #SafeWithSBI #TransactSafely #SBIATM #Withdrawal pic.twitter.com/uCbkltrP8T — State Bank of India (@TheOfficialSBI) October 24, 2021 ఎస్బీఐ ఏటీఎం సెంటర్లలో కొత్త రూల్ ►ఏటీఎం సెంటర్లలో రూ.10వేల కంటే ఎక్కువ మొత్తాన్ని డబ్బుల్ని డ్రా చేసే వారికోసం ఎస్బీఐ ఈ కొత్త ఓటీపీ రూల్ ను అమలు చేస్తోంది. మరి ఆ రూల్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ►ఎస్బీఐ ఏటీఎం సెంటర్లలో 10వేల కంటే ఎక్కువ మొత్తాన్ని డబ్బుల్ని డ్రా చేయాలంటే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ►ఏటీఏం సెంటర్లో బ్యాంక్ అకౌంట్ హోల్డర్లు ఏటీఎం మెషీన్లో డెబిట్ కార్డ్ ఇన్ సర్ట్ చేసిన తరువాత కార్డ్ పిన్, విత్ డ్రాల్ అమౌంట్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఓటీపీని ఎంటర్ చేయాలని అడుగుతుంది. ►ఆ సమయంలో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ►ఇక ఈ ఓటీపీని అనేది ఒక్క విత్ డ్రాల్‌కి మాత్రమే పనిచేస్తుంది. రెండో సారి విత్ డ్రాల్ చేయాలంటే మరో కొత్త ఓటీపీని ఎంటర్ చేయాలని ఎస్బీఐ తెలిపింది. చదవండి: బంపర్ ఆఫర్: పోస్టాఫీస్ ఫ్రాంఛైజ్,పెట్టుబడి తక్కువ..సంపాదన ఎక్కువ -
నిధులిచ్చి సంస్థను కాపాడండి!
ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్కు రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక కింద ఇస్తామన్న రూ.1,500 కోట్ల నిధులను తక్షణం విడుదల చేయాలని ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను జెట్ ఎయిర్వేస్ పైలట్ల సమాఖ్య నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ కోరింది. కంపెనీ మూతబడితే 20,000 పైచిలుకు సిబ్బంది రోడ్డున పడే ప్రమాదం ఉందని, వారిని ఆదుకునేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని అభ్యర్థించింది కూడా. ‘జెట్ కార్యకలాపాలు యథాప్రకారం సాగించేందుకు వీలుగా రూ.1,500 కోట్ల నిధులను విడుదల చేయాలని ఎస్బీఐని కోరుతున్నాం. అలాగే, 20,000 పైచిలుకు ఉద్యోగాలు కాపాడాలని ప్రధాని నరేంద్ర మోదీని అభ్యర్థిస్తున్నాం’’ అని నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ (ఎన్ఏజీ) వైస్ ప్రెసిడెంట్ అదీమ్ వలియాని చెప్పారు. సోమవారమిక్కడ కంపెనీ ప్రధాన కార్యాలయంలో సిబ్బందితో సమావేశమైన సందర్భంగా ఆయన విలేకరులతో ఈ విషయాలు చెప్పారు. సంక్షోభంలో ఉన్న సంస్థకు సంఘీభావం తెలిపేందుకు పైలట్లు, ఇంజనీర్లు, క్యాబిన్ సిబ్బంది తదితర ఉద్యోగులు కంపెనీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. దాదాపు రూ. 8,000 కోట్ల పైగా బాకీ పడిన జెట్ ఎయిర్వేస్ యాజమాన్య అధికారాలను బ్యాంకుల కన్సార్షియం తన చేతుల్లోకి తీసుకోవటం తెలిసిందే. కొత్త ఇన్వెస్టరు వచ్చే దాకా కంపెనీ కార్యకలాపాలు సాగించేందుకు వీలుగా రూ.1,500 కోట్లు సమకూర్చేలా బ్యాంకులు ప్రతిపాదనలు చేశాయి. ఇప్పటిదాకా కేవలం రూ.300 కోట్లు.. అది కూడా విడతలవారీగా చిన్న మొత్తాల్లోనే ఇచ్చాయి. తాజాగా తక్షణం అత్యవసరంగా ఎంత ఇవ్వాలన్న దానిపై గత శుక్రవారం ఎయిర్‌లైన్ మేనేజ్మెంట్, ఎస్బీఐ మధ్య జరిగిన సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. బ్యాంకుల నిర్ణయం నేటికి వాయిదా.. జెట్‌కు అత్యవసరంగా నిధులు సమకూర్చే అంశంపై సోమవారం జరిగిన సమావేశంలో కూడా బ్యాంకర్లు తగు నిర్ణయం తీసుకోలేకపోయారు. దీంతో మంగళవారం మరోసారి సమావేశమవ్వాలని నిర్ణయించుకున్నారు. కంపెనీ సిబ్బందికి అంతర్గతంగా రాసిన లేఖలో జెట్ ఎయిర్వేస్ సీఈవో వినయ్ దూబే ఈ విషయాలు వెల్లడించారు. నిధులు అందుబాటులోకి రాకపోవడంతో విదేశీ రూట్లలో ఫ్లయిట్స్ రద్దును ఏప్రిల్ 18 దాకా పొడిగించినట్లు పేర్కొన్నారు. మరోవైపు, ‘సోమవారం సమావేశంలో నిధుల విడుదల చేస్తారని ఆశించాం. అలా జరగకపోవడం నిరాశపర్చింది. మంగళవారం కూడా నిధులు అందకపోతే కంపెనీ కొనసాగే పరిస్థితులైతే కనిపించడం లేదు‘ అని పైలట్ల యూనియన్ వర్గాలు పేర్కొన్నాయి. -
ఏటీఎంనే ఎత్తేశారు
నగదు కోసం ఏకంగా ఎస్బీఐ ఏటీఎం మెషిన్నే దొంగలు ఎత్తుకెళ్లిన సంఘటన అసోంలోని కామరూప్ జిల్లాలోని రంగియాలో గత అర్థరాత్రి చోటు చేసుకుంది. ఏటీఎం మెషిన్లో రూ. 5.38 లక్షల నగదు దొంగలు అపహరించారని పోలీసులు తెలిపారు. చోరీకి గురైన ఏటీఎం కేంద్రాన్ని మంగళవారం ఉదయం పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. ఏటీఎంలోని సీసీ ఫూటేజ్‌లను పోలీసు ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. దొంగలను సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని చెప్పారు. ఏటీఎం నుంచి మెషిన్ ఎత్తికెళ్లిన సమయంలో ఏటీఎం కేంద్రం వద్ద భద్రత సిబ్బంది లేరని చెప్పారు. ఏటీఎం కేంద్రంలో నగదు మెషిన్‌ను బ్యాంక్ సిబ్బంది సరిగ్గా బిగించ లేదన్నారు. ఈ నేపథ్యంలో నగదు మెషీన్ ఎత్తుకెళ్లేందుకు దొంగలకు మరింత సులువైందని తెలిపారు. కామరూప్ జిల్లాలోని రంగియా రైల్వే స్టేషన్ సమీపంలోని ఏటీఎం కేంద్రంలో బ్యాంక్ అధికారులు సోమవారం రూ. 45 లక్షలు పెట్టారని చెప్పారు. అయితే ఖాతాదారులు ఆ ఏటీఎం ద్వారా నగదు డ్రా చేయడంతో దొంగలు ఏటీఎం మెషిన్ ఎత్తుకు వెళ్ల సమయానికి అందులో రూ.5.38 లక్షలు ఉందని వెల్లడించారు. గత నెలలో రంగియా ప్రాంతంలో ఇలాగే మరో ఏటీఎంను దొంగలు ఎత్తు కెళ్లారు. అందులోని రూ. 25 లక్షల నగదు దొంగిలించి... ఆ ఏటీఎం మెషిన్‌ను మురికి కాల్వలోపడేశారని పోలీసు ఉన్నతాధికారులు ఈ సందర్భంగా గుర్తు చేశారు.