STF
-
సారా టెండుల్కర్‌కు కొత్త బాధ్యతలు.. సచిన్ ట్వీట్ వైరల్ (ఫొటోలు)
-
నాలుగో సింహం.. విధినిర్వహణే శాపం
ఈ చిత్రంలో నిర్జీవంగా పడి ఉన్న వ్యక్తి రాజశేఖర్. చిత్తూరు పోలీసువిభాగంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ (ఎస్టీఎఫ్)లో పని చేసేవాడు. పెళ్లి చూపులకు వెళ్లేందుకు సెలవు అడిగితే ఉన్నతాధికారులు నిరాకరించారు. సెలవు అడిగిన ప్రతిసారీ ఇతనికి నిరాశే ఎదురయ్యేది. దీంతో తీవ్ర ఒత్తిడికి గురై గతేడాది ఏప్రిల్ 20న ఎస్పీ క్యాంపు కార్యాలయంలోనే విధులు నిర్వర్తిస్తూ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిత్తూరు అర్బన్: బహుశా ఈ ఒక్క ఉదాహరణ చాలనుకుంటా.. విధి నిర్వహణలో సగటు పోలీసు పడుతున్న ఒత్తిడి భారం.. జిల్లాలో పోలీసుల సంఖ్య..24 గంటల్లో ఎప్పుడు పిలిచినా పరుగెత్తాల్సిన పోలీసుశాఖలో సెలవు ఇవ్వకుంటే ఓ వ్యక్తి మానసిన పరిస్థితి ఎలా ఉంటుందనడానికి రాజశేఖర్ మరణమే సాక్ష్యం. సెలవు.. ప్రభుత్వ ఉద్యోగి హక్కు. కానీ అత్యవసర సేవల్లాంటి పోలీసు విభాగంలో సెలవు పేరు ఎత్తే అర్హత ఏ ఒక్కరికీ ఉండదు. ఎండలో నిలబడి ట్రాఫిక్ విధులు, అడవుల్లో కూంబింగ్, ఇతర రాష్ట్రాల్లో ఎర్రచందనం స్మగ్లర్ల వేట, ఆర్ఐల వద్ద ఆర్డర్లీ డ్యూటీలు.. ఇన్నింటి నుంచి కాస్త ఉపసమనం ఇచ్చే వారంతపు సెలవు జిల్లాలోని ఏ ఒక్క కానిస్టేబుల్‌కు అమలు కావడం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పోలీసుశాఖలో వారాంతపు సెలవు (వీక్లీ ఆఫ్)ను తప్పనిసరి చేస్తానంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి మాటివ్వడం ఆ శాఖలో సంతోషాన్ని నింపిందనే చెప్పాలి. సమయం ఎక్కడ..? పోలీసుశాఖ అత్యవసర విభాగమే అయినప్పటికీ వారాంతపు సెలవు ఇవ్వకపోవడంతో పోలీసులు, వారి కుటుంబాలు నలిగిపోతున్నాయి. వేళకాని వేళల్లో విధులు నిర్వహిస్తూ నలిగిపోతున్నారు. దీంతో వ్యక్తిగత, కుటుంబ జీవితానికి దూరమైపోతున్నారు. ప్రధానంగా ఇంట్లో తల్లిదండ్రులు, భార్యా పిల్లలతో గడపలేని పరిస్థితి. పిల్లలు ఏం చదువుతున్నారు ? ఏం చేస్తున్నారు? వారి ఇష్టాఇష్టాలు తెలుసుకునే సమయం కూడా చాలామందికి దొరకడం లేదు. కొన్నిసార్లు పనిలో అధికారుల నుంచి ఎదురయ్యే చీవాట్లు, చీత్కారాలను ఇంట్లో వారిపై చూపించేవాళ్లూ ఉన్నారు. తండ్రి కుటుంబంపై దృష్టి పెట్టకపోవడంతో చెడుదారిను ఎంచుకునే వాళ్లు ఉన్నారు. చిత్తూరులో ఓ ఏఎస్ఐ కొడుకు తొమ్మిదో తరగతిలోనే తోటి విద్యార్థిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయడంతో అతనిపై కేసు నమోదు చేసి జువైనెల్ హోమ్‌కు తరలించడమే ఇందుకు నిదర్శనం. పట్టించుకునే వారేరీ? జిల్లాలో తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో పోలీసుల బాగోగుల కోసం సంక్షేమ సంఘాలున్నాయి. పోలీసుల కష్టాలు, ఇబ్బందులను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికే సంక్షేమ సంఘాన్ని ఎన్నుకుంటారు. ఇలా ఎన్నికైన అధికారుల్లో చాలా మంది డ్యూటీలకు వెళ్లకుండా.. ఇంకా చెప్పాలంటే అసలు యూనిఫాం తొడగకుండా ఉన్నతాధికారుల అడుగులకు మడుగులొత్తుతుంటారు. ప్రభుత్వ పెద్దలు చెప్పేట్లు నడుచుకుంటూ వేలాది మంది పోలీసుల మనోభావాలను తాకట్టు పెడుతుంటారు. అధికారపార్టీ నేతలు పోలీసులపై దౌర్జన్యం చేసినా ఖండించని నేతలు.. ప్రతిపక్ష నాయకులు చిన్నమాట అంటే మాత్రం మీడియా ఎదుటకొచ్చి విమర్శలు గుప్పించిన ఘటనలు చాలానే ఉన్నాయి. జిల్లాలో పోలీసులకు ట్రావెల్ అలవెన్స్ ఇచ్చి ఆర్నెళ్లవుతున్నా ఏ యూనియన్ ప్రశ్నించదు. స్పెషల్ పార్టీ పోలీసులకు ఇతర ప్రాంతాలకు, దూరంగా డ్యూటీలు వేస్తే ఆరోగ్య సమస్యలున్న వారికి డ్యూటీల నుంచి మినహాయింపు ఇవ్వండంటూ అధికారులను అడిగే ధైర్యం ఎవరికీ ఉండదు. వైఎస్జగన్ హామీతో ఆశలు.. పోలీసుశాఖలో సిబ్బంది పడుతున్న కష్టాలను ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తించారు. ‘పోలీసుల కష్టాలు నే విన్నాను.. మీకు తోడుగా నేనుంటాను. మన ప్రభుత్వం రాగానే పోలీసుశాఖలో వారాంతపు సెలవు(వీక్లీఆఫ్)ను కచ్చితంగా ఇస్తాను. హోంగార్డులకు సైతం ఇది వర్తింపజేస్తాం’ అంటూ ఇచ్చిన హామీ పోలీసుల్లో కొత్త ఆశలను చిగురింపచేస్తోంది. జీవితాంతం రుణపడి ఉంటారు వైఎస్జగన్ ఇచ్చిన హామీ అమల్లోకి వస్తే బతికున్నంత వరకు ఏ ఒక్క పోలీసు మర్చిపోరు. జీవితాంతం గుర్తుంచుకుంటారు. ఏళ్ల తరబడి ఈ శాఖలో డ్యూటీలు చేస్తూ కుటుంబాలకు దూరమైపోయాం. పిల్లల బాగోగులు చూసుకునే టైం ఉండడం లేదు. తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగలేకుంటే ప్రశాంతత లేకుండా పోతోంది. వీక్లీ ఆఫ్ అమలు చేస్తే మాత్రం ప్రతి పోలీసు కుటుంబం జగన్‌కు రుణపడి ఉంటుంది. – కేఎన్ మురళి, జిల్లా పోలీసు సంక్షేమ సంఘ మాజీ అధ్యక్షుడు, చిత్తూరు -
మళ్లీ తెరపైకి షణ్ముగప్రియ
కోయంబత్తూరు: తనకు న్యాయం చేయాలంటూ ప్రధాని కార్యాలయం ఆదేశించి మూడేళ్లు గడిచినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు షణ్ముగప్రియ. ఇచ్చిన మాట నిలబెట్టుకోమని తమిళనాడు ప్రభుత్వానికి పీఎంఓ సూచించినా పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు. రాష్ట్రాన్ని వణికించిన ఘరానా స్మగ్లర్‌ను పట్టించినందుకు తనకు దక్కిన గౌరవం ఇదేనా అంటూ వాపోయారు. ఇంతకీ ఎవరీ షణ్ముగప్రియ? మూడు (కన్నడ, తమిళ, కేరళ) రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ను మట్టుబెట్టడంలో కీలకపాత్ర పోషించారీమె. కోయంబత్తూరులోని వాడవల్లి ప్రాంతానికి చెందిన షణ్ముగ ప్రియ.. వీరప్పన్‌కు సంబంధించిన కీలక సమాచారం అందించి పోలీసులకు సహాయపడ్డారు. వీరప్పన్‌ను పట్టుకునే ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీసు బృందానికి సహకరించేందుకు 2004లో ఆమెను ఉన్నతాధికారి శాంతమరై కన్నన్ నియమించారు. వీరప్పన్ భార్య ముత్తులక్ష్మికి నాలుగు నెలలు తన ఇంటిని అద్దెకిచ్చి సన్నిహితురాలిగా మెలిగారు. అతడికి సంబంధించిన సమాచారాన్ని రాబట్టి పోలీసులకు అందించారు. నీలగిరి కొండల్లో భార్యను కలుసుకునేందుకు వీరప్పన్ వస్తున్నాడన్న సమాచారాన్ని పోలీసులకు చెప్పింది షణ్ముగప్రియ కావడం గమనార్హం. అయితే అప్పుడు వీరప్పన్‌ను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు. చివరకు బాధే మిగిలింది.. ‘వీరప్పన్ అనారోగ్యం, అతడి చూపు మందగించిన విషయం, అడవుల్లో అతడు ఎక్కడ దాక్కున్నాడనే దాని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాను. నా జీవితాన్ని ఫణంగా పెట్టి పోలీసులకు సహకరించాను. ఇన్ని చేసినా చివరకు నాకు బాధే మిగిలింది. చెడ్డ పేరు తెచ్చుకోవాల్సి వచ్చింది. ఎవరూ ముందుకు రాని సమయంలో ధైర్యంగా ముందుకు వచ్చి ఈ ఆపరేషన్‌లో పాలు పంచుకున్నాను. ఆ సమయంలో ఎన్నో బాధలు, సమస్యలు ఎదురైనప్పటికీ వెనుకంజ వేయకుండా వీరప్పన్ ప్రతి కదలికపై పోలీసులకు సమాచారం అందించాను. రివార్డు సంగతి ప్రక్కన పెడితే కనీసం ప్రభుత్వం, పోలీసు విభాగం నుంచి గుర్తింపు కూడా దక్కలేద’ని షణ్ముగప్రియ వాపోయారు. 2004, అక్టోబర్ 18న వీరప్పన్, అతడి నలుగురు అనుచరులను ఎస్టీఎఫ్ హతమార్చింది. ఈ ఆపరేషన్‌లో తమకు సహకరించిన షణ్ముగప్రియకు తగినవిధంగా రివార్డులిస్తామని ఎస్టీఎఫ్ అప్పట్లో ప్రకటించింది. పదేళ్లు గడిచినా తనను పట్టించుకోకపోవడంతో 2015లో ప్రధాని కార్యాలయానికి ఆమె లేఖ రాశారు. షణ్ముగ ప్రియకు న్యాయం చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించినా ఆమెకు ప్రతిఫలం మాత్రం దక్కలేదు. నేనేమి చెప్పలేను: కన్నన్ ఈ విషయంపై శాంతమరై కన్నన్ మాట్లాడుతూ... ‘వీరప్పన్‌ను పట్టుకునేందుకు చాలా ఆపరేషన్లు నిర్వహించాం. కానీ అవన్నీ ఫలించలేదు. ఇలాంటి వాటిలో షణ్ముగప్రియ కూడా పాల్గొన్నారు. వీరప్పన్‌కు సంబంధించిన విలువైన సమాచారం ఆమె అందించారు. అయితే వీరప్పన్‌ను హతమార్చిన ఆపరేషన్‌లో ఉన్న వారికి మాత్రమే ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రతిపాదించాం. షణ్ముగప్రియ విషయంలో నేనేమి చెప్పలేను’ అని అన్నారు. ఈ వ్యవహారంపై డీజీపీ టీకే రాజేంద్రన్ ఇంకా స్పందించలేదు. -
దద్దరిల్లిన దండకారణ్యం
సాక్షి, కొత్తగూడెం/చర్ల/పర్ణశాల: సరిహద్దు దండకారణ్యం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కుంట పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 15 మంది మావోలు మృతిచెందారు. మరో ఐదుగురు గాయపడి భద్రతా సిబ్బందికి చిక్కారు. వీరిలో ఒక మహిళ కూడా ఉంది. మరికొందరు పారిపోయినట్లు సుక్మా ఎస్పీ అభిషేక్ మీనా తెలిపారు. తెలంగాణ, ఏపీ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో 200 మంది సీఆర్‌పీఎ‹ఫ్, డీఆర్జీ, ఎస్టీఎఫ్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున కుంట పోలీసుస్టేషన్‌కు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో నులకతుంగ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్‌కు వెళ్లగా మావోయిస్టులు బలగాలను గమనించి కాల్పులు ప్రారంభించారు. వెంటనే భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. సుమారు గంటకు పైగా ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకోగా, దళ కమాండర్ సహా 15 మంది మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో దళ కమాండర్ వంజం హుంగ, సభ్యులు ముచకి హిడ్మ, మడకం గంగు, హుంగా, ముచకి ముక్క, దాబో, మడకం టెంకో, ముచకి హిడిమా, మడకం సోసా, మడకం హుంగా, ముచకి నందా, సీత ఉన్నారు. మరో ముగ్గురి పేర్లు తెలియాల్సి ఉంది. ఓ మహిళ సహా నలుగురు మావోలు గాయపడి బలగాలకు చిక్కారు. ఘటనా స్థలంలో మొత్తం 16 ఆయుధాలు పోలీసులకు లభించాయి. వీటిలో 12 నాటు తుపాకులు, ఒక 305, ఒక 12–బోర్, 315–బోర్, పిస్టల్, కత్తి ఉన్నాయి. మృతదేహాలను కుంట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ముగిసిన రెండు రోజుల్లోనే మావోయిస్టులకు భారీ స్థాయిలో నష్టం జరగడం గమనార్హం. ‘ఛత్తీస్’లో ఇదే భారీ నష్టం.. మావోయిస్టు ఉద్యమ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది కోలుకోలేని నష్టం జరిగింది. గత మార్చి 2న బీజాపూర్ జిల్లా తడపలగుట్టల్లో జరిగిన ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. అప్పటి నుంచి ఇప్పటివరకు భద్రతా బలగాలు, మావోయిస్టుల దాడులు, ప్రతిదాడులతో దండకారణ్యం రక్తసిక్తంగా మారింది. గత ఏప్రిల్ చివరి వారంలో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో ఏకంగా 40 మంది మావోయిస్టులు మృతి చెందారు. తరువాత ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో 8 మంది, సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మావోలు మరణించారు. ఈ నెల 24న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కుర్నపల్లి వద్ద జరిగిన ఘటనలో చర్ల ఏరియా కమాండర్ అరుణ్ మృతి చెందాడు. తాజాగా ప్రస్తుత ఎన్కౌంటర్లో మరో 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. తడపలగుట్ట ఎన్కౌంటర్ తరువాత నుంచి ఇప్పటివరకు మావోయిస్టులు ప్రతీకారంగా భారీగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడంతో పాటు, సీఆర్పీఎఫ్ జవాన్లు సహా ఇతరులను సుమారు 30 మందిని హతమార్చారు. గత 5 నెలల కాలంలో దండకారణ్యంలో మావోయిస్టులు పోలీసులకు మధ్య జరిగిన పోరులో సుమారు 120 మంది ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. వీరిలో 90 మంది మావోయిస్టులు ఉండగా, 30 మంది భద్రతా సిబ్బంది, ఇతరులు ఉన్నారు. పట్టున్న చోటే మావోలకు ఎదురుదెబ్బ మావోయిస్టులకు గట్టి పట్టున్న (లిబరేటెడ్‌జోన్) ప్రాంతంలోకి దూసుకెళ్లిన జవాన్లు కోలుకోలేని దెబ్బతీశారు. ఈ ప్రాంతానికి జవాన్లు తొలిసారిగా వెళ్లి భారీ ఆపరేషన్ చేపట్టారని నక్సల్స్ ఆపరేషన్ డీజీడీఎం అవస్థి తెలిపారు. సుమారు 20 కిలోమీటర్ల మేర కాలినడకన మూడు కొండలు దాటి మావోయిస్టుల ఆచూకీ కనుగొన్నారని అన్నారు. సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడంతోనే అత్యంత సురక్షిత ప్రాంతంగా భావించిన ప్రాంతంలో మావోయిస్టులు 15 మందిని కోల్పోయినట్లుగా తెలుస్తోంది. గోంపాడ్, బాలా తోంగ్, మిన్‌చా ఏరియాలకు చెందిన మిలిషియా కమిటీలు సంయుక్తంగా క్యాంపు నిర్వహిస్తున్న క్రమంలో జవాన్లు ఒక్కసారిగా చుట్టుముట్టడంతోనే ఈ భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకున్నట్లు సమాచారం. -
ఎక్సైజ్ అధికారుల దాడులు
► పారబోసిన కల్తీకల్లు, శాంపిల్ సేకరణ ► ఎస్టీఎఫ్ అదుపులో ఇద్దరు నిందితులు కల్వకుర్తి : రాష్ట్ర ఎక్సైజ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించి రెండు చోట్ల కల్తీకల్లును పారబోశారు. ఈ మేరకు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కొన్ని రోజులుగా కల్వకుర్తి పట్టణంలో జోరుగా కల్తీకల్లు విక్రయిస్తున్నట్టు స్థానికులు కొందరు ఇటీవల ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం ఎస్టీఎఫ్ ఏఈఎస్ నాగేంద్రరెడ్డి ఆధ్వర్యంలో మెరుపు దాడులు నిర్వహించారు. స్థానిక హనుమాన్‌నగర్‌లోని ఓ దుకాణంపై దాడి చేసి కల్లును పరీక్షించారు. అందులో క్లోరల్హైడ్రేట్తోపాటు ఇతర మత్తు పదార్థాలను మిళితం చేసినట్టు గుర్తించి పారబోశారు. అదే కాలనీలోని మరో దుకాణంపై దాడి చేసి కల్లును పరీక్షించి శాంపిల్ తీసి హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించారు. వాటి నిర్వాహకులు యాదయ్యగౌడ్, శ్రీనివాస్‌గౌడ్‌లను అరెస్ట్ చేసి స్థానిక ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. ఈ దాడుల్లో ఎస్టీఎఫ్ సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ లింగయ్య పాల్గొన్నారు. -
అటవీ సిబ్బందిపై ఎర్రచందనం కూలీల దాడి
-
అటవీ సిబ్బందిపై ఎర్రచందనం కూలీల దాడి
చిత్తూరు: శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. వారి ఆగడాలకు హద్దులేకుండో పోతోంది. ఏమాత్రం భయంలేకుండా తమ ఇష్టారాజ్యంగా వారు ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. చిత్తూరు జిల్లా దేవరకొండ అటవీ ప్రాంతంలో, వైఎస్ఆర్ జిల్లా రైల్వేకోడూరు మండలం బాలుపల్లి చెక్‌పోస్టు వద్ద ఎర్రచందనం కూలీలు అటవీ సిబ్బందిపై దాడి చేశారు. భయంతో ఆటవీ సిబ్బంది పరుగులు తీశారు. దేవరకొండ అటవీప్రాంతం యర్రావారిపాలెం మండలం తుమ్మలచేనుపల్లిలో అటవీ సిబ్బంది(ఎస్టిఎఫ్ దళాలు)పై ఎర్రచందనం కూలీలు దాడి చేశారు. ఈ దాడిలో దాదాపు 200 మంది కూలీలు పాల్గొన్నారు. కూలీలపై ఎస్టిఎఫ్ దళాలు కాల్పులు జరిపారు. ఒక కూలీ మృతి చెందాడు. మిగిలిన కూలీలు పారిపోయారు. ఈ సందర్భంగా అటవీ సిబ్బంది భారీగా ఎర్రచందనం నిల్వలు స్వాధీనం చేసుకున్నారు. ఘటనాస్థలిని జిల్లా ఎస్పి శ్రీనివాసరావు పరిశీలించారు. వైఎస్ఆర్ జిల్లాలో ఫారెస్ట్ సిబ్బందిపై ఎర్రచందనం కూలీల వీరంగం చేశారు. రైల్వేకోడూరు మండలం బాలుపల్లి చెక్‌పోస్టు వద్ద దాదాపు వంద మంది కూలీలు అటవీ సిబ్బందిపై రాళ్లతో దాడి చేశారు. దాంతో సిబ్బంది భయంతో పరుగులు తీశారు. ఆ తరువాత వారు పారిపోయారు. బాలుపల్లి అటవీప్రాంతంలో ఎర్రచందనం తరలించేందుకు సిద్ధంగా ఉన్న లారీని సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.