statue broken
-
‘మోదీ గుంజిళ్లు తీయాలి’
మందిర్ బజార్/డైమండ్ హార్బర్: సంఘసంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ద్వారా బీజేపీ బెంగాలీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శించారు. ఈ దుశ్చర్యకు బీజేపీ నేతలు తగిన ఫలితం అనుభవిస్తారనీ, బెంగాలీలు వారిని క్షమించబోరని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని మమత ఫాసిస్టుగా, ప్రజలను హింసించే వ్యక్తిగా అభివర్ణించారు. పంచలోహాలతో చేసిన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని పాత విగ్రహం ఉన్నచోటే ప్రతిష్టిస్తామన్న మోదీ ప్రతిపాదనను మమత తిరస్కరించారు. మందిర్ బజార్, డైమండ్ హర్బర్‌ల్లో గురువారం ఎన్నికల ప్రచారంలో మమత పాల్గొన్నారు. మోదీ గుంజిళ్లు తీయాలి.. బంగారం లాంటి పశ్చిమబెంగాల్ టీఎంసీ పాలనలో దివాళా తీసిందని బీజేపీ చీఫ్ అమిత్ షా చెప్పడంపై మమత మండిపడ్డారు. ‘బెంగాల్ దివాలా తీసిన రాష్ట్రంగా మారిందని చెప్పడానికి మీకు (బీజేపీ నేతలకు) సిగ్గుగా అనిపించడం లేదా? బెంగాల్‌కు బీజేపీ భిక్ష అక్కర్లేదు. కొత్తగా విద్యాసాగర్ విగ్రహాన్ని ఏర్పాటుచేయడానికి మా దగ్గర నిధులున్నాయి. ప్రధాని మోదీ ఓ అబద్ధాల కోరు. అలాంటి వ్యక్తిని దేశం ఇప్పటివరకూ చూడలేదు. విద్యాసాగర్ విగ్రహాన్ని బీజేపీ గూండాలు ఎలా ధ్వంసం చేశారో మీడియా స్పష్టంగా చూపింది. బెంగాల్ వారసత్వ సంపదను ధ్వంసం చేసినందుకు మోదీ గుంజిళ్లు తీయాలి’ అని మమత వ్యాఖ్యానించారు. ఈసీ అమ్ముడుపోయింది.. సామాజిక మాధ్యమాల్లో బీజేపీ నకిలీ వార్తలు, వదంతులు వ్యాప్తి చేస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి అమ్ముడుపోయిందని మమత విమర్శించారు. ఈ మాట అన్నందుకు తాను జైలుకు వెళ్లాల్సివచ్చినా అందుకు సిద్ధమేనని తేల్చిచెప్పారు. -
మమతతో పోలీసుల కుమ్మక్కు
మథురాపూర్ / చందౌలీ / మిర్జాపూర్: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పశ్చిమబెంగాల్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కైన పోలీసులు సంఘసంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహం ధ్వంసానికి సంబంధించిన సాక్ష్యాలను మాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తప్పదని అర్థం కావడంతో మమతా బెనర్జీ తనను జైల్లో పెట్టిస్తామని బెదిరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలను వేధిస్తున్న తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) గూండాలే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని మోదీ పునరుద్ఘాటించారు. పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ, విపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆందోళనలో మమత.. టీఎంసీ నేతలు, ఆ పార్టీకి చెందిన గూండాలు బెంగాల్‌ను నరకంగా మార్చేశారని ప్రధాని మోదీ విమర్శించారు. ‘నారదా, శారదా చిట్‌ఫంట్ కుంభకోణాల్లో సాక్ష్యాలను మాయంచేసిన రీతిలోనే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహ ధ్వంసం ఘటనలో సాక్ష్యాలను అదృశ్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ దుశ్చర్యకు కారకులైనవారిని కఠినంగా శిక్షించాలి. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి ఖరారవడంతో మమతా బెనర్జీ కలవరపడుతున్నారు. ఆ ఆందోళనతోనే నన్ను జైల్లో పెట్టిస్తామని బెదిరిస్తున్నారు. మమతా బెనర్జీ ఆమె మేనల్లుడు అభిషేక్‌లు బెంగాల్‌ను లూటీచేయడం, బలవంతపు వసూళ్ల సిండికేట్‌ను నడపడమే పనిగా పెట్టుకున్నారు. ఈ అత్తా–అల్లుడి ప్రభుత్వాన్ని సాగనంపాలని ప్రజలు నిర్ణయించుకున్నారు’ అని మోదీ ఆరోపించారు. ‘జై శ్రీరామ్’ అనడమూ నేరమే.. పశ్చిమబెంగాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీజేపీ పోరాడుతోందని ప్రధాని మోదీ తెలిపారు. ‘పశ్చిమబెంగాల్లో ప్రజాస్వామ్యం అపఖ్యాతిపాలైంది. దుర్గాపూజ, సరస్వతీపూజతో పాటు చివరికి జై శ్రీరామ్ అని నినదించడం కూడా బెంగాల్లో నేరమైపోయింది. రాష్ట్రంలోని బీజేపీ కార్యాలయాలను కూడా స్వాధీనం చేసుకుంటామని మమతా బెనర్జీ బెదిరించారు. పశ్చిమబెంగాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీ పోరాడుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలపై తన బొమ్మ వేసుకుంటూ మమతా బెనర్జీ స్టిక్కర్ దీదీగా మారిపోయారు. ఆమెకు భారత ప్రధానిపై నమ్మకం ఉండదు కానీ, పాక్ ప్రధానిని మాత్రం ఏ జంకూ లేకుండా ప్రశంసిస్తారు. ఓవైపు బీజేపీ కార్యకర్తలను జైలులో పెడుతున్న బెంగాల్ పోలీసులు, మరోవైపు టీఎంసీ గూండాలను మాత్రం స్వేచ్ఛగా తిరగనిస్తున్నారు’ అని ఆరోపించారు. విపక్షాలు విఫలమయ్యాయి.. తనపై ప్రతిపక్షాల దూషణలు పెరిగేకొద్దీ ప్రజల ప్రేమ కూడా పెరుగుతూనే ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ‘ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతున్నామని మహాకల్తీ కూటమిలోని రాజకీయ పార్టీలన్నింటికి అర్థమైంది. ఇవన్నీ మోదీ హటావో(మోదీని తప్పించండి) అనే నినాదంతో ముందుకెళుతున్నాయి. బెంగళూరులో ఓ వేదికపై గ్రూప్ ఫొటో దిగిన ఈ పార్టీల నేతలంతా కలసికట్టుగా ప్రధాని పదవికి ఓ అభ్యర్థిని ఎన్నుకోవడంలో మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. ప్రధాని ఎవరు అవుతారన్న ప్రశ్న ఉదయించగానే, ఎవరి డబ్బావారు వాయించుకోవడం మొదలుపెట్టారు’ అని మోదీ ఎద్దేవా చేశారు. ‘10 సీట్లు, 20, 22, 30, 55 లోక్‌సభ సీట్లు ఉన్నవారంతా ప్రధాని అయిపోవాలని కలలు కంటున్నారు. కలలు కనడం తప్పుకాదు. కా నీ ఇప్పుడు దేశమంతా ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్(ఈసారి కూడా మోదీ ప్రభుత్వమే) అంటోంది. మేం జాతీయ భద్రత విషయంలో రాజీపడం. ఉగ్రవాదులను ఏరివేయడంతో పాటు వేర్పాటువాదుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. ఈ సేవకుడు ప్రజల ఆశలు, ఆకాంక్షల సాధన దిశగా దేశాన్ని ముందుకు తీసుకెళుతున్నాడు’ అని తెలిపారు. -
బెంగాలీ సెంటిమెంట్‌పై ‘ఎన్నికల దాడి’
లోక్‌సభ ఎన్నికల ప్రచారం చివరి దశ వేడెక్కింది. కోల్‌కతాలో మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఎన్నికల ర్యాలీలో జరిగిన విధ్వంసంతో దేశం దృష్టి యావత్తు బెంగాల్‌పైకి మళ్లింది. అమిత్ షా ర్యాలీకి మమత సర్కారు అడ్డంకులు కల్పించడం, ర్యాలీని తృణమూల్, సీపీఎం శ్రేణులు అడ్డుకోవడం, ప్రతిగా బీజేపీ కార్యకర్తలు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. మాటల యుద్దం నుంచి దాడుల వరకు... సాధారణంగా బిహార్ తదితర ఉత్తరాది రాష్ట్రాలు కొన్నింటిలో ఎన్నికలప్పుడు అల్లర్లు, హింస జరగడం గత ఎన్నికల్లో చూశాం. అయితే, ఈ సారి ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు చెప్పుకోతగ్గ గొడవలు లేకుండా ప్రశాంతంగా జరగ్గా పశ్చిమ బెంగాల్లో ఎన్నికల హింస, అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఇంత వరకు జరిగిన వివిధ దశల పోలింగులో హింస జరగడం ఒక ఎత్తయితే, తాజాగా అమిత్‌షా మంగళవారం నిర్వహించిన రోడ్‌షోలో ఇరు పక్షాలు విధ్వంసానికి పాల్పడటంతో ఎన్నికల ప్రచార కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఈశ్వర్ చంద్ర విగ్రహ విధ్వంసానికి కారకులు మీరంటే మీరంటూ తృణమూల్, బీజేపీలు ఆరోపణలు చేసుకున్నాయి. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ ఎన్నికల నియమావళిని యథేచ్చగా ఉల్లంఘిస్తున్నా ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదంటూ బీజేపీ నేత అమిత్ షా మండి పడ్డారు. తృణమూల్ అభివృద్ధి, ప్రజాస్వామ్య వ్యతిరేక పార్టీ అంటూ ప్రధాని మోదీ దుయ్యబట్టారు. అమిత్‌షా పొరుగు రాష్ట్రాల నుంచి గూండాలను తీసుకొచ్చి విధ్వంసానికి పాల్పడ్డారని మమతా బెనర్జీ ఆరోపించారు. బెంగాలీ సంస్కృతి, సంప్రదాయాలపై బీజేపీ దాడి చేసిందంటూ మండి పడ్డారు. ఘటనపై ఇరు పక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. బుధవారం పరిస్థితిని సమీక్షించిన ఎన్నికల సంఘం తొమ్మిది నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిషేధించింది. తృణమూల్ బలప్రయోగం పశ్చిమ బెంగాల్ ఎన్నికలు మమతా బెనర్జీ, ప్రధాని మోదీల మధ్య పోరుగా మారాయి. వీలయినన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంటే, కమలనాథులకు అవకాశం దక్కకుండా చేసేందుకు దీదీ అన్ని మార్గాలు అవలంబిస్తోంది. అధికారాన్ని ఉపయోగించుకుని విపక్ష నేతల పర్యటనలకు, ఎన్నికల ప్రచారాలకు, ర్యాలీలకు మోకాలడ్డుతోంది. అంతే కాకుంగా, విపక్ష నేతలకు పట్టున్న జిల్లాల్లో ఓట్లు వేసేందుకు ఓటర్లను అనుమతించడం లేదు. తృణమూల్ చేస్తున్న ఈ ప్రయత్నాలను అడ్డుకునే క్రమంగా తరచు హింస,అల్లర్లు చోటు చేసుకుంటున్నాయి. ఈ తీవ్ర పోరుకి కారణం... తృణమూల్, బీజేపీలు రెండూ ఇంతటి తీవ్ర స్థాయి పోరుకు దిగడానికి కారణం బెంగాల్లో విజయం ఇద్దరికీ తప్పనిసరి కావడమే. దేశంలో తృణమూల్ అధికారంలో ఉన్నది ఒక్క బెంగాల్లోనే. ఇక్కడ అధికారం కోల్పోతే దాని మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో తృణమూల్ శ్రేణుల పెత్తనం పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉంది. మరోవైపు 34 ఏళ్ల తమ అధికారాన్ని కొల్లగొట్టిన తృణమూల్‌పై సీపీఎం కన్నెర్రగా ఉంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా మమతాని మట్టి కరిపించాలని సీపీఎం శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. అందుకోసం అవసరమైతే బీజేపీకి సహకరించడానికి కూడా కమ్యూనిస్టులు సిద్దపడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ గెలుపు కోసం ప్రత్యర్థులను బల ప్రయోగంతో అణచివేయడానికి తృణమూల్ వెనుకాడటం లేదు. మమత మేనల్లుడు పోటీ చేస్తున్న డైమండ్ హార్బర్ నియోజకవర్గంలో తృణమూల్, బీజేపీల మధ్య వరసగా కొన్ని రోజుల పాటు ఘర్షణలు జరగడం దీనికి నిదర్శనం. మరోవైపు బీజేపీకి కూడా బెంగాల్లో మెజారిటీ సీట్లు సాధించడం జాతీయ రాజకీయాల దృష్ట్యా అవసరం. రెండో సారి కేంద్రంలో అధికారం కోసం ప్రయత్నిస్తున్న కమలనాధులకు హిందీ బెల్ట్‌లో గతంలోలా ఈ సారి మెజారీటీ స్థానాలు రావని తేలిపోయింది. అక్కడి నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి అత్యధిక లోక్‌సభ స్థానాలున్న బెంగాల్లో పట్టు సాధించడం బీజేపీకి అనివార్యం. అందుకే బెంగాల్లో వీలైనన్ని సీట్లు సాధించేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. తృణమూల్‌పై ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడం, తృణమూల్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి చూస్తున్న కమ్యూనిస్టుల సహాయం తీసుకోవడం ద్వారా దీదీకి చెక్ చెప్పేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇది కూడా ఇరు పక్షాల మధ్య ఘర్షణలకు దారి తీస్తోంది. సత్తా చాటుకునేందుకే... తమ సత్తా చాటేందుకు మమత, మోదీలు పరోక్షంగా ప్రయత్నించడం రెండు పార్టీల మధ్య రాజకీయ పోరాటానికి దారి తీసింది. చివరిదశ పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ ఇరు పక్షాలు ఎన్నికల నిబంధనలను, సంప్రదాయాలను పక్కన పెట్టి గెలుపే లక్ష్యంగా ఎత్తులు, పైఎత్తులు వేస్తున్నాయి. తాజా అల్లర్లు, విధ్వంసాలు రెండు పార్టీల్లో నైరాశ్యం ఏ స్థాయిలో ఉందో నిరూపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తృణమూల్–బీజేపీల మధ్య జరిగిన తాజా ఘర్షణల్లో ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్ విగ్రహం విధ్వంసం బెంగాల్ ప్రజల భావోద్వేగాలపై ప్రభావం చూపుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇది బెంగాలీ సంస్కృతిపై దాడిగా పలువురు అభివర్ణిస్తున్నారు.ఈ ఘటనను సీపీఎం సహా అనేక పార్టీలు తీవ్రంగా ఖండించడం, తృణమూల్ నేతలు తమ ఫేస్బుక్ ప్రొఫైల్స్‌ను మార్చడం ఈ ఘటన ప్రాధాన్యతను వెల్లడిస్తున్నాయి. విగ్రహ ధ్వంసానికి కారణమెవరైనా మరో 4 రోజుల్లో జరగనున్న పోలింగ్‌పై దీని ప్రభావాన్ని తోసి పుచ్చలేమని ఎన్నికల పరిశీలకులు భావిస్తున్నారు. హద్దులు దాటిన ప్రచార యుద్ధం యూపీ మాదిరిగానే బెంగాల్‌లోని 42 సీట్లకు ఏడు దశల్లో పోలింగ్ జరుగుతోంది. చివరి దశలో మిగిలిన 9 లోక్‌సభ స్థానాలకు మే 19వ తేదీన పోలింగ్ జరుగుతుంది. రాష్ట్రంలో నాలుగు, ఐదు, ఆరు దశల పోలింగ్ సరళిని బట్టి చూస్తే బీజేపీ బలపడుతోందని, ఈసారి ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. తృణమూల్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని వారు చెబుతున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ పశ్చిమ బెంగాల్‌ను లక్ష్యంగా చేసుకుందని రాష్ట్ర సీపీఎం నేత ఒకరు అన్నారు. బెంగాల్‌ను 34 ఏళ్లు పాలించిన సీపీఎం బాగా బలహీనం కావడం, కాంగ్రెస్ బలం ఊహించని స్థాయిలో కుంచించుకుపోవడంతో బీజేపీకి మమతా బెనర్జీ పెద్ద సవాలుగా మారారు. ఇద్దరూ ఇద్దరే... మోదీ ఆరెసెస్‌లో, తర్వాత బీజేపీలో సంస్థాగత పదవులు సమర్థంగా నిర్వహించి నాలుగు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు. చివరికి ప్రధాని పదవి చేపట్టారు. వామపక్ష పాలనలో మమత వీధి పోరాటాలతో రాటుదేలారు. సీపీఎం భౌతిక దాడులను సైతం తట్టుకుని హింసకు హింసతోనే ఆమె జవాబిచ్చారు. 1998లో కాంగ్రెస్ నుంచి బయటికొచ్చి తృణమూల్ కాంగ్రెస్ స్థాపించాక బీజేపీతో చేతులు కలిపారు. వరుసగా 1998, 99, 2004 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో పోటీచేశారు. అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ కేబినెట్లో మంత్రిగా పనిచేసిన మమత రాష్ట్రంలో తృణమూల్‌కు గట్టి పునాదులు వేయగలిగారు. చివరికి 2011 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి పదవి కైవసం చేసుకున్నారు. ఆమె తన రాజకీయ ప్రత్యర్థులను అణచివేసే క్రమంలో సీపీఎం, కాంగ్రెస్ ఉక్కిరి బిక్కిరై బలం కోల్పోయాయి. ఈ పరిణామాలను అనుకూలంగా మలచుకున్న బీజేపీ రాష్ట్రంలో తృణమూల్‌కు ప్రత్యామ్నాయంగా అవతరించింది. ఆరో దశ పోలింగ్‌కు ముందు మేదినీపూర్ ఎన్నికల ర్యాలీలో మమత ప్రసంగిస్తూ, ‘‘1942లో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా నడిచిన క్విట్ ఇండియా ఉద్యమం లాంటివే 2019 లోక్‌సభ ఎన్నికలు. ఫాసిస్టు మోదీ సర్కారును అధికారం నుంచి కూలదోయడానికే మా పార్టీ పోరాడుతోంది,’’ అని ప్రకటించారు. మోదీ ఇటీవల బెంగాల్లో ఓ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ, ‘‘ మమత అనగానే ‘టీ’ అక్షరంతో మొదలయ్యే మూడు పదాలు గుర్తుకొస్తాయి. అవి తణమూల్, టోల్‌బాజీ(బలవంతపు వసూళ్లు) టాక్స్. అన్నారు. బుధవారం కోల్‌కతాలో భారీ ర్యాలీ చేపట్టిన తృణమూల్ చీఫ్, సీఎం మమతా బెనర్జీ ఢిల్లీలో మౌన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న కేంద్రమంత్రి నిర్మల, ఇతర సీనియర్ బీజేపీ నేతలు -
ప్రజాదరణ ఓర్వలేక వికృత చేష్టలు
శ్రీకాకుళం, రాజాం/రాజాం రూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజాం లో ఇటీవల నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్రకు లభించిన ప్రజాదరణ ఓర్వలేక టీడీపీ నేతలు వికృత చేష్టలకు దిగారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తెరవెనుక కుట్రలు పన్నారు. తాగునీటి పైపులైన్ ఏర్పాటుచేయాలనే సాకుతో మాధవబజార్ ఎదురుగా ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని తొలగించే యత్నం చేశారు. విషయం తెలుసుకున్న పార్టీ రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, పార్టీ శ్రేణులతో పాటు అభిమానులు చేరుకుని అడ్డుకోవడంతో వెనుదిరిగారు. ఇదీ జరిగింది.. బుధవారం ఉదయం 5 గంటల సమయంలో ఏఈ సురేష్‌కుమార్, టీపీఓ నాగలతలు వైఎస్సార్ విగ్రహం తొలగించే ప్రయత్నం చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న రిక్షా కార్మికుడు రాజు పెద్దగా కేకలు వేస్తూ దిమ్మ వద్ద అడ్డంగా పడుకుని నిరసన వ్యక్తం చేశాడు. ఇంతలో మరికొంతమంది అభిమానులు చేరుకుని విగ్రహాన్ని కదలనివ్వకుండా అడ్డుకున్నారు. విషయం తెలిసిన రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులుతో పాటు పార్టీ నేతలు పాలవలస శ్రీనివాసరావు, కరణం సుదర్శనరావు, వంజరాపు విజయ్‌కుమార్, పారంకోటి సుధ, జడ్డు జగదీష్, శాసపు వేణుగోపాలనాయుడు, కిల్లాన మోహన్ తదితరులు అక్కడకు చేరుకుని కమిషనర్‌ను నిలదీసి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అడ్డుగా లేకపోయినా.. నగర పంచాయతీ అధికారులు రాజాం ప్రధాన రహదారి విస్తరణకు సంబంధించి గత ఏడాది డిసెంబర్లో కొలతలు నిర్ధారించి రోడ్డుకు ఇరువైపులా ఉన్న షాపులను తొలగించారు. మాధవబజార్ ఎదురుగా ఉన్న వైఎస్సార్ విగ్రహం అడ్డులేకపోవడంతో వదిలేశారు. బుధవారం తెల్లవారుజామున ఉన్నఫలంగా పొక్లెయినర్ తీసుకొచ్చి వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జోగులుతో పాటు పార్టీ నేతలు, అభిమానులు కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పైపులైన్‌కు అడ్డుగా లేకపోయినా విగ్రహాన్ని ఎందుకు తొలగించారని మండిపడ్డారు. మళ్లీ విగ్రహం పెట్టే వరకు వెనుకంజ వేసేది లేదని తేల్చిచెప్పి పైపులైన్ వేసే వరకు నిరీక్షించారు. దీంతో నగర పంచాయతీ అధికారులు పైపులైన్ వేసి విగ్రహాన్ని యథాతథ స్థితిలో ఉంచి సిమెంట్ నిర్మాణం చేయించారు. దీంతో ఎమ్మెల్యే, నాయకులు, అభిమానులు ఆందోళన విరమించారు. తప్పు ఎవరిది..? వైఎస్సార్ విగ్రహం తొలగింపు వెనుక రాజాంకు చెందిన అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఓ నేత మెప్పు కోసం నగర పంచాయతీ అధికారులతో పాటు ఆర్అండ్బీ అధి కారులు అత్యుత్సాహం ప్రదర్శించినట్లు సమాచారం. విగ్రహాన్ని తొలగించేందుకు ఏ అనుమతులు ఉన్నాయో చెప్పాలని అభిమానులు కోరగా నగర పంచాయతీ అధికారులు, ఆర్అండ్బీ జేఈలు ఒకరినొకరు విమర్శించుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ శాఖల అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు రాజాం పట్టణవాసులు పేర్కొన్నారు. కమిషనర్ వ్యవహార శైలిపై అనుమానాలు రాజాం నగరపంచాయతీ కమిషనర్ వి.వి.సత్యనారాయణ మొదటి నుంచీ టీడీపీ కోవర్టుగా ఉంటున్నారని పలువురు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇదే ప్రాంతంలో పాఠశాల ముఖద్వారం రోడ్డుకు అడ్డంగా ఉన్నా తొలగించలేదని, వైఎస్సార్ విగ్రహం పైపులైన్‌కు అడ్డంగా లేకపోయినా తొలగించేందుకు అత్యుత్సాహం చూపించారని ఆరోపించారు. రాజాంలో ప్రజా సంకల్పయాత్ర విజయవంతం కావడంతో టీడీపీ నేతలే ఈ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే కంబాల జోగులు ఆరోపించారు. ఈ విషయాన్ని ఇక్కడతో విడిచిపెట్టేదిలేదని, కలెక్టర్‌కు, ఆర్జేడీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. -
రేమల్లేలో వైఎస్ విగ్రహం ధ్వంసానికి యత్నం
కృష్ణాజిల్లా, హనుమాన్‌జంక్షన్ రూరల్ (గన్నవరం) : బాపులపాడు మండలం రేమల్లేలోని గ్రామ కూడలిలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు గుర్తు తెలియని వ్యక్తులు యత్నించారు. ఈ ఘటన మంగళవారం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మహానేత వైఎస్ విగ్రహం ధ్వంసం చేయటానికి యత్నించినట్లుగా పలుచోట్ల ఉన్న దెబ్బలను గ్రామస్తులు గుర్తించారు. వైఎస్ విగ్రహంలో తలను ధ్వంసం చేసేందుకు యత్నించటంతో మెడ వద్ద బీటలు వారడంతో పాటుగా పలుచోట్ల గట్టి దెబ్బలు కనిపించాయి. విగ్రహం తల వెనుక భాగంలో పాగా స్వల్పంగా ధ్వంసమైంది. దీంతో గ్రామానికి చెందిన పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. విగ్రహ ధ్వంసంపై వీరవల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి సమయంలో ఈ దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు విగ్రహం వద్దకు చేరటంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన చెలరేగకుండా అదుపు చేశారు. గ్రామ కూడలిలో పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఉండటంతో వాటి ఆధారంగా దర్యాప్తు చేసి నిందితులను పట్టుకోవాలని పార్టీ నాయకులు కోరారు. దీంతో సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలిస్తామని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. కాగా సాయంత్రం పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు గ్రామంలో పర్యటించి ధ్వంసమైన వైఎస్ విగ్రహాన్ని పరిశీలించారు. మహానేత విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ వైరంతో విగ్రహాలపై ప్రతాపం చూపటం తగదన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు దుట్టా శివ నారాయణ, జిల్లా కార్యదర్శి నక్కా గాంధి, జిల్లా అధికార ప్రతినిధి వేగిరెడ్డి సూర్యనారాయణ, మండల మాజీ అధ్యక్షుడు యనమదల సాంబశివరావు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు తోమ్మండ్రు రమేష్, పార్టీ నాయకులు సూరపనేని రాధాకృష్ణమూర్తి, చౌటపల్లి జేమి, అల్లంశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
వైఎస్సార్ విగ్రహం ధ్వంసం
రాప్తాడు: రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లిలో గురువారం అర్ధరాత్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. భారీ శబ్దం రావడంతో సమీపంలోని వారు బయటకు వచ్చారు. వారిని గమనించిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. శుక్రవారం ఎం.బండమీదపల్లిలో ‘గ్రామ దర్శిని – గ్రామ వికాసం’ కార్యక్రమం జరిగింది. గొందిరెడ్డిపల్లి మీదుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యే మంత్రి పరిటాల సునీత దృష్టిలో పడి మెప్పు పొందేందుకు కొందరు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. విగ్రహాల ధ్వంసం పిరికిపందల చర్య విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నియోజకవర్గ నేత తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి (చందు), జెడ్పీటీసీ సభ్యుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, మండల కన్వీనర్ బోయ రామాంజినేయులు, యూత్ కన్వీనర్ చిట్రెడ్డి సత్యనారాయణరెడ్డిలు శుక్రవారం గొందిరెడ్డిపల్లికి వెళ్లి సంఘటనపై ఆరా తీశారు. విగ్రహం వద్దే ఆందోళనకు దిగారు. దివంగత ముఖ్యమంతి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయడం పిరికిపందల చర్య, అనాగరిక చర్య అని తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి (చందు) మండిపడ్డారు. గ్రామాల్లో రాజకీయ కక్షలను ప్రేరేపించేలా వైఎస్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. ఇంతలో ఎస్ఐ ధరణిబాబు ఘటన స్థలానికి చేరుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని నాయకులు వినతిపత్రం అందజేశారు. అరెస్టు చేయనిపక్షంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చందు హెచ్చరించారు. పల్లెల్లో చిచ్చు పెట్టేందుకే.. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని నాయకులు విమర్శించారు. రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్, బంధువులు పాలెగాళ్ల వ్యవస్థను తలపిస్తున్నారని విరుచుకుపడ్డారు. దీంతో ప్రజలందరూ వైఎస్సార్సీపీ వైపు చూస్తున్నారని, దీన్ని జీర్ణించుకోలేకపోయిన మంత్రి పల్లెల్లో చిచ్చు పెట్టేందుకు విగ్రహాల ధ్వంసాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో దాదాపు పది విగ్రహాలు ధ్వంసమయ్యాయన్నారు. టీడీపీ హయాంలో అభివృద్ధి చేసి ఉంటే గ్రామాలకు వెళ్లి ప్రజలకు తెలపాలే కానీ.. ఇలా విగ్రహాల ధ్వంసంతో రెచ్చగొట్టాలనుకోవడం మంచిది కాదన్నారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని గుర్తించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు అమర్నాథ్రెడ్డి, జూటూరు శేఖర్, సింగారప్ప, యర్రగుంట కేశవరెడ్డి, గోవింద్‌రెడ్డి, సుబ్బరాయుడు, మాజీ సర్పంచులు బాబయ్య, వెంకట్రామిరెడ్డితోపాటు బాబయ్య, చిన్న ఓబిరెడ్డి, కొండారెడ్డి, కుమ్మర లక్ష్మినారాయణ, గోపాల్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, నాగిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, వివేకానందరెడ్డి, శంకర్‌రెడ్డి, నారాయణరెడ్డి, అంజన్‌రెడ్డి, కేశవరెడ్డి, నడిపి బాబయ్య పాల్గొన్నారు. -
ఇందిరమ్మ విగ్రహం ధ్వంసం
మాచర్ల: పట్టణంలోని రైల్వేస్టేషన్‌కు వెళ్లే రహదారిలో స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహం ధ్వంసం చేయడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం విగ్రహం వద్ధ ధర్నా నిర్వహించారు. జోహార్ ఇందిరా.. జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న అర్బన్ సీఐ సాంబశివరావు అక్కడకు చేరుకొని విచారణ చేపట్టారు. ప్రత్యక్ష సాక్షులు పలువురు లారీ ఢీకొనడం వల్ల విగ్రహం ధ్వంసమైనట్లు తెలిపారు. లారీకి ట్రాక్టర్ అడ్డం రావడంతో దాన్ని తప్పించబోయి విగ్రహాన్ని ఢీకొన్నట్లు వివరించారు. అయితే, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఇది కుట్ర అని, తమ పార్టీని బతకనివ్వకూడదన్న దురుద్దేశంతో కొందరు ఇలా వ్యవహరించారని ఆరోపించారు. విగ్రహాన్ని ప్రతిష్టించకపోతే ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
కౌగిలింత ఖరీదు 90 లక్షల రూపాయలు
కన్సాస్: అమెరికాలో ఓవర్‌ల్యాండ్ పార్క్, టోమాహాక్ రిడ్జ్ కమ్యూనిటీ సెంటర్లో ఒక ఐదేళ్ల పిల్లవాడు తెలియక చేసిన చిన్న తప్పిదానికి దాదాపు 90 లక్షల రూపాయల మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కమ్యూనిటీ సెంటర్లోని సర్వేలైన్ కెమెరాలో రికార్డయిన దృశ్యాల ప్రకారం సారా గాడ్మాన్ కొడుకు, ఐదేళ్ల పసివాడు అక్కడే ఉన్న ఓ విగ్రహాన్ని కౌగిలించుకుని, ఆడుకుంటున్నాడు. అయితే అనుకోకుండా ఆ విగ్రహం కాస్తా కింద పడి పగిలిపోయింది. అదృష్టవశాత్తు పిల్లవానికి ఎలాంటి గాయాలు కాలేదు. విషయం తెలుసుకున్న సారా వెంటనే అక్కడకు వెళ్లి తన కుమారున్ని ఇంటికి తీసుకొచ్చింది. పగిలిపోయిన విగ్రహం ఖరీదు మహా అయితే ఓ 800 డాలర్లు (ఇండియా కరెన్సీ ప్రకారం 55,076 రూపాయలు) ఉంటుంది. ఆ మొత్తాన్ని కట్టేస్తే గొడవ ఉండదని అనుకుంది. అయితే కొన్ని రోజుల తర్వాత కమ్యూనిటీ సెంటర్ నుంచి సారాకు ఒక ఉత్తరం వచ్చింది. దానిలో తన కుమారుడు పగలకొట్టిన విగ్రహం ఖరీదు చూసిన సారాకు గుండె ఆగినంత పనయ్యింది. ఓ 800 డాలర్లు ఉంటుందనుకున్న విగ్రహం విలువ కాస్తా ఏకంగా 1,32,000 డాలర్లు (అంటే మన కరెన్సీ ప్రకారం 90,87,540 రూపాయలు) గా ఉంది. ముందు ఆ ఉత్తరం చూసి ఆశ్చర్యపోయిన సారా, తెరుకుని కమ్యూనిటీ సెంటర్ వారిని తిట్టడం ప్రారంభించింది. ‘అంత ఖరీదైన విగ్రహాన్ని ఎలాంటి రక్షణ లేకుండా, కనీసం తాకకూడదనే హెచ్చరిక కూడా లేకుండా ఇలా జనాలు తిరిగే ప్రదేశంలో ఎలా ఉంచుతార’ని ప్రశ్నించింది. అంతేకాక డబ్బు చెల్లించనని తేల్చి చెప్పింది. దాంతో కమ్యూనిటీ సెంటర్ అధికారులు ‘ఆ విగ్రహాన్ని సందర్శన నిమిత్తం ఇక్కడకు తీసుకొచ్చాము. అయినా ప్రజాధనాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంద’ని తెలిపారు. విగ్రహం ఖరీదు చెల్లించనని చెప్పిన సారా, కంపెనీ వారు తీసుకునే చట్టపరమైన చర్యలను ఎదుర్కొడానికి సిద్దపడింది. కానీ ఇంతలో కమ్యూనిటీ సెంటర్ అధికారి రైలీ ‘మా ఇన్సూరెన్స్ కంపెనీ పొరపాటున బిల్లు చెల్లించమనే ఉత్తరాన్ని సారాకు పంపింది. కానీ మేము ఆ బిల్లును సారా కుటుంబం నుంచి వసూలు చేయాలనుకోవడం లేదు. ఆమె ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడి ఈ వ్యవహారాన్ని ముగిస్తామ’ని తెలిపారు. సారా కొడుకు పగలకొట్టిన విగ్రహం స్థానిక శిల్పి బిల్ లియన్స్ రూపొందించిన ‘ఆఫ్రొడైట్ డి కాన్సాస్ సిటి’ అనే శిల్పం. -
వెలిచేరులో రంగా విగ్రహం ధ్వంసం
తూర్పుగోదావరి ,ఆత్రేయపురం: గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం అర్ధరాత్రి సమయంలో వెలిచేరు సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న వంగవీటి మోహన్‌రంగా విగ్రహాన్ని ధ్వంసం చేశారు. పోలీసు జాగిలాలు గుర్తుపట్టకుండా విగ్రహం చుట్టూ కారం చల్లారు. విగ్రహం మెడ భాగం నుంచి తలను వేరు చేసేందుకు విఫలయత్నం చేశారు. బుధవారం తెల్లవారు జామున విగ్రహాన్ని గమనించిన స్థానికులు ఆందోళనకు దిగారు. కాపు సంఘం నాయకులు వెలిచేరు గ్రామానికి చేరుకుని రోడ్డుపై బైఠాయించి దోషులను అరెస్టు చేయాలని ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న రావులపాలెం సీఐ పెద్దిరాజు, ఆత్రేయపురం ఎస్సై నాగార్జునరాజు తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరీస్థితిని సమీక్షించారు. ఇంతలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని దోషులు ఎంతటివారైనా వదలొద్దని పోలీసులను ఆదేశించారు. దోషులు ఎంతటి వారైనా వదిలి పెట్టవద్దని పోలీసులను ఆదేశించారు. ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా ఎవరు ప్రయత్నించినా ఉపేక్షించేది లేదన్నారు. కులాల వారీగా కాకుండా మహానుభావులను అందరూ స్మరించుకునేందుకే విగ్రçహాలను ఏర్పాటు చేస్తారని, వాటిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అతి త్వరలో రంగా నూతన విగ్రహాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘాతుకానికి పాల్పడిన వారికి పడే శిక్షను చూస్తే మరెవరైనా భవిష్యత్‌లో ఇలాంటి నేరం చేయాలంటే భయపడే పరిస్థితి నెలకొనేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. గతంలో మెర్లపాలెంలో విగ్రహం ధ్వంసానికి సంబంధించి సీసీ టీవీ ఫుటేజీ ఉన్నా నేటికీ ఆ కేసు కొలిక్కిరాలేదన్నారు. అలాగే వెలిచేరు గ్రామంలో అంబేడ్కర్ విగ్రహం, ఉచ్చిలిలో రంగా విగ్రçహాలు ధ్వంసం వల్ల గొడవలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో దోషులను పట్టుకుని శిక్షించడంలో విఫలమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరితగతిన ఇలాంటి కేసుల్లో దోషులను పట్టుకుంటే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని అదశగా చర్యలు తీసుకోవాలని పోలీసులను జగ్గిరెడ్డి కోరారు. అలాగే కాంగ్రెస్‌పార్టీ నియోజక వర్గ ఇన్చార్జి ఆకుల రామకృష్ణ, ప్రముఖ పారిశ్రామికవేత్త బండారు శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనందరావు తనయుడు సంజీవ్ తదితరులు మాట్లాడుతూ తెలుగుజాతికి వంగవీటి మోహన్‌రంగా ఎన్నో సేవలు చేశారని, అలాంటి మహానేత విగ్రహన్ని ధ్వంసం చేయడం అమానుషమన్నారు. జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకుంటామని సీఐ పెద్దిరాజు, తహసీల్దారు వరదా సుబ్బారావు ఆందోళనకారులకు హామీ ఇచ్చారు. వివిధ పార్టీల నాయకులు, మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ కనుమూరి శ్రీనివాసరాజు, జెడ్పీటీసీ మద్దూరి సుబ్బలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ వేగేశ్న చంద్రరాజు, రావులపాలెం ఎంపీపీ కోటచెల్లయ్య, ప్రముఖ న్యాయవాది పెద్దింటి వేణుగోపాల్, వైఎస్సార్సీపీ నాయకులు కునాధరాజు రంగరాజు, శ్రీనివాసరాజు, ఎంపీటీసీ వేముల నాగలక్ష్మి, గాదిరాజు రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. -
అమరజీవి విగ్రహం ధ్వంసం
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జోగిపేటలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు సోమవారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నెల రోజుల్లో రెండోసారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల ఆర్యవైశ్య సంఘాలు మండిపడుతున్నాయి. అలాగే విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని, అలాగే భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. -
సెల్ఫీల పిచ్చోళ్లు.. విగ్రహం విరగ్గొట్టేశారు!
ఇటీవలి కాలంలో సెల్ఫీల పిచ్చి బాగా ఎక్కువైపోయింది. అది కాస్తా చివరకు విగ్రహాలు విరగ్గొట్టేవరకు వెళ్తోంది. ఉత్తర ఇటలీలో కొంతమంది పర్యాటకులు ఇదే పని చేశారు. ఎప్పుడో 1700 సంవత్సరం నాటి హెర్క్యులెస్ విగ్రహాన్ని వాళ్లు విరగ్గొట్టేశారు. విగ్రహం మీదకు ఎక్కి మరీ సెల్ఫీ తీసుకోడానికి కొంతమంది పర్యాటకులు ప్రయత్నించడంతో అది కాస్తా విరిగిపోయింది. ఈ ఘటన క్రెమోనాలో శుక్రవారం రాత్రి జరిగింది. విగ్రహం పైనున్న పాలరాతి కిరీటం విరిగి కింద పడిపోయింది. ఇలా విగ్రహాన్ని విరగ్గొట్టిన ఇద్దరు పర్యాటకులను పోలీసులు గుర్తించినట్లు స్థానిక పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈ విగ్రహంలో రెండు హెర్క్యులెస్ విగ్రహాలు ఒక పెద్ద షీల్డును పట్టుకుని ఉంటారు. క్రెమోనా నగరానికి ఇది ఓ సింబల్‌లా ఉంటుందని చెబుతారు. ఈ విగ్రహ నిర్మాణం 1700 సంవత్సరంలో పూర్తయింది. 1962లో దీన్ని ఇపుడున్న ప్రదేశానికి మార్చారు.